Vijaya Lakshmi
Published on Oct 20 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?‘గుగు’ కి తెలుగు అస్సలు రాదు. ఇంగ్లీష్ కూడా ఓ మాదిరిగా వచ్చు. అది కూడా జర్మన్ స్లాంగ్ లో మాటలాడుతుంది. ఎందుకంటే కెన్యా లో కొన్ని ప్రాంతాలలో జర్మన్ బాష మాట్లాడుతారు. కనుక అమ్మాయిల మధ్య కమ్యూనికేషన్ కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే, “అవసరం కొత్త విషయాన్ని కనిపెట్టడానికి అమ్మ” అన్న ఆంగ్ల సామెత గుర్తు చేసుకుంటూ, వాళ్ళు మెల్లిగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడడం నేర్చుకుంటున్నారు. అసలు జీవితం కంటే పెద్ద బడి, అనుభావాల కన్నా పెద్ద మాస్టర్లు ఎక్కడ ఉన్నారు !?
ఆ రోజు ఆదివారం. పార్క్ కి జనం బిలబిలమంటూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో కొత్త స్టూడెంట్స్ మాత్రమే కాక ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అందరూ ఒకరితో ఒకరు పరిచయం చేసుకోవడం లాంటివి నడిచాయి .
రాగింగ్… అని అనలేకపోయినా చిలిపి మాటలు, సరదా జోకులు సీనియర్ లు వేస్తే, జూనియర్ లు వాటిని స్పోర్టివ్ గానే తీసుకున్నారు. ఒక విధమైన సహృద్భావ వాతావరణం అక్కడ ఏర్పడింది .
ఆ రోజు పార్క్ కి ఆయుష్ కూడా వచ్చాడు. అయుష్ హ్యాండ్సంగా ఉంటాడు. అలాగే మంచి తెలివైన వాడు. చదువుల్లో, స్పోర్ట్స్ లో అన్నిటిలో ఫస్ట్. అలాగే ఈ రోజులలో కొంతమంది కుర్రాళ్ళకి ఉండే ఆవలక్షణాలు ఏమీ లేనివాడు.
అయుష్ తండ్రి జగన్నాధం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎంత సంపాదించాడో ఆయనకే తెలియనంత కూడబెట్టాడు. దేశంలో ప్రతి మేజర్ సిటీలో ఆయనకి బిజినెస్ బ్రాంచ్ బంగాళా ఉంది. ఆయనకున్న కార్ల సంఖ్య పది పై మాటే. అలాగే భార్యలు కూడా బహువచనంలో ఉన్నారని బిజినెస్ సంబంధిత వ్యక్తులు, చుట్టాల్లో చాలమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు.
అయుష్ తల్లి సీత నిజంగా మహా సాధ్వి. ఉత్తమ ఇల్లాలికి, ఆదర్శవంతమైన తల్లికి అత్యుత్తమ ఉదాహరణ సహజంగా ఆవిడ పెంపకంలో పెరిగిన అయుష్… మంచివ్యక్తి అని చెప్పకనే చెప్పవచ్చు .
అయుష్ కి దీప్తి అనే చెల్లెలు ఉంది. ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. అందానికి మారురూపమే దీప్తి.
మొత్తానికి ఆ మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచిమనిషి ఆయుష్ అనేది నిర్వివాదాంశం.
అతనిని చూసిన అమ్మాయి అయితే వెంటనే ‘ఇతను నా జీవిత భాగస్వామి అయితే బాగుండును ‘అని అనుకుంటుంది. ఎవరైనా అమ్మాయి తల్లిదండ్రులు చూస్తే ‘ఈ అబ్బాయి డాక్టర్ అయ్యిన తరువాత మా అల్లుడిగా చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది ‘అనుకుంటారు.
నివేదిత ది కూడా ఆయుష్ వాళ్ళ ఊరే. ఇద్దరూ చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు. ఒకటో క్లాసు నుంచి ఇంటర్ వరకు ఒకేక్లాసులో ఉన్నారు. ఇప్పుడు మెడిసిన్ లో కలిసి చేరారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ‘అంతకు మించి ఏ భావాలూ ఇద్దరిలో లేవు’ అని చూసిన వాళ్ళు అనుకునేలా వాళ్ళ మాటతీరు, ప్రవర్తన ఉంటాయి. అసలు నిజం పరమాత్మునికే ఎరుక !?
కానీ ప్రస్తుతం ఉంటున్నది కొత్త ప్రదేశంలో. అది తల్లిదండ్రులకు దూరంగా.ఒకవేళ అంతా అనుకుంటున్నట్టు అది కేవలం స్నేహమే అయితే ... మరి ఇప్పుడు వాళ్ళ స్నేహం ఎలా మారుతుందో .ఎలా పరిణమిస్తుందో ?
“హాయ్ అయుష్! ఏమిటి పుస్తకాల పురుగు ఇలా పార్క్ కి వచ్చింది?” అంది నివేదిత నవ్వుతూ .
“నేనేమీ నీలాగ పుస్తకాలను కషాయం చేసి తాగేయనులే.” అన్నాడు అయుష్ కూడా నవ్వుతూ .
“అందుకేనేమిటి అన్ని సబ్జెక్టులలో గోల్డ్ మెడల్ కి ఇప్పడినుంచే ప్లాన్ చేస్తున్నావు? “ అంది నివేదిత
“నాకు గోల్డ్ మెడల్స్ ఎక్కడ రానిస్తావు? నువ్వు ఉన్నావుగా నాకు జెష్టదేవత.” అన్నాడు ఆయుష్ .
“ఇదుగో నన్ను దేవతా గీవతా అన్నావంటే ఊర్కోను. నేను చాలా గుడ్ గర్ల్ “అంది నివేదిత గర్వంగా మొహం పెట్టి .
“సరేలే .వృక్షంలేనిచోట ఆముదం వృక్షమే మహా వృక్షం అయినట్టు... ఈ రోజులలో అమ్మాయిలు కాస్త ఫాస్ట్ గా మోడరన్ గా ఉంటున్నారు ....నువ్వు ఇంకా పూర్వ కాలం పిల్లవి కనుక గుడ్ గర్ల్ అని చెప్పుకుంటున్నావు.“ అన్నాడు అయుష్ నివేదితని ఉడికించే ధోరణిలో.
“నేనేమీ పాత చింతకాయ పచ్చడిని కాదు. నాకు బోల్డ్ మోడరన్ ఔట్ లుక్ ఉంది .”అంది నివేదిత ఉక్రోషంగా .
“మోడరన్ ఔట్లుక్ ఉంది గాని మోడరన్ అమ్మాయివి కాదు .“ అయుష్ తన మాటల ధోరణి సాగించాడు .
“సరే ..మన గొడవ ఎప్పుడూ ఉండేదే గాని... మన బాచ్ మేట్స్ అయిన నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఈ అమ్మాయి శరణ్య“ అంటూ అయుష్ కి పసుపురంగు మేక్సీ వేసుకున్న అమ్మాయి వైపు చూపించింది. ’హాయ్’ లు అయ్యాయి. తరువాత స్నేహని, హసితని పరిచయం చేసింది.
“స్నేహ స్నేహం చేయడంలో ఫస్ట్ .హసిత ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది “ అంది నివేదిత .
“అబ్బా!! నీకు సెన్స్ అఫ్ హ్యుమర్ కూడా ఉందే” అన్నాడు అయుష్ వెక్కిరింత నవ్వుతూ .
“అదిగో మళ్ళీ “కోపం నటించింది నివేదిత .
“ఓకే .ఓకే “అన్నాడు ఆయుష్ .
“షి ఈస్ మిస్ గుగు” అంటూ అక్కడే ఉన్న ఆఫ్రికన్ అమ్మాయిని పరిచయం చేసింది నివేదిత.
“హాయ్ గుగు. హౌ ఆర్ యు” అంటూ పలకరించాడు ఆయుష్ .
“ఐ యాం ఫైన్” అంటూ జర్మన్ స్లాంగ్ లో చెప్పింది గుగు.
“పాపం ఆ అమ్మాయి ఎక్కడో కెన్యా నుంచి వచ్చింది. దూరం. భాష రాదు. బంధువులు లేరు. చాలా బెంగ పెట్టుకుంది” అంది నివేదిత. సంభాషణ అంతా ఇంగ్లీష్ లో సాగుతోంది.
“డోంట్ వర్రీ గుగు. వి ఆర్ అల్ యువర్ ఫ్రెండ్స్. యువర్ నేమ్ గుగు ఈస్ ఇంటరెస్టింగ్ అండ్ నైస్ . బై ది వే వాట్ గుగు మీన్స్?” అని నవ్వుతూ అడిగాడు ఆయుష్.
“ఏ ప్రీషియస్ పర్సన్.” అంది గుగు సిగ్గుపడుతూ .
“వండర్ఫుల్. సో... ఏ ప్రీషియస్ పర్సన్, దట్ ఈస్ గుగు, ఈస్ అవర్ ఫ్రెండ్” అంటూ గుగుకి చేయి అందించాడు ఆయుష్ . గుగు తల దించుకుని అతనితో కరచాలనం చేసింది. ఆ తరువాత ఆయుష్ అక్కడ ఉన్న అమ్మాయిలతో చాలా సేపు కబుర్లు చెప్పాడు .
“తల్లీ నివేదిత నువ్వు అయితే నిశాచరురాలివి. మేము మనవమాత్రులం. టైం రాత్రి తొమ్మిది అయ్యింది. ఇక వెడదామా?” అన్నాడు అయుష్ నివేదితని ఉద్దేశించి నవ్వుతూ.
“అలాగే అసురా!” అంది నివేదిత కూడా నవ్వుతూ. అందరూ నవ్వారు. శరణ్య గుగుకి జరిగిన సంభాషణ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పింది.
“గుగు... నువ్వు అర్జెంటు గా తెలుగు నేర్చుకోవాలి. ఈ తర్జుమాలు అవీ కుదరవు” అన్నాడు ఆయుష్ చనువుగా .
‘ఏమిటి? ‘ అన్నట్టు మొహం పెట్టింది గుగు.
నివేదిత నవ్వుతూ ఆయుష్ భావం గుగు కి వివరించింది.
“అదేలే “అంది గుగు .
“ఒహో తెలుగు మొదలు పెట్టేసావన్నమాట. అదేలే కాదు సరేలే అనాలి” అన్నాడు ఆయుష్ .
ఈసారి స్నేహ ఆయుష్ మాటలని తర్జుమా చేసి గుగు కి చెప్పింది.
“అగాలే “అంది గుగు.
“మళ్ళీ” అన్నాడు అయుష్ నవ్వుతూ .
“మరీ ఆ అమ్మాయిని కంగారు పెట్టేయకు.” అంది నివేదిత .
అందరూ లేచి వాళ్ళ వాళ్ళ గదుల వైపు నడిచారు.
*************
ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యింది. పరీక్షలు అయ్యాయి. కాలేజీకి సంక్రాంతి అని నాలుగురోజులు సెలవులు ఇచ్చారు. అలా ఎప్పుడైనా శలవలు ఇచ్చినా ఆ తరువాత ఆదివారాలు పనిచేసి కోర్స్ కంప్లీట్ చేసేస్తారు ఆ కాలేజీలో .
సెలవులు ఇచ్చారు కనుక స్టూడెంట్స్ లో చాలామంది తమ తమ ఊళ్ళకు బయలుదేరారు. ఆయుష్, నివేదిత ఆయుష్ తండ్రి పంపించిన కారులో ప్రయాణమయ్యారు. బెంగగా మోహం పెట్టుకున్న గుగుని కూడా తనతో రమ్మని తీసుకెళ్ళింది నివేదిత.
గుగు హుషారుగా నివేదిత వెంట వెళ్ళింది. ఆయుష్ నివేదితని, గుగుని నివేదిత వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
నివేదిత తండ్రి వినోద్ కి సిటీ లో పెద్ద మాల్ ఉంది.ఎప్పుడూ బిజినెస్ గొడవలతో తలమునకలై ఉంటాడు. నెలకు సగం రోజులు బయటే భోజనం. ఏ రాత్రివేళో పడుకుందుకు ఇంటికి వస్తాడు. తల్లి రమ పదహారణాల తెలుగు గృహిణి. భర్తకు కావలసినవి చూడడం, ఏకైక సంతానం అయిన నివేదిత బాగోగులు గురించి పట్టించుకోవడం ఆమె దినచర్యలో భాగం. ఈ రోజులలలో మనుషుల్లా సెల్ ఫోన్ కి బానిస కాదు. ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఏదో చదువుకుంటూ కూచుంటుంది. అది ఆధ్యాత్మికం కావచ్చు, సాంఘికం కావచ్చు, లేదా రాజకీయం కావచ్చు. అసలు నివేదితని ఎలాగైనా డాక్టర్ ని చేయాలని కూతురు చిన్నప్పడినుంచి ప్రయత్నం చేస్తూ, కూతురిని ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉంది. అయితే ఏనాడు కూడా నివేదితని “నువ్వు డాక్టర్ వే కావాలి” అని నిర్భందించలేదు. ఇన్నాళ్ళకి తన కలలు పండుతున్నాయని ఆవిడకి చాలా సంతోషంగా ఉంది.
పండక్కి వచ్చిన నివేదితని చూసిన తల్లి రమ కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది .
“ఏమిటే నివ్వూ అలా చిక్కిపోయావు? తిండి తినడం లేదా?” అంటూ ప్రేమగా అడిగింది రమ.
“సుబ్భరంగా ముప్పొద్దులా తింటున్నాను. నువ్వేమీ బెంగపెట్టుకోక్కర్లేదు” అంది నివేదిత నవ్వుతూ..
“ఏమోనే... ఒక తల్లిగా నా బాధ నాది. నువ్వు ఏంతింటున్నావో? ఎలా ఉంటున్నావో అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాను” అంది రమ అప్యాయంగా కూతురిని చూస్తూ .
“నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకోకు.” అంది నివేదిత.
“అబ్బో! మా అమ్మాయిలో అప్పుడే డాక్టర్ లక్షణాలు వచ్చేసాయే” అంది రమ గర్వంగా.
“అది సరే నాన్న ఏడమ్మా?”
“ఆయన సంగతి నేకు తెలయనిది ఏముంది తల్లీ. ఆయన పెద్దపండగ రోజు ఇంటిపట్టున ఉంటే అదే పెద్దభాగ్యం.” అంది రమ.
************************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో