Vijaya Lakshmi
Published on Oct 29 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“సరే ఈ సొల్లు కబుర్లకేంగాని. రాబోయే పరీక్షలని తలుచుకుంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది”అంది శరణ్య.
“వెన్నులోంచి వణుకు అయితే న్యురోలోజిస్ట్ ని కలుసుకో తల్లీ” అంది అంది గుగు.
“నేను చాలా సీరియస్ గా మాట్లాడుతుంటే... నీకేం గుగు… నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా మీ తల్లిదండ్రులు ఏమీ అనరు. మా నాన్నగారు నా వీపు చిట్లగొడతారు. ఆయనకి అస్సలు ఇష్టం లేకపోయినా నేను దెబ్బలాడి మెడిసిన్ లో చేరాను. నా కోర్స్ అయ్యేవరకు తను ఉంటానో లేనో ఆయన ఆయన భయం. ఆయనికి కార్డియో మయోపతీ. అది కూడా ఏదో రేర్ కాంప్లికేషన్ తో ఉందట. రెగ్యులర్ గా ఎలక్ట్రో కార్డియోలోజిస్ట్ ట్రీట్మెంట్ లో ఉంటున్నారు. అందుకే ఏదో మాములు డిగ్రీ చదివించేసి, డిగ్రీ అయిపోగానే నాకు పెళ్ళి చేసేద్దామనుకున్నారు” అంది శరణ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.
“అరెరే!! సారీ. ఈ విషయం ఇంత వరకూ ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదే?” అంది గుగు తను అన్న మాటలకి నొచ్చుకుంటూ. మిగతా వాళ్ళు కూడా అదే మాట అన్నారు.
“ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి. మళ్ళీ నా బాధలు చెప్పి అందరి మనసు కష్ట పెట్టడం ఎందుకు అని నేను చెప్పలేదు” అంది శరణ్య కళ్ళు తుడుచుకుంటూ.
“మరి పోనీ మీ నాన్నగారి కోరిక ప్రకారం పెళ్ళి చేసుకోవచ్చు కదా?” అని అడిగాడు ఆయుష్.
“నాకు ఒక బావ ఉన్నాడు. వాడు నా చదువు అయ్యేవరకు పెళ్ళి కుదరదు అన్నాడు” అంది శరణ్య.
“అదేమిటే ఈ రోజుల్లో కూడా మేనరికం చేసుకుంటున్నావా? అది కూడా కాబోయే డాక్టర్ వి!!” అంది స్నేహ .
“నిజమే. మేనరికపు సంబంధాలు అంత మంచివి కావు. కాని ముక్కు మోహం తెలియని ఎవడినో కట్టుకుని జీవితాంతం బాధపడేకంటే ఇది బెటర్ అనిపించింది” అంది శరణ్య .
“అవునులే. ది నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్ నోన్ ఆంజిల్ అంటారు పెద్దలు” అంది హసిత.
“అయినా పిల్లలు సరిగ్గా పుట్టే అవకశాలు తక్కువని తెలిసి నువ్వు ఎందుకు కాంప్రమైస్ అవుతావు శరణ్య”అంది స్నేహ మరలా.
“స్నేహ... మామూలుగా ఏ విధమైన సంబంధం లేని వ్యక్తులను పెళ్ళి చేసుకుంటే సెంట్ పెర్సెంట్ నార్మల్ చిల్ద్రెన్ పుడతారని గారంటీ ఇవ్వగలవా? లేదు. అలాగే మేనరికం చేసుకుంటే కచ్చితంగా సమస్యలు ఉన్న పిల్లలు పుడతారని చెప్పగలవా? రెండింటికి నీ సమాధానం నో అనే కదా. ఈ రోజుల్లో కూడా మేనరికపు సంబంధాలు చేసుకుని ఎంతో అందమైన, తెలివైన పిల్లలు పుట్టిన వాళ్ళు నాకు తెలుసు. అయినా పూర్వకాలంలా ఆస్తులు బైటకు పోతాయని వాళ్ళలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రమాదమే. కాని కేవలం ఫస్ట్ జనరేషన్ లో మేనరికపు సంబంధం చేసుకుంటే సాధారణంగా ఏమీ ప్రాబ్లం ఉండదని మన ప్రోఫ్ఫెసర్లు చెపుతున్నారు కదా” “అంది శరణ్య.
“అవును అనుకో. లైఫ్ ఈస్ ఏ బిగ్ ఛాన్స్” అంది స్నేహ.
