2025 సింహాచలం గిరిప్రదక్షిణ Full details of the 2025 Simhachalam Giri Pradakshina—date, time, and more

Vijaya Lakshmi

Published on Jun 14 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

సింహాచలం గిరిప్రదక్షిణ, తేదీ సమయం, అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, గిరిప్రదక్షిణ చరిత్ర, మహత్యం, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎంత దూరం చేయాలి, ఏ మార్గంలో చేయాలి...


సింహాచలం...ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవంసింహాద్రప్పన్న.  సింహాచల శ్రీవారాహలక్ష్మీనరసింహస్వామి.  సింహాచలేశుడు కొలువుతీరిన సింహగిరి అతి పెద్ద పండుగకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. స్థానికులతో పాటు పొరుగు జిల్లాలే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన లక్షలాది మంది భక్తజన సందోహం సింహాద్రప్పన్నా నమో నమః అంటూ ప్రవాహంలా సాగిపోయే రోజు గిరిప్రదక్షిణ రోజు. సింహాద్రప్పన్న చివరి విడత చందన సమర్పణకు సన్నాహాలు చేసేది ఆ రోజే. సింహాచల క్షేత్రంలో స్వామి నిజ రూపం, నిత్య రూపాలతో కొలువుతీరిన పుష్పరథం కదిలేది రోజే సింహాచలం గిరిప్రదక్షిణ రోజు.

సింహాచల గిరిప్రదక్షిణ రోజు సింహాచలం కొండ మాత్రమె కాదు సింహాచలం విశాఖ నగర పరిసరాలన్నీ సింహాచలేశా... వరాహ లక్ష్మీ నరసింహా... సింహాద్రప్పన్నా అన్న భక్తుల ఆర్తి పూర్వక పిలుపులతో మారుమోగిపోతుంది.



ఈ సంవత్సరం అంటే 2025 లో సింహాచల గిరిప్రదక్షిణ జరిగే తేదీలు సమయం ఆ విశేషాలు చూద్దాం.,,ఆషాఢ శుద్ధ చతుర్దశి అంటే జూలై 9 నాడు సాయంత్రం మొదలై ఆషాఢ శుద్ధ పొర్ణమి నాడు అంటే జూలై 10 న ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమ ... గురుపూర్ణిమ .... సింహాచలేశుని గిరిప్రదక్షిణ. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు సింహాచల గిరిప్రదక్షిణ చేయడం అనాది నుంచి వస్తున్న ఆచారం.


గిరిప్రదక్షిణ ఎందుకు చేయాలి


ఎందుకు చేయాలంటే సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తుల  ప్రగాడ నమ్మకం. ఆ కొండను సాక్ష్టాట్టూ ఆ కొండమీద కొలువుతీరిన స్వామిగానే భావించి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అదే గిరిప్రదక్షిణ. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొంటే.. స్వామి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా.. స్వామిని మొక్కుకుని.. గిరి ప్రదక్షిణలో పాల్గొంటే.. ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.. సింహగిరి ప్రదక్షిణం.. భూ ప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పాప ప్రక్షాళన జరిగి పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ గిరిప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.


సింహాచలం గిరి ప్రదక్షిణ ఎంతదూరం ఉంటుంది? ఎలా చెయ్యాలి?


అంటే ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చెయ్యడం వెనక కూడా ఓ కారణం ఉంది. సింహాచల క్షేత్రానికి నరసింహస్వామికి 32 సంఖ్యకు ఒక సంబంధముంది. ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి స్తంభం లోనుంచి ఆవిర్భవించినపుడు 32 రూపాలను ధరించినట్టు చెప్తారు. అదే విధంగా  ఉగ్రం వీరం మహా విష్ణుం అన్న నృసింహ మూల మంత్రం 32  అక్షరాలతో ఉంటుంది. అందుకే 32 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు.


జులై 9 వ తేదీ సాయంకాలం సింహాచలం కొండ దిగువన దేవస్థానం తొలి పావంచా వద్ద శ్రీ స్వామి వారి పుష్పరథం ప్రారంభమవుతుండి. అక్కడ నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహాచలంలో తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు.


జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆలయ అధికారులు భక్తులను కోరారు. గతేడాది సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ గిరి ప్రదక్షిణలో 10 లక్షల మంది పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసినా, అంతకు మించి భక్తులు తరలివచ్చారు గత ఏడాది.


ప్రదక్షిణ ఎక్కడ మొదలై ఎలా జరుగుతుందంటే


గిరి ప్రదక్షిణ... తొలి పావంచా అంటే కొండ ఎక్కే మొద‌టి మెట్టు నుంచి మొదలై అడవివరం, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, వెంకోజిపాలెం, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం వెనుక వైపు, డీఎల్‌బీ క్వార్టర్స్, మాధవధార, ఎన్‌ఎడీ జంక్షన్, బాజీ జంక్షన్, సప్తగిరి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాస నగర్, గోశాల మీదుగా మళ్లీ మొదటి మెట్టుకు చేరుకుంటుంది.

అయితే కిందటి ఏడాది కంటే ఈసారి మరింత ఎక్కువ మంది భక్తులు తరలివస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు.

ఇక కొండ చుత్తూ నడిచి గిరి ప్రదక్షిణ చెయ్యలేని భక్తులు కొండమీద ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గిరిప్రదక్షిణ చేసిన భావంతో తృప్తి పడతారు.


చివరి విడత చందన సమర్పణ


గిరిప్రదక్షిణ జరిగిన వెంటనే సింహాచల నరసింహస్వామికి చివరివిడత చందన సమర్పణ జరుగుతుంది. పొర్ణమి రోజు తెల్లవారుఘామున సుప్రభాత సేవ అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన మూడు మణుగుల అంటే సుమారు 125 కేజీల చందన్నాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం తరువాత స్వామికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ  ఇదే.  ఇవి సింహాచలం కొండ గిరిప్రదక్షిణ వివరాలు.


Recent Posts
వైజాగ్ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో వైభవంగా శ్రావణలక్ష్మీ పూజలు  | Shravana Lakshmi pooja in Vizag sri kanakamahalakshmi temple
వైజాగ్ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో వైభవంగా...
రాధాకృష్ణుల సంయుక్తావతారం చైతన్య మహాప్రభు | Great devotee of puri jagannatha swamy      |     chaitanya mahaprabhu bhakti udyamam
రాధాకృష్ణుల సంయుక్తావతారం చైతన్య మహాప్రభు | Great...
ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం టికెట్లు | Sri Srinivasa divyanugraha special homam tickets release on August 1st
ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీ...
ఈ 5 కృష్ణ దేవాలయాలను తప్పకుండా చూడాల్సిందే  | Must visit these 5 Srikrishna temples in India
ఈ 5 కృష్ణ దేవాలయాలను తప్పకుండా చూడాల్సిందే...
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు | Vijayawada kanakadurga temple Shravan festivals
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు |...