అన్వేషణ తెలుగు నవల 17వ భాగం | ఇందూరమణ | Anveshana part 17 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 09 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ - సీరియల్ నవల

ధారావాహిక నవల

17వ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

 (నిన్నటి భాగం తరువాయి కథ)...

‘‘మీ గదిలోకి ఈ గన్ ఎలా వచ్చింది రాము?’’ అనునయంగా అడిగాడు ఎస్సై. పాడుబడ్డ భవనంలో దొరికిన గన్ చూపిస్తూ అడిగాడు.

‘‘అదా! ఎక్కడిది సార్! ఆ పాడుబడ్డ బంగ్లాాలో దొరికిందా? బొమ్మ తుపాకీనా సార్?’’ ఉత్సాాహంగా అన్నాాడు రాము.

‘‘ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది?’’ గద్దించి అడిగాడు ఎస్సై.

‘‘ఏమో సార్! మా సోమూగాడు కూడా కొనలేదు. కొంటే నాకు చెప్తాాడు కదా! ఏదైనా మా ఇద్దరూ కలిసే కొంటాం... ఉంటాం... ఆడుకుంటాం. వాడుకుంటాం. అందులో రీలుందా సార్!’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘రామూ! ఇది బొమ్మ తుపాకీ కాదు. ప్రాాణాలు తీసే నిజం తుపాకీ. ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది?’’ అసహనంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అమ్మో! నిజం తుపాకీయే?! ఇలాంటివి సినిమాల్లో చాలా సార్లు చూసాను సార్! ఇది మా దగ్గరకెలా వచ్చిందో తెలీదు సార్! అమ్మతోడు’’ నెత్తిమీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాాడు.

‘‘సోమూ తెచ్చాాడా?!’’ అడిగాడు ఎస్సై.

‘‘లేద్సాార్! వాడూ తేలేదు. వాడూ నేను రాత్రీపగలు కలిసే ఉంటాం కదా!’’ అన్నాాడు రాము.

‘‘ఆలోచించు... బాగా ఆలోచించు. విదేశీభక్తులు దేవుడి దర్శనానికి వచ్చినపుడు వారి దగ్గర దొంగిలించారేమో కదా!’’ అన్నాాడు ఎస్సై రామూ కేసి అదోలా చూస్తూ.

‘‘సారూ! మేము ముష్టోళ్ళమే గాని ముఠాగాళ్లం కాదు సార్! దొంగతనం మా ఇద్దరికీ చేత కాదు. అమ్మాా అయ్యాా దానం చెయ్యండయ్యాా అంటూ కాళ్లావేళ్లా పడి అడుక్కుంటామే గాని అడక్కుండా ఒక్క పైసా ముట్టమండీ.’’ కోపంతో తల ఎగరేస్తూ గుండెల్లోనుండి తన్నుకొస్తున్న దు:ఖాన్ని అదిమిపట్టి అన్నాాడు రాము.

రామూ మాటల్లో నిజాయితీ గ్రహించాడు ఎస్సై అక్బర్ ఖాన్. బజర్ నొక్కిి సేంట్రీని పిలిచాడు.

‘‘ఈ కుర్రాాడ్ని పంపించెయ్యండి. ఈ కుర్రాాడి దగ్గర తీసుకున్న ఏ.టి.ఎమ్ కార్డు, డబ్బు తిరిగి ఇచ్చెెయ్యండి.’’ అంటూ రామూకేసి నవ్వుతూ చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆనందంతో ఉప్పొంగి పోయాడు రాము.

‘‘నిన్ను నీ గదిదగ్గర దించేస్తాాడు మా కానిస్టేబుల్. ఆ డబ్బు జాగ్రత్త.’’ రాము కేసి చూస్తూ అన్నాాడు ఎస్సై.

‘‘సార్! మా సోముని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసారో... నేను కూడా వాడి దగ్గరకు వెళ్తాను సార్! పాపం! వాడిప్పుడు ఎలా ఉన్నాాడో’’ బెంగగా అన్నాాడు రాము.

‘‘ఈ డబ్బుతో ఎలా?! జాగ్రత్తగా దాచుకో గలవా?’’ అడిగాడు ఎస్సై.

‘‘ఏం ఫర్లేదు సార్! నా ఫేంటు లోపల మరో ఫేంటు ఉంది. అందులో దాచేస్తాను. అమ్మగారిని కలిస్తే ఇచ్చేేస్తా’’ అన్నాాడు రాము.

డబ్బుకోసం ఆవిడ రాముని ఎలాగైనా కలుస్తుంది. ‘పాడుబడ్డ భవనం’ లో అయితే ఈ రాత్రికే కలిసేది. వీడు హాస్పిటల్ కి వెళ్తానంటున్నాాడు. ఎలా?! ఆలోచిస్తూ సెంట్రీ కేసి చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘రామూ! నువ్వెెళ్లి రైటర్ దగ్గర నిలబడు. మా కానిస్టేబుల్ని నీతో పంపిస్తాాను. హాస్పిటల్ దగ్గర దించేసి వచ్చేేస్తాాడు. సరేనా!’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అలాగే సార్!’’ అంటూ ఎస్సై గదిలో నుండి బయటకు వెళ్లిపోయాడు రాము.

‘‘సార్! ఏదో చెప్పబోయారు.’’ ఎస్సై ముందు వినయంగా నిలబడి అడిగాడు సెంట్రీ.

‘‘రైటర్ దగ్గరున్న ఏ.టి.ఎమ్. కార్డు రెండుప్రక్కలా జెరాక్స్ తీయించండి. ఆ కుర్రాాడికి వాడి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చెెయ్యండి. అలాగే వాడి డిబ్బీ కూడా ఇచ్చెెయ్యండి. నువ్వెెళ్లి రైటర్ని పంపించు.’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

సెంట్రీ వెళ్ళిన అర నిమిషం లోనే రైటర్ వచ్చాాడు.

‘‘ఆ కుర్రాాడి వస్తుువులన్నీ ఇచ్చేేసాక వాడి వెనుక మన కానిస్టేబుల్స్ ని ఇద్దర్ని సివిల్ డ్రస్ లో పంపించు. వాడిని నీడలా వెంబడించాలి. ఈ కుర్రాాడికి ఏ.టి.ఎమ్. కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్న ‘ఆమె’ వీడ్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చాన్స్ మిస్ చెయ్యకూడదు. ఈ ‘పిస్టల్’ ఆమెదే అయితే చాలా ప్రమాదం. ఆ స్త్రీ ఏ ఉగ్రవాద సంస్థకో చెందినదైతే మరీ ప్రమాదం. అందుకే మన వాళ్లని చాలా ఎలర్ట్ గా ఉండమను.’’ చెప్పాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! ఏ.టి.ఎమ్. డబ్బు ఇవ్వకుండా మన కస్టడీలో ఉంచితే మంచిది కదా!’’ నసుగుతూ అన్నాాడు రైటర్.

‘‘ఎందుకు?! దాని వలన ఉపయోగం ఏమిటి?! ఏటిఎమ్ కార్డు ఎలాగూ మనం జెరాక్స్ తీయిస్తాం కదా! ఆ ఆధారంతో బ్యాంకులో సంప్రదించి అది ఎవరి పేరున ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చుు. ముందు ఆ స్త్రీ ఎవరో కనిపెట్టాాలి. రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలి. నేను చెప్పినట్టు చెయ్యంండి.’’ చిరాగ్గాా అన్నాాడు ఎస్సై. మరి మారు మాట్లాాడకుండా వెనుదిరిగాడు రైటర్.

‘‘రైటర్ గారూ!.... జస్ట్ ఏ మినిట్!’’ వెను దిరిగి వెళ్లి పోతున్న రైటర్ ని పిలిచాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై అక్బర్ ఖాన్ పిలుపు వినగానే టక్కున ఆగి వెనక్కిి వచ్చాాడు రైటర్.

‘‘ఆ దొంగ కథ ఏం చేసారు?’’ అడిగాడు ఎస్సై.

‘‘అదే ఆలోచిస్తుున్నాా సార్! ఆ బ్యాాగ్ ఎవరిదో తెలీదు. అందులో చీరలు తప్ప ఏమీ లేవు. కాకపోతే మన దగ్గర చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాాయి. నగలు పోయాయని కొందరు, నగదు పోయిందని కొందరు ఇలా

చాలా మంది భక్తుుల నుండే చాలా ఫిర్యాాదులు అందాయి, వీళ్లని నాలుగు తన్ని కనుక్కుంటే గాని వీళ్ళు నిజం చెప్పరు.’’ అన్నాాడు రైటర్.

‘‘అలాగే ! మీరా పనిలో ఉండండి! ఇక నేను ఇంటికి వెళ్తాను. ఏదన్నాా అర్జెంటు పనుంటే కాల్ చెయ్యంండి.’’ అంటూ సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్ సార్!’’ అంటూ సెల్యూట్ చేసాడు రైటర్.

**************

కె. జి. హెచ్ ముందు బస్సు దిగింది ఆమె. ఎత్తైన భవనాలు. బ్రిటీష్ కాలంనాటి రాతి కట్టడాలు. బిల్డింగ్ ప్రవేశద్వాారం కేసి చూసింది. ఎత్తుగా ఉన్న పై అంతస్థుు పైన ‘కింగ్ జార్జ్ హాస్పిటల్’ అని చెక్కిి ఉంది. ఆ ప్రాంతం అంతా ప్రైైవేట్ హాస్పటల్స్, మెడికల్ షాపు, డయాగ్నసిస్ సెంటర్ లతో కళకళలాడుతోంది. ఎటు చూసినా జనం... ఎక్కడ చూసినా కార్లు, బైకులు. రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలు. నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్ లోపలకు వెళ్ళింది. ఓ.పి. ప్రక్కనే ఎమర్జెన్సీ వార్డు కనిపించింది. ప్రమాదాల వలన గాయపడేవారిని గాని అత్యవసరవైద్యం అవసరమైన ప్రాాణాంతకరోగులుగాని ముందుగా ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స అందించి రోగతీవ్రతను బట్టి సాధారణ వార్డుకు పంపిస్తాారు.

సోముకి తల మీద బలమైన గాయమైంది. సృహ లేదు. ఎమర్జెన్సీవార్డుకే తీసుకు వచ్చి ఉంటారు అనుకుంటూ నేరుగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరకెళ్లింది. వార్డు బయట ఒకతను ఆమెను అడ్డగించాడు.

‘‘ఎవరు కావాలి?’’ నిష్కర్షగా అడిగాడు వార్డు బోయ్.

‘‘ఇప్పుడే ఒక ఏక్సిిడెంట్ కేసు వచ్చింది కదా! చూద్దామని.’’ అటూ ఇటూ దిక్కులు చూస్తూ అంది ఆమె.

‘‘ఇప్పుడా....ఈ అరగంటలో ఆరు కేసులు అవే వచ్చాాయి. అన్నీ బైక్ ఏక్సిిడెంట్లు, కారు ఏక్సిిడెంట్లు కేసులే.... అందులో ఎవరు మీ తాలూకా?’’ ఆమెని ఎగాదిగా పరిశీలనగా చూస్తూ అడిగాడు వార్డు బోయ్. వార్డు బోయ్ వాలకం కనిపెట్టిన దానిలా చేతిలో ఉన్న చిన్న బ్యాాగ్ జిప్ తీసి వందనోటు అతని చేతిలో పెట్టింది.

‘‘చెప్పండమ్మాా! మీ తాలూకా వాళ్లెవరో చెప్తే నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్తా.’’ వినయంగా వంగి అన్నాాడు వార్డు బోయ్.

‘‘వంద’ ఎంత వందనాన్ని తెచ్చింది’ అనుకుంది మనసులోనే.

‘‘పదేళ్ళ కుర్రాాడు.... తలమీద గాయంతో ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాాడు.’’ చెప్పింది ఆమె.

‘‘ఓ అదా! కుర్రాాడు.... పాపం తల మీద ఎవరో గట్టిగానే కొట్టాారట కదా! డాక్టర్లు అంటుంటే విన్నాాను. అదిగోనమ్మాా ఆ మూల బెడ్ మీద ఉన్నాాడు.’’ ఎమర్జెెన్సీ వార్డులో ఉన్న సోముని చూపిస్తూ అన్నాాడు వార్డు బోయ్.

సోము ఎక్కడున్నాాడో చెయ్యెత్తి చూపించిన వార్డుబోయ్ కేసి కృతజ్ఞతగా చూసింది ఆమె.

‘‘పోలీసులే తెచ్చి జాయిన్ చేసారు. ఇక్కడే ఇంత వరకూ ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. ఆకలేస్తోంది. కాస్త ఎంగిలిపడి వస్తానంటూ బయటకు వెళ్లాడమ్మాా. పోలీసోడొచ్చేేలోపు మీరు ఆ కుర్రాాడ్ని చూసి వచ్చెెయ్యండి! పోలీసులసలే

మంచోళ్ళు కాదు! ఎందుకు పంపించావంటే నా ఉద్యోగం పోతుంది. ఎందుకొచ్చిన తంటా. బేగా ఎళ్లొచెయ్యండమ్మాా!’’ అంటూ ఆమెని లోపలకు పంపించాడు వార్డు బోయ్.

తలకి కట్టు కట్టి ఉంది. ఒంటిమీద స్పృహ లేకుండా పడుకుని ఉన్నాాడు సోము. ఇంకెక్కడా గాయాలు లేవు. నెమ్మదిగా చేతి మీద తట్టింది ఆమె. ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్నాాడు సోము. ఒక్కక్షణం భయంగా చూసింది ఆమె. ‘పాపం! తన వలన ఈ స్థితికి వచ్చాాడు!’ మనసులోనే అనుకుంది. సోము దగ్గరనుండి వెనక్కిి వచ్చేేసింది ఆమె.

‘‘అమ్మాా! ఆ కుర్రాాడ్ని చూసారా? ఏ వెధవలు కొట్టారో గానీ, చాలా బలంగా కొట్టారు. చాలా కుట్లుపడ్డాాయి.’’ చెప్పాాడు వార్డుబోయ్.

‘‘చూసాను.’’ అంటూ ఒకడుగు ముందుకు వేసి ఆలోచిస్తూూ క్షణం నిలబడింది ఆమె.

‘‘చెప్పండమ్మాా! నాకేదో చెప్పాాలనుకుంటున్నాారు కదా! ఫర్లేదు చెప్పండి’’ ఆమె అలా ఆలోచిస్తూ అయోమయంగా నిలబడడం చూసి అన్నాాడు వార్డుబోయ్. వార్డుబోయ్ అలా అనేసరికి ఒక్కసారే అదిరిపడింది ఆమె. తన మనసులో మాట కనిపెట్టేసినట్టే ఎలా మాట్లాాడుతున్నాాడు. ఈ వార్డుబోయ్ ఎవడో గాని మహాఘటికుడే!’’ అనుకుంది ఆమె.

‘‘చిన్న సహాయం చేస్తాావా?’’ అడిగింది ఆమె.

‘‘అయ్యో! అదెంతమాట చెప్పండమ్మాా!’’ అన్నాాడు వార్డుబోయ్.

***************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

పోలీసులతో 'ఆమె ' ఆడుతున్న దాగుడు మూతలకు తెర పడబోతోండా? ఇంతకీ 'ఆమె' ఎవరు? ఆమె 'అన్వేష'ణ దేనికి?


Recent Posts
అన్వేషణ తెలుగు నవల 17వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 17 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 17వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పదిహేనవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 15 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పదిహేనవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 16వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 16 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 16వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పద్నాలుగవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 14 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పద్నాలుగవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 13 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం ...