ఆలయమా!? తంత్ర విశ్వవిద్యాలయమా!? ప్రసిద్ధి చెందింది. 64 యోగినిల చౌసట్ యోగినీ ఆలయం | chausath yogini temple located in Madhya Pradesh

Vijaya Lakshmi

Published on Nov 04 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మర్మం, తాంత్రిక శక్తి, ప్రాచీన విద్యల సమ్మేళనానికి నిలయం ఈ ఆలయం. భారదేశత చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన శిల్పకళా రహస్యాలలో ఒకటి. అదే మధ్యప్రదేశ్ లోని చౌసత్ యోగినీ ఆలయం. తాంత్రిక విశ్వవిద్యాలయంగా ప్రసిద్ది చెందిన ఆలయం.

64 యోగినిల చౌసత్ యోగిని ఆలయం ఎన్నో రహస్యాలు, ఇతిహాసాలతో నిండి ఉంది. ఒక పురాణం ప్రకారం, ఈ ఆలయాన్ని మహాభారతం కాలంలోని పాండవులు తమ అరణ్యవాస సమయంలో నిర్మించారు. వారు తమ దైవిక శక్తులను ఉపయోగించి ఒకే రాత్రిలో ఆలయాన్ని నిర్మించారట. మరొక కథనం ప్రకారం, ఈ ఆలయం యోగినిమాత, శివునికి రహస్య సమావేశ స్థలం, వారు తాంత్రిక ఆచారాలు, నృత్యాలు చేయడానికి ఇక్కడకు వస్తారని చెప్తారు.

చౌసత్ అంటే పురాణ కథనం

చౌసాత్” అంటే 64 యోగినీలు — శక్తి దేవత యొక్క భిన్న రూపాలు.

వీరు మహాశక్తి యొక్క సైన్యమని, బ్రహ్మాండ శక్తుల గూఢరూపాలని తంత్ర శాస్త్రం చెబుతుంది. పురాణ కథనం ప్రకారం, దుర్గాదేవి రాక్షసులను నాశనం చెయ్యడానికి తన శక్తి నుండి 64 యోగినీలను సృష్టించిందట. వీరు భూమిపై దిగి, వేర్వేరు స్థలాల్లో స్థిరమయ్యారని, ఆ స్థలాల్లో ఒకటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్ లోని  చౌసాత్ యోగినీ ఆలయం.

చౌసాత్ యోగినీ ఆలయం ఎక్కడ ఉంది?

చౌసాత్ యోగినీ ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రముఖంగా చెప్పుకోవలసిన ఆలయాలు  మధ్యప్రదేశ్ లో రెండు ఓడిశాలో రెండు ఉన్నాయని చెబుతారు.

ఈ నాలుగు దేవాలయాలలో మొరెనా జిల్లాలోని మితావలి గ్రామంలోని దేవాలయం అత్యంత ప్రత్యేకమైనది, ప్రముఖమైనది, పురాతనమైనదే కాదు అత్యంత రహస్యమైనదిగా చెప్తారు. ఈ ఆలయం తంత్ర సాధన, యోగిని ఆరాధనకు కేంద్రంగా, తంత్ర, మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందిందిగా పరిగణించబడుతుంది. ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో కనబడతాయి. హిందూ పురాణాల ప్రకారము 64 సంఖ్య చతుష్షష్ఠి కళలను సూచిస్తున్నది.

ఆలయ నిర్మాణం

ఇక మధ్య్రప్రదేశ్ లోని ఈ 64 యోగినిల  చౌసత్ యోగిని ఆలయం సా.శ. 1323లో నిర్మించబడిందని, రాజపుత్ర రాజులైన కచ్ఛపఘాట రాజు దేవపాల ( సా.శ. 1055  - 1075 ) నిర్మించాడు.

సూర్యుని సంచారాన్ని బట్టి జ్యోతిషశాస్త్రం మరియు గణితంలో విద్యను అందించే వేదికగా ఈ ఆలయం ఉండేదని చెబుతారు 

మిటోలిలోని చౌసత్ యోగిని ఆలయాన్ని భారత పురావస్తు సర్వే శాఖ, పురాతన చారిత్రక స్మారక చిహ్నంగా ప్రకటించింది.

చౌసత్ యోగిని ఆలయం వాస్తుశిల్పం మరియు కళలకు ఒక అద్భుత చిహ్నం. ఈ ఆలయం వృత్తాకారంలో దాదాపు 30 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పైకప్పు ఉండదు.

ఈ ఆలయంలో 64 గదులు ఉంటాయి. ఈ 64 గదులలో యోగినీమాతల మూర్తులతో పాటు  64 శివలింగాలను ప్రతిష్టించారు. తంత్ర సాధన కోసం 64 మంది యోగినిల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు. వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి. వీటిలో ఇప్పుడు 35 మాత్రమే మిగిలి ఉన్నాయి. కొన్నిటిని మ్యూజియంలో భద్రపరిచినట్టు చెబుతారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయంపై దాడులు నిర్వహించి, శిల్పాలను ధ్వంసం చేసినట్టుగా చరిత్ర కథనాలు చెబుతున్నాయి. ఈ కారణంగా చాలా శిల్పాలు భిన్నమై కనిపిస్తుంటాయి. అయినా ఆనాటి శిల్పకళా వైభవానికి ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. 10 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఆనాటి రాజుల దైవభక్తిని ఆవిష్కరిస్తూ వుంటుంది.

అపూర్వమైన ఈ  నిర్మాణాలు సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి. గర్భాలయంలో శివపార్వతులు నంది వాహనాన్ని అధిరోహించి కనిపిసస్టారు. నంది వాహనంపై ముందువైపున కూర్చున్న శివుడు, వెనక కూర్చున్న పార్వతీదేవి వైపు తిరిగి ఏదో మాట్లాడుతున్నట్టుగా దర్శనమిస్తాడు. ఆదిదంపతుల అన్యోన్యతకు ఈ దృశ్యం అద్దం పడుతూ వుంటుంది.

స్థల పురాణం

ఓ మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన అభ్యర్ధన మేరకు స్వామివారు ఈ రూపంలో ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. మనోహరమైన ఈ మూలమూర్తిని దర్శించడం వలన, వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు

ఈ ఆలయం దాదాపు ఎత్తైన  కొండపై ఉంది. కొండమీదికి  100 మెట్లు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది.

చౌసత్ యోగిని ఆలయం వృత్తాకారంలో ఉంది, దీని బయటి వ్యాసం దాదాపు 170 అడుగులుంటుంది. 101 స్తంభాలపై ఉంది, ఇది భూకంపాలను తట్టుకునేలా మరియు స్థిరంగా ఉండేలా రూపొందించబడింది.

వలయాకారంలో నిర్మించబడిన ఈ ఆలయమే భారత పార్లమెంట్ భవనం నిర్మాణానికి ప్రేరణగా మారిందని చెప్తారు.

చౌసాత్ యోగినీ ఆలయం ఎక్కడ ఉంది?

చౌసాత్ యోగినీ ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అందులోనూ మితవాలి చౌసాత్ యోగినీ ఆలయం ప్రత్యేకమైనది. ఇది మిటోలి గ్రామంలోని ఒక కొండపై గ్వాలియర్ పట్టణానికి దాదాపు 40 కి.మీ దూరంలో ఉంది. 

తాంత్రిక విశ్వవిద్యాలయం

చౌసత్ యోగిని ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం తాంత్రిక సాధన, యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారట. అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారని స్థల పురాణం. తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. పూర్వం తంత్ర-మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారని చెబుతారు. ఇప్పటికీ కూడా ఈ దేవాలయం శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉందని స్థానికుల నమ్మకం. అందుకే రాత్రి వేళల్లో ఈ ఆలయానికి ఎవ్వరూ వెళ్లారు.

ఈ ఆలయం అత్యంత అందమైన ప్రకృతి మధ్య సుందరమైన పరిసరాలతో కనువిందుగా ఉంటుంది.

ఎప్పుడు చూడాలి

అక్టోబర్ నుండి మార్చి వరకు ఉండే శీతాకాలం ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం . ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆలయం  ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

Recent Posts
మానూ మాకును కాను – నవల – 17  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
ఆలయమా!? తంత్ర విశ్వవిద్యాలయమా!? ప్రసిద్ధి చెందింది. 64 యోగినిల చౌసట్ యోగినీ ఆలయం | chausath yogini temple located in Madhya Pradesh
ఆలయమా!? తంత్ర విశ్వవిద్యాలయమా!? ప్రసిద్ధి చెందింది. 64...
మానూ మాకును కాను – నవల – 16  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
ఇక్కడికి వెళితే ఎంత మొండి రోగాలైనా నయమవుతాయట.  | Nanjundeshwar (sri kantheeshwar) temple nanjangud mysore
ఇక్కడికి వెళితే ఎంత మొండి రోగాలైనా నయమవుతాయట....
మానూ మాకును కాను – నవల – 15  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...