Vijaya Lakshmi
Published on Jul 31 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 1, 2వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరపనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ కార్యక్రమ షెడ్యూల్ కూడా ప్రకటించింది.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 1వ తేదీన ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు సాయంత్రం 6 గంటలకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటలకు సంగీత కచేరి, ఉదయం 11.30 గంటలకు హరికథ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 2వతేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ttd ప్రకటించింది.
తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు. వారు చేసిన 18 గ్రంధాలలో శ్రీవారి ప్రాభవాన్ని వర్ణిస్తూ 13 గ్రంధాలు తిరుమలలోనే రచించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి స్వయంగా వెంగమాంబ నివాసానికి వెళ్లి వారితో ముచ్చటించేవారట.
అలాగే శ్రీవారి సేవలతోను, శ్రీవారి వైభవంతోనూ తరిగొండ వెంగమాంబకు గట్టి అనుబంధమే ఉంది. తిరుమలలో ఏ ఉత్సవం జరిగినా, తిరుమల మాడవీధులలో స్వామి ఊరేగుతున్నపుడు, శ్రీవారు స్వయంగా వెంగమాంబ నివాసానికి వెళ్లి ఆమె ఇచ్చే ముత్యాల హారతి అందుకునేవారని, ఆమె ముత్యాలహారతి లేకపోతే స్వామివారు ఆమె నివాసం ముందునుంచి ఇక ముందుకు కదిలేవారు కాదని ఇలా చాలా సంఘటనలే ఉన్నాయి తిరుమల చరిత్రలో. అందుకే ఆ ఆనవాయితీ ప్రకారం నేటికి కూడా ఉత్సవాలలో వెంగమాంబ వంశీకులు ఇచ్చే ముత్యాలహారతిని స్వాకరించే శ్రీవారు ముందుకు సాగుతారు.
మరీ ముఖ్యంగా శ్రీవారి సన్నిధిలో భక్తులు ఆకలితో ఉండకుండా తన శక్తి మేరకు వారికి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. అందుకే తరిగొండ వెంగమాంబ గౌరవార్ధం అన్నప్రసాదా కాంప్లెక్స్ కు ఆమె పేరు పెట్టడం జరిగింది. తిరుమలలో మనందరికీ అన్నప్రసాదం అందించే వెంగమాంబ అన్నప్రసాదా కాంప్లెక్స్.
తరిగొండ వెంగమాంబ సాధారణ శకం 1730లో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు వేంకటేశ్వరుని కరుణతో పుత్రికగా జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు.
ఈమెకు పదేండ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు.
ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.
కొంతకాలానికి తిరుమల చేరుకున్న వెంగమాంబ తిరుమల వివిధ ప్రదేశాలలో తపస్సు చేస్తూ ఉండేది. అలా వెంగమాంబ తపస్సు చేసిన ఒక గుహే తిరుమలలోని వెంగమాంబ గుహ.
కొంతకాలం ఆలయ మండపంలో ఉంటూ స్వామిని సేవించేది. కొంతకాలానికి తిరుమలలో ఆమె నివసించడానికి మహంత్ మఠం వారు ఆమెకు నివాసానికి కాస్త స్థలం ఇచ్చారు. ప్రతిరోజూ ఉదయం పూట తులసి, పూలమాలలతో, సాయంత్రం హారతితో స్వామిని సేవించేది.
ఆమె భక్తికి మెచ్చిన తాళ్ళపాక అన్నమయ్య వంశస్తులు వెంగమాంబకు ఆలయం సమీపంలో కొంత స్థలాన్ని ఇచ్చారు. ఆమె భక్తికి, ఆమె హారతులకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు తరచూ ఆమె కుటీరం వద్దకు వెళ్లి ఆమెతో పాటలు పాడించుకొని వినేవారట.
అయితే ఆలయ పూజారులు ఆమె వైభవాన్ని చూసి అసూయపడి ఆలయ ప్రవేశ్శం లేకుండా చేసారు. అదే సమయంలో తిరుమలలో బ్రహ్మోత్సవం జరుగుతోంది. రథోత్సవం రోజున వెంగమాంబ కుటీరం వద్దకు రాగానే స్వామి రథం ఇక ముందుకు వెళ్ళకుండా ఆగిపోయిందట. భక్తులు, పూజారులు, అధికారులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారి ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ఈ ఆటంకానికి తాము వెంగమాంబ పట్ల చూపిన అనుచిత ధోరణే కారణమని గ్రహించిన పూజారులు వెంగమాన్బతో హారతి ఇప్పించాగానే రథం యధాప్రకారంగా కదిలింది.
ఆ రోజే స్వామివారు పూజారికి కలలో కనిపించి ప్రతిరోజూ ఏకాంతసేవ తరువాత ఆలయాన్ని మూసివేసే ముందు, ప్రతిరోజూ వెంగమాంబ హారతి ఇచ్చేలా చేయాలని ఆదేశించారు. ఆరోజు నుంచి వెంగమాంబ హారతి ఇచ్చే ఆచారం పాటిస్తున్నారు. అది ఇప్పటికి కూడా కొనసాగుతోంది. అదే వెంగమాంబ ముత్యాలహారతి.
భక్తుల తాకిడి తన ఆధ్యాత్మ జీవనానికి, తన సాధనకు ఆటంకంగా మారిందని గ్రహించి, స్వామి వారి ఆజ్ఞ తీసుకొని తిరుమల శ్రీవారి ఆలయానికి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబురు తీర్థం సమీపంలో ఉన్న ఒక దుర్భరమైన గుహలో తపస్సులో మునిగిపోయింది వెంగమాంబ.
చివరికి 1817 లో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.
తిరుమల అన్నప్రసాదం చరిత్ర
తిరుమల లో ఒక్కరోజు అన్నదానం చెయ్యాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా