తుఫాన్ కి అర్నబ్ పేరే ఎందుకు? తుఫాన్లకు ఎవరు పేరు పెడతారు? ఎందుకు పెడతారో తెలుసా? | How cyclones are named, reason behind thufan names,who give nemes to cyclone

Vijaya Lakshmi

Published on Oct 27 2026

Vijaya Mavuru

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఓనిల్‌, నీలం, హుద్‌హుద్‌, ఐలా, తితలీ, గజ, పెథాయ్‌..ఫణి’ ఈ పేర్లెక్కడో విన్నట్టనిపిస్తున్నాయి కదూ.... ఎస్ మీ ఆలోచనా కరెక్టే....ఇవి మనల్ని బాగా వణికించి, భయపెట్టిన కొన్ని తుఫాన్ల పేర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతున్న, భీభత్సం సృష్టిస్తున్న తుఫాన్ అర్నబ్ తుఫాన్.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ అర్నబ్. అసలు అర్నబ్ అంటే అర్థమేంటి? అర్నబ్ అన్న పేరెందుకు పెట్టారు ఎవరు పెట్టారు?  పేరు వెనుక అర్థం మరియు వివరాలు. చూద్దాం... బెంగాలీ భాషలో 'అర్నబ్' అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం. పేరు పెట్టిన దేశం బంగాదేశ్.  ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టే నిబంధనల ప్రకారం, ఈసారి ఈ పేరును బంగ్లాదేశ్ దేశం సూచించింది.

       అసలింతకీ తుఫాన్లకు పేర్లేంటి? అసలీ పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? ఈ డిటేల్స్ లోకి వెళ్తే...

తుఫాన్లకు పేర్లెందుకు?

అసలు తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతిని మొదలు పెట్టింది  అమెరికాయేనట. 19వ శతాబ్దం చివర ఆస్ట్రేలియా వాతావరణ శాఖకు చెందిన శాస్త్రజ్ఞురాలు క్లేమెంట్ లిండ్లీ రాగ్ ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభించారని చెప్తారు. అప్పట్లో ఆమె ప్రజలు అంతగా ఇష్టపడని  నాయుకుల పేర్లు తుఫాన్లకు  పెట్టేవారట. నిజానికి అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్ల వచ్చే తుఫాన్‌లకు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ పేర్లు పెట్టె బాధ్యతా తీసుకుంటుంది.

తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం

అయితే  దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం మాత్రం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ మహాసముద్రం. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. తుఫాను వచ్చిన ప్రాంతం పేరుతొ చెప్పడం, లేదా తుఫాను తీరం దాటిన ప్రదేశం పేరుతొ చెప్పడం చేసేవారు. అలా పేర్లు లేకపోవడం వలన వాటి గురించి పత్రికల్లో రాయాలన్నా వాటి గురించి మాట్లాడాలన్నా కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఒకవేళ ఫలానా సంవత్సరంలో వచ్చిన తుఫాన్ అని చెప్పాలన్నా ఆ సమయంలో రెండు మూడు చోట్ల రెండు మూడు తుఫాన్లు కనక వస్తే చాలా గందరగోళంగా ఉండేదట. దాంతో తుఫాన్‌ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నా... తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా, వాటి గురించి చర్చించాలన్నా ఎన్నో  సమస్యలు ఎదురయ్యేవి. ఈ పరిస్తితి నుంచి బయటపడాలంటే తుఫాన్‌లకు పేర్లు పెట్టడమే మార్గమని చాలా దేశాలు అభిప్రాయపడ్డాయి..

WMO ఆధ్వర్యంలో తుఫాన్ల పేర్లు

ఈ విషయం గురించి చర్చించుకోడానికి 2000 సంవత్సరంలో WMO ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ తర్వాత కూడా అనేక సార్లు సమావేశాలు నిర్వహించుకొని చివరికి 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ తుఫాన్లకు పెట్టె పేర్లపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం మొదలు పెట్టారు. బంగాళా ఖాతం, మరియు అరేబియన్ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలు బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఒక ప్యానల్ గా ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన 8 దేశాలు ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. 8 దేశాలు ఎనిమిదేసి పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసారు. ఈ 64 పేర్లు అయిపోయిన తరువాత మళ్ళీ పేర్లను రూపిందిస్తారు.

తుఫాన్ల పేర్లు ఎలా పెట్టాలి?

అయితే ఆ పేర్లు ఎలాపడితే అలా పెట్టకూడదు. దానికీ కొన్ని నియమాలున్నాయి. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. తుఫాన్ పేరు, పలకడానికి  వీలుగా వుండాలి. 8 అక్షరాల లోపు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను గాని వారి వారి సంస్కృతీ సప్రదాయాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు. పెడర్థాలు వచ్చేలా ఉండకూడదు .ఇలా కొన్ని నియమాల ప్రకారం పేర్లు పెట్టవలసి ఉంటుంది.

అలా నియమబద్ధంగా ప్యానెల్ లో ఉన్న 8 దేశాలు ఎనిమిదేసి పేర్లు పెట్టాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆ లిస్టులో బంగ్లాదేశ్ సూచించిన పేరు మొదటి స్థానంలో ఉంది. దాంతో 2004 అక్టోబరులో హిందూ మహాసముద్రంలో వచ్చిన తుఫాన్‌కు బంగ్లాదేశ్ సూచించిన ఒనిల్ పేరు పెట్టారు. అలా ప్రారంభమయిన తుపాను పేర్లు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను దగ్గరనుండి తిత్లీ, గజ, పెధాన్, అన్నీ ఇలా పెట్టిన పేర్లె.

2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి.

ఎవరెవరు ఎఏ తుఫాన్లకు పేర్లు పెట్టారు?

బంగ్లాదేశ్: ఒనిల్, ఒగ్ని, నిషా, గిరి, హెలెన్, చపల, ఓక్కీ, ఫొని

ఇండియా: అగ్ని, ఆకాశ్, బిజిలీ, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు

మాల్దీవులు: హిబరు, గోను, ఆలియా, కీలా, మాది, రోను, మకును, హిక్కా

మయన్మార్: ప్యార్, యెమిన్, ప్యాన్, థానె, నానోక్, కయాంత్, దయే, కయాబ్

ఒమన్: బాజ్, సిదర్, వార్డ్, ముర్జాన్, హుద్ హుద్, నాడా, లుబాన్, మహా

పాకిస్తాన్: ఫనూస్, నర్గీస్, లైలా, నీలం, నీలోఫర్, వార్దా, తిత్లీ, బుల్‌బుల్

శ్రీలంక: మాలా, రష్మి, బంధు, మహాసేన్, ప్రియా, అసిరి, గజ, సోబా

· థాయ్‌లాండ్: ముక్దా, ఖైముక్, ఫేట్, ఫైలిన్, కోమెన్, మోరా, పెథాయ్, ఆంఫాన్ ఇవి ఆ దేశాలు రూపొందించిన పేర్లు. సో... ఫ్రెండ్స్ తుఫాన్ల పేర్ల వెనకున్న కథేంటో తెలిసింది కదా...