గణేశ వేషంలో పూరీ జగన్నాథుడు | పూరీ జగన్నాథ స్వామి హాథీవేష | jagannath hathi besha | puri jagannath swami stories

Vijaya Lakshmi

Published on Jun 27 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు. ఓడిశా లోని పూరీలోని జగన్నాథ ఆలయం ప్లోరపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సంవత్సరమంతా పూరీ జగన్నాథునికి వివిధ అలంకారాలు, ఉత్సవాలు, పండుగలు ఎన్నో ఎన్నెన్నో. ఇక ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పూరీ జగన్నాథుని వైభవానికి లెక్కే లేదు. ఆషాడంలో ప్రపంచప్రసిద్ధి చెందిన రథయాత్రకు ముందు జ్యేష్ట పూర్ణిమ నాడు జగన్నాథ, సుభద్ర, బలభద్రులకు స్నానయాత్ర చేస్తారు. ఆ స్నానయాత్ర రోజు జగన్నాథ, బలభద్రులు ఏనుగు వేషధారణలో, దర్శనమిస్తారు. దీనినే హాథీబేష… గజానన బేష, హాథీవేష అనీ పిలుస్తారు. పూరీజగన్నాథునికి విభిన్నమైన అలంకారాలు చేసే సంప్రదాయం ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ ఏనుగు వేషంలో అలంకారం ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథేంటి? తెలుసుకుందాం….



హాథీబేష… ఆషాఢ శుద్ధ విదియనాడు మొదలయ్యే ప్రపంచ ప్రసిద్ధ ‘జగన్నాథ రథయాత్ర’కు ముందే, జ్యేష్ఠ పౌర్ణమినాడు ఈ వేడుక జరుగుతుంది. ఇక హాథీబేషకు ముందు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రను అభిషేకించడానికి ‘స్నానయాత్ర’కు తీసుకువెళ్తారు. స్నానయాత్రకు ముందే స్వామిని ఏనుగు తలతో ఉన్న గణపతి వేషంలో జగన్నాథుడిని అలంకరిస్తారు. దీనివెనకున్న కథ ఏంటంటే….


ఒకానొక సమయంలో పూరీ రాజు దగ్గరికి గణపతి భట్ట అనే గొప్ప పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరీక్షేత్రంలో జగన్నాథుడిని స్నానయాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకకు హాజరవ్వాలని గణపతి భట్టను ఆహ్వానించాడు రాజు.


దానికి గణపతిభట్టు తాను గణపతి భక్తుడినని ,గణపతిని మాత్రమే ఆరాధిస్తానని, అందువలన అన్యదేవత అయిన జగన్నాథుని వేడుకకు రాలేనని అంటాడు. రాజు బలవంతపెట్టేసరికి, అన్యమనస్కంగానే జగన్నాథుడి స్నానయాత్రకు వెళ్లడానికి గణపతి భట్ట ఒప్పుకొంటాడు. అయితే, అక్కడికి వెళ్లేసరికి గణపతి భట్టు ఎదుట ఒక అద్భుతం జరుగుతుంది.


లోపలి వెళ్లి జగన్నాథుని చూడగానే జగన్నాథుడైన శ్రీకృష్ణుడు గణపతి భట్టకు అతడి ఇష్టదైవమయిన గణేశుడి రూపంలో సాక్షాత్కరిస్తాడు. అంతేకాదు, బలభద్రుడు కూడా ఏకదంతుడి రూపంలోనే కనిపిస్తాడు. దాంతో దైవం ఒకటే అని, పేర్లు మాత్రమే వేరని అతనికి జ్ఞానోదయమవుతుంది. తనకు కండ్లు తెరిపించడానికే, తనలోని మూఢత్వాన్ని పోగొట్టడానికే జగన్నాథ, బలభద్రులిద్దరూ గణపతి రూపాన్ని ధరించారని తనకు దర్శనమిచ్చారని ఆయనకు అర్థమవుతుంది. గణపతి, విష్ణువు, శివుడు, గౌరి ఇలా భేదాలెన్ని ఉన్నా పరమాత్ముడు ఒక్కడే అని గుర్తిస్తాడు.తన మూఢత్వాన్ని వదిలి స్వామి ముందు మోకరిల్లుతాడు.




అప్పటినుంచి రథయాత్రకు ముందు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిపే ‘స్నానయాత్ర’ సమయంలో జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు. అలా బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో ఏనుగు ముఖంతో ఉన్న గణపతి రూపంలో దర్శనమిచ్చే ఈ దర్శనాన్ని పూరీ ఆలయ సంప్రదాయంలో ‘హాథిబేష’ అని వ్యవహరిస్తారు. గణపతి వేషంలో స్వామిని దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇది చాలా అరుదుగా జరిగే ఆలంకార దర్శనంలో ఒకటి. అందుకే స్నానయాత్ర రోజున హాథీబేష దర్శనం కోసం జగన్నాథుడి మందిరాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు. నిజానికి స్నానయాత్ర తరువాత భక్తులకు ఆలయ ప్రవేశం లేదు, కానీ జగన్నాథ,బలభద్ర, సుభద్రమ్మలు అనసరా ఘర్ నుండి ప్రజలకు హాతీబేష వేషంలో దర్శనమిస్తారు. స్వామివారి హాతీవేష దర్శనంతో కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని,ఎలాంటి వేదన అయినా తొలగిపోతుందని, ఎలాంటి వేధింపుల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఏనుగు దేవత గణపతిని సూచిస్తాడు, కాబట్టి ఈ రూపంలో స్వామిని దర్శించడం ద్వారా విఘ్నాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం



ఈ ఇతివృత్తానికి చిహ్నంగానే జగన్నాథ స్వామి హాతీవేష సంప్రదాయం పూరీ రథయాత్రలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సంప్రదాయం ప్రకారం, రథయాత్ర సమయంలో భక్తులు ఎత్తైన, రంగురంగుల ఏనుగు రూపంలో వేషధారణ చేసి, నృత్యాలు, సంగీతంతో ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితంచేస్తారు. హాతీవేషధారులు రథయాత్రకు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటారు. రథయాత్రలో హాతీవేషధారులు జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు బయటకు తీసుకురావడానికి ముందు, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఏనుగు రూపంలో హాధీవేషధారణతో నృత్యాలు చేస్తూ , ఉత్సవాన్ని మరింత భక్తిపూరితంగా, ఉల్లాసంగా మారుస్తారు. ఈ వేషధారణ పూరీ రథయాత్రకు ప్రత్యేకతను ఇస్తుంది.


Recent Posts