Vijaya Lakshmi
Published on Jul 07 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నిన్నటి కథ తరువాయి బాగం
కొండ మీద నుండి రెండో కానిస్టేబుల్ కూడా ప్రమాదస్థలానికి వచ్చి చేరుకున్నాాడు. కొండబస్సులో నుండి దిగి వస్తూనే ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసాడు.
‘‘సార్! వినయంగా నిలబడ్డాాడు కానిస్టేేబుల్.
‘‘నువ్వు కూడా ‘ఆమె’ని చూడ లేదా?’’ సీరియస్‌గా అడిగాడు ఎస్సై.
‘‘లేద్సాార్! కొండ బస్సు కదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యువకులిద్దరూ బస్సుులో వున్న ‘ఆమె’ని చూసామన్నాారు.’’ చెప్పాాడు.
‘‘సరే! యాత్రీకులందరితో పాటు ఆమె కూడా ఇదిగో... ఇక్కడే బస్సు దిగేసి ఉంటుంది. పద! ఎక్కడికి పారిపోలేదు. వెంటనే ఆర్టీసీ బస్సు స్టాంండ్ దగ్గరకు వెళ్దాం.’’ అంటూ బుల్లెెట్ ఎక్కిి స్టాార్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! మనం....’’ సంశయంగా అన్నాాడు కానిస్టేేబుల్ .
‘‘ఎస్! మనకి ఆమె ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఓ పని చేద్దాం.’’ అంటూనే ఏదో గుర్తొచ్చి టక్కున బుల్లెెట్ స్టాండ్ వేసాడు ఎస్సై అక్బర్ ఖాన్. జేబులోనుండి సెల్ ఫోన్ తీసి చకచకా నెంబర్లు నొక్కాాడు.
‘‘నమస్తే సార్! చెప్పండి సార్! గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ రైటర్‌ని మాట్లాాడుతున్నాాను.’’ అట్నుండి రైటర్ అంటున్నాాడు.
క్రైమ్ ఎస్సై అక్బర్ ఖాన్‌ని మాట్లాాడుతున్నాాను.’’ హుందాగా అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! నమస్తే!’’ అట్నుండి వినయంగా అన్నాాడు రైటర్.
‘‘రైటర్ గారూ! వినండి. అర్జెంటుగా అడివివరం రేంజ్‌లో గస్తీ తిరుగుతున్న మన పెట్రోలింగ్ టీమ్ ఎక్కడున్నాారో కనుక్కోండి! అర్జెంటు’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! వైర్ లెస్ సెట్ కనెక్ట్ చెయ్యమంటారా?’’ అడిగాడు రైటర్.
‘‘ఎస్! అర్జెంటుగా...కలపండి.’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
మరు క్షణంలో అట్నుండి వాయిస్ వినిపించింది.
‘‘హలో....హలో....నేను రక్షకవాహనం డ్రైవర్‌ని మాట్లాాడుతున్నాాను.’’
‘‘హలో.... హలో.... క్రైమ్ ఎస్సై అక్బర్ ఖాన్ హియర్! పెట్రోలింగ్ కారులో ఎవరూ లేరా?’’ అడిగాడు ఎస్సై.
‘‘సార్! మేము సింహాచలం కొండదిగువ బస్సుస్టాండ్‌లో ఉన్నాం. టీమ్ అంతా ఎవరో కుర్రాాడ్ని ఏటిఎమ్‌లో డబ్బులు డ్రాా చేస్తుండగా పట్టుుకున్నాారు. ఆ డబ్బు ఎవరో స్త్రీదని ఆ కుర్రాాడు టీమ్ అందర్నీ ఎక్కడికో తీసుకు వెళ్ళాడు సార్!’’ అట్నుండి రక్షక వాహనం డ్రైవర్ చెప్పింది వింటూనే ఉలిక్కిి పడ్డాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఓకే...ఓవర్...’’ అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే బుల్లెెట్ స్టాార్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఎస్సై బుల్లెెట్ స్టాార్ట్ చేయగానే వెనక ఎక్కిి కూర్చుున్నాాడు కానిస్టేబుల్. ఎస్సై అక్బర్ ఖాన్‌కి మతి పోయింది.
