అన్వేషణ తెలుగు నవల 20వ భాగం | ఇందూరమణ | Anveshana part 20 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 12 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ – సీరియల్ నవల

ధారావాహిక

20వ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

 (నిన్నటి భాగం తరువాయి కథ)...

.‘‘అన్నాా.. అన్నాా... ఇప్పడు...ఇప్పుుడు అమ్మగారెక్కడున్నాారన్నాా?....’’ వార్డుబోయ్‌ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అడిగాడు రాము. ‘‘ఎక్కడుంటారో నాకు తెలీదురా!... కానీ... కానీ... నాకో ఫోన్‌ నెంబరు ఇచ్చింది. నువ్వు వస్తే ఫోన్‌ చెయ్యమని ఇచ్చిందావిడ.’’ అంటూ ఫోన్‌ నెంబర్‌ కోసం జేబులో నుండి సెల్‌ తీసాడు వార్డుబోయ్‌.

‘‘ఇంకా ఏం చెప్పాారన్నాా?’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘ఆమె చెప్పిందంతా రామూకి చెప్పాాలా? వద్దాా? వీడి దగ్గరున్న పాతికవేలు అబద్ధం చెప్పిలాగేసుకుంటేనో. ఏ.టి.ఎమ్‌ కార్డు కూడా వీడిదగ్గరే ఉంటుంది. అది కూడా లాగేసుకుంటేనో?! ఆలోచనలతో సతమతమవుతూ రాముకేసి పరీక్షగా చూసాడు వార్డుబోయ్‌.

‘‘ఏంటన్నాా అలా చూస్తున్నాావ్‌! అమ్మగారేం చెప్పాారో చెప్పన్నాా?’’ ఆతృతగా అడిగాడు రాము. ఇంతలో నర్సు పరుగున అక్కడకు వచ్చింది.

‘‘డాక్టర్సు రౌంండ్స్‌కి వస్తున్నాారు. బి అలర్ట్‌....’’ అంటూ అంతే వేగంగా మరో వార్డుకేసి పరిగెట్టింది నర్సు. ఆమె వెనుకే బిలబిలమంటూ వచ్చిన నలుగురైదుగురు నర్సులు ఎవరి వార్డుల్లోకి వాళ్ళు పరుగులు పెడుతున్నాారు.

‘‘నువ్విక్కడే ఉండరా! నేను వార్డులో ఉండాలి.’’ అంటూ వార్డుబోయ్‌ కూడా ఎమర్జెన్సీ వార్డులోకి పరుగందుకున్నాాడు.

సరిగ్గాా అదే సమయంలో... హాస్పిటల్‌ సూపరిండెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ హుందాగా మెళ్ళో స్టెతస్కోప్‌ వేసుకుని చకచకా ముందుకు నడుస్తుంటే ఆయనకి అటూఇటూ పదిమంది డాక్టర్లు అంతే వేగంతో అనుసరిస్తూ ఆయన

చెప్పింంది వింటూ వార్డుకేసి వస్తున్నాారు. ఎమర్జెన్సీ వార్డు దగ్గరకొచ్చి ఆగారు. వార్డుబోయ్‌ వినయంగా డోర్‌ తెరిచి పట్టుకున్నాాడు. కే. జి. హెచ్‌. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ తో పాటు మిగతా డాక్టర్లంతా ఎమర్జెన్సీ వార్డులోకి అడుగు పెట్టాాడు. అప్పటికే ఇద్దరు నర్సులు ఎమర్జెన్సీ వార్డులో సిద్ధంగా ఉన్నాారు. ఎమర్జెన్సీ వార్డు బయట వరండాలో బెంచీ మీద కూర్చున్న రాము ఆతృతగా అంతా గమనిస్తూ కూర్చున్నాాడు.

‘దేవుడా! మా సోమూగాడు కళ్ళు తెరిచి నాతో నవ్వుతూ మాట్లాాడేలా చెయ్యి స్వాామీ!’ మనసులోనే సింహాద్రి అప్పన్నకు మొక్కుకున్నాాడు రాము.

అదే క్షణంలో... డాక్టర్లంతా సోము మంచంచుట్టూ మూగి పరీక్షిస్తూ నిలబడ్డాారు. సోము ‘కేస్‌ షీట్‌’ చూస్తున్న సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ భృకుటి ముడిపడింది.

‘‘వ్వాాట్‌?’’ ఆందోళనగా అరిచాడు డాక్టర్‌ రామ్‌ కుమార్‌. జూనియర్‌ డాక్టర్లంతా ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తూండిపోయారు.

****************

రామకృష్ణాా బీచ్‌... ఆమె బస్సు ఎక్కిి వెళ్ళి పోగానే పళ్ళు పటపటా కొరుక్కున్నాాడతను. పరుగెత్తినా బస్సు అందుకోలేకపోయాడు.

‘ఇప్పుడేం చెయ్యాాలి? ఎక్కడని వెదకాలి? ఎటు వెళ్తోంది ఆమె? తన యజమానికైతే వాగ్ధానం చేసాడు. ఆమెను చంపే మీ దగ్గరకొస్తానని ఆవేశంగా అరిచాడు. కానీ, ఇప్పుడెటని వెళ్ళాలి. ఆ బస్సు నేరుగా సింహాచలం వైపే వెళ్తుంది. ఆమె తిరిగి సింహాచలం చేరుకుంటుందా? ఆలోచిస్తూనే సెల్‌ తీసి వన్‌ నెంబర్‌ నొక్కాాడు. స్పీడ్‌ డయల్‌. అంతే! ఎవరికో రింగ్‌ వెళ్తోంది.

‘‘ఏరా రంగా!.... ఏమైంది?’’ ఆతృతగా అడుగుతున్నాారెవరో.

‘‘అన్నాా! నువ్వెెక్కడున్నాావు?’’ అడిగాడతను.

‘‘జగదాంబ థియేటర్‌ దగ్గర పడిగాపులు పడుతున్నాాను.’’

‘‘నాకు అదిక్కడ రామకృష్ణా బీచ్‌లో కనిపించింది.’’

‘‘ఆ! కనిపించిందా?! కడతేర్చేసావా?’’ ఆనందంగా అట్నుంచి అడిగాడు ఆగంతకుడు.

‘‘అదును కోసం చూసానన్నాా ఇంతలో అది తప్పించుకుందన్నాా.’’ నీళ్ళు నములుతూ చెప్పాాడు రంగా.

‘‘అదునెందుకురా! అవకాశం దొరికాక ఎవరైనా మీనమేషాలు లెక్కిిస్తారా? మనం కిరాయి హంతకులం. మనకి ముహూర్తాాలు... షరతులేంట్రాా రంగా! నీకు మతిపోయిందా?’’ అట్నుండి అరిచాడతను.

‘‘అన్నాా! అయిపోయింది. తప్పయిపోయింది. అదిప్పుడు సింహాచలం బస్సు ఎక్కింది. జస్ట్‌ మిస్‌!....ఏం చెయ్యాాలో అర్థంకాక నీకు ఫోన్‌ చేసాను.’’ అన్నాాడు రంగా.

‘‘ఏం చేద్దాం? అక్కడేదన్నాా బస్సు రెడీగా ఉంటే ఎక్కెయ్యి. ఆమె ఎక్కిన బస్సు సింహాచలం వెళ్తుంది నిజమే! కానీ, ఆమె మధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరో... రైల్వేేస్టేషర్‌ దగ్గరో దిగేస్తే....?!’’ అవతల నుండి అతనన్నాాడు.

‘‘మధ్యలో ఎందుకు దిగుతుందన్నాా? అయినా ఇక్కడే... ఈ ప్రదేశాల్లోనే ఎందుకు దిగుతుంది? మరెక్కడన్నాా దిగొచ్చుకదా?’’ అయోమయంగా అన్నాాడు రంగా.

‘‘ఓరి వెంగళప్పాా! ఇప్పుడు టైమ్‌ ఎంతయింది. రాత్రి పది దాటిపోతోంది. ఈ రాత్రికి ఆమె ఎక్కడన్నాా విశ్రాంతి తీసుకోవాలంటే ఆమెకి అనువుగా ఉండేవి ఈ రెండు ప్రదేశాలే.’’ అన్నాాడు అవతలి వ్యక్తిి.

‘‘అన్నాా.. సింహాచలం వెళ్లదంటావా?’’ అనుమానంగా అన్నాాడు రంగా.

