Vijaya Lakshmi
Published on Oct 27 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?గూగు ప్రశ్నకు ఆశ్చర్యంగా చూసాడు ఆయుష్.
“ఆ అమ్మాయి నన్ను ఇష్టపడితే, నేను ఆ అమ్మాయిలో ఇతర విషయాలు, మానసిక లక్షణాలు ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య జీవితాంతం కొనసాగే బంధం. అది కేవలం ఆకర్షణ అయితే అది కొద్ది కాలమే నిలుస్తుంది. సో కాల్డ్ ప్రేమ అయితే కర్పూరంలా వెలిగి ఆరిపోతుంది. కాని ఆత్మ బంధం అయితే జీవితాంతం నిలుస్తుంది. అందుకే ఈ రోజులలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్ళి చేసుకుంటున్నారు” అన్నాడు ఆయుష్ .
“కాని మీ దేశంలో చూసినా, ఇంకే దేశంలో చూసినా విడాకులు ఎక్కువవడంలా?” అని ప్రశ్నించింది గుగు.
“ఏదో కొంత శాతం అయి ఉండవచ్చు. మనం ఫార్మకోలోజి క్లాస్ లో వినలా.. కొన్ని మందులు కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కాని వాటి వల్ల ఎంతో మందికి ఉపయోగం. అలాగే ప్రేమ పెళ్ళి”
“కాని ఇక్కడ చాలా అరేంజ్డ్ మారేజేస్ కూడా జరుగుతాయని విన్నాను .మరి అవి ఎలా సక్సెస్ అవుతున్నాయి?” అంది గుగు.
“యు ఆర్ రైట్. అవి సక్సెస్ కావడానికన్నా, ప్రేమపెళ్ళి సక్సెస్ కావడానికన్నా ఒకరి ఆత్మ మరొకరి ఆత్మతో కలవడం ముఖ్యం. ఆ విషయం నీకు ముందుగానే చెప్పాను” అన్నాడు ఆయుష్.
“అంటే నీకు అమ్మాయి మంచిదైతే అందచందాలు అక్కర్లేదంటావు ?” అని అడిగింది గుగు.
“ముందు ఆమ్మాయి నాకు నచ్చాలి” అన్నాడు ఆయుష్.
“నీకు నచ్చాకేలే” అంది గుగు నవ్వుతూ.
వాళ్ళు ఇద్దరకీ కూడా పట్టుమని పద్దెనిమిది ఏళ్ళు నిండలేదు. అయినా ఎన్నో విషయాలు ఎంతో మెచ్యూర్డ్ గా మాట్లాడుకోవడం వాళ్ళ పక్కనే పొదల్లో కూచున్న అనటామి రీడర్ వింటున్నాడు. ఆయన అక్కడ ఉన్న విషయం గాని, తమ మాటలు వింటున్న విషయం గాని ఆయుష్ కి, గుగుకి తెలియదు. తెలిస్తే కాస్త తక్కువ, జాగ్రత్తగా మాట్లడేవారేమో!!?? ఆ అనాటమీ రీడర్ తో ఆయుష్ కి పరిచయం. ఆయన కారులోనే గుగు జ్వరం అప్పుడు పరీక్షలు రాసింది .
“గుగు బాగా చీకటి పడింది ఇక వెళదామా ?” అన్నాడు ఆయుష్.
“చాలా థాంక్స్ ఆయుష్. ఈ రోజు నాకు కంపెనీ ఇచ్చావు. లేకపోతే బోరుకొట్టి చచ్చేదానిని” అంటూ లేచింది గుగు. ఇద్దరూ హాస్టల్ వైపు బయలుదేరారు. దారిలో మాట్లాడుకుంటు వెడుతున్నారు.
“మా నాయనమ్మగారు అంటుండేవారు అందం కొరుక్కుతింటామా అని” అన్నాడు ఆయుష్.
“అందం కొరుక్కు తినకపోవచ్చుగాని బుగ్గలు కొరుక్కు తింటారు కదా” అంది గుగు చిలిపిగా.
“గుగు నేను ఊహించిన దానికంటే నువ్వు వందరెట్లు తెలివయినదానివి... ఇంకా అల్లరి పిల్లవి” అన్నాడు ఆయుష్ గుగు మాటలకి కాస్తంత ఆశ్చర్యపోతూ, కాస్తంత సరదా పడుతూ.
“అందుకే మీ మగవాళ్ళకు అందమైన అడపిల్లలు కావాలి” అంది గుగు నవ్వుతూ.
“మా దేశంలో అడపిల్లలకి జేబు లేదా పర్సు బరువుగా ఉండే మగపిల్లలు కావాలి. మరి నీ సంగతి తెలియదు కాని” అన్నాడు అయుష్.
“నిజం చెప్పనా” అని అడిగింది గుగు .
“చెప్పు” అన్నాడు ఆయుష్.
అప్పడికి హాస్టల్స్ దగ్గరికి వచ్చేసారు.
“నాకు... నాకు... నీలాంటి అబ్బాయి కావాలి” అంటూ సిగ్గుపడుతూ తన హాస్టల్ లోకి తుర్రుమంది గుగు.
ఆయుష్ ఒక నిమషం ఏమి అర్థం కాలేదు .
‘ఏమిటీ!!?? గుగు తనని ఇష్టపడుతోందా !!?? అసలు మంచి, చెడు ఏమైనా ఆలోచించిందా? ఎంత 2019 సంవత్సరం అన్నా... వేరు వేరు దేశాలు... వేరు వేరు సంస్కృతులు, వేరు ఆహారపు అలవాట్లు, వేరు ఆచార వ్యవహారాలు... కేవలం ఒక సంవత్సర పరిచయం... అదీ పరిమితమైన పరిచయం... అది ప్రేమ అనుకుంటోందా? అసలు తను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదే? అలాంటి సూచనలు గుగుకి ఇవ్వలేదే? మరి ...” గుగు మాటలతో ఒక విచిత్రమైన మానసిక స్థితిలోకి నెట్టబడ్డాడు ఆయుష్. అలాంటి పరిస్థితి ఎందరో యువకులకు, వాళ్ళ యవ్వనంలో ఎన్నిసార్లో ఎదురు అయ్యి ఉంటుంది. ఆయుష్ కీ ఎదురయ్యింది. దానికి అతను ఎలా స్పందిస్తాడో కాలమే నిర్ణయిస్తుంది.
అటు గుగు పొరపాటున నోరు జారింది గాని, ఆమె మనస్సు గందరగోళంగా ఉంది.
‘తను ఆఫ్రికా అమ్మాయి. ఆయుష్ పదహారణాల ఛాందస, శోత్రియ కుటుంబంలో పుట్టిన తెలుగు అబ్బాయి. అసలు అతను ఎలా స్పందించాడో తెలియదు. తన మాటలు భవిష్యత్ లో ఏ అనర్ధానికి దారి తీస్తాయో తెలియదు’ అని భయపడుతూ, ఆలోచిస్తూ కూచుంది.
గుగు వయస్సు కూడా తక్కువే. మానసిక పరిణితి లేదనే చెప్పాలి. అటు ఆయుష్ కూడా చిన్న వాడే. అయితే అతనికి లోకజ్ఞానం, మానసిక పరిణితి, తెలివి తేటలు ఎక్కువనే చెప్పాలి. కాని అక్కడ అది కేవలం కులాంతరో ప్రేమో, మతాంతర ప్రేమో కాదు ఖండాంతర ప్రేమ. అసలు అది ప్రేమో కాదో తెలియదు. ఎందుకంటే గుగు ఆయుష్ ని ప్రేమిస్తోంది. కాని ఆయుష్ ఆ రోజే మొదటసారిగా గుగు నోట వెంట ఆమె తనని ప్రేమిస్తోందనే మాట విన్నాడు.
ఆ రాత్రి ఇద్దరికి నిద్ర కరువయ్యింది. గుగులో తను ఆయుష్ ని ఇష్ట పడుతున్నానని చెప్పిన మాటలు భయాందోళనలు కలిగిస్తూ నిద్ర దూరం చేస్తే, ఆయుష్ కి గుగు మాటలు పదే పదే చెవుల్లో మారుమ్రోగుతూ నిద్రని దరిదాపులకు రానీయలేదు. అసలు ఆ రోజు ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళకుండా ఉంటే బాగుండును అని గుగు అనుకుంది. గుగు ఫోన్ చెయ్యగానే వెళ్ళకుండా ఉండాల్సింది అని ఆయుష్ అనుకున్నాడు .
గుగు ఎప్పడినుంచో ఆయుష్ గురించి ఆలోచిస్తూ ఒక స్థిర అభిప్రాయంకి వచ్చింది.
కాని ఆయుష్ ఇన్నాళ్ళు గుగు ని ఒక మంచి స్నేహితురాలుగానే భావించాడు. గుగు తనని ఆరాధిస్తోందని కాని, తనని ప్రేమిస్తోందని కాని ఏ మాత్రం ఊహించలేకపోయాడు.
ఆయుష్ గుగు గురించి ఆలోచించసాగాడు. గుగు మెడిసిన్ చదువుకోడానికి ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చింది. గుగు తల్లిదండ్రులు బాగా స్థితిమంతులు. వాళ్ళని చూసాక, వాళ్ళతో మాట్లాడాక, మర్యాద కల మనుషులని తెలిసింది. గుగు తనలాగే మంచి పొడగరి. రంగు నలుపు గాని, మోహంలో ఏదో తెలియని కళ ఉంది. కనుముక్కు తీరు భారతీయులతో పోలిస్తే కాస్త వేరేగా ఉన్నా కురూపి కాదు. సంసార పక్షంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, గుగు చక్కగా అలంకరించుకుంటే, ఆఫ్రికన్ విమానయాన సంస్థలలో ఎయిర్ హోస్టెస్ లా ఉంటుంది. గుగు అప్సరస అని అనడం అతిశయోక్తి అయినా, అనాకారి అని అనకకూడదు. నాన్నగారి బాషలో చెప్పాలంటే గుగు కి “ఏ” ఇవ్వలేంగాని “బీ”కచ్చితంగా ఇచ్చి తీరాలి .
ఇక మానసికంగా ఎంతో పరిపక్వత, నిజాయితీ కల మనిషి గుగు. నిజం చెప్పాలంటే తన ఊహాసుందరి కి ఉండవలిసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిలో. ఒక్క రంగు తక్కువ. రూపం కుడా ఆంధ్ర అమ్మాయిలలా నాజుకుగా ఉండకపోవచ్చు. కాని సున్నితంగానే ఉంటుంది. ’అయినా నాయనమ్మ చెప్పినట్టు అందాన్ని కొరుక్కు తింటానా’. అన్నింటి కన్నా ముఖ్యం గుగు తనని ప్రేమిస్తోంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనని ప్రేమించే వాళ్ళని పెళ్ళి చేసుకుంటే సుఖపడతామని చాలా మంది పెద్దలు చాలాసార్లు చెప్పగా తను విన్నాడు. పుస్తకాల్లో చదువుకున్నాడు.
ఇక నివేదిత కూడా తనని ఇష్టపడుతోందేమో? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోవడం వలన, కలిసి తిరగడం వలన బహుశా తనంటే ఆశ పెట్టుకుందేమో? అయితే తన దగ్గర ఎప్పుడు ఆ మాట అనలేదు. తనకైతే నివేదిత కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. ఒకవేళ అమ్మా, నాన్నా అలాగే నివేదిత తల్లిదండ్రులు ఏమైనా అనుకున్నారేమో. ఏది ఏమైనా గుగు లాంటి ఒక అమ్మాయి డైరెక్ట్ గా “నిన్ను ప్రేమిస్తున్నాను” అని అంది అంటే, అందులో నూటికినూరుపాళ్ళు నిజం ఉండి తీరుతుంది.
కాని తన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఎలా స్పందిస్తారో. కులం దాటి బయటకు వెళ్ళి అమ్మాయని ప్రేమించాను, పెళ్ళి చేసుకుంటాను అంటేనే భరించలేరు. ఇప్పుడు దేశ, జాతి, మత సరిహద్దులు చెరిపేసి వేరే దేశం అమ్మాయని పెళ్ళి చేసుకుంటాను అంటే భరించే శక్తి ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఇక నా తల్లిదండ్రులకు అసలు ఉండదు. అలాగే గుగు తల్లిదండ్రులు. వాళ్ళ పరిస్థితి వేరు. కూతురిని ముక్కూ మోహం తెలియని దేశం లో, కుర్రాడు ఎవడో, ఎటువంటి వాడో, ఏమీ తెలియనివాడికి కూతురిని ఇచ్చి పెళ్ళి చెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తారు, మధనపడతారు! ఏ తల్లిదండ్రులకు అయినా సంతానం అంటే ప్రేమ ఉంటుంది. అది అక్కడ సంస్కృతిని బట్టి, ఆచార వ్యవహారాల బట్టి కొంత తేడా ఉంటే ఉండొచ్చుగాక.
ఆ మధ్య వచ్చిన గుగు తల్లిదండ్రులను చూస్తే వాళ్ళకి, వాళ్ళ అమ్మాయి అంటే ఎంత ప్రేమో అర్థం అయ్యింది. ఏది ఏమైనా గుగు నేనంటే ఇష్టపడింది. ఇక తక్కిన అడ్డంకులు ఏమైనా వస్తే ఇద్దరూ కలిసి అధిగమించాలి... అలా చాలా సేపు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయుష్.
********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో