వైజాగ్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాలు | Vizag sri kanakamahalakshmi temple dasara navaratri festival

Vijaya Lakshmi

Published on Oct 27 2026

Vijaya Mavuru

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఉత్తరాన్ద్రుల ఆరాధ్యదైవం వైజాగ్ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి, దసరా ఉత్సవాలు పదిరోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 11 10 26 తేదీన ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల దసరా రోజు 20 10 26 తేదీన ఘనంగా ముగిసాయి. ఈ శరన్నవరత్రులలో అమ్మవారు వివిధ అలంకారాలలో కన్నులపండుగగా దర్శనమిచ్చారు కనకమహాలక్ష్మి అమ్మవారు.


         ఈ సందర్భంగా మరొక్కసారి అమ్మవారి నవరాత్రుల అలంకారాలు, పూజలు పునశ్చరణ చేసుకొని కనకమహాలక్ష్మి అమ్మవారిని కనులారా దర్శించుకుందాం.


మొదటి రోజు-ఆదిలక్ష్మి అలంకారం-కుంకుమార్చన

శరన్నవరాత్రుల తొలిరోజు అంటే 11 10 26 నాడు కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. చూసారా అమ్మవారు ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నారో. ఆదిలక్ష్మిగా కొలువుతీరిన అమ్మవారికి లక్ష కుంకుమర్చన పూజ నిర్వహించారు.


రెండవరోజు - ధనలక్ష్మి అలంకారం - లక్ష చామంతుల పూజ

         శరన్నవరాత్రులలో రెండవరోజు కనకమహాలక్ష్మి  అమ్మవారు ధనలక్ష్మి అలంకరణ లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారికి లక్ష చామంతులతో పూజ జరిగింది. చూస్తున్నారు కదా అమ్మవారిని తనివితీరా దర్శించడానికి రెండుకళ్ళు సరిపోవు కదా.

మూడవరోజు - ధాన్యలక్ష్మి - లడ్డూల పూజ

మూడవరోజు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవాఋ ధాన్యలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లడ్డులతో అమ్మవారికి సహస్రనామార్చన పూజ జరిగింది.

నాలుగవరోజు - ధైర్యలక్ష్మి - తులసీదళముల పూజ

శరన్నవరాత్రులలో నాలుగవరోజు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో  దర్శనమిచ్చారు. అమ్మవారికి తులసీదళములతో సహస్రనామార్చన పూజ జరిగింది.

ఐదవరోజు-సంతానలక్ష్మి-కలువపూల పూజ

శరన్నవరాత్రి మహోత్సవములు ఐదవ రోజు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు  శ్రీ సంతానలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన జరిగింది.

6వ రోజు- శ్రీ విద్యాలక్ష్మీ-5 రకాల పువ్వుల పూజ

శరన్నవరాత్రులలో 6వ రోజు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు  శ్రీ విద్యాలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. 5 రకముల పూలతో పంచపుష్పార్చన పూజ జరిగింది.

7వ రోజు-విజయలక్ష్మి-గులాబీల పూజ

శరన్నవరాత్రి మహోత్సవములలో 7వ రోజు  అమ్మవారు  శ్రీ విజయలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. గులాబి పూలతో సహస్రనామార్చన పూజ జరిగినది.

8వ రోజు-గజలక్ష్మి దేవి-లక్షగాజుల పూజ    

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు 8వ రోజు అమ్మవారు శ్రీ గజలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. గజలక్ష్మీ అలంకారంలో అమ్మకు లక్షగాజులతో సహస్రనామార్చన పూజ జరిగింది.

9వ రోజు-మహాలక్ష్మి కూరగాయల అలంకారం           

శరన్నవరాత్రి మహోత్సవములు చివరి రోజు అంటే 9వ రోజు  అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి  అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మను  శాఖంబరిగా  అన్ని రకముల కూరగాయలతో పూజ జరిగింది   

10వ రోజు దసరా మహోత్సవం                       

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు బాగంగా విజయదశమి రోజు        శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారంలో 108 బంగారు పుష్పములతో పూజ చేసి ఫలాలు సమర్పించారు.