‘‘వెళ్లినా వెళ్ళొచ్చు. మనం ముందు ఈ రెండు చోట్ల క్షుణ్ణంగా వెదుకుదాం. ఇక్కడ దొరక్కపోతే అక్కడికే వెళ్తుంది. అట్నుంచి అలా వెళ్దాం.’’ స్థిరంగా అన్నాాడు అవతలి వ్యక్తి.

‘‘అన్నాా! నువ్వు గ్రేేటన్నాా! నేను ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర దిగి వెతుకుతాను. నువ్వు....’’ అంటుండగానే అవతలి వ్యక్తి హుషారుగా ‘‘నేను రైల్వేేస్టేషన్‌ దగ్గరకు వెళ్తాను. డన్‌!’’ అంటూనే ఫోన్‌ కట్‌ చేసాడు.

రంగా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాాడు. ఈ రోజు ఈ రాత్రి ఎలాగైనా ‘ఆమె’ని హతమార్చాాలి. స్థిరంగా అనుకుని రామకృష్ణాాబీచ్‌ బస్సుప్టాప్‌ లో నిలబడ్డాడు కసాయిగూండా రంగా.

*************

డాక్టర్లంతా వార్డులోకి వెళ్లడం చూసిన రాము ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాాడు. వార్డుబోయ్‌ కూడా లోపలే ఉన్నాాడు. లోపల ఏం జరుగుతోందో తెలీక గుండెలు అర చేత్తో పట్టుుకు కూర్చున్నాాడు రాము.

‘‘వ్వాాట్‌?! ఈ కుర్రాాడికి ఇప్పటికే తెలివి రావాలే! ఇంకా రాలేదంటే ఆశ్చర్యంగా వుంది. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది కదా!’’ కేస్‌ షీట్‌ చూస్తూ అసహనంగా అన్నాాడు సూపరింటెండెంట్‌ రామ్‌ కుమార్‌.

‘‘సార్‌! డాక్టరుగారు రాసిన మందులన్నీ టైమ్‌ ప్రకారం ఇస్తున్నాం సార్‌!’’ నర్సుు వినయంగా చెప్పింది.

‘‘నర్స్‌! వెంటనే ఈ ఇంజక్షన్‌ చెయ్యండి. అరగంటలో మెలకువ రావాలి. లేదా? పేషెంట్‌ కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. క్విిక్‌.’’ అంటూ కేస్‌ షీట్‌లో ఇంజక్షన్‌ పేరు రాసి ఆ తర్వాాత వాడాల్సిన మందులు కూడా రాసి నర్సు చేతికిచ్చాాడు డాక్టర్‌ రామ్‌ కుమార్‌.

డాక్టర్‌ చెప్పినట్టే పరుగున వెళ్లి సిరంజితో వచ్చింది నర్సు. సోముకి ఇంజక్షన్‌ చేసాక మిగతా పేషెంట్లను చెక్‌ చేస్తూ ఎమర్జెన్సీ వార్డులో నుండి మరో వార్డులోకి వెళ్లిపోయారు డాక్టర్లందరూ. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది నర్సు. వార్డుబోయ్‌ బయటకు వచ్చి రాము ప్రక్కనే కూర్చున్నాాడు.

‘‘అన్నాా! మా సోముకి ఎలా ఉందన్నాా?’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘మీ వాడి సంగతేమో గాని.... మాకైతే గుండెలు జారిపోయాయిరా నాయనా! పెద్ద డాక్టర్‌ అందర్నీ అదరగొట్టి ఒదిలేసాడ్రాా! అరగంటలో మీ వాడికి తెలివొస్తుంది. రావాలి.’’ రాము భుజం మీద చెయ్యేసి చెప్పాాడు వార్డుబోయ్‌.

‘‘నిజమా అన్నాా!’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘అవునొరేయ్‌! అంత డబ్బు ఎక్కడ దాచావురా? చూస్తుంటే చొక్కాా చిరిగిపోయి ఉంది. ఫేంటు చూస్తే ఓ కాలు పొట్టి ఓ కాలు పొడవు దేనికీ జేన్నట్టుు లేదు.’’ రాము ఒళ్ళంతా తడమబోతూ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘అన్నాా... అన్నాా... ఊరుకో అన్నాా!’’ అంటూ దూరంగా జరిగాడు రాము.

రాముని ఆపాదమస్తకం చూస్తూ కూర్చున్నాాడు వార్డుబోయ్‌. ఈ గుంటడ్ని మోసం చెయ్యడం చాలా కష్టం. ఏం చెప్పినా నమ్మడు. ఆవిడ చెప్పినట్టు చెప్తేగాని దారికి వచ్చేేలా లేడు. దేశముదురుగాడిలా ఉన్నాాడు’ అనుకున్నాాడు వార్డుబోయ్‌.

‘‘ఏంటన్నాా! అలా చూస్తుున్నాావ్‌!’’ వార్డుబోయ్‌ తననే పరీక్షగా చూస్తుంటే ఆడపిల్లలా సిగ్గుపడుతూ అన్నాాడు రాము.

‘‘నీకో నిజం చెప్పాాల్రాా! చెప్పాాలా? వద్దాా? అని ఆలోచిస్తున్నాాను. చెప్తే నాకేటి లాభమా అని’’ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘అన్నోయ్‌! ఏం చెప్పకన్నాాయ్‌ నాకు భయంగా వుంది. ముందు మా సోము గాడికి ఎలా వుందో చెప్పన్నాా’’ మనసు ఏదో కీడు శంకించే సరికి భయంగా అన్నాాడు రాము.

‘‘ఛ! ఛ! అదేంకాదురా! మీ సోముగాడి విషయం కాదు. వేరే ఇంకోటి. నీకు లాభం... నాకు నష్టం. ఏం చేద్దాం! చెప్పమంటావా?! వద్దంటావా?!’’ గమ్మత్తుగా రాముకేసి చూస్తూ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘లాభమా? నాకా?... చెప్పన్నాా.... చెప్పన్నాా.... చెప్పు!’’ ఆతృతగా వార్డుబోయ్‌ దగ్గరకు జరుగుతూ అన్నాాడు రాము.

‘‘మీ అమ్మగారు కలిసారన్నాానా!’’

‘‘అవును!’’

‘‘నీ దగ్గర డబ్బుందని చెప్పాారన్నాానా?’’

‘‘అవును!’’

‘‘అది నీ దగ్గరే ఉంచేసుకోరా... ఇంకెవరికీ ఇవ్వక్కర్లేేదు అని అన్నాారని నీకు చెప్పలేదుగా’’ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘అర్థమయ్యేటట్టు చెప్పన్నాా!’’ చిరాగ్గా అన్నాాడు రాము.

‘‘ఒరేయ్‌ మొద్దూ! మీ అమ్మగారే ఆ పాతికవేలు నిన్ను తీసేసుకోమని చెప్పాార్రాా!’’ రాము భుజాలు పట్టుుకుని కుదుపుతూ చెప్పాాడు వార్డుబోయ్‌.

‘‘నన్నాా!ఎందుకూ?! ఈ డబ్బుు అమ్మగారిదే కదా!’’ ఆశ్చర్యంగా అన్నాాడు రాము.

‘‘సోముగాడికి బాగులేదు కదా! హాస్పిటల్లో ఖర్చుంటాయని... అవి నీ దగ్గరే ఉంచి అవసరమైతే ఖర్చుపెట్టుకోమని చెప్పాార్రాా!’’ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘నిజమా?!... ఇంత డబ్బు నాకే ఇచ్చేేసారా? నమ్మలేకపోతున్నాానన్నాా... నిజంగా నమ్మలేకపోతున్నాాను.’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘నమ్మితే నమ్ము... నమ్మక పోతే నాకిచ్చెెయ్‌. నాకైతే కిందామీదా ఆరు జేఋలున్నాాయి... చూడు!’’ వెటకారంగా జేఋ చూపిస్తూ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘పో అన్నాా! నన్ను మరీ చిన్నపిల్లాాడ్ని చేసేస్తున్నాావ్‌. డబ్బుు నాదికాదని తెలిసినా చూడు ఎంత జాగ్రత్తగా దాచానో’’ అంటే ఫేంటు లోపల ఉన్న మరో నిక్కరుపై ఫేంటు విప్పదీసిమరీ చూపిస్తూూ ‘‘ఇంక ఈ డబ్బు నాదైతే గుండెల్లో పెట్టుకు దాచుకుంటానన్నాా!’’ అంటూ పై షర్టు విప్పి లోపల ఉన్న జేబులోపల ఉన్న బనీను చూపించాడు రాము.

‘‘అమ్మో!....అమ్మో?!....ఎంత ఖతర్‌నాక్‌ గాడివిరా!’’ ఆశ్చర్యంంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు వార్డుబోయ్‌.

‘‘ఛ! ఊరుకో అన్నాా!... అన్నాా! అమ్మగారింకేం చెప్పాారన్నాా?’’ ‘జేబులో డబ్బుతో పాటు ఏ.టి.ఎమ్‌ కార్డు కూడా తన దగ్గరే ఉంది. దాన్ని తన ప్రాాణంకన్నాా మిన్నగా కాపాడుకొస్తుున్నాాడు. పోలీసుబారి నుండి సురక్షితంగా కాపాడుకొచ్చాాడు. అది అమ్మగారికి చేర్చాాలి.’ మనసులోనే అనుకున్నాాడు రాము.

‘‘చెప్పాారు.’’ అంటూ రహస్యంగా రాముమీదకు ఒంగి గుసగుసగా గొణుగుతూ చెప్పాాడు వార్డుబోయ్‌.

‘‘అన్నాా.... కొంచెం... ఇంకొంచెం గట్టిగా చెప్పన్నాా! ఒక్కముక్క వినపడలేదంటే నమ్ము.’’ వార్డుబోయ్‌ కి మరింత చేరువగా జరిగి అతనిమీద పడ్డట్టు రాసుకుంటూ కూర్చుని అడిగాడు రాము.

‘నీ దగ్గర ఏ.టి.ఎమ్‌ కార్డు ఉంది కదా! అది నా చేతికిమ్మన్నాారు. కార్డు భద్రంగానే ఉంది కదా?’’ అడిగాడు వార్డుబోయ్‌.

‘‘ఆ!...ఉందన్నాా! ఇస్తే.. అది నిన్ను తీసేసుకోమన్నాారా?!’’ ఆశ్చర్యంగా అడిగాడు రాము.

‘ఎగస్ట్రాాలొద్దురొరేయ్‌! నాతోనే కామెడీ చేస్తున్నాావా? డబ్బు నీకా? ‘ఖాళీ కార్డు’ ముక్క నాకా అదెందుకురా నాలిక గీసుకోడానికి. దాని తాళం కూడా నీకు తెలిసుంటుంది కదా! అది చెప్పు! నచ్చినంత గీక్కుంటా!’’ చిన్నగా నవ్వుతూ అన్నాాడు వార్డుబోయ్‌.

వార్డుబోయ్‌ మాటలు విని ఫకాలున నవ్వాాడు రాము.

‘‘ఏందిరోయ్‌! నీకు నవ్వొచ్చేే మాటలేమున్నాాయిరా! కార్డుముక్క ఒక్కటే ఎందుకురా...! దాంతో దాని పిన్‌ నెంబరు చెప్పమన్నాా! దానికి ఆ నవ్వేందిరా!...’’ చిరు కోపం ప్రదర్శిస్తూ అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘నీ మాటలు విని కాదన్నాా! ఇందాక నన్నుు స్టేషన్‌ నుండి తీసుకువచ్చాారే...ఆ పోలీసులు గుర్తొచ్చి...నవ్వుకున్నాా!’’ అన్నాాడు రాము. రాము నోట పోలీసుల మాట వినగానే త్రుళ్లి పడ్డాాడు వార్డుబోయ్‌.

‘‘పోలీసులా! వాళ్ళెవర్రాా! ఇందాక నిన్ను తీసుకొచ్చినోళ్లా?’’ అమ్మో!....అమ్మో! నంగనాచిలా ఉన్నాావు. అప్పుుడే... పోలీసుతో సావాసాలేట్రాా!’’ భయంగా అన్నాాడు వార్డుబోయ్‌.

‘‘సావాసం కాదన్నాా! వాళ్ళే నన్ను దొంగననుకుని లాక్కుపోయారు. నిజం తెలుసుకుని వదిలేసారు.’’ చెప్పాాడు రాము. వార్డుబోయ్‌కి బుర్ర తిరిగిపోయింది. ఆవిడ ముందే చెప్పింది. ఎవరూ చూడకుండా... ఎవరికీ అనుమానం రాకుండా రాము దగ్గర నుండి ఆ ఏ.టి.ఎమ్‌ కార్డు తీసుకోమంది. వీడు చూస్తే పోలీసులతో వచ్చాాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. ఏ గొడవా లేకపోతే ఆవిడే వచ్చి వీడిదగ్గర ఏటిఎమ్‌ కార్డు తీసుకోవచ్చు కదా! తనకి అంత డబ్బు ఇస్తానందంటే.. ఇది ప్రమాదకరమైన పనేనన్నమాట. అమ్మో! నిజంగా.... ఆమె అన్నట్టు ఎవరైనా రామూని, నన్ను గమనిస్తున్నాారా?! ఏమో! ఆ అనుమానం మనసులో మెదగానే టక్కున బల్లమీద నుండి లేచాడు వార్డుబోయ్‌. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వార్డు ముందున్న వరండా అంతా తిరిగి ఏ మూలన ఎవరైనా నక్కిి ఉన్నాారేమో అని తిరిగి తిరిగి చూసాడు. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు.వార్డుబోయ్‌ ఎందుకలా వింతగా ప్రవర్తిస్తుున్నాాడో అర్థం కాలేదు రాముకి. హాస్పిటల్‌ అంతా నిశ్శబ్దంగా ఉంది. వార్డుముందు వరండాలో ఎక్కడా పిట్టమనిషి లేడు. ఎమర్జెన్సీ వార్డు ముందే తనలాగ నలుగురైదుగురు బల్లమీద పడుకుని ఉన్నాారు. బల్ల మీద నుండి లేచి వార్డుబోయ్‌ వెనకాలే వెళ్లాడు రాము. వార్డుబోయ్‌ భయం భయంగా నాలుగుమూలలా దూరి.... దారి పొడుగునా ప్రతి బల్ల ఇరుకున ఎవరైనా నక్కిి ఉన్నాారేమోనన్న అనుమానంతో పిల్లిలా అడుగులోఅడుగు వేసుకుంటూ గాలిస్తున్నాాడు. చీమచిటుక్కుమన్నాా వినిపించేంతటి నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఎమర్జెన్సీ వార్డులోనుండే ఉండుండి క్షతగాత్రుులు బాధతో చిన్నగా మూలుగుతున్న మూలుగులు చిన్నగా విన్పిస్తున్నాాయి. వార్డుముందున్న నడవా అంతా ఈ చివర నుండి ఆ చివర వరకూ వెళ్లిచూసాడు వార్డుబోయ్‌. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. బల్లమీద పడుకున్నవాళ్లంతా ముసలివాళ్ళు, ఆడవాళ్ళు. వరండా అంతా వెదికాడు. ఎమర్జెన్సీ వార్డును ఆనుకుని ‘ఓ.పి.’ ఉంది. చిన్న చిన్న రోగాలకు అక్కడికక్కడే మందులు రాసి ఇచ్చేే వార్డు అది. అక్కడే బయట నుండి రావడానికి ప్రధానద్వాారం ఉంది. ఆ ప్రధానద్వాారం ముందు పెద్దహాలు. పేషెంట్లని చూడ్డానికి వచ్చేేవాళ్ళు బయట రూమ్‌ లు దొరక్క అవస్తలు పడ్డవాళ్ళు ఆ హాల్లోనే పడుకుంటారు. ఒక్కరోజు కోసం రూమ్‌ లు అద్దెకు తీసుకోలేని వాళ్లంతా అక్కడే విశ్రమిస్తాారు. ప్రధానద్వాారం ముందున్న హాలులో పడుకున్న వాళ్లని గమనిస్తూ నడుస్తున్నాాడు వార్డుబోయ్‌.వార్డుబోయ్‌ కి తెలీకుండా అతని వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లిన రాము ఒక్కసారే ‘అన్నాా!’ అని అరుస్తూ వెనక నుండి వార్డుబోయ్‌ నడుం పట్టుకున్నాాడు. హఠాత్తుుగా వెనుకనుండి ఎవరో నడుం పట్టుకుని అరిచేసరికి అదిరిపడి అంతెత్తున ఎగిరి పడ్డాడు వార్డుబోయ్‌

******************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


Recent Posts