క్షీరసాగర మథనానికి శాపమే కారణమా?/cursed story of ksheerasagara madhanam

Vijaya Lakshmi

Published on Mar 21 2024

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

      హిందూ పురాణాల్లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయి. ఎన్నిసార్లు విన్నా... ఎంత తరచి తరచి తెలుసుకున్నా ఇంకా ఏదో మనకు తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. వాటిలో క్షీర‌సాగ‌ర మ‌థ‌నం కూడా ఒక‌టి. అవును, క్షీరసాగర మథనం లో ఎన్నో అద్భుతాలు... రహస్యాలు... ఇంకెన్నో గూడార్ధాలు... మర్మాలు, దాగి ఉన్నాయి. క్షీర సాగర మాధనంలోనే శ్రీమహావిష్ణువు యొక్క రెండు అవతారాలు ఉద్భవించాయి ఆ అవతారాలు ఏంటి? ఎ సందర్భంలో, ఎందుకు ఉద్భవించాయి? క్షీరసాగర మధనంలో అమృతంతో పాటు హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం లాంటి ఎన్నో విశిష్ట వస్తువులు, జీవులు... చంద్రుడు, లక్ష్మీదేవి తో పాటు మరెంతో మంది దేవీ దేవతలు కూడా ఆవిర్భవించారు.. ఆ ఆవిర్భవించిన దేవీ దేవతలు ఎవరు? ఎందుకు ఉద్భవించారు?  అసలు క్షీరసాగర మధనం ఎందుకు జరిగింది? క్షీర సాగర మధనంలో దేవదానవులు పాల్గొన్నారు. బద్ధ శత్రువులైన దేవదానవులు కలిసి ఎందుకు క్షీరసాగరాన్ని చిలికారు. పాలసముద్రం మధించడంలో దేవదానవులకు సహకరించిన జీవజాతులు ఏంటి? క్షీరసాగర మధనంలో నాగజాతి పాత్ర ఎంతవరకు ఉంది? అన్నిటి కంటే ప్రధానమైన ప్రశ్న దేవదానవులు క్షీరసాగరాన్ని ఎందుకు మధించారు? ఇలా క్షీరసాగర మధనం గురించి ఎన్నో ప్రశ్నలు వస్తాయి...


youtube play button


       క్షీరసాగర మథనానికి కారణం ఓ శాపమా!


    క్షీరసాగర మధనం...పాల సముద్రాన్ని మధించడం. అసలెందుకు జరిగింది. పౌరాణిక చరిత్రలో ఎన్నో సంఘటనలకు అంకురం వేసింది మహర్షుల శాపాలే. అలాగే ఈ క్షీరసాగర మథనం ఘటనకు కూడా మూలం ఒక శాపం. కోపానికి పరాకాష్ట అయిన దూర్వాస మహర్షి శాపం. సాగరమథనంలో విశేషాలను తెలుసుకునేముందు పాల సముద్ర మథనానికి దారితీసిన ఆ శాప కథనమేంటో ముందుగా తెలుసుకుందాం..

ఒకసారి ఇంద్రుడు తన వాహనం ఏనుగు మీద విహరిస్తున్నాడు. అదే సమయంలో  దూర్వాస మహర్షి అతనికి ఎదురుపడ్డాడు. ఇంద్రుడు మహర్షిని చూసి ప్రణామం చేసాడు. మహర్షి తన చేతిలో విష్ణుమూర్తికి అలంకరించబడిన శేష పుష్పమాలను స్వర్గాధిపతి ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలను ఏనుగు మేడలో వేస్తాడు. మేడలో మాల పడడంతో చిరాకుతో ఏనుగు మాలను తొండంతో తీసి విసిరికొట్టి కాలితో తొక్కి పాడు చేస్తుంది. అది చూసిన దూర్వాస మునికి కోపం వచ్చి, ఓరీ మధాందుడా విష్ణు ప్రసాదమయిన పుష్పమాలను కళ్ళకి అద్దుకుని తీసుకొకుండా ఏనుగుకి అలంకరిస్తావా? అది దానిని కిందపడేస్తుందా? ఏ ఐశ్వర్య గర్వంతో, పదవి ఇచ్చిన అహంకారంతో, నిర్లక్షంతో నన్నే కాకుండా దైవ ప్రసాదాన్ని కూడా  అవమానించావో ఆ పదవి నీది కాకుండా పోతుంది. నీ ఐశ్వర్యం అంతా సముద్రంలో కలిసిపోతుంది" అని శపించి వెళ్లిపోతాడు.



    దూర్వాసుని శాప ప్రభావం వలన ఇంద్రుడి సర్వ సంపదలు నశించిపోయాయి. దానవులు దేవతల మీద ఆధిపత్యం సంపాదించారు. రాక్షసరాజైన బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుని ఇంద్ర పదవి పోయింది. దేవతలు స్థానాన్ని కోల్పోయారు. రాక్షసుల బాధలను సహించలేని పరిస్తితుల్లో, వారి ఆధిపత్యాన్ని అంగీకరించలేక, అంగీకరించక తప్పని పరిస్తితుల్లో, తమకు జరిగిన అనర్ధానికి ఎంతో బాధపడిన ఇంద్రుడు దేవతలతో కలిసి, బ్రహ్మ దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. విష్ణుమూర్తిని వేడుకొమ్మని చెప్పాడు బ్రహ్మదేవుడు. వెంటనే విష్ణువును ప్రార్ధించాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీమహావిష్ణువు, నువ్వు శాపం కారణంగా పోగొట్టుకున్న సంపదలతో పాటు అమృతాన్ని కూడా సాధించాలంటే క్షీరసాగరాన్ని మధించడమే మార్గమని చెప్పాడు ఇంద్రునితో. అయితే అది ఒక్క దేవతల వల్లమాత్రమే సాధ్యం కాదు. దానికి అత్యంత బలవంతులు, మీ దాయాదులు అయిన అసురుల సహాయం కూడా తీసుకోవాలని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. వారికి కూడా అమృతం దొరుకుందన్న ఆశ చూపి రాక్షసులను సముద్ర మధనానికి ఒప్పించమని సలహా చెప్పాడు.

     వెంటనే ఇంద్రుడు, రాక్షసుల దగ్గరికి వెళ్లి అక్కచెల్లెళ్ల బిడ్డలమయిన మనం, మన విబేధాలు మరిచి అమృత సాధనకు పాటు పడదాం. అమృతం సేవిస్తే మరణాన్ని జయించి అమరులం అవుతాము అని చెప్పాడు. అమృతంతో అమరులమవుతాం అని వినగానే రాక్షసులలో ఆశ మొదలయింది. అమృతం సాధించాలంటే మనం పాలసముద్రాన్ని చిలకాలి, క్షీర సాగరంలో లభించిన అమృతాన్ని మనందరం పంచుకొని సేవిద్దాం, అని తమ దాయాది సోదరులైన రాక్షసులను ఒప్పించారు దేవతలు ఇంద్రుడు. తమకు కూడా అమృతం దొరుకుతుందని ఆశపడిన రాక్షసులు క్షీరసాగర మథనంలో దేవతలకు సహాయపడడానికి ముందుకొచ్చారు. తాము కూడా మీతో కలిసి పాల సముద్రం చిలికుతామని ఒప్పుకున్నారు..



    మందరగిరి కవ్వంగా... వాసుకి కవ్వపు తాడుగా...

  ఎవరి ప్రయోజనం కోసం వారు దేవ దానవులు క్షీరసాగర మథనానికి పూనుకున్నారు. అంత మహిమాన్వితమైన మహాసముద్రాన్ని చిలకాలంటే దానికి తగిన సాధనాలు కూడా కావాలి కదా! అందుకే మందర పర్వతాని కవ్వంగా ఉపయోగించి చిలకాలని భావించి మందరగిరిని తీసుకొని వచ్చారు. మరి చిలకడానికి తాడు కావాలి కదా... ఆ మహాసముద్రాన్ని మహాపర్వతంతో చిలకాలంటే మామూలు తాడుతో సాధ్యం కాదు కదా...  అందుకని మహాసర్పమయిన వాసుకిని తాడుగా ఉండమని కోరారు దేవదానవులు. అమృతంలో బాగం ఇస్తామని సర్పరాజైన వాసుకికి నచ్చచెప్పి, కవ్వపుత్రాడుగా ఉండడానికి ఒప్పించారు. నొప్పి తెలియకుండా మందర పర్వతాన్ని చదునుచేసి, వాసుకిని త్రాడుగా చుట్టి పాలసముద్రాన్ని చిలకడానికి ఉద్యమించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు కవ్వపు తాడుగా ఉన్న వాసుకి సర్పాన్ని ఒకవైపు దేవతలు మరో వైపు రాక్షసులు పట్టుకొని సముద్ర మధనాన్ని ప్రారంభిస్తున్నపుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపగించుకోని మీరు మాకంటే అధికులా... మేము  తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని మేమే తలవైపు నిలబడి చిలుకుతాం అని పట్టు బట్టారు. దాంతో  దేవతలు సరే మీకు ఇష్టమైన విధంగానే చేద్దాం అని తాము వాసుకి సారం  తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు.దేవతలు వాసుకి తలవైపు నిలబడి చిలకడానికి సిద్ధమయారు. కోలాహలంగా క్షీరసాగర మధనం ప్రారంభం అయింది. పాల సముద్రం అందులో మహాపర్వతమయిన బరువయిన మందరగిరి. దాంతో క్రింద ఏ ఆధారం లేకపోవడంతో బరువయిన మందరగిరి క్షీరసాగరంలో క్రిందికి జారిపోవడం మొదలయింది. ఆదిలోనే తమ కార్యానికి ఆటంకం కలగడంతో దేవదానవులు ఇరకాటంలో పడిపోయారు.  ఆ తరువాత వారు ఆ ఆటంకాన్ని ఏ విధంగా అధిగమించారు? ఈ క్షీరసాగర మథనంలో  ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలేంటి?  క్షీరసాగర మధనంలో ఏ ఏ జీవులు, వస్తువులు బయటపడ్డాయి? అసలు అమృతం కోసం చేసిన ఈ కార్యక్రమంలో అమృతం ఆవిర్భవించిందా? అమృతం కోసమే దేవతలతో చేతులు కలిపిన రాక్షసులకు అమృతం దక్కిందా?


Recent Posts
మానూ మాకును కాను – నవల – 18  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
పాండురంగడు పడవ నడిపిన వైనం  |  గోమాబాయి కథ  | Gomabai Great devotee of pandaripur panduranga vithal
పాండురంగడు పడవ నడిపిన వైనం |...
మానూ మాకును కాను – నవల – 17  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
ఆలయమా!? తంత్ర విశ్వవిద్యాలయమా!? ప్రసిద్ధి చెందింది. 64 యోగినిల చౌసట్ యోగినీ ఆలయం | chausath yogini temple located in Madhya Pradesh
ఆలయమా!? తంత్ర విశ్వవిద్యాలయమా!? ప్రసిద్ధి చెందింది. 64...
మానూ మాకును కాను – నవల – 16  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...