Vijaya Lakshmi
Published on Jun 28 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శ్రీశైలం దేవస్థానం శివయ్య భక్తులకు ఒక శుభవార్త చెప్పింది. ఆరు నెలల కిందట ఆగిపోయిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. మరి, ఉచిత స్పర్శదర్శనం ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది? స్పర్శ దర్శనం సమయాలు, టోకెన్లు ఎలా పొందాలి పూర్తి వివరాలు...
దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం. భువిలో వెలిసిన కైలాసం శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది. నిత్యం ఎంతో మంది భక్తులు అక్కడ వెలిసిన శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకొని శ్రీశైల మల్లన్న ను తనివితీరా దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు.
గతంలో శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని భక్తులు తమ చేతులతో తాకుతూ 'స్పర్శ దర్శనం' చేసుకొనేవారు. ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అందరికీ తక్కువ సమయంలోనే స్వామి దర్శనం కలిగించాలని, ఉచిత సర్శ దర్శనాన్నీ నిలుపుదల చేశారు దేవస్థానం అధికారులు. కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంది.
అయితే, భక్తుల అభ్యర్థనలు వెల్లువెత్తడంతో ఉచిత స్పర్శ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది శ్రీశైలం దేవస్థానం బోర్డ్. జులై ఒకటో తేదీ నుంచి శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్జిత సేవలకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.
వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు రెండు గంటలపాటు ఈ ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది. అవకాశాన్ని బట్టి ప్రతిరోజూ 1,000 నుంచి 1,200 మందికి ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తామని ప్రకటించారు. అయితే, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ ఉచిత సర్ప దర్శనం ఉండదని స్పష్టం చేశారు.
అయితే స్పర్శదర్శనానికి ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేసి టోకెన్లు ఉన్న భక్తులకే ఉచిత స్పర్శదర్శనం ఉంటుంది. ప్రారంభంలో దేవస్థానం వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేస్తామని, తరువాత కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని, భక్తుడి పేరు, ఆధార్, ఫోన్ నంబరును కంప్యూటర్‌లో నమోదు చేసి క్యూ.ఆర్ కోడ్ కలిగిన టోకెన్‌ను ఇచ్చే విధానం ప్రవేశపెడతామని తెలిపారు.
ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని.. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో ధరించవలసి ఉంటుంది. పురుషులు తప్పనిసరిగా పంచె, కండువాతో దర్శనానికి హాజరవ్వాలి. షర్టులు, టీషర్టులు, ప్యాంటులు ధరించి వచ్చిన వారిని దర్శనానికి అనుమతించరు. అదే విధంగా, మహిళలు చీర లేదా చుడిదార్‌లో దర్శనానికి రావాలి. జీన్స్, లెగ్గిన్స్, పాశ్చాత్య దుస్తులు ధరించిన వారికి ప్రవేశం ఉండదు.