అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం | ఇందూరమణ | Anveshana part 13 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 06 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ _ సీరియల్ నవల

ధారావాహిక నవల

పదమూడవ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

నిన్నటి కథ తరువాయి

 ‘‘అలసటగా ఉందమ్మాా!’’ అంది ఆమె. పడుకుందేగానీ తల దగ్గర పెట్టుకున్న తుపాకీ మీదే చెయ్యి ఆన్చిి పడుకుంది.

‘‘మీకు ఏమన్నాా తినడానికి పళ్ళు గాని, టిఫిన్‌ గాని తెమ్మంటారా అమ్మాా!’’ ఆప్యాాయంగా ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు సోము. దీపపు వెలుగులో కూడా ఆ కుర్రాాడి కళ్లల్లో కనిపించిన ఆప్యాాయతకి కరిగిపోయింది ఆమె. చటుక్కున లేచి కూర్చుంది.

‘‘మీ ఇద్దరూ ఇక్కడికి ఎలా వచ్చాారు బాబు! మీకు బంధువులు ఎవరూ లేరా?! అమ్మాా నాన్న మీద అలిగి వచ్చెెయ్య లేదు కదా!’’ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ అడిగింది ఆమె.

‘‘మాకెవరూ లేరమ్మాా! నేనూ, రామూ అనాథాశ్రమంలో పెరిగాము. అనాథాశ్రమంలోనే అయిదో తరగతి వరకూ చదువు చెప్పాారు. ఆ తర్వాాత ఆరో తరగతి నుండి టౌన్‌ పంపించే వారు. మేము ఇద్దరం బడికి ఎగ్గొట్టి ఊరు మీద తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమానికి వస్తున్నాామని వార్డెన్‌ గారికి తెలిసి పోయింది. రెండు మూడు సార్లు వార్నింగ్‌ ఇచ్చాారు. ఆ తరువాత వారం రోజులు పచ్చి మంచి నీళ్ళు ఇవ్వకుండా గదిలో ఉంచేసేవారు. మేమిద్దరం ఇక అక్కడ ఉండలేక పారిపోయి వచ్చేేసాం. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇదిగో... ఈ దేవాలయం మెట్లమీద బ్రతుకుతున్నాాము.’’ తామిద్దరి గురించి వివరంగా చెప్పాాడు సోము.

‘‘అయ్యో! తప్పు కదా బాబూ! బుద్ధిగా చదువుకుంటే మీకీ పాట్లు తప్పేవి కదా!’’ అంటూనే గబ గబా చేతిలో ఉన్న చిన్న పర్సు లాంటి బ్యాాగ్‌ తెరిచి సెల్‌ ఫోన్‌ తీసింది ఆమె. స్విచ్‌ ఆఫ్‌ అయి ఉన్న ఫోన్‌ తీసి చూసింది.ఛార్జింగ్‌ లేక ఆగిపోయిన సెల్‌ చూసి పెదవి విరుచుకుంది. తిరిగి ఫోన్‌ లోపల పెట్టి సోము కేసి చూసింది.

‘‘మీరిద్దరూ బాగా చదువుకుంటారా?’’ అడిగింది ఆమె.

‘‘ఇప్పుడు మమ్మల్నెెవరు చదివిస్తాారమ్మాా! పారిపోయి వచ్చిన చవట దద్దమమలం. అనాథాశ్రమానికి కూడా రానివ్వరేమో కదా!’’ బాధగా అన్నాాడు సోము.

ఇంతలో వెనుక నుండి ఎవరో తలమీద బలంగా కర్రతో కొట్టేసరికి ‘అమ్మాా’ అంటూ కెవ్వున అరిచి కూర్చున్న దగ్గరే కుప్పకూలి పోయాడు సోము. ఆ హఠాత్పరిణామానికి ‘ఆమె’ ఒక్క సారే ఉలిక్కిి పడింది. ఎదురుగా పెద్ద దుడ్డుకర్ర పట్టుకుని యమకింకరుడిలా ఒకడు నిలబడి ఉన్నాాడు. వాడి వెనుకే మరో ఇద్దరు కత్తులు పట్టుుకుని కనిపించారు.

ఆమెకి ముచ్చెెమటలు పోసాయి. ఏం చేయాలో అర్థంకాక చటుక్కున లేచి నిలబడింది. చేతికందిన చుర కత్తి తీసి ఛటుక్కున బొడ్డుులో దోపుకుంది.

‘‘వెళ్లరా! దాని దగ్గర ఏముందో అంతా లాగెయ్‌. ఆ బ్యాాగ్‌ లాక్కుని పట్రాా!’’ దుడ్డుకర్ర చేత పట్టుకుని కాలయముడిలా నిలబడ్డవాడన్నాాడు.

‘‘ఎ....వ....రు.... మీ....రు?!’’ నెమ్మదిగా నోరు పెగిల్చి అడిగింది ఆమె.

‘‘ఎవరైతే నీకెందుకు?! ముందు నీ చేతిగాజులు చెవులకున్న దుద్దులు, ముక్కుపుడక, తీసి ఇచ్చెెయ్యి.’’ కర్కశంగా అరిచాడు ఒకడు. కర్కశంగా అరిచిన అతని అరుపులు విని మరిక మాట్లాాడలేదు ఆమె. అప్రయత్నంగానే చేతి గాజులు

తీసింది. వెనుక నిలబడ్డ ఇద్దరూ ముందుకొచ్చి ఆమె చేతిలో వస్తువులు లాగేసుకున్నాారు. ఒకడు బ్యాాగ్‌ కూడా లాక్కుని భుజానికి తగిలించుకున్నాాడు.

‘‘అన్నాా! దీన్ని లాక్కుపోదామన్నాా!....’’ ఆబగా ఆమె అందాల కేసి చూస్తూ అన్నాాడొకడు.

‘‘ఎక్కడికో? ఎందుకురా! ఇక్కడే పని కానిచ్చేేద్దాం!’’ అన్నాాడింకొకడు. ఆమె అవయవాలని కన్నాార్పకుండా దీపపు వెలుగులోనే కళ్ళు చిట్లించుకుని చూస్తూ నిల బడి పోయారు ముగ్గురు. వాళ్లు మీదపడితే ఎలా ఎదుర్కోోవాలో ఆలోచిస్తూనే బొడ్లో దాచుకున్న చురకత్తి మీద చెయ్యేసి సిద్ధంగా నిలబడిందామె.

ఇంతలో బయట బూట్ల శబ్దం విన్పించే సరికి దుండగులు ముగ్గురూ బిక్కచచ్చిపోయి మౌనంగా నిలబడిపోయారు.

‘‘ఎక్కడికిరా మమ్మల్ని తీసుకువచ్చాావు. ఈ బూత్‌ బంగ్లాాలో ఎవరుంటార్రాా! దొంగ వెధవ! మమ్మల్ని తప్పుదారి పట్టిస్తుున్నాావా?’’ బంగ్లాా బయట అరుస్తున్నాారెవరో.

‘‘లేదు సార్‌! మా సోముగాడు అమ్మ గార్ని ఇక్కడికే తీసుకు వచ్చి ఉంటాడు. లోపల ఉంటారు సార్‌... సార్‌... సార్‌ అదిగో! ఆ గదిలో చూడండి! కొవ్వొత్తి వెలిగిలేదూ! అక్కడే ఉంటారు.’’ అంటున్నాాడు రాము. రాము మాటలు వింటూనే ఆమె అదిరి పడింది. రాము ఎవరినో వెంటబెట్టుుకు వస్తున్నాాడు. ఎవరు వాళ్ళు? నా కోసమే వెతుక్కుంటూ వస్తున్నట్లున్నాారు. కొంపదీసి పోలీసులా? పోలీసులే అయి వుంటుంది. ఇప్పుడెలా?! పోలీసులకి దొరికితే తన అన్వేేషణ గతి....అధోగతే! ఆలోచిస్తూనే చుట్టూ పరికించింది. గదిలోపల నుండి ప్రక్క గదిలోకి... .వెనుకనున్న గదుల్లోోకి.... మరో ద్వాారం కనిపించింది. అంతలోనే పోలీసులు ముగ్గుురు లోపలికి వచ్చేేసారు. బయట మాటలు వినిపించగానే దుండగులు ముగ్గురూ అలర్ట్‌ అయ్యాారు. ఆమె సంగతిని మర్చిపోయారు. ఆమెమీదకు పులుల్లాా దూకాలనుకున్న ముగ్గురూ గదిలోకి వచ్చిన పోలీసులను చూసి అదిరిపడ్డాారు.

‘‘ఒరేయ్‌! పదండిరా! పదండి’’ అంటూ ఆమె దగ్గర దోచేసిన బంగారం, బ్యాాగ్‌తో సహా గదిలోనుండి వెనుకద్వాారం గుండా పరుగులు పెట్టాారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా వారివెనుకే పరుగందుకుంది. దుండగులు ముగ్గుురూ ఆ భవనంలోనుండి వెనుక ద్వాారాల గుండా మెట్ల మార్గంలోకి పరుగందుకున్నాారు అక్కడ నుండి తప్పించుకోవాలనే ధ్యాసలో కన్నుమిన్ను కానకుండా పరుగెడుతున్నాారు. ఆమె అక్కడ నుండి బయటపడి ఆ దుండగుల కంటపడకుండా మరో మార్గంలో పరుగులాంటి నడకతో చీకట్లోనే నక్కిినక్కిి దాక్కుంటూ ముందుకు సాగిపోయిందామె.

టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులతో వచ్చిన రాము గదిలోకి రాగానే క్రింద పడివున్న సోమూని చూసి భోరున ఏడుస్తూూ పరుగున వెళ్లి సోముని లేవనెత్తాాడు. సోము తలకి గాయమై రక్తం స్రవిస్తోంది. స్పృహతప్పి పడిఉన్న సోముని ఒడిసి పట్టుకుని ఏడుస్తూనే పోలీసుల కేసి చూసాడు రాము. దుండగులు ముగ్గురూ నిస్సహాయురాలైన ఆమె మీద పడి చెరచడానికి సిద్ధంగా ఉన్నాారని గ్రహించారు పోలీసులు. పట్టుకొనే లోపలే పారిపోవడం చూసి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు మతి పోయింది. గదిలో నుండి పరిగెత్తి పారిపోతున్న దుండగులను చూసి పోలీసులు అలర్ట్‌ అయ్యాారు. దుండగుల వెనుకే ఆమె కూడా పరిగెట్టి పారిపోవడం చూసి అవాక్కయ్యాారు.

‘‘కానిస్టేబుల్‌! నువ్విక్కడే ఉండు. మేమిద్దరం పారిపోతున్న వారిని వెంబడిస్తాంం. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యి’’ అంటూనే హెడ్‌ కానిస్టేబుల్‌ పరుగందుకున్నాాడు. అతన్ని అనుసరించి పరుగెట్టాాడు మరో కానిస్టేబుల్‌.

***********

ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. అప్పటికే ఊరూ-వాడా ప్రమాదవార్త తెలిసిపోయింది. జనాలు గుంపులు గుంపులుగా నిలబడి ఏం జరిగిందో ఒకర్నొకరు అడిగి తెలుసుకుంటూ... ఏం జరగ బోతోందోనని కళ్ళు చిట్లించుకుని.... చెవులు రిక్కించుకుని ప్రమాదాన్ని ప్రమోదం చూస్తున్నట్లుు చూస్తున్నాారు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ ని చూస్తూనే రోడ్డుు మీద అటూఇటూ తిరుగుతున్న జనాలు ప్రక్కకి తప్పుకున్నాారు. ట్రాాఫిక్‌ పోలీసులు కొండమీద నుండి దిగే వాహనాలకు అంతరాయం కలగకుండా ట్రాాఫిక్‌ క్లియర్‌ చేస్తుున్నాారు. బుల్లెెట్‌ రోడ్డుు ప్రక్కనే సైడ్‌ స్టాండ్‌ వేసి నిలబెట్టి ఆతృతగా ప్రమాదస్థలానికి వెళ్లాడు ఎస్సై. ఘాట్‌ రోడ్‌ కు రెండో ప్రక్క అది. రోడ్డు అంచున నిలబడి క్రిందకు చూసాడు. క్రింద అంతా తుప్పులు, ముళ్ల మొక్కలు చిన్న చిన్న బండలు. ఘాట్‌ రోడ్ వార కట్టిన చిన్న ప్రహారీ గోడని గుద్దుకుందేమో.... గోడ విరిగి పోయి వుంది. యువకుల్లాంంటి వాళ్ళు లోయలోకి దిగి వెళ్తున్నాారు. అప్పటికే పోలీసులు స్వాాధీనం చేసుకున్నాారు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కూడా లోయలోకి దిగాడు. దిగుతూ తూలి జారిపడబోయాడు. ఇంతలో ఎవరో చేయూతనిచ్చి ఆదుకున్నాారు. క్రింద లోయలోనుండి కొందరు పైకి ఎక్కిి వస్తుున్నాారు.

అంత లోనే చిన్నచిన్న గాయాలతో కానిస్టేబుల్‌ని ఇద్దరు పైకి ఎక్కిిస్తూ నడిపించుకు వస్తున్నాారు. కానిస్టేబుల్‌ని చూస్తూనే ఆనందంతో ఉప్పొంగి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ‘ష్‌! రక్షించావయ్యాా!’ మనసులోనే అల్లాని ప్రాార్థించుకున్నాాడు.

‘‘సార్‌! క్షమించండి సార్‌! బస్సుని...’’ గాయాలతో లోయలోనుండి పైకి చేరిన కానిస్టేబుల్‌ ఆయాస పడుతూ ఏదో చెప్ప బోయాడు.

‘‘ఓకే! ఓకే! అర్జంటుగా అంబులెన్స్‌ లోకి వెళ్ళికూర్చోో....’’ ఆ ప్రక్కనే రెడీగా ఉన్న అంబులెన్స్‌ దగ్గరకు తనే కానిస్టేబుల్‌ చెయ్యి పట్టుుకుని నడిపించుకు వెళ్ళాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. అంబులెన్స్‌లో ఉన్న ఎమర్జెెన్సీ స్టాాఫ్‌ గబాలున వచ్చి కానిస్టేబుల్‌ని అంబులెన్స్‌ లోకి తీసుకువెళ్లి ఫస్ట్‌ ఎయిడ్‌ చేసారు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు యువకులను నలుగురైదుగురు భుజాల మీద మోసుకొచ్చాారు. వాళ్ళిద్దరికీ బాగా గాయాలయ్యాాయి. రక్తంతో తడిసి ముద్దయిపోయారు. ఇద్దరికి సృహ లేదు. ప్రమాదవార్త తెలిసి కొండపై నుండి గాబరాగా దిగి వచ్చిన వరహాలశెట్టి ప్రమాదస్థలంలో నిలబడి గగ్గోలు పెడుతున్నాాడు. తన కొత్త బైక్‌కి ఏమైందోనని ఆతృతతో అందర్నీ వాకబు చేస్తున్నాాడు.

‘‘బైక్‌ కదా పోతే పోనీలేవయ్యాా. ఎవరికీ ప్రాాణనష్టం కలగ లేదు. అందుకు సంతోషించాలి. నీ బైక్‌కేముంది. ఇన్స్యూూరెన్స్‌ వాళ్ళు బాగు చేయించేస్తాారు.’’ ఎవరో అంటున్నాారు.

‘‘అయ్యో!... నా బైక్‌కి ఇన్స్యూూరెన్స్‌ గట్రాా ఏదీ లేదండీ బాబు! ఏడాదికి రెండు వేలెందుకు దండగ అని కట్టడం మానేసాను. రెండేళ్ళు కూడా కాలేదండీ బాబోయ్‌!’’ లబోదిబోమని తలబాదుకుంటున్నాాడు వరహాల శెట్టి.

అందినట్టేే అంది...

****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


అందినట్టే అంది పోలీసుల నుంచి జారిపోయిన ఆమె ఎక్కడికెళ్ళింది? కానిస్టేబుల్ ద్వాారా అక్బర్ ఖాన్ కి ఏం తెలిసింది? తెలుసుకోవాలంటే అన్వేషణ సీరియల్ నవలలో రేపటి భాగం తప్పక చదవండి.


Recent Posts
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 13 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పన్నెండవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 12 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పన్నెండవ భాగం ...
2026 వైజాగ్ సింహాచలం గిరిప్రదక్షిణ తేదీలు, సమయం,చరిత్ర, ఫలితాలు   | full details of Vizag simhachalam temple giripradakshina
2026 వైజాగ్ సింహాచలం గిరిప్రదక్షిణ తేదీలు, సమయం,చరిత్ర,...
ఆషాఢ బోనాల వెనుక 5 షాకింగ్ రహస్యాలు  |  బోనాల చరిత్ర | secrets of Ashadha bonalu, poturaju, rangam, mahankali
ఆషాఢ బోనాల వెనుక 5 షాకింగ్ రహస్యాలు...
అన్వేషణ తెలుగు నవల పదకొండవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 11 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల పదకొండవ భాగం ...