Vijaya Lakshmi
Published on Aug 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాతూ శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోగోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో టిటిడి తెలియచేసింది.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
ఆగస్టు 17న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
నిన్న ఆగస్ట్ 11 వ తేదీ 75,740 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
34,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు 4.84 కోట్ల హుండీ కానుకలు సమర్పించుకున్నారు.
Ssd టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారుగా 18 గంటల సమయం పడుతోంది.