అన్వేషణ తెలుగు నవల 18వ భాగం | ఇందూరమణ | Anveshana part 18 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 10 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ – సీరియల్ నవల

ధారావాహిక నవల

18వ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

 (నిన్నటి భాగం తరువాయి కథ)... 

‘‘ఎవరికీ తెలీకూడదు. అడిగినా చెప్పకూడదు. ప్రమాణ పూర్వకంగా ఎవరు ఏమడిగినా నోరు విప్పనంటేనే చెప్తాను.’’ వార్డుబోయ్ కేసి చూస్తూ అంది. ఆమె మాటలకి వార్డుబోయ్ క్షణంపాటు బిత్తరపోయాడు. ‘‘ఈవిడెవర్రాా బాబూ! ఏదో మర్డర్ చేయమన్నట్టు చెప్తోంది. కొంపదీసి ఈ కుర్రాాడి పీక పిసికెయ్యమంటుందా?! అయ్యో! ఇదెక్కడి గొడవరా బాబూ! నేరకపోయి అడిగాను. చూద్దాం. ఏం చెప్తుందో! తనకి నచ్చితేనే ఒట్టేస్తాను. ఆమె చెప్పినట్టు వింటాను. నచ్చకపోతే బిల్కుల్గా నా వల్ల కాదని చెప్తాాను అంతే’

‘‘చెప్పండమ్మాా! ఏదీ చెప్పకుండానే ఎవరికీ చెప్పొద్దంటే నాకేమర్ధమవుతుంది.’’ మనసులో పరిపరివిధాలుగా ఆలోచించుకుని అన్నాాడు వార్డుబోయ్.

‘‘ఏమీలేదు చిన్నసహాయం. ఈ కుర్రాాడ్ని చూడ్డానికి ఇప్పుడో... రేపో... ఒక కుర్రాాడు వస్తాడు. వాడిపేరు రాము. వాడిదగ్గర నాదే పాతికవేల కేష్ వుంది. అది వాడిదగ్గరే ఉంచుకుని ఈ కుర్రాాడికి బాగయ్యేవరకూ ఖర్చులకు ఉంచమను. వాడి దగ్గర నా ఏటిఎమ్ కార్డు ఉంది. అది నువ్వు తీసుకో. ఎవరూ చూడకుండా ఇదంతా చెయ్యాాలి. ఎవరికీ అనుమానం కూడా రాకూడదు. వాడికీ చెప్పు. ఏ.టి.ఎమ్ ఏదని ఎవరైనా అడిగితే పోయిందని చెప్పమను. నీకిచ్చినట్టు చెప్పొద్దను.’’ చెప్పింది ఆమె.

‘‘ఆ! పాతికవేలే! ఆ కుర్రాాడ్ని తీసుకోమనాలా? మరి నాకో మేడమ్?!’’ ఆశగా అన్నాాడు వార్డుబోయ్.

‘‘నీకూ ఇస్తాను. ఈ పని చెయ్యి.’’ అంది ఆమె.

‘‘పిన్ నెంబర్ చెప్తారా?!? ఆ కుర్రాాడ్ని అడగమంటారా?’’ ఆశగా ఆమెకేసి చూస్తూ అడిగాడు వార్డుబోయ్.

‘‘పిన్ నెంబర్ నీకెందుకు?’’ ఆశ్చర్యంగా అంది ఆమె.

‘‘మరి, ఆ కుర్రాాడి దగ్గర ఏ.టి.ఎమ్ నన్ను తీసుకోమన్నాారు కదా!’’ బిక్కమొహం వేస్తూ అన్నాాడు వార్డుబోయ్.

‘‘అది నువ్వు నాకు అందిస్తే అప్పుడు నీకు నేను డబ్బుులిస్తాను.’’ అంది ఆమె.

‘‘ఆ! ఎంతిస్తారు మేడమ్?!’’ ఆనందంగా అడిగాడు వార్డుబోయ్.

‘‘అదింకా నా చేతికి రావాలి కదా! ఏ.టి.ఎమ్ నాకిచ్చినప్పుుడే ఇస్తాాను.’’ అంది ఆమె.

‘‘సరే! మిమ్మల్ని ఎలా? ఎక్కడ కలవాలి? మీరే ఇక్కడికి వస్తారా?’’ అడిగాడు వార్డుబోయ్.

