Vijaya Lakshmi
Published on Sep 12 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ, జాతర మహోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ సిబ్బంది ప్రకటించారు. భక్తుల కోసం నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1,తేదీ గురువారం మండల దీక్ష ప్రారంభమవుతుంది. అనంతరం చదురు గుడి వద్ద, వనం గుడి వద్ద పందిరి రాట మహోత్సవం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 22, గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం కానుంది. ఇక దసరా పండుగ అనంతరం వచ్చే తొలి మంగళవారం అంగరంగ వైభవంగా ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన, విశిష్టమైన పైడిమాంబ అమ్మవారి పండుగ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జాతరలో ప్రధాన ఘట్టమైన తొలేళ్ల మహోత్సవం అక్టోబర్ 26, సోమవారం నిర్వహిస్తారు. అక్టోబర్ 27, మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించే సిరిమాను ఉత్సవం జరగనుంది. జాతరలో భాగంగా ఆ తరువాతి మంగళవారం, నవంబర్ 3, న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 7, శనివారం కలశ జ్యోతి ఊరేగింపు జరగనుంది. మహోత్సవాల చివరి దశలో నవంబర్ 10, మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, నవంబర్ 11, బుధవారం చండీ హోమం నిర్వహించనున్నారు. దాంతో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ముగుస్తాయి.
అమ్మవారి సిరిమాను దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు విజయనగరం వచ్చి పైదిమాంబ అమ్మవారిని దర్శించుకుంటారు.