అన్వేషణ తెలుగు నవల 16వ భాగం | ఇందూరమణ | Anveshana part 16 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 08 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ - సీరియల్ నవల

ధారావాహిక నవల

16వ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

నిన్నటి బ్లాగ్ తరువాయి కథ

 ‘ఎన్‌.ఏ.డి.లో దిగాక ఏ.టి.ఎమ్‌లో డబ్బు డ్రాా చేసుకోవాలి.’ అనుకుంటూ నోట్ల మధ్య ఉన్న మరో అరలోనుండి ఎటిఎమ్‌ కార్డు బయటకు తీసింది. వివిధ బ్యాంకుల ఏటిఎమ్‌ కార్డు లెక్కకు మించి ఉన్నాాయి. ఒకో బ్యాంంకు ఏటిఎమ్‌ లు రెండేసి కార్డుులు ఉన్నాాయి. ఎన్‌.ఏ.డి దగ్గర ఏ బ్యాంకు ఏ.టి.ఎమ్‌ కనిపిస్తే ఆ కార్డులో డబ్బు డ్రాా చెయ్యొచ్చులే అనుకుంటూ మళ్లీ కార్డులన్నీీ చిన్న పర్సులాంటి బ్యాాగ్‌లో ఉన్న మరో అరలో భద్రంగా దాచేసింది.

‘‘అమ్మాా! వచ్చేేసాం! ఇక్కడ దిగుతారా?’’ ఆటోని గిర్రున మలుపు తిప్పుతూ అన్నాాడు ఆటోవాలా. అప్పటికే ఆటో ఎన్‌.ఏ.డి. చేరుకోవడం...తిరిగి వెళ్లిపోవడానికి ఆటోని బస్సుస్టాంండ్‌ కేసి మలుపు తిప్పేయడం జరిగి పోయింది.టక్కున ఆటో దిగి అప్పటికే చేత్తో పట్టుకున్న వంద నోటు ఆటో డ్రైైవర్‌ చేతికి ఇచ్చి గబ గబా వైజాగ్‌ వైపు వెళ్తోన్న బస్సు కోసం అవతలి వైపు బస్సు స్టాండ్‌ కేసి నడిచింది ఆమె.

‘‘పాపం! సోము ఎలా ఉన్నాాడో! భగవంతుడా! ఆ పిల్లాాడ్ని రక్షించు స్వాామీ’’ మనసులో దేవుడ్ని ప్రాార్థించుకుంది ఆమె. ఆ ఇద్దరు పిల్లల మీద తనకెందుకంత అవ్యాాజమైన ప్రేేమ కలుగుతోందో అర్థంం కావటం లేదు. సోము చెప్పిన కథ విన్నాాక మరింతగా వారి మీద అనురాగం పెరిగి పోయింది. ఆలోచిస్తూనే బస్సుుస్టాండ్‌ దగ్గర నిలబడింది. బస్సులు వరుసగా వస్తుున్నాాయి. కిక్కిిరిసి ఉన్న బస్సుకేసి చూసి ఎక్కలేక ఖాళీ బస్సుకోసం ఎదురుచూస్తూ నిలబడింది. కె.జి.హెచ్‌కి వెళ్ళే బస్సుు 28 నెంబర్‌ గలవి మాత్రమే ఎక్కాాలని ఎవరో పాసింజర్‌ని అడిగి తెలుసుకుంది. ఎదురుగా అన్నపూర్ణ రెస్టారెంట్‌ బోర్డు కనిపించేసరికి అంతవరకూ ఎక్కడ దాక్కుందో ‘ఆకలి’ పులిలా విజృంభించింది. ఆకలి దహించే సరికి అటూ ఇటూ చూసింది ఆమె. బస్సుస్టాండ్‌ ప్రక్కనే పాన్‌ షాప్‌ కనిపించింది.గబ గబా వెళ్లి రొట్టెలు కొనుక్కుంది. అక్కడికక్కడే రొట్టెల మీద కవరు చించేసి ఆబగా నాలుగు ముక్కలు నోట్లో కుక్కుకుంది. మిగిలినవి కవరులో చుట్టేసి బస్సులో కూర్చుని తీరిగ్గా తినొచ్చులే అనుకుంటూ తిరిగి బస్సుస్టాండ్‌లో నిలబడింది ఆమె. గత నెల రోజులుగా ఇదే వరస. మధ్యాాహ్నం ఏదో హోటల్లో నాలుగు మెతుకులు తినడం... రాత్రుళ్ళు రొట్టెలతో సరిపెట్టుకోవడం ఆమెకి అలవాటై పోయింది.

‘ఒంటరితనం’ ఎంత భయంకరమో అర్థమైంది ఆమెకి. ఒంటరి ‘ఆడది’ కనిపిస్తే కబళిద్దామనుకునే మగమృగాలు... ఒంటరి వ్యక్తికి నిలువ నీడ కూడా దొరకదని నిరూపిస్తూ తలదాచుకోవడానికి అద్దెకు కూడా గదులివ్వడం కుదరదనే లాడ్జీ నియమ నిబంధనలు. ఇల్లు వదిలిన దగ్గర నుండి రైల్వేే స్టేషన్ లో ఉండే విశ్రాంంతి గదుల్లోనే పడుకునేది. కాలకృత్యాాలు తీర్చుకునేది. దేవాలయాల్లోో అయితే మూకుమ్మడి బస. అక్కడ... ఆ సత్రాాల్లోనే సర్వస్వం. అయితే, ఇవేవీ ‘ఆమె’ గమ్యాాన్ని చేరుకోకుండా ఆపలేకపోయాయి. ఆమె గమనాన్ని సాగనివ్వకుండా అడ్డుుకో లేక పోయాయి. పదేళ్ళు పెళ్లయిన పదేళ్ల తర్వాాత కళ్ళు తెరిచింది. కళ్ళు తెరుచుకుంది. కాదు....కాదు....కళ్ళు తెరిపించింది. తన మోడు వారిన జీవితానికి వెలుగు రేఖ... బీడు వారిన బ్రతుకులో ఆశ మొలక....చచ్చిపోదామనుకుని...బ్రతకలేక...బ్రతకలేక జీవచ్ఛవంలా బ్రతుకుతున్న తన కొన ఊపిరికి ఊపిరిలూదిన ఊసులు...పదేళ్ళు అంధకారంలో కొట్టుకులాడుతున్న వేళ....సూర్యోదయంలా వెలసిన చల్లటి కబురు.... అదేగా తన అన్వేేషణకి పునాది. అదేగా తన ఆరాటానికి ఆయువు....అదేగా తన ఈ వెతుకులాటకి బాసట...ఊరట. ‘ఆకలి’ తీర్చుకుని ఉపశమనం పొందుతూ ఊహల్లోో ఊసులాడుకుంటూ బస్సుు కోసం ఎదురు చూస్తూ బస్సుస్టాండ్‌లో ఉన్న సిమ్మెంంటు దిమ్మ మీద కూర్చుంంది ఆమె.

‘‘అమ్మాా! మీరేనా ‘కె.జి.హెచ్‌’కి వెళ్లే బస్సుు కోసం అడిగింది. అదిగో! ఆ బస్సే వచ్చింది.’’ అంటూ ఎవరో పాసింజర్‌ గట్టిగా అరిచి పిలిచేసరికి ఉలిక్కిిపడి ఇహానికి వచ్చింది ఆమె. గబుక్కుున లేచి పరుగున వెళ్లి ఖాళీగా ఉన్న సిటీ బస్సుులోకి ఎక్కిి కూర్చుంది ఆమె.

*****

రాత్రి ఎనిమిదిగంటలవుతోంది. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణ అంతా ఫిర్యాాదుదారులతోనూ, ముద్దాాయిలతోనూ కిక్కిిరిసి పోయి వుంది. గుంపులు గుంపులుగా నిలబడి గుస గుసలాడుకుంటున్నాారు. ఆ ప్రాంంతానికి అదే పోలీస్‌ స్టేషన్‌.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ తన గదిలో కూర్చుున్నాాడు. ఉదయం జరిగిన సంఘటనలన్ని నెమరువేసుకుంటూ కూర్చుున్నాాడు. కొండ ఘాట్‌ రోడ్‌లో జరిగిన ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ కానిస్టేబుల్‌ హాస్పిటల్‌ నుండి

నేరుగా పోలీస్‌ ప్టేషన్‌ కు వచ్చి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని కలిసాడు. ఆ బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాల పాలై హాస్పటల్‌ లో చికిత్స పొంందుతున్నాారని చెప్పాాడు కానిస్టేబుల్‌. బైక్ నుజ్జుు నుజ్జుు అయిపోయింది. స్టేషన్‌ బయట పాడు పడ్డ బైక్‌లు, కార్ల మధ్య తెచ్చి పడేసారు. ఏక్సిిడెంట్‌లో పాడై పోయిన బైక్‌ కోసం స్టేషన్‌ బయట కూర్చుున్నాాడు వరహాల శెట్టిి. రాముని ఓ మూల కూర్చోోబెట్టాారు. దొంగలు ముగ్గుుర్నీ బట్టలు విప్పించేసి కట్‌ డ్రాాయర్ల తో ‘సెల్‌’లో కూర్చోోబెట్టాారు.

నైట్‌ డ్యూూటీకి వెళ్ల వలసిన పోలీసులు తమ తమ బీట్‌ బుక్కులు పట్టుుకుని సిద్ధంంగా ఉన్నాారు. పోలీస్‌ కమీషనర్‌ ఆఫీసు నుండి ఒకటే ఫోన్‌ కాల్స్‌. కొండ మీద దేవాలయం దగ్గర జరిగిన ముసలమ్మ మర్డర్‌ కేసులో శోధించి సాధించిన ఫలితం ఏమిటంటూ ఒకటే ఆరా!

ముసలమ్మని చంపింది ఎవరో అర్థం కావటం లేదు. కనీసం హత్యాాయుధాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. కావాలని జరిగిన మర్డరో.....కాకతాళీయంగా జరిగిన మర్డరో అర్థంం కావడం లేదు. ముసలమ్మ  ‘వీలునామా’  ఏమైందో కూడా అంతుచిక్కటంలేదు. ఆస్తి డాక్యుమెంట్లు, ఆ ముసలమ్మ రాసిన ఉత్తరాన్ని బట్టి ‘వీలునామా’ రాసిందన్నది వాస్తవం. ముసలమ్మతో ఆ రాత్రి గడిపిన ‘ఆమె’ని పట్టుకో లేకపోయారు. కనీసం ‘ఆమె’ ఎవరో ఎక్కడుంటుందో కూడా కనిపెట్టలేకపోయారు.

ఆలోచిస్తూనే బజర్‌ నొక్కాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

స్టేషన్‌లో కాపలాగా ఉండే సెంట్రీల్లో ఒకడు బజర్‌ వినపడగానే టక్కున ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు ప్రత్యక్షమయ్యాాడు.

‘‘సార్‌!’’ వినయంగా సెల్యూట్ చేసాడు.

‘‘ఆ కుర్రాాడెక్కడున్నాాడు?!’’ అడిగాడు ఎస్సై.

‘‘స్టేషన్‌ లోనే ఉన్నాాడు సార్‌?’’ అన్నాాడు కానిస్టేబుల్‌.

‘‘ఆ విషయం నాకు తెలీదా?! కుర్రాాడ్ని ‘సెల్‌’ లో పెట్టాారా అని అడుగుతున్నాాను.’’ కోపంగా అన్నాాడు ఎస్సై.

‘‘లేద్సాార్‌! రైటర్‌ గారి రూమ్‌లో ఓ మూల ఏడుస్తూ కూర్చున్నాాడు.’’ చెప్పాాడు కానిస్టేబుల్‌.

‘‘వెళ్లి తీసుకురా!’’ హుకుం జారీ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఎస్సై ఆర్డర్‌ వినీ వినగానే పరుగున వెళ్లి రాముని వెంటబెట్టుకు వచ్చాాడు సెంట్రీీ. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడుతూ చిరిగిన షర్టుతో కళ్లు ఒత్తుుకున్నాాడు రాము.

‘‘నీ పేరేమిటి బాబూ!’’ ప్రేమగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘రాము....రాము సార్‌!’’ వినయంగా అన్నాాడు రాము.

‘‘ఏ.టి.ఎమ్‌లో డబ్బు దొంగిలించావా?’’ రాము కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘లేద్సాార్‌! ఏ.టి.ఎమ్‌. కార్డుతో డబ్బు తీసాను. అది చూసి పోలీసులు దొంగనని పట్టుుకున్నాారు. ఎంత చెప్పినా వినలేదు.’’ ఏడుపు గొంతుతో చెప్పాాడు రాము.

‘‘ఏ.టి.ఎమ్‌ కార్డు నీదేనా?’’ అడిగాడు ఎస్సై.

‘‘కాద్సాార్‌! అమ్మగారిది!’’ అన్నాాడు రాము.

‘‘మీ అమ్మగారిదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

‘‘మా అమ్మ కాదు సార్‌? యాత్రకొచ్చాారే. ఆ అమ్మ గారిది సార్‌!’’ చెప్పాాడు రాము.

‘‘ఆవిడెవరు? నీకెలా తెలుసు?!’’ అడిగాడు ఎస్సై.

‘‘ఆవిడ దేవత సార్‌! నాకూ సోమూకి చెరో రెండువేల రూపాయలు దానం చేసిన పుణ్యాత్మురాలు సార్‌?’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘అంత మాత్రాానికే నిన్ను నమ్మి ఈ కార్డు ఇచ్చి డబ్బుు తెమ్మన్నదా?’’ అడిగాడు ఎస్సై.

‘‘అవును సార్‌! నేనూ సోమూ బస్సు స్టాండ్‌లో ఉన్నప్పుడు కనిపించారు. రెండువేల రూపాయల దానం చేసిన తల్లిని మర్చిపోలేం కదా సార్‌! ఆనందంగా వెళ్లిి పలకరిస్తే నాకు ఏ.టి.ఎమ్‌. కార్డు ఇచ్చి డబ్బుు తెమ్మన్నాారు.’’ అన్నాాడు రాము.

‘‘మరి, ఆవిడ ఏదీ?! నీ దగ్గర డబ్బు, కార్డు తీసుకోలేదేం?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అమ్మ గార్నిి సోముగాడు మేము ఉండే పాడుబడ్డ రాజు గారి భవనానికి తీసుకుపోయాడు సార్‌!’’ అన్నాాడు రాము.

‘‘అదే ఎందుకు? ఆవిడే ఏటిఎమ్‌లో డబ్బు డ్రాా చేసుకోవచ్చు కదా రామూ!’’ కుతూహలంగా రాము మొహంలో మొహం పెట్టిి అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అవును కదా....’’ అని క్షణం ఆలోచిస్తూ నిలబడిపోయాడు రాము. తిరిగి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా హుషారుగా అన్నాాడు.

‘‘ముందు ఏటిఎమ్‌ ఎక్కడుందని అమ్మ గారే అడిగారు సార్‌! నేనూ, సోము ఏ.టి.ఎమ్‌ అదిగో అంటూ చూపించాము. అక్కడ మీ పోలీసు జీపు చూసి అమ్మగారే నా చేతికి ఏటిఎమ్‌ కార్డుు ఇచ్చి పిన్‌ నెంబర్‌ చెప్పి డబ్బు తెమ్మన్నాారు. నేను వచ్చేేవరకూ తొలిపావంచా మెట్లమీద కూర్చుంటామన్నాారు.’’ అన్నాాడు రాము.

‘పోలీసు జీపు’ చూసి అనగానే ఉలిక్కిి పడ్డాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ‘పోలీసుజీపు’ చూస్తే ఆవిడకెందుకు భయం కలిగింది? తప్పు చేసిన వాళ్ళు తప్పుడు ఆలోచనతోనే భయపడాలి. అయితే ‘ఆవిడ’ ఎవరు?! దొంగా?! దొంగ అయితే ?! అంత డబ్బు ఏటిఎమ్‌లో ఎలా దాచుకో గలుగుతుంది? దోచుకున్న సొమ్ము బ్యాంకుల్లో దాచేసుకుందా?! దొంగలు కూడా ఏటిఎమ్‌లు ఎందుకు వాడకూడదు? వాళ్ళు సమాజంలో వ్యక్తుులేగా? ప్రజాస్వాామ్యంంలో ఓటున్న బలమైన శక్తులేగా?! అనుకున్నాడు.

****************

సశేషం

మిలిన కథ రేపటి బ్లాగ్ లో

" ఆమె " ఎవరో పోలీసులు తెలుసుకోవడానికి ఒక్కొక్క ఆధారమే వారధి అవుతోందా...?? రేపటి బ్లాగ్ లో తెలుసుకుందాం.

Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...