‘‘నేనే ఇక్కడకు వస్తే ఆ కుర్రాాడి దగ్గర నేనే తీసుకుంటా కదా! ఇది నా సెల్ నెంబర్. రాము దగ్గర ఏ.టి.ఎమ్ కార్డు తీసుకోగానే నాకు ఫోన్ చెయ్యి. ఎక్కడ కలవాలో చెప్తాను. జాగ్రత్త! ఈ విషయం నీకూ నాకూ తప్ప వేరే ఎవరికీ తెలీకూడదు.’ అంది ఆమె.

‘‘మేడమ్.. మేడమ్....ఎంతిస్తాారో చెప్తేే....’’ నీళ్ళు నములుతూ అడిగాడు వార్డుబోయ్.

‘‘అంతకు పదింతలు సరేనా?!’’ అంది చిన్నగా నవ్వుతూ ఆమె.

‘‘ఆ!....!’’ ఒక్కసారే ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టేసాడు వార్డుబోయ్. ఆ కుర్రాాడికి పాతికవేలు ఇచ్చేేసింది. అంతకు పదింతంలంటే...అమ్మో! రెండు లక్షల ఏభై వేలే?....! అయితే, ఆ ‘కార్డు’లో ఇంకెంత సొమ్ముు ఉందో?! లక్షలో... కోట్లో... ఏమో!’ అనుకుంటూ ఆమె కేసి చూస్తూండి పోయాడు వార్డుబోయ్. ఆమె అక్కడ్నుండి బయటపడి కలెక్టరాఫీసు గేటు దగ్గరకు చేరుకుంది.

ఆ నాలుగురోడ్ల జంక్షన్ లో నాలుగుమూలలా నాలుగు బ్యాంకులకు చెందిన ఏ.టి.ఎమ్ సెంటర్లు ఆమె దృష్టిని ఆకర్షించాయి. గబగబా వెళ్లి ఒక బ్యాంకు ఏ.టి.ఎమ్ లోకి వెళ్లి పాతికవేలు డ్రాా చేసింది. అలా నాలుగు ఏ.టి.ఎమ్ ల్లోకి వెళ్లి నాలుగు పాతికవేలు డ్రాా చేసి లక్షరూపాయలు మడిచి చిన్న బ్యాాగ్ లో కూరేసింది. అన్నీ రెండువేలు, అయిదొందల నోట్లయినా చిన్న బ్యాాగ్ కావడం వలన ఇరికించి మరీ లోపల దాచి జిప్ వేసింది ఆమె. అప్పటికే టైమ్ ఎనిమిది దాటి తొమ్మిది గంటలు కావస్తోంది. కలెక్టరాఫీసు అప్లో నిలబడి క్రిందకు చూసింది. ఒకవైపు కేజిహెచ్ ముఖ ద్వాారం... దానికి అటూ ఇటూ కళకళలాడుతూ నర్సింగ్ హోంలు. రెండోవైపు చూసి ఆశ్చర్యపోయింది. కలెక్టరాఫీసు ఎత్తులో ఉండడం వలన రెండో వైపు డౌన్ లో ఉరకలు వేస్తూ అలలహోరుతో గంభీరంగా కనిపించింది సముద్రం. అక్కడే ఒక్కక్షణం నిలబడి సముద్రం కేసి చూసింది. గబగబా అడుగులు వేసుకుంటూ ‘బీచ్’ కేసి నడిచింది ఆమె. సముద్రం అలలు హోరెత్తి పోతున్నాాయి. రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నాా సందర్శకుల తాకిడి తగ్గలేదు. కలెక్టరాఫీసునుండి నడుచుకుంటూ రామకృష్ణా బీచ్ దగ్గరకు చేరుకుంది ఆమె. సముద్రాానికి ఎదురుగా ఉన్న ఇసుకతిన్నెెపై రకరకాల బొమ్మలు... జారుడుబల్లలు, తూగుటుయ్యాాలలు,

ఎక్కడ బడితే అక్కడ అందంగా అమర్చాారు. మధ్యమధ్య పూలమొక్కలు పెద్దపెద్ద కుండీలలో విరబూసి కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాాయి. సముద్రతీరానికి విహారానికి వచ్చేే సందర్శకులు కూర్చోడానికి అన్నట్టు సిమ్మెంటు బల్లలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వరసగా ఏర్పాాటు చేసారు. సముద్రాానికి చేరువలో ఒక సిమ్మెంటు కుర్చీ ఖాళీగా కనిపించేసరికి మౌనంగా వెళ్లి కూర్చుంది ఆమె.

సముద్రతీరమంతా జనంతో నిండిపోయింది. బీచ్ పార్క్ లో కూడా చాలామంది సందర్శకులు తమ పిల్లాపాపలతో వచ్చి ఆటపాటలతో ఉత్సాాహంగా గెంతులేస్తున్నాారు. పోలీసుల చేతికి చిక్కిిన రాము ఎలా ఉన్నాాడో? ఏ.టి.ఎమ్ లో డ్రాా చేసిన పాతికవేలు రాము దగ్గర పోలీసులు లాగేసుకునే ఉంటారు. వీలైతే ఏ.టి.ఎమ్. కూడా లాగేసుకోవచ్చు. కానీ ఏదో మూల అలా చేస్తాారా?! అన్న అనుమానం. రాము ఎక్కడున్నాా పోలీసుల దగ్గర నుండి బయటపడితే స్నేహితుడైన సోమూని చూడ్డానికి తప్పకుండా వస్తాాడు. అందుకే వార్డుబోయ్ తో బేరం కుదుర్చుకుంది. కానీ పోలీసులు రాముని అంత వేగంగా వదులుతారా?! ఆలోచిస్తూూ కూర్చున్న ‘ఆమె’ ఒక్కసారే అదిరి పడింది. బ్యాాగ్ లో ఉన్న ‘పిస్టల్’ అనవసరంగా బయటకు తీసి తను కూర్చున్న దగ్గర పోస్టర్ పేపర్ క్రింద దాచింది. కొంపదీసి ఆ పిస్టల్ గాని పోలీసులకు దొరికిపోయిందా?! విదేశాల నుండి తెప్పించిన ఎంతో ఖరీదైన పిస్టల్ అది. చీకట్లో టార్గెెట్ ని ఛేదించడానికి వీలుగా టార్చిలైటు కూడా అమర్చిన అత్యాాధునిక ఆయుధం అది 9 ఎమ్.ఎమ్ పిస్టల్. చేతిలో ఇమిడి పోయేంత చిన్న పిస్టల్ ఆది. ఎంతో ఆశపడి, ఇష్టపడి తెప్పించుకున్నది. ఆ గన్ గుర్తొచ్చేే సరికి ‘ఆమె’ నవనాడులూ కృంగిపోయాయి. తన రక్షణకోసం తెచ్చుకున్న గన్ అది. అదే ఇప్పుడు తన పీకలమీదకు తెచ్చేేటట్టు ఉంది. అలాంటి ఆయుధం తన దగ్గరుందని తనని ఉగ్రవాదిగా చిత్రిస్తాారు పోలీసులు. వారి చేతిలో ఆ పిస్టల్ పడిందంటే తన మీదే గురి పెడతారు. ఆ ఏ టి ఎమ్ కార్డు తనదేనని గుర్తిస్తాారు. ఆ తర్వాాత తనని... తన ఉనికిని గుర్తించడం అంత కష్టమైన పని కాదు. ఆలోచిస్తూ కూర్చున్న ఆమె మనసంతా కకావికలమై పోయింది. అనవసరంగా తనకి తనే పోలీసుల ఉచ్చులో చిక్కుకుపోతుందేమో! వార్డుబోయ్ కి తన సెల్ నెంబర్ ఇవ్వకుండా ఉంటే బావుండేది. పోతేపోయాయ్ పాతికవేలే! అయినా ఆ డబ్బు కోసం ఆలోచించలేదు. ఏ.టి.ఎమ్ కార్డు కోసం తెలివి తక్కువగా ప్రయత్నించింది. ఇప్పుడు పోలీసులు తన మీద ఈజీగా వల విసరొచ్చు. తానెక్కడున్నాా దొరికిపోతుంది. ఆ ఆలోచన కలగ గానే టక్కున చిన్న బ్యాాగ్ లో ఉన్న సెల్ కోసం గబగబా వెదికింది. నోట్ల మధ్య కూరుకుపోయి అట్టడుగున ఉంది సెల్. బయటకు తీసి సెల్ స్విచ్చాాఫ్ చేయబోయింది. పాతిక పై చిలుకు మిస్డ్ కాల్స్. ఉదయం నుండి ఇప్పటి వరకు తెరిపి ఇవ్వకుండా వచ్చినట్లున్నాాయి,. సెల్ సైలెన్స్ మోడ్ లో ఉండడం వలన ఒక్క కాల్ కూడా గొంతుపెగుల్చుుకుని బయటపడలేదు.

