గిరిప్రదక్షిణ ఏర్పాట్లలో అపశ్రుతి | Risk in Giri Pradakshina preparations

Vijaya Lakshmi

Published on Jul 05 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

సింహాచలంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగబోతున్న గిరిప్రదక్షిణకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రహదారి క్లియరెన్స్, మొబైల్ వాష్ రూమ్స్, భక్తులు ఉండడానికి షెడ్లు ఇలా అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. రెండు రోజులు కిందటే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ తో పాటు దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాలు కురుస్తుండడంతో భక్తులు తడవకుండా ముందు జాగ్రత్త చర్యగా రేకులతో షెడ్డు ఏర్పాటు చేసారు. భక్తులు టెంకాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించే తెలిపావంచా ముందు భాగంలో భారీ క్యూలు వాటి పైనా షెడ్డు వేశారు.



ఈ నేపధ్యంలో సింహగిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కొండ దిగువ తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు కూలిపోయింది. ఇనుప రాడ్లు, రేకులతో ఏర్పాటు చేసిన షెడ్డు అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఏ ప్రమాదం ప్రమాదం జరుగలేదు. ఇంకా ఏర్పాట్లు

జరుగుతుండగానే షెడ్డు కూలిపోవడంతో షాక్ లో పడిపోయారు.


youtube play button



youtube play button


Recent Posts