ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు | Largest Hindu Temples in the World in Telugu

Vijaya Lakshmi

Published on Jan 29 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

హిందూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు… అవి భారతీయ సంస్కృతి, శిల్పకళ, ఆధ్యాత్మిక విజ్ఞానానికి ప్రతీకలు. ప్రపంచంలో కొన్ని హిందూ దేవాలయాలు విస్తీర్ణం, నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాధాన్యం పరంగా అతి పెద్దవిగా గుర్తింపు పొందాయి. వేల సంవత్సరాల చరిత్ర, తత్వశాస్త్రం, శిల్పకళ, భక్తి అన్నీ కలిసిన రూపమే హిందూ దేవాలయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేవాలయాలు విస్తీర్ణం, ఎత్తు, నిర్మాణ వైభవం పరంగా అతి పెద్దవిగా నిలిచాయి. అవి భక్తుల మనసుల్లోనే కాదు…

ప్రపంచ చరిత్రలో కూడా తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో లేదని మీకు తెలుసా?

కంబోడియాలోని అంకోర్ వాట్ నుంచి, తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం వరకు—

ఈ దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయి? ఎందుకు అంత విశాలంగా ఉన్నాయి? వాటి వెనుక ఉన్న బ్లాగ్  తెలుసుకుందాం,


🛕 1. అంకోర్ వాట్ – కంబోడియా

(World’s Largest Hindu Temple)

అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.

అంకోర్ వాట్ (Angkor Wat) ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తించబడింది.



“భారతదేశంలో ఉన్న దేవాలయాలు ప్రపంచంలోనే గొప్పవని మనం గర్వంగా చెప్పుకుంటాం…

కానీ…👉 ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో లేదంటే… నమ్మగలరా?”

వందల ఎకరాల్లో… వేల సంవత్సరాల క్రితం…ఒక్క ఇనుము ముక్క కూడా వాడకుండా…నిర్మించిన అద్భుత దేవాలయం ఆంగ్కోర్ వాట్ దేవాలయం. ఇది కంబోడియా దేశంలో ఉంది. దక్షిణ ఆసియాలోని కంబోడియా దేశంలో ఉన్న అంకోర్ వాట్! దేవాలయం ఒక అద్భుతం. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం.

అంకోర్ వాట్ (Angkor Wat) ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తించబడింది. వేల ఏళ్ల క్రితమే… వందల ఎకరాల్లో నిర్మించబడిన దేవాలయం… అన్కోర్ వాట్ దేవాలయం

ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయంలో అడుగడుగునా  రామాయణం, మహాభారత ఘట్టాలు రాతిలో అద్భుతంగా  చెక్కబడ్డాయి.

ఈ ఆలయం నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్.   సాధారణ శకం 12వ శతాబ్దంలో ఖ్మేర్ సామ్రాజ్య రాజు సూర్యవర్మన్ II కాలంలోనిర్మించబడింది. దీని  నిర్మాణ కాలం: సుమారు 30 సంవత్సరాలు.

అద్భుతం ఏమిటంటే…ఈ ఆలయం మొత్తం శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఆలయ గోడలపై రామాయణం…మహాభారతం…సముద్ర మథనం… క్షీరసాగర మథనం, , వామనావతారం, కృష్ణ లీలలు ఇలా హిందూ పురాణాలకు సంభందించిన ప్రతి ఘట్టం  జీవంతో కదిలినట్టు చెక్కబడ్డాయి.

విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఇప్పటికీ…ఈ ఆలయం కంబోడియా జాతీయ జెండాపై ఉంటుంది.ఒక హిందూ దేవాలయం…ఒక దేశానికి చిహ్నంగా మారడం… ఇది హిందూ సంస్కృతి శక్తిగా చెప్పుకోవచ్చు.

ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. ఆలయంలో  విష్ణువు శేషశాయనుడిగా దర్శనమిస్తాడు.

అంకోర్ వాట్ అనేది కంబోడియాలోని సియం రీప్ (Siem Reap) ప్రాంతంలో ఉన్న ఒక విశాలమైన దేవాలయ సముదాయం.

అంకోర్ వాట్ ఒక ఆలయం మాత్రమే కాదు…ఖగోళ గణిత పరికరం కూడా అని చెబుతారు పరిశోధకులు. కొన్ని ప్రత్యెక దినాలలో సూర్య కిరణాలు నేరుగా విష్ణు పాదాల మీద పడే విధంగా నిర్మాణం జరిగింది. అలాగే ఆలయ కొలతలు నాలుగు యుగాలైన కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల సంఖ్యలకు సరిపోతాయి.

13వ శతాబ్దం తరువాత ఖ్మేర్ సామ్రాజ్యంలో బౌద్ధం విస్తరించింది. దాంతో అంకోర్ వాట్ హిందూ ఆలయం నుంచి  బౌద్ధ విహారంగా మారింది. అయితే హిందూ ఆలయ చిహ్నాలు మాత్రం యధాతధంగానే ఉన్నాయి.

👉 ఇది కంబోడియా జాతీయ చిహ్నంగా కూడా నిలిచింది.

🛕 2. శ్రీ రంగనాథస్వామి ఆలయం – శ్రీరంగం

(India’s Largest Hindu Temple)

భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే.

భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం.

·        భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం చెప్తారు.

·        తమిళనాడులో శ్రీరంగం,లో ఉన్న ఈ ఆలయం రంగనాథుడు రూపంలోనే శ్రీ మహావిష్ణువు అంకితం చేయబడింది. విస్తీర్ణం: సుమారు 156 ఎకరాలు, గోపురాలు: 21, ప్రాకారాలు: 7 తో

·        ఈ ఆలయం ఒక చిన్న పట్టణంలా ఉంటుంది. ఆలయం లోపలే ఇళ్లు, దుకాణాలు, వీధులు ఉన్నాయి.

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ఆసియాలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి.



·        భారతదేశంలో దేవాలయాలు ఎన్నో ఉన్నా… “దేవుడు స్వయంగా విశ్రాంతి తీసుకునే స్థలం” అని భక్తులు నమ్మే ఆలయం ఒక్కటే అదే శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం. కావేరి నది ఒడిలో, ఒక ద్వీపంపై విరాజిల్లిన ఈ మహాదేవాలయం…భక్తికి, వాస్తుశిల్పానికి, చరిత్రకు, రహస్యాలకు నిలువెత్తు ప్రతీక.

ఇది కేవలం ఒక ఆలయం కాదు… వైకుంఠం భూమిపై అవతరించిన రూపం.

·        పురాణాల ప్రకారం, స్వయంగా బ్రహ్మదేవుడు ఈ రంగనాథస్వామిని పూజించాడు. బ్రహ్మలోకంలో పూజింపబడిన ఈ విగ్రహాన్నిఇక్ష్వాకు వంశ రాజులకు అప్పగించాడు. రామాయణంలో ప్రసిద్ధుడైన విభీషణుడు,శ్రీరాముని ఆశీర్వాదంతో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

·        కానీ… శ్రీరంగం వద్ద విగ్రహం భూమిపై ఉంచగానే  అది కదలకుండా స్థిరపడిపోయింది. ఎంత ప్రయత్నించినా అక్కడినుంచి విగ్రహం కదిలించడం సాధ్యం కాలేదు. అప్పుడు ఆకాశవాణి:

“ఇదే రంగనాథుని స్థానం” ఆ విగ్రహాన్ని లంకకు తీసుకుపోయే ప్రయత్నం మానుకొని, ఇక్కడే ఆలయం నిర్మించమని చెప్పిందని ఆలయ స్థల పురాణ కథనాలు చెబుతున్నాయి.

·        శ్రీరంగం ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆది శేషునిపై శయనావస్థలో దర్శనమిస్తాడు. దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇది మోక్షానికి సంకేతం అని, భక్తులపై కరుణకు చిహ్నం అని శాస్త్రాలు చెబుతాయి

·        🛕 3. స్వామినారాయణ అక్షర్ధామ్ – ఢిల్లీ

ఆధునిక కాలంలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం.

ఢిల్లీ లోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయం ఆధునిక భారత శిల్పకళకు అద్దం పడుతుంది.

·        ధిల్లీ లోని స్వామి నారాయణ్ ఆలయం.వే ల సంవత్సరాల క్రితమే కాదు…ఆధునిక కాలంలో కూడా

భారతదేశం అద్భుత ఆలయాన్ని నిర్మించింది. అదే  ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్ధామ్. 2005లో ప్రారంభమైన ఈ ఆలయంలో ఒక్క ఇనుము ముక్క కూడా ఉపయోగించలేదు.ఇనుమన్నది ఉపయోగించకుండా కేవలం గ్రానైట్…మార్బుల్… ఉపయోగించి నిర్మించన ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు… శిల్పకారుల చేతుల మాయ… అంటారు పరిశీలకులు. ఇది  భారతీయ సంస్కృతి ప్రదర్శనశాల. అని కూడా వర్ణిస్తారు.

·        ఇక్కడ అతి పెద్ద ఆకర్షణ మ్యూజికల్ పౌంటేన్. రాత్రి సమయాలలో  యాగ్నపురుష్ కుండ్ వద్ద నిర్వహించే ఈ ప్రదర్శనలో రంగురంగుల నీరు, ధ్వని మరియు లైట్లు కలసి ఒక భావోద్వేగ అనుభూతిని  పంచుతాయి ఇది పిల్లలకు మరియు పెద్దలకు సమానంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

·        ఆధునిక కాలంలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం.

·        ఢిల్లీ లోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయం ఆధునిక భారత శిల్పకళకు అద్దం పడుతుంది.



🛕 4. బృహదీశ్వర ఆలయం – తంజావూరు

చోళుల శిల్ప వైభవానికి నిదర్శనం

·        తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది.

·        చోళ రాజు రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం…ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్న గానే నిలిచిపోయింది. పరిశోధకులకు మిస్టరీగానే మిగిలిపోయింది. బృహదీశ్వర ఆలయం – తంజావూరుచోళుల శిల్ప వైభవానికి నిదర్శనం. విమాన గోపుర ఎత్తు: సుమారు 216 అడుగులు. వెయ్యేళ్ల క్రితమే ఇంత భారీ శిఖరాన్ని నిర్మించడం అప్పటి శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం.

·        1000 సంవత్సరాలకు పైగా కాలం గడిచినా,ఇప్పటికీ ఆకాశాన్ని తాకే విమానం,నీడ పడని శిఖరం,ఒకే రాతితో చెక్కిన నంది,శివుడి విశ్వరూపాన్ని తెలిపే చిత్రాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి.

·         ఆ భారీ శిఖర రాయిని ఎలా పైకి ఎక్కించారు? శిఖరం నీడ పడకుండా ఎలా నిర్మించారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించబడుతోంది.



🛕 5. బేలూరు – హళేబీడు ఆలయాలు

శిల్పకళలో అతి సూక్ష్మత

విస్తీర్ణంలో పెద్దవి కాకపోయినా,

👉 శిల్ప వైభవంలో ప్రపంచంలోనే అద్భుతమైన హిందూ దేవాలయాలు.

·        భారతీయ కళ, శిల్పకళ, ప్రాచీన వైభవాన్ని ఇష్టపడేవారు హళేబీడు హోయసలేశ్వర దేవాలయాన్ని చూడటం తప్పనిసరి అని చెప్పాలి. ఈ దేవాలయాన్ని 2023లో UNESCO ప్రపంచ వారసత్వ స్థలంగా అధికారబద్ధం చేశారు, హోయసాలార్ శిల్పకళ యొక్క అద్భుతతను ప్రపంచానికి ప్రసిద్ది చేయడానికి

·        విస్తీర్ణంలో పెద్దవి కాకపోయినా, శిల్పకళలో అతి సూక్ష్మత, శిల్ప వైభవంలో ప్రపంచంలోనే అద్భుతమైన హిందూ దేవాలయాలుగా చెప్పుకునే ఆలయాలు.

·        కర్ణాటక రాష్ట్రంలో  హోయసళ రాజుల నిర్మాణం ఈ హలెబీడు దేవాలయాలు. ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది


హిందూ దేవాలయాల విశాలత వెనుక భావం

హిందూ దేవాలయాలు పెద్దగా ఉండటానికి కారణం కేవలం ఆడంబరం కాదు.

అవి —


·        ముగింపు

·        ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయాలు మనకు ఒక్క విషయం చెబుతాయి —

భక్తి పరిమాణంతో కొలవబడదు… కానీ భక్తి కోసం నిర్మించిన నిర్మాణాలు మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి.

·        ఈ దేవాలయాలు రాయి, మట్టి మాత్రమే కాదు…

👉 వేల సంవత్సరాల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యాలు.


❓ Frequently Asked Questions (FAQ)

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు

❓ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏది?

జ: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంకోర్ వాట్ (Angkor Wat). ఇది కంబోడియాలో ఉంది మరియు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. సుమారు 402 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.

❓ భారతదేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏది?

జ: భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం (తమిళనాడు). ఇది సుమారు 156 ఎకరాల్లో విస్తరించి ఉంది.

❓ అంకోర్ వాట్ ఆలయం భారతదేశంలో ఎందుకు లేదు?

జ: ప్రాచీన కాలంలో భారతీయ హిందూ సంస్కృతి దక్షిణ-ఆసియా దేశాలకు విస్తరించింది. ఆ ప్రభావంతోనే కంబోడియాలోని ఖ్మేర్ రాజులు అంకోర్ వాట్ వంటి హిందూ దేవాలయాన్ని నిర్మించారు.

❓ అంకోర్ వాట్ ఏ దేవుడికి అంకితం చేయబడింది?

జ: అంకోర్ వాట్ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణం మొత్తం విష్ణువు నివాసమైన వైకుంఠాన్ని ప్రతిబింబిస్తుంది.

❓ హిందూ దేవాలయాలు ఎందుకు అంత విశాలంగా నిర్మించబడ్డాయి?

జ: హిందూ దేవాలయాలు వాస్తు శాస్త్రం ప్రకారం బ్రహ్మాండానికి ప్రతిరూపంగా నిర్మించబడతాయి. గర్భగుడి సృష్టి కేంద్రాన్ని సూచిస్తే, ప్రాకారాలు భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తాయి.

❓ ఆధునిక కాలంలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయం ఏది?

జ: ఆధునిక కాలంలో నిర్మితమైన విశాల హిందూ దేవాలయం స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయం (ఢిల్లీ). ఇది 2005లో ప్రారంభమైంది.

❓ అక్షర్ధామ్ ఆలయంలో ఇనుము ఎందుకు ఉపయోగించలేదు?

జ: హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణంలో లోహాలు ఉపయోగించకూడదనే భావన ఉంది. అందుకే అక్షర్ధామ్ ఆలయం పూర్తిగా రాయి, గ్రానైట్, మార్బుల్ తో నిర్మించబడింది.

❓ బృహదీశ్వర ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది?

జ: తంజావూరులోని బృహదీశ్వర ఆలయం 216 అడుగుల ఎత్తైన శిఖరం కలిగి ఉంది. వెయ్యేళ్ల క్రితమే ఇంత భారీ నిర్మాణం చేయడం అప్పటి భారతీయ శిల్ప విజ్ఞానానికి నిదర్శనం.

❓ ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలు భారతీయ శిల్పకళ ఆధారంగానేనా?

జ: అవును. కంబోడియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలు కూడా భారతీయ వాస్తు, శిల్ప, ఆగమ శాస్త్రాల ప్రభావంతోనే నిర్మించబడ్డాయి.

❓ ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు ఎందుకు ముఖ్యమైనవి?

జ: ఈ దేవాలయాలు కేవలం మత పరమైనవి కాదు. అవి

👉 భారతీయ సంస్కృతి

👉 శిల్పకళ

👉 ఆధ్యాత్మిక తత్వం

👉 చారిత్రక వారసత్వం

అన్నిటికీ నిలువెత్తు సాక్ష్యాలు.


Recent Posts
తిరుమల మే నెల దర్శన కోటా  వివరాలు | Tirumala darshan tickets quota release
తిరుమల మే నెల దర్శన కోటా ...
మహాశివరాత్రి రోజున ఏం చేయాలి? ఇలా చేస్తే శివానుగ్రహం ఖాయం! | Maha Shivaratri Special Rituals
మహాశివరాత్రి రోజున ఏం చేయాలి? ఇలా చేస్తే...
మహా శివరాత్రి – ఈ రాత్రి ఎందుకు ప్రత్యేకం? అసలు రహస్యం ఇదే! | Scientific Reasons Behind Maha Shivaratri
మహా శివరాత్రి – ఈ రాత్రి ఎందుకు...
2026 తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు డేట్స్  | 2026 Tirumala Srivari Salakatla Theppotsavam Dates
2026 తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు డేట్స్...
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు | Largest Hindu Temples in the World in Telugu
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు |...