శ్రీశైలం అడవిలో అద్భుత ఆధ్యాత్మిక యాత్ర | A divine spiritual journey through the sacred forests of Srisailam.

Vijaya Lakshmi

Published on Dec 28 2023

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించగలం. అందుకేనేమో ఆ దేవి దర్శనం ఓ సాహసయాత్రే. దట్టమైన అడవుల్లో ఓ చిన్న గుహలో వెలసిన ఆ తల్లి దర్శనం ఆ జగజ్జనని సజీవంగా మన ముందు నిలచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన ఆ తల్లిని ఇప్పుడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. 

ఇంతకీ ఆ దేవి ఎవరు...? ఆ క్షేత్రమేది...? ఆ క్షేత్ర దర్శనం ఎందుకంత కష్టం..?


ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. దట్టమైన నల్లమల అడవులలో నెలకొన్న శ్రీశైలం ఆది దంపతుల స్థిర నివాసంగా మహా క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఎందరో మహర్షులు, మహనీయులు, కారణజన్ములు, యోగులు, సిద్దులు ఇక్కడికొచ్చి మల్లిఖార్జునుని కొలిచి ముక్తిని పొందారని స్థలపురాణం చెప్తోంది. అప్పడే కాదు ఇప్పటికి కూడా ఇక్కడి అరణ్యాలలో ఎంతోమంది మునులు ఎవ్వరికీ కనబడకుండా ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు.ఎన్నో పురాతన ఆలయాలు, పురాణ చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయిక్కడ. అలాంటి వాటిల్లో గత కొన్నేళ్ళుగా విశేష ప్రాచుర్యం పొందినది శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం.


ఆధునిక సౌకర్యాలు పుష్కలంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా చాల సులువుగా వెళ్ళగలుగుతున్నాం. ఈ క్రమంలో సుదూర,సుదీర్ఘ యాత్రలు కూడా సులభంగా చేస్తున్నాం. కాని ఆ ఆలయాన్ని దర్శించడం మాత్రం అంత ఈజీ కాదు. ట్రెక్కింగ్ ఈ మాటే ఎంతో ఎట్రాక్టివ్ గా వుందికదూ.దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ కి వెళ్లేవారి గురించి వింటున్నప్పుడు టివీలో వాళ్ళను చూస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలవుతాం. అదిగో సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది.శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరీయాత్ర. వాగులు వంకల్లో, దట్టమైన అడవిలో బండరాళ్ల మధ్య, చిన్నచిన్న సెలయేళ్ళు దాటుకుంటూ, మన వాహనం వెళ్ళే శబ్దం తప్ప మరే శబ్దం లేని నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలో ప్రయాణిస్తున్న వాహనం ఎత్తుపల్లాల మధ్యలో బండల మీద వెళుతూంటే విపరీతమైన కుదుపులతో వెళ్తుంటే అదెక్కడ బోల్తాపడుతుందో అన్న భయంతో ఉత్కంఠ... ప్రయాణికులు అరిచే అరుపులు, అరుస్తూ అంతలోనే ఆ నిశ్శబ్దాన్ని, ఈ ఉత్కంటను చేధిస్తూ ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలలు, అంత దట్టమైన అడవిలో వాహనానికి అడ్డంగా ఏ పులో వస్తే ఏం చేస్తాం అన్న భయంకరమైన ఊహలు, ఆ ఊహను బయటపెడితే వాటికి మరింత ఊతమిస్తూ, అవును అప్పుడప్పుడు పులులు ఎదురోస్తూ ఉంటాయి అనే జీపు డ్రైవర్ మాటలు...వీటన్నిటితో భయం,ఉత్కంఠ,ఆహ్లాదం, ఆనందం వీటన్నిటి కలయికతో సాగిపోయే సాహసయాత్ర అద్భుతమైన మరచిపోలేని అనుభవాన్ని, అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ యాత్రే ఇష్టకామేశ్వరీదేవి యాత్ర.



నిజానికి ఆ యాత్ర చేయటం అంట ఈజీకాదు. ఆవిడని దర్శించుకోవటం అంత సులభంకాదు. అక్కడికి కార్లు, బస్సులు లాంటివి ఏవీ వెళ్ళవు.శ్రీశైలక్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రమే అక్కడకు వెళ్తాయి.అది కూడా శారీరకంగా ఆరోగ్యంతో వున్న వారు దాంతోపాటూ మానసికంగా గుండెధైర్యం వుండే వాళ్ళు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు.ఎందుకంటే అక్కడకు వెళ్లేదారి అంతే కష్టతరంగా, భయంకరంగా వుంటుంది.

చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న, సినిమాలో చూసినటువంటి అడవిదారులు, వాగులు, వంకలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును. కాస్త ధైర్యం చేయగలిగితే, మరికొంత శ్రమకోర్చగలిగితే లైఫ్ లో ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా వుండిపోతుంది ఇష్టకామేశ్వరీ యాత్ర. ఈ యాత్ర గురించి పూర్తి వివరాలు వీడియోలో చూడండి...


youtube play button


Recent Posts