‘ఏం చేద్దాం?’ ఒక్క క్షణం మౌనంగా సెల్ కేసి చూసింది. అత్తమ్మ! ఎంతో ఆందోళన చెందితే గాని.... మరెంతో అత్యవసర పరిస్థితి ఎదురైతే గాని ఫోన్ చెయ్యదు. తనూ అంతే! ఇద్దరి మధ్య అదే ఒప్పందం మరి? ఇప్పుడెందుకు చేసినట్టు?’ ఆలోచిస్తూనే టక్కున రింగ్ చేసింది ఆమె.

అవతల నుండి ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నట్టుు ఒకే రింగుతో రిసీవ్ చేసుకున్నాారు. ‘‘అమ్మాా! ఎలా ఉన్నాావమ్మాా! ఉదయం నుండి భయపడిపోతున్నాాను!’’ ఆందోళనగా అంది అవతల నుండి అత్తమ్మ.

‘‘నాకేం కాలేదమ్మాా! మీరెందుకంత కంగారు పడుతున్నాారు?’’ లాలనగా అంది ఆమె.

‘‘సింహాచలం దేవాలయం దగ్గర ఎవరో ఒక స్త్రీని చంపేసారని టీవీల్లో చెప్తూ చూపిస్తుంటే... నీ శాలువా... నీకోసం విదేశాల నుండి మీ మామయ్య తెప్పించిన శాలువ చూసి భయపడి పోయానమ్మాా!...ఆ తర్వాాత, చని పోయిన స్త్రీ వృద్ధురాలని చెప్పినంత వరకూ నా గుండె దడ ఆగలేదు తల్లీీ!’’ ఆందోళనగా అంది అత్తమ్మ.

‘‘నాకేం కాదత్తమ్మాా! మీరేం భయపడకండి.’’ అంది ఆమె.

‘‘ఆ శాలువా?! అర్థోక్తిలో ఆగి పోయింది అత్తమ్మ.

‘‘ఆ ముసలమ్మకి నేనే ఇచ్చాానత్తమ్మాా!’’ అంది ఆమె.

‘‘అంటే....?! ఆశ్చర్య పోయింది అత్తమ్మ.

‘‘అంటే....ఏమిటి అత్తమ్మ’’ అడిగింది ఆమె.

‘‘ఆశాలువ నీదని తెలిసే....అది నువ్వేే అనుకుని...అమ్మో! నాకెందుకో భయంగా ఉందమ్మాా!’’ అవతలనుండి ఏడుపు వినిపించగానే టక్కున సెల్ ఫోన్ కట్ చేసింది ఆమె. అన్నింంటికీ తెగించే తాను ఇంత దూరం వచ్చింది. అన్నీ ఉన్నాా అందరూ ఉన్నాా నాకంటూ ఎవరూ లేరన్న బాధలో దేశాలు పట్టుకు తిరుగుతోంది. నాకంటూ మిగిలిన ఒకే ఆధారం... దాన్ని వెదుక్కుంటూ తిరుగుతోంది. తన గురించి అత్తమ్మకి తప్ప వేరే ఎవరికీ తెలీదు. తన గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదనే అనుకుంది.

కానీ, అత్తమ్మ భయ పడుతున్నట్టుు తనని ఎవరైనా వెంబడిస్తుున్నాారా? ఎందుకు?! తానాన్ని బంధాలని ఒదులుకుని వచ్చేేసింది. అయినా, ఇంకా తన మీద పగ ఎవరికి? దేనికి?! తానేం నేరం చేసింది?’’ ఆలోచిస్తూూనే చుట్టూ పరికించి చూసి ఉలిక్కిి పడింది. సందర్శకులందరూ తరలిపోతున్నాారు. అక్కడక్కడ ఒకరిద్దరు ప్రేమికుల జంటలు తప్ప వేరే ఎవరూ కనిపించటం లేదు. 

************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

ఆమె భయం నిజమైనదా? పిస్టల్ పోలీసుల చేతికి చిక్కింది. అది ఎక్కడికి దారితీసింది? ఈ అన్వేషణ రేపటి వరకు.

Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...