Vijaya Lakshmi
Published on Oct 24 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. చార్ ధాం గా చెప్పబడే కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు సంవత్సరంలో ఆరునెలలు మాత్రమే భక్తులకు దర్శనానికి అనువుగా అందుబాటులో ఉంటాయి. మిగిలిన ఆరునెలలు మూసివేస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లిన్గాలలో ఒకటయిన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. భాయ్ దూజ్ పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మంగళ హారతి, భజనాలు, వేదపారాయణాలతో ఆలయం అంతట భక్తి తరంగాలు అలముకున్నాయి. చివరగా పండితులు శాస్త్రోక్తంగా ద్వారబంధన పూజ నిర్వహించి, ఆలయ ప్రధాన గర్భగృహ ద్వారం మూసి వేసారు.
ఈ సందర్భంగా గురువారం ఉదయం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్మీ మేళతాళాలు, సుమారు పది వేల మంది భక్తుల జై బాబా కేదార్ నాథ్ నినాదాల మధ్య కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఘనంగా ప్రారంభమయింది. ఈ ఊరేగింపు శనివారం నాటికి ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయానికి చేరుకోనుంది. మిగిలిన ఆరునెలల పాటు ఈ ఊఖీమఠ ఆలయంలోనే కేదార్‌నాథుడు పూజలందుకుంటాడు.
ఈ ఉత్సవాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే చార్‌ధామ్‌లోని గంగోత్రి ఆలయాన్ని అక్టోబర్22న, కేదార్ నాథ్, యమునోత్రి ఆలయాలను 23న, మూసివేయగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 25న మూసివేయనున్నారు. మంచు, తీవ్రమైన చలి కారణంగా ప్రతి సంవత్సరం అక్టోబరు- నవంబరు నెలల్లో ఈ ఆలయాలను మూసివేసి ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు.
ఈ సంవత్సరం 17,68,795 మంది యాత్రికులు కేదార్ నాథుడిని దర్శించుకున్నారని ఇది గత సంవత్సరం యాత్ర చేసిన భక్తుల సంఖ్య కంటే సుమారు 1.25 లక్షలు ఎక్కువని బద్రి కేదార్ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది ప్రకటించారు. గత సంవత్సరం 16,52,076 మంది భక్తులు బాబా కేదార్ నాథుదిని దర్శించుకున్నారు.