Vijaya Lakshmi
Published on Aug 22 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?"ఒక భారీ రాతి రథచక్రం చూసి, నిమిషాలు, సెకన్లతో సహా సమయాన్ని చెప్పగలిగిన విజ్ఞానం? శతాబ్దాల నాటి ఈ ఆలయంలో గాలిలో తేలుతూ ఉండే విగ్రహం ఏమయింది? ప్రధాన సూర్యదేవుని విగ్రహం ఇప్పుడెక్కడుంది? ఈ సూర్య దేవాలయానికి శ్రీకృష్ణునితో ఉన్న సంబంధమేంటి? కోణార్క్ అంటే ఏంటి? అసలీ సూర్య భగవానుని ఆలయానికి కోణార్క్ అన్న పేరెందుకు వచ్చింది?
కోణార్క్ ఆలయం... most mysterious temple. ప్రపంచం లోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదు అంటే నమ్మక తప్పదు. బ్రిటిష్ వారు ఈ ఆలయ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపి సీల్ చేశారు! ఎందుకని? కేవలం ఆలయాన్ని కాపాడడానికే ఇసుక నింపారా? లేక లోపల ఏదైనా రహస్య నిధి లేదా భయంకరమైన సైన్స్ దాగి ఉందా? అసలీ మిస్టీరియస్ టెంపుల్ ఎందుకు నాశనమయింది? ముస్లిం దండయాత్రల వల్లనా లేక ఆంగ్లేయుల కుతంత్రం వలనా? లేక ఇంకేదైనా మానవాతీత శక్తి ఇక్కడుందా? వింటుంటే ఏదో ఫాంటసీ సినిమాలా అనిపిస్తోంది కదూ... కానీ ఇది నిజం. ఇవన్నీ ఒరిస్సాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్య దేవాలయం వెనుక ఉన్న షాకింగ్ నిజాలు!"
కోణార్క్ ఆలయ రహస్యాల వెనక ఉన్న మిస్టరీ ఏంటి? బ్రిటిష్ వారు ఈ ఆలయంలో అసలేం దాచారు?. కోణార్క్ ఆలయం వెనుక ఉన్న అత్యంత భయంకరమైన, ఆశ్చర్యకరమైన నమ్మలేని, నమ్మకతప్పని నిజాలను మీ ముందుకు తీసుకువచ్చాం!
ఓ కథ ప్రకారం సూర్యడు... అర్కుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడని, అలాగే ఒడిశాలో ఉన్న ఐదు పుణ్య క్షేత్రాల కోణంలో సూర్యుడు వెలసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు వచ్చిందంని విభిన్న కథనాలు వినబడుతుంటాయి.
రహస్యాలే కాదు...ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారనే విషయంలో కూడా విభిన్న కథనాలు ఉన్నాయి. ఒకప్పుడు శ్రీ కృష్ణుడి కొడుకు అయిన సాంబుడు తన ప్రవర్తన కారణంగా మునుల శాపానికి గురయ్యాడు. అయితే ఆ శాప విమోచనం గురించి ఎంతో ప్రయత్నించగా మునుల ద్వారా ఈ శాపం నుంచి విముక్తిని ఇచ్చేది కేవలం ఆ సూర్య భగవానుడే అని తెలుసుకుంటాడు. మునులు చెప్పిన ప్రకారం సాంబుడు ఉత్కళ ప్రాంతం అంటే ఇప్పటి ఒడిశా లోని చంద్రబాగ నది ఒడ్డున సూర్యభగవానుని కోసం 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసాడు, అతని తపస్సుకు ఆ సూర్యభగవానుడు సంతోషించి సాంబుడిని శాపం నుండి విముక్తుడిని చేస్తాడు, ఆ తర్వాత సాంబుడు కృతజ్ఞతతో ఒక గొప్ప సూర్య దేవాలయం నిర్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
సాంబుడు ఎక్కడైతే 12 సంవత్సరాలు తపస్సు చేసాడో, అదే స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని సూర్య భగవానుడి ప్రధాన విగ్రహాన్ని రావణలంక సృష్టికర్త అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఆధునిక కాలంలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని గంగ రాజవంశానికి చెందిన పాలకుడు నరసింహదేవ్ 13 వ శతాబ్దంలో నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీని నిర్మాణానికి సంబంధించిన కథనం కూడా ఆసక్తిగా ఉంటుంది. సుమారు 1,200 మంది శిల్పులు, 12 ఏళ్ల కఠిన శ్రమతో 1250 సంవత్సరంలో దీన్ని నిర్మించారట.
అయితే, ఒకప్పుడు వైభవానికి మారుపేరుగా వెలిగిన కోణార్క్ ఆలయం కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, విదేశీ ఆక్రమణల వల్ల ఈ ఆలయం తన వైభవాన్ని కోల్పోయింది.
రాత్రి వేళల్లో కోణార్క్ లో ఏం జరుగుతోంది?
ఈ ఆలయానికి సంబంధించి ప్రజల్లో అనేక నమ్మకాలు, ప్రచారాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ నుంచి గుండెలదరగోట్టేలా కంకణాల ధ్వని, నాట్యం చేస్తున్న పదవిన్యాసాలూ వినబడతాయని చెబుతారు. అప్పటి రాజుల ఆస్థానంలో నృత్యం చేసిన నర్తకీమణుల ఆత్మలు రాత్రిపూట ఇక్కడ తిరుగుతాయని అందుకే ఆ శబ్దాలు వస్తాయని నమ్ముతారు.
భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రానికి సుమారు 22 మైళ్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున నిర్మించబడింది కోణార్క్ ఆలయం. భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం యొక్క వైభవం, అద్భుతమైన నిర్మాణం కారణంగా, భారత ప్రభుత్వం ప్రకటించిన అత్యంత పురాతన, మహిమ గల 10 అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం1984లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కూడా పొందింది.
శిల్పకళా వైభవానికి పెట్టింది పేరయిన ఈ ఆలయం, ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. రథం ఆకారంలో ఉండే ఈ ఆలయం చుట్టూ 12 భారీ చక్రాలతో ఏడు పెద్ద గుర్రాలు లాగుతున్నట్టుగా ఉంటుంది.
కోణార్క్ అంటే
అసలీ ఆలయానికి కోణార్క్ అనే పేరెందుకు వచ్చింది? కోణార్క్ అనే పదం కోన్, అర్క్ అన్న రెండు పదాల నుంచి వచ్చింది. సంస్కృతంలో 'కోణ' అంటే మూల అని, 'ఆర్క్' అంటే సూర్యుడని అర్థం. అందుకే దీనికి కోణార్క్ అని పేరు వచ్చింది. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైనా ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన మిస్టరీ సమయం... టైం. ఖగోళ విజ్ఞానం. "మనం వాచ్‌లతో సమయం చూస్తాం. ప్రస్తుతకాలంలో అయితే సెల్ ఫోన్స్ లో సమయాన్ని చూస్తాం. కానీ 700 ఏళ్ల క్రితం కట్టిన ఈ మిస్టరీ ఆలయంలో. సూర్య రధచక్రంలా నిర్మించిన రాతి చక్రం చూసి నిమిషాలతో సహా సమయం చెప్పొచ్చట.
ఇప్పటి శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యం... ఒకప్పుడు గాలిలో తేలిన విగ్రహం, దాని వెనుక ఉన్న అయస్కాంత మిస్టరీ... అసలు 13వ శతాబ్దంలో అంతటి ఇంజనీరింగ్ ఎలా సాధ్యమైంది? నేటికీ ఒక unsolved mystery కోణార్క్ సూర్య దేవాలయం. రహస్యాల పుట్ట.
"కోణార్క్.... నిజానికి ఇదొక దేవాలయం మాత్రమే కాదు, ఒక భారీ రాతి రథం. సూర్య భగవానుడు ఏడు గుర్రాలతో ప్రయాణిస్తున్నట్లుగా దీన్ని నిర్మించారు. 7 గుర్రాలు ఏడు రోజులను సూచిస్తే, చక్రాలు కాలచక్రాన్ని సూచిస్తాయి. దీని వెనుక ఉన్న ఖగోళ శాస్త్రం చూస్తుంటే, ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించాం అనుకునే మనం, నాటి మన పూర్వీకుల మేధస్సు, శాస్త్ర విజ్ఞానం చూసి తలవంచక తప్పదు. మరి అంతటి "ఈ అద్భుత ఖగోళ విజ్ఞాన ఖని కోణార్క్ ఎందుకు నాశనమైంది? ముస్లిం దండయాత్రల వల్లనా లేక సముద్ర తీరం కావడం వల్ల పునాదులు బలహీనపడ్డాయా? కారణం ఏదైనా, నేటికీ ఈ ఆలయం అనేక మిస్టరీలకు నిలయంగా ఉంది."
ఆలయానికి 12 జతల చక్రాలు ఉన్నాయి. "కానీ అసలు రహస్యం ఇక్కడే ఉంది... ఈ చక్రాలు కేవలం అలంకరణ కాదు, ఇవి పర్ఫెక్ట్ 'సన్ డయల్స్'. వీటిపై ఉండే చిన్నచిన్న గుర్తులను బట్టి చూస్తే. ఈ చక్రాలపై పడే సూర్యుని నీడను బట్టి పగటి సమయాన్ని నిమిషాలతో సహా, , సెకన్లతో సహా సమయం కచ్చితంగా చెప్పవచ్చు. ఇంతటి అద్భుతమైన ప్లానింగ్ చేయడానికి ఆ రోజుల్లో ఏ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని? 700 ఏళ్ల క్రితమే అంతటి గణితశాస్త్రం మన వాళ్ళకు ఎలా తెలుసు? అందుకే దీనిని ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తిస్తారు. కానీ, ఈ అందమైన శిల్పకళ వెనుక ఒక చీకటి రహస్యం కూడా దాగి ఉంది!
కోణార్క్ ఆలయ చరిత్రలో మరో షాకింగ్ నిజం - గర్భాలయంలోని విగ్రహం అయస్కాంత శక్తితో గాలిలో తేలుతూ ఉండేది. ఒకప్పుడు ఈ ఆలయం పై భాగం లో దాదాపు 52 టన్నుల బరువుగల భారీ అయస్కాంతం ఉండేదట. పోర్చుగీస్ నావికులు తమ దిక్సూచి పనిచేయడం లేదని, ఆ అయస్కాంతాన్ని తొలగించారని చెబుతారు. అది నిజమా లేక కట్టుకథా?" ఇది తెలుసుకునే ముందు ఆలయచరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం
భారతదేశం.. అద్భుతమైన నిర్మాణ కళకు పుట్టినిల్లు. "ఒడిశా సముద్ర తీరంలో, కాలానికి అతీతంగా నిలబడిన ఒక భారీ రాతి రథం.. ప్రపంచ ప్రసిద్ధ 'కోణార్క్ సూర్య దేవాలయం'. 'కోణార్క్ సూర్య దేవాలయం' ఒక అద్వితీయమైన కళాఖండం. దీనిని చూస్తుంటే, ఒక భారీ రథం ముందుకు దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది.
ఇప్పుడు అసలైన మిస్టరీ లోకి వెళ్దాం. చరిత్రకారుల కథనాల ప్రకారం.. ఒకప్పుడు ఈ ఆలయ గర్భాలయంలోని ప్రధాన సూర్య విగ్రహం గాలిలో తేలియాడేది! ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక భారీ విగ్రహం గాలిలో ఎలా నిలబడుతుంది?
దీని వెనుక అప్పట్లోనే ఒక అద్భుతమైన సైన్స్ ఉపయోగించారు. ఆలయ గోడల నిర్మాణంలో అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను (Magnets) వాడారు. అలాగే ఆలయం పైన, అంటే 'కలశం' స్థానంలో దాదాపు 52 టన్నుల బరువైన ఒక దివ్య అయస్కాంత రాయిని అమర్చారు. ఈ అయస్కాంత శక్తుల బ్యాలెన్స్ (Magnetic Levitation) వల్లే ఆ విగ్రహం గాలిలో తేలేది.
ఆ భారీ అయస్కాంతం ఏమయింది?
కానీ, ఈ 52 టన్నుల భారీ అయస్కాంతం వల్ల ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ ఆలయం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల. ఆ దారిలో వెళ్లే విదేశీ ఓడల (ముఖ్యంగా పోర్చుగీస్ వ్యాపార నౌకల) దిక్సూచీలు (Compasses) తప్పుగా పనిచేసేవి. ఆలయంలోని అయస్కాంత శక్తి ఓడలను తనవైపు లాగేసుకునేది. దీంతో ఎన్నో ఓడలు సముద్రంలో మునిగిపోయాయి.
దీనితో విసిగిపోయిన కొందరు నావికులు.. ఆలయం పైభాగంలో ఉన్న ఆ 52 టన్నుల అయస్కాంతాన్ని తొలగించి దాన్ని తీసుకెళ్లిపోయారని ఒక బలమైన వాదన ఉంది. ఎప్పుడైతే ఆ ప్రధాన అయస్కాంతాన్ని తీసేశారో, ఆలయ గోడల బ్యాలెన్స్ దెబ్బతిని గర్భాలయం కూలిపోయింది. మరి ఆ తర్వాత విగ్రహం ఏమైంది? ఇప్పుడెక్కడుంది?
ఎప్పుడైతే ఈ ఆలయం నుండి అయస్కాంతము ను తొలగించారో, అప్పటి నుండి నెమ్మది నెమ్మది గా ఆలయం లో పగుళ్లు రావటం, విరిగిపోవడం మొదలైంది. ఈ ఆలయం గురించి ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, భారతదేశంలో ముస్లిం పాలకులు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో వారి నుంచి దేవతా విగ్రహాలను రక్షించుకోడం కోసం ఆలయం లో ఉన్న ప్రధానదేవుడు సూర్యదేవుని విగ్రహాన్ని మట్టిలో సురక్షితం గా పాతిపెట్టారు అని, ఆ తరువాత ఈ ప్రతిమను ఇక్కడి నుండి తీసి, పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలోనే ఉంచబడిందని కూడా చాలా మంది నమ్ముతారు. అయితే ఈ కథనానికి ప్రామాణికత లేదని కూడా ఒక వాదన ఉంది.
ప్రస్తుతం ఈ ఆలయంలో పూజలు లేకపోయినా, ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మాత్రమే కాకుండా, భారతీయ వాస్తుశిల్ప వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక స్మారక చిహ్నంగా నిలిచి ఉంది. రాతిలో చెక్కిన ఈ సూర్యుని రథం, తరాలు మారినా తన కథను మనకు వినిపిస్తూనే ఉంటుంది. దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు.
కోణార్క్ అంటేనే ఓ అపురూపం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షింస్తున్న అద్భుతమైన శిల్పకళా వైభవం. ఇక్కడ ఈ శిల్పాలలో సింహం, మనిషిమీద దాడి చేస్తున్న ఏనుగు ఆ ఏనుగు పై దాడి చేస్తున్న సింహం కనబడుతున్నాయి కదా.... అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనమయితే, ఏనుగు ధనానికి ప్రతీక... ఈ రెండూ మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం మానవాలికిస్తున్న సందేశంగా చెప్తారు.
10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే ఇక్కడుండే అశ్వాలు వీరత్వానికీ, బలానికీ ప్రతీకలుగా చెబుతారు.
ఇంతటి అద్భుతమైన ఈ మిస్టీరియస్ టెంపుల్ ప్రస్తుతం ఒక శిధిలాలయం. ఈ ఆలయ ధ్వంసం వెనుక ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయి.
ముస్లిం దండయాత్రలు: 16వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ కర్రానీ సేనాధిపతి 'కాలాపహాడ్' ఈ ఆలయంపై దాడి చేసి, విగ్రహాలను ధ్వంసం చేశాడని, ఆలయ సంపదను దోచుకున్నాడని కొందరు చరిత్రకారులు నమ్ముతారు.
బ్రిటిష్ వారి హస్తం లేదా ప్రకృతి వైపరీత్యం?: అయస్కాంతాన్ని తీసేయడం వల్లో లేదా భారీ తుఫానుల వల్లో ఆలయం బలహీనపడింది. అయితే, 1903వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఒక వింత పని చేశారు. ఆలయం పూర్తిగా కూలిపోకుండా ఉండడానికి, వారు ఆలయ ముఖ్యమైన భాగం (జగమోహన మండపానికి) నాలుగు వైపులా గోడలు కట్టేసి, లోపల పూర్తిగా ఇసుకతో నింపేసి సీల్ చేశారు!
అవును, వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఈ ఆలయం లోపలిభాగం ఇసుకతోనే నిండి ఉంది. ఇటీవల కాలంలో ఆ ఇసుకను తీసేసి లోపల ఏముందో చూడాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోందని వార్తలున్నాయి. ఎందుకంటే.. బ్రిటిష్ వారు కేవలం ఆలయాన్ని కాపాడడానికే ఇసుక నింపారా? లేక లోపల ఏదైనా రహస్య నిధి లేదా భయంకరమైన సైన్స్ దాగి ఉందా అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్! మిస్టరీ
మన పూర్వీకుల అద్భుత మేధస్సుకు నిదర్శనమైన ఈ కోణార్క్ సూర్య దేవాలయం గురించి మీరేమనుకుంటున్నారు? బ్రిటిష్ వారు లోపల ఇసుక నింపడం వెనుక ఏదైనా రహస్యం ఉందం