అన్వేషణ తెలుగు నవల 19వ భాగం | ఇందూరమణ | Anveshana part 19 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 11 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ – సీరియల్ నవల

ధారావాహిక

19వ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

 (నిన్నటి భాగం తరువాయి కథ)... 

 అనుకోకుండా సోల్ ఫోన్ కేసి చూసుకుంది ఆమె. పదిగంటలకు దగ్గరవుతోంది సమయం. ఇక అక్కడ ఉండకూడదు. మరి, ఎక్కడికెళ్లాలి?’’ ఆలోచిస్తూ నిలబడింది. ఆర్టీసీ బస్సుస్టాండ్ కో... రైల్వేేస్టేషన్ కో వెళ్లడమే తనకి మేలు. ప్రయాణీకుల మధ్య తెల్లవార్లూ గడిపెయ్యచ్చు.’’ అలా అనుకుంటూనే గబాలున లేచి నిలబడింది ఆమె. బీచ్ రోడ్ లో ఉన్న బస్సుస్టాండ్ కేసి చూసింది. నలుగురైదుగురు నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తున్నట్టున్నాారు. గబగబా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లాలని ఇసుకలో కాలు తీసి కాలు బలంగా వేస్తూ నడుస్తోంది ఆమె.

కొద్ది దూరంలో ఒక ఆగంతకుడు నిలబడి అరగంట నుండి ఆమెనే తదేకంగా గమనిస్తూ నిలబడ్డాడు.ఇసుకలో నడవలేక నడుస్తున్న ఆమె తల ఎత్తి బస్సుస్టాప్ కేసి చూస్తూ అనుకోకుండా ఆ ఆగంతకుని కేసి చూసింది. అదే సమయంలో అతను కూడా ఆమెనే చూస్తూ నిటారుగా కరెంటు స్తంభంలా నిలబడి ఉన్నాాడు. అతనలా చూడగానే ఆమె గుండె దడదడలాడింది. ఆరడుగుల అజానుబాహుడు... అతని రూపం... వాలకం... బాగా ఎరుగున్న వ్యక్తిలానే కనిపించాడు. కానీ ఎక్కడ చూసిందో... ఆ క్షణం గుర్తుకు రాలేదు. అయినా, తానీ ఊర్లో...ఈ మహానగరంలో ఉన్నాానన్న విషయం ఎవరికీ తెలీదుకాక తెలీదు. కాబట్టి అతను తెలిసిన వాడు కాకపోవచ్చు. తనే అలా భ్రమపడి పోతోందేమో! తల దించుకు నడుస్తూ ఓరకంట అతన్నేే గమనిస్తూ రోడ్డు మీదకు చేరుకుంది ఆమె. అదే సమయంలో సిటీబస్సు వచ్చి స్టాాప్ లో ఆగింది. బస్సును చూస్తూనే పరుగున వెళ్ళి బస్సు ఎక్కింది ఆమె. పరుగెడుతున్న బస్సుని చూస్తూనే అతను కూడా కరెంటు స్తంభంలా నిలబడ్డవాడు ఛటుక్కున బస్సుు కోసం వెంటపడ్డాాడు.

అప్పటికే బస్సు విమానంలా దూసుకుపోయి పాండురంగస్వాామి గుడిదగ్గర మలుపు తిరిగి కనుమరుగైపోయింది. ఆ అగంతకుడు ఉసూరుమని ఆయాసపడుతూ నిలబడి జేబులోనుండి సెల్ తీసాడు.

‘‘అన్నాా! అది మళ్లీ మిస్సయ్యిందే!... ఛస్! వదలను అన్నాా దాన్ని వదలను. అదెక్కడికెళ్లినా వేటకుక్కలా వెంట పడతా! దాన్ని చంపాకే నీ దగ్గరకొస్తా.’’ అంటూ అరిచాడు ఆగంతకుడు. రోడ్డుమీద పోయేవాళ్లు, బీచ్ లో మిగిలి వున్న జనం వింటారని కూడా అతను భయపడలేదు. వింటే ప్రమాదమని కూడా భయపడకుండా రాక్షసుడిలా పళ్ళు పటపటా కొరుకుతూ అరిచాడు.

**********

రాత్రి పది దాటిపోయింది. ఇద్దరు పోలీసులు సివిల్ డ్రస్ లో రాముని తీసుకుని కె. జి. హెచ్ దగ్గరకు వచ్చాారు. నేరుగా ఎమర్జెెన్సీవార్డులో ఉన్న సోము దగ్గరకు తీసుకువెళ్లారు. సోమూని అలా చూస్తూనే రాము భోరున ఏడుస్తూ కుప్ప

కూలిపోయాడు.

‘‘ఒరేయ్ బడుద్దాయ్! ఇక్కడ ఏడవకూడదు. లే! లేచి బయటకురా మిగతా పేషెంట్లుు లేస్తాారు.’’ అంటూ రామూని లేవనెత్తి వార్డు బయటకు లాక్కువచ్చాారు ఇద్దరు కానిస్టేబుళ్ళు.ఇంతలో వార్డుబోయ్ పరుగున వచ్చాాడు. అంతవరకూ వార్డు బయటే కాపలా ఉన్న వార్డు బోయ్ భావనగ ర్ వార్డులో తన తోటి ఉద్యోోగిని కలవడానికి వెళ్లాడు. స్వీపర్ శివంగిని కాపలాపెట్టి మరీ వెళ్లాడు. వస్తూనే కోపంగా అరిచాడు వార్డుబోయ్.

‘‘ఎవరండీ మీరు? లోపలకు ఎలా వెళ్లారు? ఇది విజిటింగ్ అవర్ కాదని తెలుసా?’’ వార్డు బయటకు వచ్చి నడవాలో ఉన్న కర్రబెంచీ మీద కూర్చున్న రాము, రాము ప్రక్కనే నిలబడ్డ కానిస్టేబుల్స్ మీద కసురుకున్నాాడు

వార్డుబోయ్. కానిస్టేబుల్స్ కి ఒళ్ళు మండిపోయింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లమని చెప్పాాలనుకున్నాారు. కానీ, చెప్పలేక పళ్ళు పటపట కొరుకుతూ నిలబడి పోయారు. ‘‘రామూ భయం భయంగా వార్డుబోయ్ కేసి చూస్తూండి పోయాడు.

‘‘రామూ! రా! చూసావుగా! పద పోదాం.’’ రాముని ఇక అక్కడ వదిలెయ్యలేక అన్నాారు కానిస్టేబుళ్ళు ఇద్దరూ.

‘‘సార్! నేనిక్కడే ఉంటాను. మా సోము కళ్ళు తెరిచే వరకూ ఇక్కడే ఉంటాను. మీరెళ్లండి సార్!’’ ప్రాాధేయపూర్వకంగా అన్నాాడు రాము.

వాళ్ల సంభాషణ వింటూనే వార్డుబోయ్ మౌనంగా వార్డు బయట తలుపు దగ్గర ఉన్న బల్లమీద కూర్చున్నాాడు. రాము రాననే సరికి వాళ్లిద్దరికీ ఏం చేయాలో పాలు పోలేదు. రాముని క్లోజ్ గా వాచ్ చెయ్యమని ఎస్సైై అక్బ

ర్ ఖాన్ ఆర్డర్. ‘ఇప్పుుడెలా?!’ అనుకున్నాారు మఫ్టిలో ఉన్న పోలీసులిద్దరు.

రాము ప్రక్కనే ఉంటే దోషి దొరకదు. రామూని ఒంటరిగా వదిలేస్తేనే ఎస్సై గారి పథకం ఫలిస్తుంది. అనుకుంటూ ఇద్దరూ ఒకర్నొొకరు కళ్లతోనే సంభోదించుకుంటూ సైగలు చేసుకున్నాారు.

‘‘రామూ! జాగ్రత్త! ఇక్కడే ఉండు. నీకేం భయం లేదు.’’ అంటూనే వార్డుబోయ్ కేసి చూసారిద్దరూ.అప్పటికే వార్డుుబోయ్ పరిస్థిితుల్నిి అర్థంం చేసుకున్నాాడు.

‘‘మీరెళ్లండి సార్! ఆ కుర్రాాడ్ని పేషెంంటుకి తోడుగా ఉండనివ్వండి. నేనున్నాాగా చూసుకుంటాను.’’ నమ్రతగా అన్నాాడు వార్డుు బోయ్.

‘‘సరే! జాగ్రత్త! మేము ఉదయాన్నేే వస్తాాము.’’ అంటూ రామూకి చెప్పిి ఇద్దరూ అక్కడ నుండి బయట ప

డ్డాారు.

‘‘ఇంత రాత్రి ఎందుకొస్తుంది రా! మనం ఇళ్లకి పోయి ఉదయాన్నేే వచ్చేేద్దాంం.’’ అన్నాాడు ఒకడు.

‘‘నేనూ అదే అనుకుంటున్నాాను. పద పోదాం.’’ అన్నాాడు రెండో వాడు. కానిస్టేబుళ్ళు ఇద్దరూ వెళ్లిన దిక్కేే చూస్తూండిపోయారు రాము, వార్డుు బోయ్. ‘ఎమర్జెన్స వార్డుులో ఉన్న కుర్రపేషెంటు కోసం వచ్చిన కుర్రాాడే అయి వుంటుంది. మేడమ్ గారు చెప్పిన రాము ఈడే!’ అనుకుంటాను. వాళ్ళిద్దరు ఎవరో దగ్గరుండి దించి వెళ్తున్నాారు. మనసులో అనుకుంటూ మౌనంగా కూర్చుున్నాాడు వార్డుు బోయ్.

‘‘అన్నాా! నేను ఈ బల్ల మీద పడుకోవచ్చాా?’’ మౌనంగా తననే చూస్తుున్న వార్డుబోయ్ కేసి చూసి అడిగాడు రాము. ‘

‘ఓ ఎస్ పడుకో రామూ! జాగ్రత్త! నీ దగ్గరున్న డబ్బు జారిపోకుండా చూసుకో!’’ అన్నాాడు వార్డుు బోయ్. వార్డుబోయ్ మాట వింటూనే ఉలిక్కిిపడ్డాాడు రాము. ‘‘వీడెవడండీ బాబు! తన దగ్గర డబ్బుంందని వీడికెలా తెలిసింది. తన పేరు పెట్టి కూడా పిలుస్తున్నాాడు.

సోముకి చూస్తే ఇంకా తెలివి వచ్చినట్టుు లేదు. మరి, వీడికి నా పేరెలా తెలిసింది?!’ ఆలోచిస్తూ వార్డుబోయ్ కేసి చూసాడు రాము. రాము అలా ఆశ్చర్యంగా తన కేసి చూడడం చూసిన వార్డుబోయ్ ఆనందంగా రాము ప్రక్కకు వచ్చి బల్ల

మీద కూర్చున్నాాడు. ఆప్యాాయంగా రాము భుజం మీద చెయ్యేసాడు.

‘‘నీ దగ్గర పాతికవేలున్నాాయి. జాగ్రత్తగా దాచుకో’’ అంటూ నెమ్మదిగా చెవిలో గుసగుసగా అన్నాాడు వార్డుబోయ్.

‘బాబోయ్! జేబులో పాతికవేల రూపాయలున్నట్టు ఎలా కనిపెట్టేసాడో! కొంపదీసి ఈడు మాయలోడు కాదు కదా!’’ అనుకుంటూ అనుమానంగా వార్డుబోయ్ మొహంలోకి చూసాడు రాము. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నప్పుడు తనతో వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో గుర్తొచ్చింది రాముకి. మనసులోనే నవ్వుకున్నాాడు.

‘‘ఏరా! నేను చెప్పింది నిజమేనా?’’ సంశయంగా అడిగాడు వార్డుబోయ్.

‘‘నా దగ్గర అంత డబ్బు ఎందుకుంటుందన్నాా! నీకేమైనా పిచ్చాా?’’ వార్డుబోయ్ కేసి వెటకారంగా చూస్తూ అన్నాాడు రాము.

‘‘అదేంట్రాా! నిజంగా నీ దగ్గర అంత డబ్బు లేదా?’’ బేల మొహం వేసాడు వార్డుబోయ్.

‘‘లేవు గాక లేవు. నీ మీద ఒట్టన్నాా!’’ నమ్మబలుకుతూ వార్డుబోయ్ తలమీద చెయ్యి వెయ్యబోతూ అమాయకుడిలా నటిస్తూ అన్నాాడు రాము.

‘‘అదేంట్రాా! ఆమె అలా చెప్పింది?’’ ఆలోచనలోపడుతూ అన్నాాడు వార్డుబోయ్.

‘ఆమె’ అనగానే ఉలిక్కిిపడ్డాడు రాము.

‘‘ఆమె.. .ఆమె ఎవరన్నాా?!’’ కుతూహలంగా అడిగాడు రాము.

‘‘ఏమోరా! చీకటి పడుతుండగా మీ పేషెంటుని చూడ్డానికని ఒకామె వచ్చింంది. ఆమె నువ్వొస్తావని... నీ దగ్గర పాతికవేల రూపాయలున్నాాయని... ఇంకా....’’ అంటూ ఆగాడు వార్డుబోయ్.

‘ఈ గుంటఎదవ నిజం చెప్తున్నాాడా? అబద్ధంం చెప్తున్నాాడా? లేదా ఆవిడే నన్ను బురిడీ కొట్టించిందా?! ఊరికే ఎందుకలా చెప్తుంది. ఇందులో ఏదో మతలబు ఉంది. ఈ గుంటనా కొడుకే నన్ను వెర్రివెధవని చేద్దామని చూస్తుున్నాాడేమో!’ మనసులోనే తర్జన భర్జన పడ్డాడు వార్డుబోయ్.

‘‘అన్నాా! చెప్పన్నాా... ఆవిడ.... ఆ అమ్మ.... ఏమందన్నాా! అమ్మగారొచ్చాారా? నిజంగా... .నిజం....’’ ఆనందంతో మరి మాట్లాాడ లేక పోయాడు రాము.

రాము మొహంలో ఆనందం....మాటల్లోో సంతోషం చూసి ఆశ్చర్య పోయాడు వార్డుు బోయ్.

‘‘అవును... అమ్మగారొచ్చాారు.... ఆమె చెప్పిందంతా నిజమేనా?! నిజమే కదరా!’’ రాము భుజాలు పట్టుకుని అడిగాడు వార్డుబోయ్.

‘‘ని...ని....నిజమే అన్నాా! నా దగ్గర.... నా దగ్గర అంత డబ్బు భద్రంగానే ఉంది.’’ ఆనందంగా అన్నాాడు రాము.

‘‘ఓరి నా భడవా! నన్నేే బురిడీ కొట్టించావు కదరా! క్షణంలో మీ అమ్మగారే నన్ను ఎదవని చేసారేమోనని భ్రమ పడేలా చేసావు కదరా!’’ రాముని ఆనందంతో కౌగిలించుకుంటూ అన్నాాడు వార్డుబోయ్.

*****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

రామూ-సోమూకి, ఆమెకీ వారధిగా మారాడు వార్డ్ బోయ్.....' వార్డ్ బాయ్ వాళ్ళను కలపడానికి సహకరిస్తాడా? పోలీసులకు సమాచారం చేరవేస్తాడా? రేపటి బ్లాగ్లో మిగిలిన కథ


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...