Vijaya Lakshmi
Published on Apr 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?దక్షిణాది అమర్‌నాథ్ యాత్ర సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. దట్టమైన నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ జాతర మూడురోజులపాటు జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఉగాది పండుగ తరువాత తొలి పౌర్ణమికి మొదలయ్యే సలేశ్వరం జాతర ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. దర్శనానికి వెళ్లేముందు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అని, తిరిగి వెళ్లే సమయంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ దారి పొడవునా శివనామస్మరణతో లోయంతా మారుమోగుతుంది. జాతర ప్రారంభం కావడంతో నల్లమల అడవుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సలేశ్వరం క్షేత్ర చరిత్ర, జాతర విశేషాలు తెలుసుకుందాం...
దట్టమైన అడవిలో లోతైన లోయలో ఉన్న గుహాలయం. చెంచుల ఆరాధ్యక్షేత్రం. సుమారు 6,7, శతాబ్దాల నాటి ఆలయం. ఆ క్షేత్రానికి వెళ్ళాలంటే ఓ పెద్ద సాహసయాత్ర చెయ్యాల్సిందే. తెలంగాణా అమర్నాథ్ గా ప్రసిద్ధి చెందిన ఆ క్షేత్రంకి వెళ్ళాలంటే ధైర్యంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో, పాల్కురికి సోమనాథుడు ఈ క్షేత్రం గురించి వివరించినట్టు చెప్తారు. ఛత్రపతి శివాజీ కూడా ఈ స్వామిని దర్శించి ఆశీస్సులు పొందినట్లు చరిత్ర కథనాలు చెప్తున్నాయి. ఎప్పుడో ఋషులు ఏర్పాటు చేసుకున్న ఆరాధ్యస్థలం. ఒకప్పుడు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఇదే మార్గం. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దర్శనం దొరికే క్షేత్రం. అత్యంత ప్రమాదభరితమైన కొండదారుల్లో కొన్ని చోట్ల కేవలం పాదం మాత్రమే మోపగలిగే స్థలంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం ప్రభువులు వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించుకున్నారట.
సలేశ్వరం.... ఓ అద్భుతం. ఓ సాహసం. ఓ ఆధ్యాత్మిక వైభవం. ఎన్నో రహస్యాలకు నిలయమైన నల్లమల అడవుల్లో తెలంగాణా రాష్ట్రంలో పూర్వం మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది సలేశ్వరం.నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ అభయారణ్యంలో ఉంది సలేశ్వరం క్షేత్రం. సలేశ్వరం జాతర పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చెయ్యండి