‘ఆమె ఎవరు? ఎందుకిలా దోబూచులాడుతోంది?! విదేశాల్లోో ఉన్న ముసలమ్మ కుమారులు చంపించారా?! ఎలా?! ఆస్తిి కోసం కన్నతల్లినే చంపేస్తారా? రోడ్డుమీదకు తగిలేసిన వాళ్ళు చంపడానికి ఎందుకు వెనుకాడతారు కనుక. మరి, ఈమె ఎవరు? ఆలోచిస్తూ కొండ దిగుతున్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్. బుల్లెెట్ దడ దడా శబ్దం చేస్తూ పరిగెడుతోంది. రోడ్డుకిరువైపులా వెలుగుతున్న వీధి లైట్ల వెలుగులో ఎదురుగా వస్తున్న కార్లు, బైకుల్ని తప్పిస్తూ నెమ్మదిగా బుల్లెెట్ డ్రైవ్ చేస్తుున్నాాడు.
కొండ దిగువ ఆఖరి మలుపు... ఎదురుగా కొండ పైకి వెళ్ళే మెట్ల దారి హైమాక్స్ లైట్ల వెలుగులో స్పష్టంగా నిపిస్తోంంది. మలుపు దగ్గరే రోడ్డుు ప్రక్కన ఉన్న ఆంజనేస్వాామి నిలువెత్తుు విగ్రహం విద్యుత్తు వెలుగుల్లో అద్భుతంగా కనిపిస్తోంది.
‘‘సార్! మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ వెనుక కూర్చున్న కానిస్టేేబుల్ ప్రశ్నకు ఉలిక్కిి పడ్డాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘అవును! ఎక్కడికెళ్తున్నాం. ఆమెని ఎక్కడని వెతుకుతాం! ఎటు వెళ్ళుంటుంది? ఆర్టీసీ బస్సుస్టాండ్ దగ్గరికి తప్ప ఎటూ వెళ్ళ లేం! ఊరు దాటి పారిపోవాలంటే బస్సు ఎక్కాాలి, అదొక్కటే మార్గం...’ మనసులోనే అనుకున్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆర్టీసీ బస్సు స్టాండ్ కి వెళ్దాం. ఆమె అటే వెళ్తుంది. ఊరు వదిలిపోవాలంటే అదే దారి!’’ అన్నాాడు ఎస్సై.
‘‘నిజమే సార్!’’ ఉత్సాాహంగా అన్నాాడు కానిస్టేబుల్. నెమ్మదిగా బుల్లెెట్ నడుపుతూ ఆలోచనలతో సతమతమవుతున్న ఎస్సై అక్బర్ ఖాన్ తొలిపావంచా ప్రక్కనే వున్న బూత్ బంగ్లాా కేసి చూసి అదిరి పడ్డాాడు. శీతాకాలం వెన్నెెల వెలుగులో బూత్ బంగ్లాాలోనుండి ఏవో ఆకారాలు ముందు పరిగెడుతూంటే వారి వెనుక మరో రెండు ఆకారాలు వెంబడించడం చూసి అదిరి పడ్డాాడు. బుల్లెట్ ని నేరుగా హైమాక్స్ లైట్లు అమర్చిన స్తంభం ప్రక్కకు తీసుకు వెళ్లి ఆపాడు. ముందు పరిగెడుతున్న ఆకారాలు ఏదో మోసుకెళ్తూ మెట్లదారిలోనుండి ఘాట్ రోడ్డుకేసి రావడం గమనించిన ఎస్సై అక్బర్ ఖాన్ ఎలర్ట్ అయ్యాాడు.
‘‘కానిస్టేబుల్! బి రెడీ! పరిగెడుతూ వస్తున్న ఆ ముగ్గుర్నీ పట్టుకోవాలి. వెనుక వస్తున్న వాళ్ళెవరో తర్వాాత ఆలోచిద్దాంం...పద!’’ అంటూనే బుల్లెెట్ స్టాండ్ వేసి భయంతో గాబరాగా తమకేసే పరిగెట్టుకొస్తున్న దుండగులను గమనిస్తూ వారికి ఎదురుగా పరిగెట్టారిద్దరూ. పాడుపడ్డ బంగ్లాలో నుండి పారిపోయి వచ్చిన దుండగులు తమవెనుక తరుముకొస్తున్న పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఘాట్ రోడ్ ప్రక్కనే ఉన్న లోయల్లోనుండి దిగువకి పారిపోవాలనే ధ్యాాసలో అటూ
ఇటూ దిక్కులు చూస్తూూ వెనుకా ముందూ చూడకుండా పరిగెడుతున్నాారు. తొలిపావంచా దగ్గర ఘాట్ రోడ్ గట్టు ఎక్కుతూ ఎదురుగా పరిగెట్టుకు వస్తున్న ఎస్సై అక్బర్ ఖాన్, కానిస్టేబుల్‌ని చూసి అదిరి పడ్డారు దుండగులు ముగ్గురూ. గబుక్కున వెనక్కిి తిరిగి పారిపోవాలనుకుని వెనకడుగు వేస్తూ వెనక్కిి తిరిగేసరికి వెనుక నుండి తరుముకొస్తుున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని చూస్తూనే చేతులో ఉన్న బ్యాాగ్ ప్రక్కన పడేస్తూ తొలిపావంచా మెట్ల కేసి పరిగెట్టబోయాడు ఒక దుండగుడు. బ్యాాగ్ ఘాట్‌రోడ్ గట్టుక్రింద పడేస్త తొలి పావంచా కేసి పరిగెడుతున్న దుండగుల్ని చూస్తూనే ఒక్క గెంతు గెంతి అతడి కాలర్ పట్టుకున్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఇంతలో వెనుక నుండి తరుముకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని మిగిలిన ఇద్దర్నీ పట్టుుకున్నాారు. దుండగులు ఘాట్ రోడ్ గట్టు క్రిందకు విసిరేసిన బ్యాాగ్ వెతికి పట్టుకొచ్చాాడు ఎస్సై అక్బర్ ఖాన్‌తో వచ్చిన కానిస్టేబుల్.
ఎస్సై అక్బర్ ఖాన్‌ని చూడగానే టాస్క్ ఫోర్స్ పోలీసు వినయంగా నమస్కరించి సెల్యూట్ చేసారు.
‘‘ఎవరో కుర్రాాడు ఏ.టి.ఎమ్‌లో డబ్బు డ్రాా చేసి పట్టుకు పోతుంటే పట్టుకున్నాారు కదా? అ కుర్రాాడేడి?! ఆ డబ్బుు ఎవరో స్త్రీ డ్రాా చేయమని చెప్పింందన్నాాడట కదా! ఆవిడ కనిపించిందా?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆ కుర్రాాడిని వెంటబెట్టుకుని ఆవిడని వెతుక్కుంటూ ఆ బూత్ బంగ్లాాకు వెళ్ళాం సార్! అప్పటికే ఈ ముగ్గురూ ఆ మహిళని రేప్ చెయ్యబోతున్నాారు. మమ్మల్ని చూసి వీళ్ళు పరిగెట్టుకుని పారితుంటే వెంబడించి వచ్చాాము.’’ చెప్పాాడు హెడ్ కానిస్టేేబుల్.
‘‘మరి ఆ కుర్రాాడు....?!’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆ కుర్రాాడితో పాటు మరో కుర్రాాడు కూడా అక్కడ ఉన్నాాడు సార్! రెండో వాడ్ని వీళ్ళు తల మీద బలంగా కొట్టినట్లున్నాారు ఆ కుర్రాాడి తలకి గాయాలైతే అంబులెన్స్‌కి కాల్ చెయ్యమని మన కానిస్టేబుల్‌ని ఒక్కడ్ని అక్కడే కాపలా పెట్టి మేము వీళ్ళని వెంబడించాం సార్!’’ చెప్పాాడు హెడ్ కానిస్టేేబుల్.
‘‘మరి, ఆ మహిళ?.... అక్కడే ఉందా?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘లేదు సార్! ఆవిడ కూడా అక్కడ నుండి తప్పించుకుంది. మేము ఇద్దరం ఈ దుండగుల మీదే దృష్టి పెట్టి వీళ్ళని వెంబడిస్తూ వచ్చేేసాం.’’ తప్పుచేసిన వాడిలా తలదించుకుని చెప్పాాడు హెడ్ కానిస్టేబుల్.
‘‘మైగాడ్! మేము వెతుకుతున్న ‘ఆమె’ ‘ఈమె’ ఒక్కరు కాదు కదా!’’ అంటూనే " పదండి! అక్కడకు వెళ్దాం.’’ అంటూ తొలిపావంచా కేసి దారితీసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఎస్సై వెనుకే దుండగుల రెక్కలు విరిచి పట్టుుకుని లాక్కెెళుతూ అనుసరించారు పోలీసులు.
*************
సరిగ్గాా అదే సమయంలో, ఆమె పరుగులాంటి నడకతో బూత్ బంగ్లాా వెనుకనుండి సంస్కృతోన్నత పాఠశాల ప్రక్క సందులోనుండి వెనుకవైపుకు చేరుకుంది. చీకట్లో దారితెన్నూ కానకుండా నడుస్తోంంది ఆమె. దుండగుల చేతుల్లోనుండి తప్పిచుకో గలిగింది గాని పోలీసుల చేతుల్లోో పడితే తప్పింంచుకోవడం చాలా కష్టం. తన బండారం బయట పడుతుంది! తన అన్వేేషణ అడుగంటిపోతుంది. తన బ్రతుకు శిథిలమైపోతుంది!! పోలీసులకు దొరక్కూడదు. తానెవరో... తానెందుకిలా పిచ్చిదానిలా తిరుగుతోందో బట్టబయలు కాకూడ దు...!’ పరిపరి విధాల ఆలోచిస్తూ పరుగులాంటి నడకతో వీధిదీపాల వెలుగుకి దొరక్కుండా క్రీీనీడలో నక్కిినక్కిి నడుస్తోంది ఆమె. దేవుడి పూలతోట దగ్గరకు వచ్చి ఆగింది. ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. దాని ప్రక్కనే ఆర్టీసీ బస్సుుస్టాండ్, ఎటు వెళ్ళాలో అర్థంకాక క్షణం ఆలోచిస్తూ నిలబడిపోయింది ఆమె. సోము చెప్పిన వారి బాల్యమే పదే పదే గుర్తుకొస్తోంది ఆమెకి. తానీ నగరం వచ్చి చేరుకున్న దగ్గరనుండి జరిగిన సంఘటనలు తిరిగిన ప్రదేశాలు ఒక్కొొక్కటిగా గుర్తు చేసుకుంటూ నిలబడింది. అక్కడే ఓ మూల చదునుగా ఉన్న చోట కూర్చుంది. తనని ఎవరూ కనిపెట్లేని నిర్ధాారించుకుంది. రోడ్డుు కేసి చూస్తూ కూర్చుంది.
విశాఖ పట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పాపాహోమ్‌కి వెళ్లింది. డాబాగార్డెన్‌లో ఎన్నోో ఏళ్ళచరిత్ర కలిగిన ప్రేమ సమాజానికి వెళ్ళింది. విశాఖపట్నంలో అధికారికంగా... అనధికారికంగా నిర్వహిస్తోన్న అనాథ శరణాలయాలన్నీ తిరిగి తిరిగి విసిగి వేసారి పోయింది. చిట్టచివరగా భీమిలిరోడ్‌లో ఉన్న ఎస్.ఓ.ఎస్. విలేజ్ కి కూడా వెళ్ళింది. ఎంతమంది పిల్లలు... ఎంత ఆహ్లాాదంగా వుంది ఆ వాతావరణం. ‘‘సేల్ అవర్ సోల్’’ బ్రిటీష్ కాలంలోనే అనాథపిల్లల కోసం ఏర్పరచిన శరణాలయం. అక్కడా నిరాశే ఎదురయ్యింది. తాను చెప్పిన ఆధారాలు... ఎక్కడా దొరకలేదు. తాను చెప్పినరోజున ఎలాంటి సంఘటనలు రికార్డు కాలేదు. అన్నిచోట్ల ఎదురైన చేదుఅనుభవం ఒక్కటే! పదేళ్లనాటి మాట. వాళ్లిప్పుడు ఇక్కడే ఎలా ఉంటారమ్మాా! పాకడం నేర్చుకోగానే పరిగెట్టి పరిగెట్టి పారిపోవడానికి సిద్ధమయ్యేే ఈ కాలం పిల్లలు... బుద్ధిగా ఉన్నవాళ్ళు ఇదిగో ఇలా చదువుకుంటూ ఓ దారి దొరికే వరకూ ఇక్కడే ఉంటారు. ఆకతాయిలు ఎందరో చెప్పాాపెట్కుండా పారి పోతుంటారు. వాళ్ల ఆచూకీ బ్రహ్మ దేవుడు కూడా పట్టలేడు. మేమేం చెయ్యగలం ఓ పోలీసురిపోర్టు ఇచ్చి ఊరుకుంటాం అంతే. అన్నిచోట్ల అదే సమాధానం. గుండె బద్దలైపోయింది. పసివాళ్లు ఎక్కడికని పారిపోతారు?...‘నా’ అన్నవాళ్ళు లేని వాళ్ళు ఎటు వెళ్లినా తిరిగి ఇక్కడికే రావాలి కదా’’ అంటే వాళ్ళేమన్నాారు? ఎంత నిర్లక్ష్యంగా చెప్పాారు?
