Vijaya Lakshmi
Published on Dec 23 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?📌 ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకే సుప్రభాత సేవతో వైదిక క్రతువులు ప్రారంభమవుతాయి. ఉదయం 5:30 గంటలకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఉత్తర ద్వార దర్శనం మొదలవుతుంది. 11:00 AM వరకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనం కల్పించబడుతుంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది భక్తులు ఉత్తర రాజగోపురం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.
📌 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
📌 ఆరోజు దర్శన టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి సోమవారం ప్రకటన విడుదల చేశారు.
📌 శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతోపాటు ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని అదనంగా రూ.500 ప్రత్యేక టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
📌 టికెట్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం వెబ్‌సైట్‌లో లేదా మనమిత్ర మొబైల్ యాప్ ద్వారా వాట్సాప్ నంబరు 95523 00009 నుంచి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. 100, 300, 500 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం సింహాచల నరసింహుని సన్నిధిలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పగల్‌పత్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో బేడా మండప తిరువీధి తరువాత జరపాల్సిన వైదిక కార్యక్రమాల కారణంగా ఈ నెల 29 వరకూ ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సుమారు 30 నిమిషాల పాటు అప్పన్న దర్శనాలు భక్తులకు లభించవని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి పేర్కొన్నారు. వైదిక విశేష కార్యక్రమాల తరువాత యథావిధిగా భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయన్నారు.
🔔 ముక్కోటి ఏకాదశి, లేదా వైకుంఠ ఏకాదశిని ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. సాధారణ ఏకాదశులు చాంద్రమానం ఆధారంగా ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రకారం ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాసంలో ఈ పవిత్రదినం భక్తుల జీవనానికి మహత్తర అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ రోజు, ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువును దర్శిస్తారని విశ్వాసం ఉంది. ఈ సంప్రదాయం ఆలయాల్లో కూడా కొనసాగుతుంది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక రత్న మందిరాలు నిర్మించి భక్తులు స్వామిని దర్శిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం పొందుతారని, జన్మ పునీతమవుతుంద వైజాగ్ సింహాచలం శ్రీ వారాహలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో 2025 డిసెంబర్ 30, మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశినాడు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సింహాచలం దేవస్థానం అధికారులు పటిష్టమైన ప్రణాళికతో ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
👉 ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకే సుప్రభాత సేవతో వైదిక క్రతువులు ప్రారంభమవుతాయి. ఉదయం 5:30 గంటలకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఉత్తర ద్వార దర్శనం మొదలవుతుంది. 11:00 AM వరకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనం కల్పించబడుతుంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది భక్తులు ఉత్తర రాజగోపురం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.
👉 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
👉 ఆరోజు దర్శన టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి సోమవారం ప్రకటన విడుదల చేశారు.
👉 శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతోపాటు ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని అదనంగా రూ.500 ప్రత్యేక టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
👉 టికెట్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం వెబ్‌సైట్‌లో లేదా మనమిత్ర మొబైల్ యాప్ ద్వారా వాట్సాప్ నంబరు 95523 00009 నుంచి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. 100, 300, 500 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
👉 ప్రస్తుతం సింహాచల నరసింహుని సన్నిధిలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పగల్‌పత్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో బేడా మండప తిరువీధి తరువాత జరపాల్సిన వైదిక కార్యక్రమాల కారణంగా ఈ నెల 29 వరకూ ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సుమారు 30 నిమిషాల పాటు అప్పన్న దర్శనాలు భక్తులకు లభించవని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి పేర్కొన్నారు. వైదిక విశేష కార్యక్రమాల తరువాత యథావిధిగా భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయన్నారు.
👉 ముక్కోటి ఏకాదశి, లేదా వైకుంఠ ఏకాదశిని ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. సాధారణ ఏకాదశులు చాంద్రమానం ఆధారంగా ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రకారం ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాసంలో ఈ పవిత్రదినం భక్తుల జీవనానికి మహత్తర అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ రోజు, ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువును దర్శిస్తారని విశ్వాసం ఉంది. ఈ సంప్రదాయం ఆలయాల్లో కూడా కొనసాగుతుంది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక రత్న మందిరాలు నిర్మించి భక్తులు స్వామిని దర్శిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం పొందుతారని, జన్మ పునీతమవుతుంది.
ఇవి కూడా చదవండి :