Vijaya Lakshmi
Published on Jan 22 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పురాణ గాథల ప్రకారం.. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన తరుణంలో అంతా నిశ్శబ్దంగా, జడంగా అనిపించింది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి బ్రహ్మ తన కమండలంలోని జలాన్ని గాలిలో చల్లగా, తెల్లని వస్త్రాలతో, చేతిలో వీణ, పుస్తకం, జపమాల ధరించిన చదువుల తల్లి సరస్వతి ఆవిర్భవించింది. ఆమె తన వీణను మీటగానే సృష్టిలో నాదం పుట్టింది. పక్షుల కిలకిలా రావాలు, నదుల గలగలలు, గాలి వీచే శబ్దం.. ఇలా సృష్టికి వాక్కు, చైతన్యం లభించాయి.
ఆ తల్లి ఆవిర్భవించిన పవిత్రమైన రోజే మాఘ శుద్ధ పంచమి. అందుకే మాఘ శుద్ధ పంచమిని సరస్వతీ దేవి జన్మదినంగా ‘శ్రీ పంచమి’ పేరుతో లోకమంతా జరుపుకుంటుంది. ఈ పర్వ దినాన్ని విద్యార్థులు ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు." ఆమె వీణాధారిణిగా, తెల్లని వస్త్రాలతో, హంసవాహనంపై దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ అవతార దినమే శ్రీ పంచమిగా పరిగణిస్తారు. మాఘ మాసం శుక్ల పక్ష పంచమి రోజున వచ్చే ఈ పండుగనే శ్రీ పంచమి అంటారు. ఇదే రోజున సరస్వతి దేవిని పూజిస్తారు.
భారతీయ సంప్రదాయాల్లో అత్యంత శుభకరమైన పండుగలలో ఇదొకటి. ఇది ప్రేమకు, విద్యకు, కళలకు, సృజనాత్మకతకు అంకితమైన రోజు. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, రచయితలు, సంగీతకారులు ఈ రోజును విశేషంగా జరుపుకుంటారు. వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా వచ్చే ఈ పండుగ, మన జీవితాల్లో కొత్త ఆలోచనలకు, సానుకూల మార్పులకు ద్వారాలు తెరుస్తుంది.
"పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి శ్రీ పంచమిని మించిన ముహూర్తం మరొకటి లేదు అంటారు. అందుకే ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తే, పిల్లలు సరస్వతీ పుత్రులవుతారని, వారికి అపారమైన జ్ఞాపకశక్తి, జ్ఞానం, తెలివితేటలూ లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పంచమి అంటేనే అక్షరాభ్యాసాలకు అత్యంత విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. ‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అంటూ చిన్నారుల చేత బియ్యంపై అక్షరాలు దిద్దిస్తారు. బాసరలోని జ్ఞాన సరస్వతీ క్షేత్రం, వర్గల్‌లోని విద్యా సరస్వతీ ఆలయం ఈ రోజున భక్తులతో పోటెత్తుతాయి. విద్యార్థులు తమ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించడం ద్వారా బుద్ధిబలం, ఏకాగ్రత లభిస్తాయని నమ్ముతారు. కేవలం అక్షర జ్ఞానమే కాదు.. సంగీతం, నాట్యం వంటి లలిత కళల అభ్యాసానికి కూడా ఈ రోజు ఎంతో శ్రేష్టమైనది.
ఎంతో శుభకరమైన శ్రీపంచమి గురించి దేవీభాగతం, బ్రహ్మాండ పురాణాల్లో విశేషంగా ప్రస్తావించారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.
శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి. సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి వస్తుంది. మనిషికి మాటేప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి... సరస్వతీ దేవి.
పరాశక్తి తొలుత ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి రూపం కూడా ఒకటి అని గ్రంధాలు చెబుతున్నాయి. సరస్వతీ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం చెబుతోంది.
గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీదేవిని ఆరాధిస్తూ అక్కడే వేద వ్యాసుడు తపస్సు చేసి, అమ్మ సాక్షాత్కారం పొంది ఆమె అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించాడని చెబుతారు. అందుకే బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు సరస్వతీ మాత కరుణతో జ్ఞానవంతులు అవుతారు, విద్యలో అందరికన్నా ముందు వుంటారని నమ్ముతారు.
ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి ఆఖరు రోజున నదిలో నిమజ్జనం చేస్తారు.
పంజాబ్, బిహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసులవారు గాలిపటాలు ఎగరేస్తారు.
జ్ఞానప్రదాత సరస్వతీ మాత కటాక్షం గురించిన కథలు చాలా కనబడతాయి మన పురాణాల్లో. పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే ఒకసారి భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు చదువుల తల్లిని స్తుతించి, నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. ఇంద్రుడు కూడా తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగినప్పుడు, శివుడు శారదామాతను తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడత. దేవగురువు బృహస్పతి కూడా పుష్కర క్షేత్రంలో వెయ్యేళ్ళు సరస్వతిమాతను ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.
ఒకసారి గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. కరుణించిన ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.
ఈ శ్రీపంచమిని 'మదన పంచమి' అని కూడా పిలుస్తారు. మదనుడు అంటే మన అందరికీ తెలిసిన మన్మథుడు. వసంత రుతువు రాకతో ప్రకృతి పులకరిస్తుంది. ఈ సమయంలో మన్మథుడు భూలోకంలో సంచరిస్తూ సమస్త సృష్టిలో ప్రేమను, అనురాగాన్ని నింపుతాడని నమ్మకం. ప్రకృతిలో వచ్చే మార్పులకు, అందానికి ఈ రోజు ప్రతీక.
