Vijaya Lakshmi
Published on Jul 22 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?సికింద్రాబాదులో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఉజ్జయిని మహంకాళి ఆలయం. వందల సంవత్సరాల క్రితం వెలసిన అమ్మవారు. పేరు మహంకాళి అయినా ఈ ప్రాంతీయుల చేత గ్రామదేవతగా ఆరాధనలందుకుంటోంది.
ప్రతి ప్రాంతంలోని ఆలయాల వెనక అందులోని దైవం వెనక ఎదో ఒక కథ ఉంటుంది. మరి ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి వెనకున్న కథేంటో తెలుసుకుందాం.
ఎప్పుడో బ్రిటిష్ వారికాలంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 వ సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేలమంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతడు, తనతో పాటు ఉన్నవారితో కలసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలని రక్షించమని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే తమ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయాన్ని కట్టిస్తామని మొక్కుకున్నారు.
ఆ తరువాత ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. అతను తిరిగి వచ్చేసరికి ఇక్కడ వ్యాధి మటుమాయమైంది. ఇదంతా మహాకాళి అమ్మవారి కరుణే అని, తన మొక్కులు ఫలించాయన్న సంతోషంలో ఆ సైనికుడు తను మొక్కుకున్న విధంగా అమ్మవారిని ప్రతిష్టించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారితో కలిసి, పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో అంటే ప్రస్తుతం అమ్మవారి గుడి ఉన్న ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళి అన్న పేరుతొ పూజలు ప్రారంభించారు.
ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లో అమ్మవారి జాతర కూడా ఆషాఢంలోనే జరపాలని ఆయన నిర్ణయింఛి అలాగే జాతర చేయడం మొదలుపెట్టారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు ఏర్పాటు చేసే పనిలో అక్కడకు సమీపంలోనే ఉన్న ఒక పాడుబడ్డబావిని బాగుచేసే పనిలో అక్కడ మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికిందట. వెంటనే ఆ విగ్రహాన్ని మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా పిలవడం మొదలుపెట్టారు. అలా ఇక్కడ బోనాల ఉత్సవారు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
1864వ సంవత్సరంలో ప్రారంభంలో ఏర్పాటు చేసిన కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేసారు.
ప్రతి సంవత్సరం ఆషాడంలో గోల్కొండ బోనాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా పేరుగాంచిన ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జంట నగరాలతో పాటు చుటుపక్కల ప్రాంతాలనుంచి వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.