‘‘వాళ్లకేమమ్మాా! ఊరంతా బంగారమే! అడుక్కునే వాళ్లకి అన్నిళ్ళు వారివే కదా. అందరూ బంధువులే! ఇలాంటి వాళ్ళు ఉంటే గింటే రైల్వేే స్టేషన్ లోనో, గుడిమెట్ల దగ్గరో అడుక్కుంటూనో... దారిన పోయేవారిని దోచుకుంటూనో తిరుగుతుంటారు.
అప్పుడే తన గుండె వెయ్యి ముక్కలై పోయింది. ఆశచావక అనాధలా అలమటిస్తూ తిరుగుతోంది. గుళ్ళు గోపురాలు చుట్టుు ముట్టి వస్తోంది. చివరికి సింహాచలం సింహాద్రినాధుని సన్నిధికి చేరుకుంది. సోము చెప్పిన మాటలు చెవుల్లో మారుమ్రోగుతుంటే ‘ఆమె’ మనసెందుకో రాము సోము పుట్టుపూర్వోోత్తరాలు ఆరాతియ్యమంటోంది. వారిద్దర్లో తానెదుకుతున్నవాడున్నాాడేమో. ఆలోచిస్తూనే రోడ్డుకేసి చూసింది ఆమె. రోడ్డంతా వచ్చేేపోయే వాహనాలతో రద్దీగా ఉంది. చాలామంది నడిచి వెళ్తున్నాారు. వాళ్ళలో కలిసి పోయి బస్సుస్టాండ్‌కి చేరుకుంటే మంచిదనుకుంటూ చక చకా రోడ్డుమీదకు వచ్చింది ఆమె.
బస్సుస్టాండ్ నుండి బయలుదేరే బస్సులన్నీ విశాపట్నంం నలుమూలలకు వెళ్ళే బస్సులే. ఏది ఎక్కిినా తానిక్కడ నుండి సురక్షితంగా బయట పడవచ్చు. ఆలోచిస్తూనే బస్సుస్టాండ్ చేరుకుందామె,.
*******
పాడుబడ్డ భవనం దగ్గరకు వచ్చి ఆగింది అంబులెన్స్. అదే సమయంలో పరుగుపరుగున వచ్చి చేరుకున్నాారు ఎస్సై అక్బర్ ఖాన్, ఆయన వెనుక పోలీసులు. సోము స్పృహ తప్పి పడి ఉన్నాాడు. సోమును పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాాడు రాము. అక్కడే కాపలాగ ఉన్న కానిస్టేబుల్ గదిలోకి ఆతృతగా పరిగెత్తుకు వచ్చిన ఎస్సై అక్బర్ ఖాన్‌ని చూస్తూనే అలర్ట్ అయ్యాాడు. సెల్యూట్ చేసి ఓ వారగా నిలబడ్డాాడు.
*************************************
ఆమె అన్వేేషిస్తుున్నది పిల్లలకోసమా??? ఆమె వెతుకుతున్న పిల్లలు రామూ-సోమూలేనా?? అసలు ఆ రాము సోములకు ఆమెకు ఏమిటి సంబంధం? ఈ రహస్యం బయట పడాలంటే రేపటి బ్లాగ్ తప్పక చదవండి.