శివుని తపస్సు భంగం చేయడానికి మదనుడు తన పుష్ప బాణాన్ని ప్రయోగించిన రోజు కూడా ఇదే. ప్రేమ, ఆకర్షణ, సృష్టి శక్తి ఈ రోజుతో అనుసంధానమై ఉండటం వల్ల దీనిని మదన పంచమి అంటారు.
ప్రేమదేవుడు మదనుడు కూడా ఈ రోజున తన శక్తిని ప్రపంచానికి చాటాడనే విశ్వాసం వల్ల దీనికి మదన పంచమి అనే పేరు వచ్చింది.
వసంత రుతువు రాకతో వనం, వనస్పతి అన్నీ కొత్త కాంతులీనుతాయి. ఈ సమయంలో ప్రేమ దేవుడైన మన్మథుడు (మదనుడు) తన భార్య రతీదేవితో కలిసి ప్రకృతిలో అనురాగాన్ని నింపుతాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున రతీ-మన్మథులను పూజించే సంప్రదాయం ఉంది. శివుని తపస్సును భంగం చేయడానికి మన్మథుడు పూలబాణాన్ని ప్రయోగించిన సందర్భం కూడా ఈ వసంత కాలానిదేనని చెబుతారు.
ఇక సరస్వతి పంచమి లేదా శ్రీపంచమి రోజు "ఇంట్లో సరస్వతీ పూజ ఎలా చేసుకోవాలి?... ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు రంగు జ్ఞానానికి, వెలుగుకు చిహ్నం. అమ్మవారికి పసుపు లేదా తెలుపు రంగు పూలతో పూజించి, పుస్తకాలను ఆమె పాదాల దగ్గర ఉంచాలి. నైవేద్యంగా కేసరి లేదా పాయసం సమర్పించడం శుభప్రదం."
శ్రీ పంచమి కేవలం ఒక పూజ మాత్రమే కాదు.. అజ్ఞానమనే చీకటిని తరిమి, జ్ఞానజ్యోతిని వెలిగించే సందేశాన్ని ఇస్తుంది. హంస వాహనాన్ని అధిరోహించిన సరస్వతీ దేవి మంచిని గ్రహించి చెడును వదిలేసే ‘నీరక్షీర వివేకాన్ని’ మనకు బోధిస్తుంది. మనిషి జీవితంలో విద్యా వివేకాలు ఉంటేనే సృష్టిలో గౌరవం లభిస్తుందనే నిత్య సత్యాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.
✅ పుస్తకాలు చదవడం
✅ కొత్త విద్య ప్రారంభించడం
✅ కళా సాధన మొదలు పెట్టడం
✅ ధ్యానం, జపం
❌ అలసత్వం
❌ అశుభ ఆలోచనలు
❌ కలహాలు
ఈ డిజిటల్ యుగంలో కూడా:
ఇవన్నీ అవసరం. శ్రీ పంచమి మనల్ని మూలాలకు తిరిగి తీసుకెళ్తుంది.
“జ్ఞానం వెలుగై మారే రోజు – శ్రీ పంచమి”
“ప్రేమ సృష్టిగా మారే రోజు – మదన పంచమి”
ఈ శ్రీ పంచమి వేళ.. అక్షర రూపంలో ఉన్న ఆ పరాశక్తిని స్మరిస్తూ, అందరిలోనూ సద్బుద్ధి కలగాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. ఇవి శ్రీ పంచమి లేదా మదనపంచమి పర్వదినం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు.
మాఘ మాసం శుక్ల పక్ష పంచమి రోజున.
అవును, శ్రీ పంచమి రోజునే సరస్వతి పూజ చేస్తారు.
అవును, ఇది అత్యంత శుభదినం.
జ్ఞానం, శుభత్వం, వసంత ఋతువు సూచనగా పసుపు ప్రాముఖ్యం.
శ్రీ పంచమి (మదన పంచమి) – ప్రేమ, సృజనాత్మకత, విద్యకు శుభారంభం
శ్రీ పంచమి, మరో పేరుగా మదన పంచమి, భారతీయ సంప్రదాయాల్లో అత్యంత శుభకరమైన పండుగలలో ఒకటి. ఇది ప్రేమకు, విద్యకు, కళలకు, సృజనాత్మకతకు అంకితమైన రోజు. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, రచయితలు, సంగీతకారులు ఈ రోజును విశేషంగా జరుపుకుంటారు.
వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా వచ్చే ఈ పండుగ, మన జీవితాల్లో కొత్త ఆలోచనలకు, సానుకూల మార్పులకు ద్వారాలు తెరుస్తుంది.
మాఘ మాసం శుక్ల పక్ష పంచమి రోజున వచ్చే ఈ పండుగనే శ్రీ పంచమి అంటారు. ఇదే రోజున సరస్వతి దేవిని పూజిస్తారు.
ప్రేమదేవుడు మదనుడు (కామదేవుడు) కూడా ఈ రోజున తన శక్తిని ప్రపంచానికి చాటాడనే విశ్వాసం వల్ల దీనికి మదన పంచమి అనే పేరు వచ్చింది.
ఈ రోజున ప్రారంభించిన పనులు విజయం సాధిస్తాయని నమ్మకం.
ఈ రోజునే అనేక ప్రాంతాల్లో విద్యారంభం (అక్షరాభ్యాసం) చేస్తారు.
చిన్నపిల్లలకు మొదటిసారి అక్షరాలు నేర్పడం ఈ రోజున చేయడం శుభం.
👉 “విద్య లేకపోతే జీవితం అంధకారం” అన్న భావనకు ఈ పండుగ ప్రతీక.