“అయినా అతనికీ ఈ విషయం తెలుసు కదా! కన్విన్సు చెయ్యలేక పోయావా?” అంది గుగు.
“అతనికి తెలిసినా అతని లాజిక్ కూడా నాలాంటిదే! ఎప్పుడో ఏదో ఆక్సిడెంట్ జరిగిందని విమానాలు ఎక్కడం మానేస్తామా! అంటాడు. నువ్వు ఇంటి డాబా మీద కూచుంటే పిడుగు పడి చావవచ్చు కదా. అలాగే అన్నివిధాలా సైన్స్ ప్రకారం చూసి చేసుకున్నా కచ్చితంగా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని గారంటీ ఇవ్వగలవా? అంటాడు” అంది శరణ్య.
“అలా గుడ్డిగా వితండవాదన చేసేవాళ్ళని ఏమీ చేయలేంగాని, కనీసం నువ్వు అన్నా వద్దనాల్సింది. సరే... అది నీ పర్సనల్ విషయం అనుకో... కాని ఈ రోజుల్లో ఎంతమంది పెళ్ళి చేసుకుని తరువాత చదువుకోవటల్లేదు!? లేకపోతే నిన్ను ఇష్ట పడ్డవాడిని, నీకు ఇష్టమైన వాడిని వేరే వాళ్ళని చేసుకో. అప్పుడు మీ నాన్నగారి కోరిక తీరుతుంది కదా. అఫ్కోర్సు! ఈ రోజుల్లో మెడిసిన్ రోజురోజుకి డెవలప్ అవుతోంది. మీ నాన్నగారి కార్డియాక్ ప్రాబ్లంకి క్యూర్ కనుక్కోవచ్చు” అన్నాడు ఆయుష్.
“నాకు ఆ ఆశ ఉంది ఆయుష్. నన్ను చేసుకోవాలునుకుంటున్నవాడు మా అమ్మ తమ్ముడి కొడుకు. కనుక ఏ పరిస్థితుల్లోనూ ఆ సంబంధం వదులుకోవడం అమ్మకి ఇష్టం లేదు” అంది శరణ్య.
“అదికాదు శరణ్య. మీ నాన్నగారి పరిస్థితి తెలిసి...” అంది నివేదిత.
“నివేదిత... అది దేవుడు ఆడవాళ్ళకిచ్చిన వరమో, శాపమో తెలియదు గాని... ఆడవాళ్ళకి పెళ్ళి అయి ఏభై ఏళ్ళు అయినా వాళ్ళ మొగ్గు పుట్టింటి వైపే. భర్త ముఖ్యం అయినా మళ్ళీ పుట్టిల్లు అంతకన్నా ముఖ్యం” అంది శరణ్య.
“అది కరెక్ట్ కాదు. పుట్టిల్లు ముఖ్యమే. కాదనను. కాని ఏ స్త్రీ కూడా భర్త కన్నా పుట్టిల్లు ముఖ్యం అనుకోవడం కరెక్ట్ కాదు” అంది స్నేహ .
“ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి. మనం ఏమీ చేయలేం” అన్నాడు ఆయుష్.
“పోనీ... శరణ్య... మీ నాన్నగారిని హైదరాబాద్ తీసుకెళ్ళి చూపిస్తే. అక్కడ మంచి కార్డియోలజిస్ట్ లు ఉన్నారు కదా” అన్నాడు ఆయుష్.
“హైదరాబాద్ లోనే కాదు. ఢిల్లీ లో ఎయిమ్స్ లో చూపించాం... అయుష్ మనకున్న అతికొద్ది నాలెడ్జి తోనే మన డాక్టర్ల పరిమితులు మనకు తెలిసిపోయింది. హైదరాబాద్, ఢిల్లీ రెండుచోట్లా డాక్టర్లు చెప్పింది ఒకటే. మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేదని, జాగ్రత్తగా మందులు, ఆహార, విహారాలతో మేనేజ్ చేసుకోమని... ఇంతకీ మనం ఎక్కడ నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం. ఈ పరీక్షలకి మన గ్రూప్ కంబైండ్ స్టడీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం... ఏమంటారు?” అని అడిగింది శరణ్య.
అందరూ ఆమె చేసిన ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. ఒక్కక్కరోజు ఒక్కొక్కరి రూమ్ లో ఆరుగురు కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆరోజు రాత్రే చదువు సీరియస్ గా మొదలు పెట్టారు. ఎవరి రూమ్ లో చదువుకుంటున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకి టీ, బిస్కట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
ఆ రోజు గుగు రూమ్ లో చదువు. గుగు కి జ్వరం!
“అమ్మా గుగు నీకు పరీక్ష అంటే జ్వరం వచ్చేస్తుంది. మాకు చలి తెప్పించేస్తున్నావు” అంది శరణ్య నవ్వుతూ.
“జ్వరం వస్తే గుగు ఏం చేస్తుంది ?” అన్నాడు ఆయుష్.
“అవునులే కారులో పరీక్ష హాల్ కి తీసుకెళ్ళడానికి నువ్వు, సేవలు చేయడానికి మేడం నివేదిత ఉన్నారుగా” అంది శరణ్య.
“ఈసారి గుగుకి సేవలు చేసే భాగ్యం మీకు కల్పిస్తున్నాను” అంది నివేదిత నవ్వుతూ.
“గుగు గారు... తమరు కనీసం డబ్బులన్నా ఇస్తే ఆ టీ, బిస్కట్స్ మేమే తెప్పించుకుంటాం. తమరికి బ్రెడ్ తెమ్మంటారా?” అంది స్నేహ గుగు నుదిటి మీద ప్రేమగా నిమురుతూ. గుగు నుదురు బాగా వేడిగా ఉంది.
“అయినా మా పెద్ద వాళ్ళు అంటారులే గుగు. జరిగితే జ్వరం అంత సుఖం లేదని” అంది స్నేహ.
గుగు నవ్వుతూ తన బాగ్ లోంచి డబ్బులు తీసి ఇచ్చింది.
నిమషాల్లో తిండి, టీ వచ్చేసాయి. అవి కానిచ్చి చదువు మొదలుపెట్టారు. ఇక నుంచి అన్ని పరీక్షలకీ అలాగే అందరూ కలిసి చదువుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
అలా కూచున్న వాళ్ళు తెల్లవార్లూ చదువుతూనే ఉన్నారు. గుగు జ్వరంతో ఉన్నా కొంత సేపు చదువుకోవడం, కొంత సేపు పడుకోవడం చేసింది. మరునాడు ఉదయానికి కొంచెం జ్వరం తగ్గి కుదుటపడింది.
అయినా సరే ఆయుష్ గుగుకి పరీక్ష హాల్ వరకు కారు ఏర్పాటు చేశాడు.
అది చూసిన శరణ్య “నేను ఇక నుంచి ప్రతీ పరీక్షకి జ్వరం తెచ్చుకుంటాను. హాయిగా వాహన యోగం పడుతుంది” అంది నవ్వుతూ.
“తధాస్తు దేవతలు ఉంటారట. అలా అనుకోకు” అంది నివేదిత నోటి మీద వేలు వేసుకుంటూ .
“ఏమిటి నివేదితమ్మా! నీకు ఆ నమ్మకాలూ కూడా ఉన్నాయేమిటి!?” అని అడిగింది శరణ్య.
“అవును” అంది నివేదిత.
“సరే. ఈసారికి ఈ పరీక్షల ఘట్టం ఇలా కానిచ్చేస్తే... వచ్చే పరీక్షలకి బతికి బాగుంటే చూద్దాం” అంది శరణ్య.
“అదిగో మళ్ళీ” అంది నివేదిత చిరుకోపంగా.
“నువ్వేమీ కంగారు పడకు నివేదితా. నేను పాపిని. ‘పాపి చిరాయు’ అంటారు కదా” అంది శరణ్య నవ్వుతూ.
“నీకు చెప్పడం నా వల్ల కాదు” అంటూ తల మీద కొట్టుకుంది నివేదిత.
“నివేదిత పాపం మన న్యురోలజీ ప్రోఫ్ఫెసర్ కి అస్సలు ప్రాక్టీసు లేదట... నువ్వు అలా తలబాదుకుంటే ఒక కేసు అన్నా వస్తుంది” అంది హసిత నవ్వుతూ.
“నిన్నూ...” అంటూ హసితని కొట్టడానికి అన్నట్టు చెయ్యి ఎత్తింది నివేదిత.
“చెయ్య సరిగ్గా లేస్తున్నట్లు లేదు... అర్తోపెడిక్...” అంటూ అక్కడే ఉన్న టేబుల్ చుట్టూ హసిత పరిగెడితుంటే వెనక్కాలే నివేదిత పరిగెత్తింది.
వాళ్ళిద్దరిని చూస్తూ మిగతా వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు.
***************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో