Vijaya Lakshmi
Published on Dec 29 2023
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?భూతల స్వర్గం కాశ్మీర్ అంటారు. అలాంటి భూతల స్వర్గంలో ఓ వైపు ఆకాశాన్నంటుతున్న ఎత్తయిన పర్వతాలు.
మరోవైపు పాతాళాన్ని తలపించే లోతైన లోయలు..
వాటి మధ్యలో పచ్చటి ప్రకృతి. దూరంగా పర్వతాలమీద మీకంటే మేమే ఉన్నతంగా ఉన్నాం అన్నట్టు సమున్నతంగా నిలబడి గర్వంగా చూస్తున్నట్లు ఉండే దేవదారు వృక్షాలు.. మమ్మల్ని అడ్డుకోవడం ఎంతటి వారికైనా సాధ్యమా అన్నట్టు కొండల మీదినుంచి గలగల పారే సెలయేరులు...
హిమాలయాల్లో తప్ప ఇంకెక్కడా చూడలేని చీనార్ వృక్షాలు,
వింతవింత పువ్వులు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీది అందమంతా అక్కడే ఉందా అన్నట్టుండే అందాల అద్భుత లోకం.
ఆ అద్భుత లోకంలో హిమాలయాలలోని ఓ గుహలో కొలువుతీరాడు పరమేశ్వరుడు. ఆ గుహే అమర్ నాథ్. ఆ గుహలో కొలువు తీరాడు అమరనాధుడు
ప్రతి హిందువూ పరమపవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అంత ఎత్తులో, ఎన్నో భయంకరమైన పరిస్తితులను దాటుకొని, మరెన్నో కష్టనష్టాలను భరించి. ఇంకెన్నో బాధలను, భయాలను ఎదుర్కొని మరీ గుహలో కొలువుతీరిన ఆ శివయ్యను దర్శించాలనే భక్తుల ఆరాటం వెనకున్న ఆత్రమేంటి? ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం...
ఎన్నో ప్రదేశాల్లో శివయ్య లింగరూపంలో వెలిసాడు. అయితే ఈ అమర్ నాథ్ గుహలో ఉన్న శివలింగం మాత్రం మహాద్భుతం అని చెప్తారు. శివయ్య మంచుశివలింగంగా వెలిసే ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని చెప్తారు. హిమాలయ పర్వతాల్లో వెలిసిన ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసిందని చెప్తారు. అందుకే ఆ పరమాత్ముడి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా సాగిపోతుంటారు.
అమర్‌నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న అమర్‌నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం..ఒకప్పుడు కశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా, కశ్యప మహాముని ఉద్ధరించాడని ఓ కథనం. ఈ పురాణగాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగు ముని అని చెబుతుంటారు. ఇక అమర్‌నాథ్ గుహ శివుని శాశ్వత నివాసంగా పరమేశ్వరుడు పార్వతీ దేవికి అమరత్వ రహస్యాన్ని బోధించిన ప్రదేశంగా భావిస్తారు. ఈ గుహలోనే ఉన్న జంటపావురాలు ఒక పెద్ద మిస్టరీ... అమర్నాథ్ చరిత్ర... జంట పావురాల రహస్యం పూర్తిగా వీడియోలో చూడండి...