Vijaya Lakshmi
Published on Oct 27 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?జై శ్రీరామ్
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ఈ రోజున కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం శ్రీ అంబికా బాగ్ లో శ్రీరామాలయంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా శ్రీ రామ పట్టాభిషేకం, రామాయణం పారాయణం, హనుమాన్ చాలీసా గానం, అలాగే వాల్మీకి చిత్రపటాన్ని, 3 కోట్ల రామకోటి పుస్తకాలను వచ్చిన భక్తులు వారి శిరస్సుపై ధరించి రామాలయం చుట్టూ మాడవీధులలో అత్యంత వైభవంగా తిరువీదోత్సవం ఘనంగా జరిగింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి , డిప్యూటీ కమిషనర్ శ్రీమతి కె. శోభారాణి , అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి అన్నపూర్ణ , HDPT ప్రాంతీయ సమన్వయ అధికారి డా.రాంబాబు వారి ఆధ్వర్యంలో ఈ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది.
ఆదికవి మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆయన ఒక ఋషి కుమారుడు. చిన్నప్పుడే అడివిలో తప్పిపోయి ఒక బోయవానికి దొరికి వారి కొడుకుగా పెరిగి విలువిద్య బాగా నేర్చుకొని కుటుంబ పోషణకై దొంగతనాలు చేస్తూ బతుకుతున్న సమయంలో నారద మహర్షి తారసపడి రామ నామ తారకమంత్రాన్ని రత్నాకర్ కి బోధించి తద్వారా రామనామ జపంతో వాల్మీకి మహర్షి చుట్టూ పుట్టలు ఏర్పడి , పుట్టల ద్వారా వచ్చినందువల్ల వాల్మీకి అని పేరు సార్ధకమయ్యింది .
మహాకవి వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి డాక్టర్ జి ఆర్ కే ప్రసాద్ రాంబాబు, సభ్యులు శ్రీ MV రాజశేఖర్, MKVV సత్యనారాయణ , శ్రీ జగన్మోహనరావు ,శ్రీ సత్యకుమార్ , శ్రీ ఎమ్మెస్ ఎన్ రాజు , శ్రీ పైడా కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.