Vijaya Lakshmi
Published on Jul 05 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నిన్నటి కథ తరువాత
మీరే రండమ్మాా! మేమిద్దరం ప్రక్కనే ఉంటాంగా! ఎలా తియ్యాాలో నేర్పిిస్తాం’’ అన్నాాడు రాము.
‘‘లేదు... నేను రాను. మీలో ఎవరో ఒకరు ఇదిగో ఈ ఏ టి ఎమ్ కార్డు పట్టుకెళ్లి ఇరవై అయిదువేలు పట్రండి!’’ అంటూ రామూ చేతికి బ్యాంకు ఏ టి ఎమ్ కార్డు ఇచ్చింది ఆమె. ఆమె చేతిలో కార్డు తీసుకుంటూ సోమూ కేసి చూసాడు రాము.
‘‘నేను అమ్మగారికి తోడుగా ఉంటాను. నువ్వెెళ్ళు’’ అన్నాాడు సోము. ఆమె కూడా రామూ భుజం మీద చెయ్యేసి వెళ్ళన్నట్టు తోసి సైగ చేసి చెప్పడంతో రాము కూడా అలాగే అన్నట్టు తల వూపాడు.
‘‘మేము మెట్ల దగ్గరకెళ్లి కూర్చుంటాము. నువ్వు అక్కడికి వచ్చెెయ్యి.’’ అంది ఆమె వెనుదిరిగి.
‘‘చలిగా వుంది కదమ్మాా! ఒరేయ్ సోమూ అమ్మగార్ని మన బస దగ్గరికి తీసుకువెళ్ళు. ఈలోగా నేను డబ్బు పట్టుకొచ్చేేస్తాను.’’ అన్నాాడు రాము
‘‘బస!....అదెక్కడుంది?’’ ఆశ్చర్యంంగా అడిగింది ఆమె.
‘‘కొండ కెళ్ళే దారుంది కదమ్మాా! అదే తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయలు కొడతారు కదా! ఆ ప్రక్క నుండి దారుంది. రండి చూపిస్తాను’’ అంటూనే ఆమెని దగ్గరుండి తొలి పావంచా దగ్గరకు తీసుకు వెళ్ళాడు సోము. దాని ప్రక్కనే కాలిబాట లాంటి సందులో నుండి తీసుకు వెళ్లాడు. అది పాడుబడ్డ పెద్ద భవంతి. రాజుల కాలంనాటి పురాతన భవనం. మెట్ల దారిలోనున్న లైట్ల వెలుగు కొసరి కొసరి అంత వరకూ ప్రసరిస్తోంది. ఆ లేలేత వెలుగులో ఆ భవంతి లోపలకు ఆమెని చెయ్యి పట్టి తీసుకువెళ్లాడు సోము.
చుట్టూ చీకటిగా వుంది. ఏదీ కాన రావటం లేదు. ఉన్నట్టుండి సోము ఆమె చెయ్యిని వది లేసి ముందుకు నడిచాడు. అలవాటైన ప్రదేశం కావడంతో చీకట్లోనే తడుముకోకుండా ముందుకు నడిచాడు సోము. సోము చెయ్యి వదిలే సరికి ఒక్కసారే భయంతో బిగుసుకుపోయిందామె. భుజాన బరువుగా ఉన్న బ్యాాగ్ రెండో భుజానికి మార్చుుకుని ఎక్కడున్నదక్కడే కొయ్యబారిపోయి నిలబడిపోయింది.
‘‘బాబూ... ఎక్కడున్నాావమ్మాా!’’ నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని సోమూని పిలిచింది ఆమె.
‘‘భయపడకండమ్మాా! నేను మీ ప్రక్కనే ఉన్నాాను.’’ అంటూ టక్కున అగ్గిపుల్ల వెలిగించాడు సోము. ఆ వెలుగులో దెయ్యంలా కనిపించిన సోమును చూసి ఒక్కసారే ఒళ్ళు జదరించింది ఆమెకు. ఆ మరుక్షణం తేరుకుని ధైర్యం తెచ్చుకుంది. కొవ్వొత్తి వెలిగించి ఒక దగ్గర పెట్టాాడు సోము. అప్పుడు చూసింది. గదిలా ఉంది. ఓమూల గోనె పట్టాలు, సినిమా పోస్టర్లు ప్లాస్టిక్ వి క్రింద పరిచి వున్నాాయి.
‘‘రండమ్మాా! ఇక్కడ కూర్చోండి!’’ అంటూ శుభ్రంగా పరిచిన చోటు చూపించాడు సోము. ఆ పాడుబడ్డ భవనంలో తనీ రాత్రి తల దాచుకోవడానికి ‘భద్రం’గా వుంటుందనుకుంది ఆమె. కొవ్వొత్తి వెలుగులో ఓ మూల కూర్చుంది ఆమె. కూర్చుంటూనే బ్యాాగ్ తాళం తీసి దుప్పటి తీసుకుంది. మరో చీర తీసి క్రింద పరుచుకుంది. బ్యాాగ్ లోనే ఓ మూల వున్న వస్తువు చేతికి తగిలే సరికి ఉలిక్కిి పడింది. బయలు దేరినప్పుడే బట్టలతో పాటు ఎందుకైనా మంచిదని తన ఆత్మరక్షణకు ఉపయోగపడతాయనుకున్న వస్తుువులన్నీ బ్యాాగ్‌లో సర్దుకుంది. బొడ్లో దోపుకున్న చుర కత్తి తీసి ఒక మూల చీర క్రింద దాచింది. బ్యాాగ్ మూసేయబోతూ బరువుగా తగిలిన వస్తువు బయటకు తీసింది ఆమె. కొవ్వొత్తి వెలుగులో ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్న సోము ఆమె బ్యాాగ్‌లో నుండి తీసి అటూ ఇటూ తిప్పి చూసిన వస్తువులను చూస్తూనే ఆశ్చర్యంగా అన్నాాడు.
‘‘అమ్మాా! అది తుపాకీ కదా! ఆ బొమ్మతుపాకీ మీకెందుకమ్మాా! మీ బాబుకోసం కొన్నాారా?’’ ఆనందంగా అన్నాాడు. ఆమె చిన్నగా నవ్వి పిస్టల్ ని చీర క్రింద దాచి అలసటగా మేను వాల్చింది.
సోము దగ్గరుండి ఆమెని తీసుకుని తొలిపావంచా దగ్గరకు రావడం మెట్లప్రక్కనే కూర్చున్న ఒక వ్యక్తి గమనించాడు. సోముతో ఆమె పాటుబడ్డ పురాతన బంగ్లాలోకి వెళ్లడం వారి వెనుకే వెంబడించి మరీ గమనించాడు అతను. ఇద్దరూ బంగ్లాా లోకి వెళ్ళగానే అతను పరుగు పరుగున వెనక్కిి వెళ్లి పోయాడు.
************
దిగువ బస్సుస్టాండ్‌లో బస్సు కోసం అసహనంగా ఎదురుచూస్తూూ నిలబడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్. కొండ పైనుండి వస్తూ ముగ్గురు యువకులు బైక్ తో సహా లోయలో పడిపోయారని వార్త వినగానే పోలీస్ స్టేేషన్ కి మెసేజ్ పాస్ చేసాడు. పావుగంటలో ట్రాాఫిక్ పోలీసు జీపులో రావడం... ఘాట్ రోడ్‌లో ప్రమాద స్థలానికి వెళ్ళడం అంతా గమనిస్తూూనే ఉన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఇంతలో కొండ బస్సు అరకొర జనాలతో దిగువ బస్సుస్టాండ్‌లో కొచ్చి ఆగింది. బస్సును చూస్తూనే వెనుకే వస్తున్న కానిస్టేబుల్, ఇద్దరు యువకులా కోసం వెదికాడు ఎస్సై. బస్సు ఆగీఆగగానే లోపల ఉన్న కొద్దిమంది ప్రయాణీకులు ఒక్కరొక్కరుగా దిగిపోతున్నాారు. దిగుతున్న ప్రతి ఒక్కర్ని పరీక్షగా చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. అందులో ఎవరూ అనుమానించదగ్గ వ్యక్తి కనిపించలేదు.
‘వెధవ కానిస్టేబుల్ ఏమయ్యాాడు?’ అనుకుంటూనే జేబులో సెల్ ఫోన్ తీసి రింగ్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్. రింగ్ వెళ్తోంది గాని ఎవరూ యెత్తటం లేదు. రెండు మూడు సార్లుు రింగ్ చేసి విసుగ్గాా బండబూతులు తిట్టుుకున్నాాడు మనసులోనే. వెంటనే రెండో కానిస్టేేబుల్ సెల్ కి కాల్ చేసాడు ఎస్సై.
‘‘సార్! నమస్తే!’’ అట్నుండి కొండపైన వున్న కానిస్టేబుల్ వినయంగా అన్నాాడు.
‘‘ఏడయ్యాా! టూ నాట్ టూ గాడు పత్తాా లేదు. ఆ కుర్రాాళ్లని తీసుకుని కొండ దిగాడా? లేదా?’’ కోపంగా అరిచాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘దిగారు సార్. కొండ బస్సుని ఫాలో చేస్తూ అరగంట క్రిితమే కొండ దిగేసారు.’’ అన్నాాడు కానిస్టేబుల్.
అప్పటికే కొండ పైకి కూడా బైక్ ఏక్సిిడెంట్ విషయం గాలివార్తలా చేరిపోయింది. ‘ఒక వేళ ఈ ముగ్గురే ఏక్సిిడెంట్‌కు గురి కాలేదు కదా!’ మనసులోనే ఆందోళనపడ్డాాడు.
‘‘ఫోన్ చేస్తూంటే ఎత్తటం లేదయ్యాా! కొండ బస్సు దిగువకు చేరుకుని అయిదు నిమిషాలయింది. బస్సు కూడా ఖాళీగా వచ్చింది. పదిమంది కూడా పాసింజర్లు లేరు. వాళ్లలో నాకు అనుమానించ దగ్గ స్త్రీ కనిపించలేదు.’’ చెప్పాాడు ఎస్సై.
‘‘అదేంటి సార్! బస్సు అంతా కిక్కిిరిసి పోయింది కదా సార్. జనంతో కిటకిలాడుతూ ఇక్కడ నుండి బయలు దేరింది.’’ చెప్పాాడు కానిస్టేబుల్.
కానిస్టేబుల్ చెప్పింది వినే సరికి ఎస్సై అక్బర్ ఖాన్‌కి మతిపోయింది. వెంటనే కొండ బస్సు డ్రైవర్ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఎస్సై.
‘‘అవును సార్! కొండమీద నుండి కిక్కిిరిసిన ప్రయాణీకులతోనే దిగాను. దారిలో బైక్ ఏక్సిిడెంట్ దగ్గర బస్సు ఆగింది. చాలామంది అక్కడే దిగి లోయలో పడ్డ బైక్‌ని, బైక్‌తో పాటు లోయలో పడ్డ యువకుల్ని చూడడానికి దిగి పోయారు’’ చెప్పాాడు డ్రైవర్. ఉలిక్కిి పడ్డాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘కొంపదీసి ఏక్సిిడెంట్‌కి గురైంది కానిస్టేబుల్ తో పాటు ఆ యువకులు కాదు కదా! ఆమె కూడా అక్కడే దిగిపోయి వుంటుంది.’ అనుకుంటూనే మళ్లీ సెల్ తీసి యువకులతో కొండదిగిన కానిస్టేబుల్‌కి రింగ్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
రింగ్ అవుతోంది గాని సెల్ రిసీవ్ చేసుకోవటం లేదు. ‘ఎస్! కానిస్టేబుల్ తో సహా ఆ యువకులే ఏక్సిిడెంట్ కి గురై ఉంటారు.’’ అనుకుంటూనే ఆతృతగా బుల్లెట్ మీద కూర్చుని స్టాార్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
*************
ఆమెతో పాటు సోము తొలిపావంచా కేసి నడిచి వెళ్తుంటే క్షణంసేపు చూస్తూ నిలబడి పోయాడు రాము. వాళ్లిద్దరూ తొలిపావంచా దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఇచ్చిన ఏ.టి.ఎమ్. కార్డుు చేత్తో పట్టుుకుని హుషారుగా ముందుకు కదిలాడు రాము.
ఇంతలో రోజూ గస్తీ తిరిగే పోలీస్ రక్షక్ వాహనం నేరుగా బస్సు స్టాండ్‌లో నుండి వచ్చి ఏ.టి.ఎమ్. సెంటర్ ముందు ఆగింది. పోలీస్ జీపుని చూడగానే టక్కున ఆగి పోయాడు రాము. కొండ దిగి వస్తున్న యాత్రీకులు పురూరవ బిల్డింగ్‌లో ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ఉన్న దేవస్థాానం కేంటీన్ కేసి నడిచి వెళ్తున్నాారు. ఆర్టీసీ బస్సు ఎక్కిి వెళ్లిపోయిన వాళ్ళు నేరుగా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళ్లిపోతున్నాారు.
పోలీసు కళ్ళుగప్పి ఏ.టి.ఎమ్‌లోకి వెళ్లాల్సిన పని తనకేమిటి? తానేమీ దొంగ కాడు కదా! అనుకుంటూ దర్జాాగా రక్షకవాహనం ప్రక్కనుండే ఏ.టి.ఎమ్ సెంటర్ లోకి వెళ్లడానికి మెట్లెక్కాాడు రాము. చిరిగిన చొక్కాా, ఒక కాలుకి ఫుల్‌గానూ, మరో కాలుకి సగమే వున్న అటూ ఇటూ కాని నిక్కరు వేసుకున్న రాముని చూసిన కానిస్టేబుల్ ఒకడు ఉలిక్కిిపడ్డాడు. రక్షకవాహనంలో ఎదర కూర్చున్న హెడ్ కానిస్టేబుల్‌ని తట్టి రాముని చూపించాడు.
ఏ.టి.ఎమ్ సెంటర్‌లోకి అడుగు పెట్టిన రామూనే ఇద్దరూ తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నాారు. ఏ.టి.ఎమ్ లో పాతికవేల రూపాయలు డ్రాా చేసి గుప్పెట్లో మడిచిపట్టుకున్న రాముని చూసి పోలీసులిద్దరూ ఆశ్చర్య పోయారు. ఛటుక్కున రక్షకవాహనం మీద నుండి గెంతి మెట్లు దిగుతున్న రాముకి ఎదురుగా నిలబడ్డాారు పోలీసులు. పోలీసులిద్దర్నీ చూస్తూనే భయ పడ్డాడు రాము. ‘అయినా తను దొంంగతనం చెయ్యలేదుగా. ఈ డబ్బు అమ్మగారిది. అడిగితే అదే చెప్తాాను.’ మనసు లోనే స్థిరంగా అనుకున్నాాడు రాము.
***********
‘‘అమ్మ గారూ! ఒంట్లో బాగా లేదా?’’ బ్యాాగ్ తల క్రింంద పెట్టుకుని మేను వాల్చిన ఆమెకేసి చూస్తూ అడిగాడు సోము.
****************
" పోలీసుల కంటపడిన రాము పరిస్థితి ఏమిటి? ఆమె పోలీసులకు చిక్కిపోయిండా? ఆమె అన్వేషణ ముందుకు సాగిందా? ఇంతకీ ఆమె అన్వేషణ దేనికోసం" తెలుసుకోవాలంటే రేపటి బ్లాగ్ తప్పక చదవండి.