అన్వేషణ తెలుగు నవల పదిహేనవ భాగం | ఇందూరమణ | Anveshana part 15 | investigative & most suspense thriller novel

Vijaya Lakshmi

Published on Jul 08 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ - సీరియల్ నవల

ధారావాహిక నవల

పదిహేనవ  భాగం

రచన : శ్రీ ఇందూరమణ

నిన్నటి కథ తరువాయి

కొవ్వొత్తి వెలుగులో గదంతా పరిశీలనగా చూసాడు ఎస్సై. రాజులకాలం నాటి భవనం కావడం వలన గదే పెద్ద హాలంత ఉంది. ఓ మూల చిరిగిన చాప పరిచి ఉంది. మరో మూల గోనె పట్టాాలు... సినిమా వాల్‌ పోస్టర్లు గదంతా పరిచి ఉన్నాాయి.

అంబులెన్స్‌ సిబ్బంది స్ట్రెచర్‌తో లోపలకు వచ్చి స్పృహతప్పి పడిఉన్న సోముని పడుకోబెట్టి తీసుకువెళ్లారు. రాము కూడా లేచి సోము వెంట వెళ్ల బోయాడు. పోలీసు రాముని అటకాయించి పట్టుకుని నిలబడ్డాారు.

‘‘ఈ కుర్రాాణ్ణి , ఆ దొంగల్ని స్టేషన్‌లో అప్పగించండి.’’ అంటూనే గదంతా కాలి బూట్‌తో చిందరవందరగా కెలుకుతూ పోస్టర్లు, గోనెపట్టాాలు ప్రక్కకు తప్పిస్తూ క్రిందంతా వెదికాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! అవన్నీ తీసి ప్రక్కన పడెయ్యనా?’’ అంటూనే ఎస్సై వెనుకే వున్న కానిస్టేబుల్‌ చక చకా గదిలో క్రింద పరిచివున్న గోనెసంచులు, సినిమా పోస్టర్లు తీసేసాడు. కానిస్టేబుల్‌ క్రింద పరిచిన సంచులు, పోస్టర్లు ఓ మూల పరిచిన చీర లాగేసి ప్రక్కకి పెడుతున్నప్పుడు వాటి క్రింద ఉన్న తుపాకీ క్రిందపడి ఠంగున శబ్దం అయింది. ఏదో వస్తువు క్రింద పడ్డ శబ్దానికి ఎస్సై, కానిస్టేబుల్‌ ఇద్దరూ ఉలిక్కిిపడ్డాారు. అప్పటికే టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దొంగలు ముగ్గుుర్నీ రాముని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. వారితో పాటే అంబులెన్స్‌ కూడా సైరన్‌ చేసుకుంటూ వెళ్లిపోయింది. శబ్దం వచ్చిన దిక్కులకేసి చూస్తూ అదిరిపడ్డాాడు ఎస్సై. మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న దీపపుకాంతిలో నల్లగా నిగనిగలాడుతూ కనిపించిన తుపాకీని చూసి ఉలిక్కిిపడ్డాాడు. అప్పటికే కానిస్టేబుల్‌ కూడా క్రింద పడ్డ తుపాకీని గమనించి పరుగున వెళ్లి తీసుకువచ్చి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చేతికిచ్చాాడు.

కానిస్టేేబుల్‌ ఇచ్చిన గన్‌ చూస్తూనే ఉలిక్కిిపడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. మోడరన్‌గా ఉందా గన్‌. ఇలాంటి పిస్టల్‌ తానెప్పుడూ చూడలేదనుకున్నాాడు మనసులోనే. ‘ఈ కుర్రాాళ్ళు... యాచకబాలలు తలదాచుకునే ఈ గదిలో ఇలాంటి మోడరన్‌ పిస్టల్‌ దొరికిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గన్‌ ఇక్కడికెలా వచ్చింది?’ ఆలోచిస్తూంటే ఊహకందని వింతలా ఉంది. అని అనుకున్నాాడు.

‘‘కానిస్టేబుల్‌! గదంతా క్షుణ్ణంగా వెతుకు. ఇంకా ఇంతకంటే విలువైన వస్తువులేమన్నాా దొరుకుతాయేమో!’’ ఆతృతగా అరిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఇద్దరూ గదంతా అంగుళం వదలకుండా జల్లెడ పట్టి మరీ వెదికారు. ఎక్కడా అనుమానించదగ్గ వస్తుువు ఏదీ దొరకలేదు. కుర్రాాళ్లు దాచుకున్న డిబ్బీలో చిల్లర కాగితాలతో పాటు రెండువేల నోట్లు రెండున్నాాయి. అవి కూడా తిరిగి డిబ్బీలో వేసి పట్టుకున్నాాడు కానిస్టేబుల్‌. అది ప్లాస్టిక్‌ డిబ్బీ తెరవడానికి వీలుగా క్రింద చిన్న కన్నం పెట్టి దానికి మూత అమర్చి ఉంది.

‘‘పద! ఇక వెళ్దాం’’ అంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ పార్క్‌ చేసి ఉన్న ఘాట్‌ రోడ్‌ కేసి నడిచాడు. మౌనంగా ఎస్సైని అనుసరించాడు కానిస్టేబుల్‌. అ పిస్టల్‌ ఇక్కడికెలా వచ్చింది? దేవుడి దర్శనానికి విదేశీయులు వస్తూంటారు. వాళ్ల దగ్గర ఈ కుర్రాాళ్ళు దొంగిలించారా?! ఆలోచిస్తూ నడుస్తున్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఉన్నట్టుండి ఉలిక్కిిపడి క్షణం మౌనంగా ఎక్కడివాడక్కడే బొమ్మలా నిలబడిపోయాడు. ఎస్సై వెనుకే మౌనంగా అనుసరిస్తుున్న కానిస్టేబుల్‌ తన పై అధికారి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఒక్క సారే బొమ్మలా నిలబడి పోయేసరికి అదిరిపడి తను కూడా ఎక్కడి వాడక్కడే గప్‌ చుప్‌ గా నిలబడి ఉండిపోయాడు. ‘కొంప దీసి ఈ పిస్టల్‌ ఈ కుర్రాాళ్ళని ఏటిఎమ్‌ నుండి డబ్బు డ్రాా చేసి తీసుకురమ్మన్న ‘ఆమె’ది కాదు కదా! ఆమెదే అయితే ?! అమ్మో! ఆమె ఏ తీవ్రవాదో ఉగ్రవాదో కాదు కదా!’ ఒక్క క్షణం భయంతో బిగుసుకుపోయి నిలబడి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో కొండపై నుండి యాత్రీకులతో దిగుతున్న కొండబస్సుు హెడ్‌ లైట్లు మొహంమీద పడేసరికి ఇహానికొచ్చి ముందుకు నడిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. మరబొమ్మలా నడుస్తుున్న ఎస్సై వెనుకే కదిలాడు కానిస్టేబుల్‌. ఘాట్‌ రోడ్‌ ప్రక్కనే ఎత్తుగా వున్న ఆంజనేయస్వాామి విగ్రహం ముందున్న హైమాక్స్‌ లైట్ల క్రింద పార్క్‌ చేసి ఉన్న బుల్లెట్‌ కేసి చూస్తూ నడుస్తుున్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*****

ఆర్టీసీ బస్సుస్టాండ్‌లో కొచ్చి నిలబడింది ఆమె. చేతిలో చిన్న బ్యాాగ్‌ ఓసారి తడిమి చూసుకుంది. రాముకి డబ్బు తెమ్మని ఏటిఎమ్‌ కార్డు ఇచ్చింది. ఇంతలో ఈ గొడవ..పెద్ద బ్యాాగ్‌ దొంగలెత్తుకు పోయారు. అందులో అంత విలువైన వస్తువు లేవీ లేవు బట్టలు తప్ప. తనకి అవసరమైనవన్నీ ఈ చిన్న బ్యాాగ్‌ లోనే సర్దుకుంది. అదృష్టంం కొద్దీ ఇది తన దగ్గరే ఉంది.’ఆలోచిస్తూ నిలబడిందే గాని రోడ్‌ వైపు దృష్టి పెట్టింంది. ‘ఏ క్షణాన్నైనా పోలీసులు తనని వెదుక్కుంంటూ రావచ్చు. ఏటిఎమ్‌ దగ్గర డబ్బు డ్రాా చేసిన రాముని పోలీసు పట్టుకుని తనకోసం వెదుక్కుంటూ తామున్న చోటికే వచ్చేేసారు. పోలీసులు ఆ సమయానికి రాకపోయి వుంటే... ఆ ముగ్గురు దుండగులు తనని నాశనం చేసి ఉండేవారు. పాపం! సోము! తనకి రక్షణగా నిలబడ్డాడని తల పగలగొట్టేసారా వెధవలు. ఇప్పుుడు సోము ఎలా ఉన్నాాడో!’ మనసులోనే బాధపడింది ఆమె. సోము చెప్పిన వారి అనాథగాథ ఆమెని బాగా కలిచివేసింది. రామూ సోమూ పట్ల ఆమెకి అమితమైన అభిమానం ఏర్పడింది. తనూ ఇప్పుడు ఓ అనాథేగా! నా అన్న వాళ్లకి దూరమై పిచ్చిదానిలా తిరుగుతోంది. రామూ సోమూ ఒకే ఈడు వాళ్ళు. ఒక్క దగ్గరే పెరిగిన వాళ్లు. అనాథలు. అక్కున చేర్చుకునే వాళ్లు లేక వీధిన పడ్డారు. పాపం పసిపిల్లలు.

ఇంతలో సైరన్‌ చేసుకుంటూ అంబులెన్స్‌ రావడం గమనించింది ఆమె. ఉత్సుకతగా రోడ్డుకేసి తదేకదీక్షతో చూస్తూ నిలబడింది. సిటీబస్సుులు ఒకదాని తర్వాాత ఒకటి వస్తుున్నాాయి. వెళ్తున్నాాయి. బస్టాండ్‌ అంతా

యాత్రిికులతో రద్దీగా ఉంది. ఆ అంబులెన్స్‌ వెనుకే టాస్క్‌ఫోర్స్‌ పోలీసు జీపు.. .దానిలో వెనుక సీట్లోో రాముతో పాటు ముగ్గుురు దొంగలు, వారి ప్రక్కనే పోలీసు కూర్చుని ఉండడం గమనించింది ఆమె.

‘అయ్యో! రాముని పోలీసులు లాక్కుపోతున్నాారే! ఆ దొంగవెధవలు కూడా దొరికిపోయారు. ఆ దొంగలు ఎత్తుకుపోయిన తన బ్యాాగ్‌....పోలీసుల దగ్గరుందా?! అయినా, అందులో ఏముంది? చీరలేగా? రాము దగ్గరున్న ఏటిఎమ్‌ కార్డు.... దాని ద్వాారా తన ఉనికి తెలిసిపోతుంది. పూర్తి బయోడేటా పోలీసుకి చిక్కిిపోతుందే! ఎలా?! ఏటిఎమ్‌ కార్డు పోయినా ఫర్లేేదు. అందులో డబ్బు పోయినా ఫర్లేదు. కానీ, దాని ద్వాారా... తనెవరో తెలిసి పోతుంది! తెలిస్తే....?!...తెలిస్తే....?! అమ్మో! తన ఆచూకీ తెలిస్తే ఇంకేమన్నాా ఉందా?! తన ఆశ...అన్వేేషణ మరుగున పడిపోవూ?!’ ఆలోచిస్తూూనే బస్సుు స్టాండ్‌లో నుండి రోడ్డుమీదకు వచ్చింది. అప్పటికే అంబులెన్స్‌, దాని వెనుక పోలీస్‌ జీపు గోపాలపట్నం కేసి వెళ్లిపోయాయి. రోడ్డుమీద కొచ్చేేసరికి ఆటోలు వరదలా ఒకటి తర్వాాత ఒకటి ఖాళీగా వస్తూ బస్సు ఎక్కడానికి బస్సుస్టాండ్‌లోకెళ్తున్న యాత్రీకుల్నిి అడ్డగించి మరీ గోపాల పట్నం... ఎన్‌.ఎ.డి. అంటూ అరుస్తూ బస్సు ఛార్జీకే రండి రండంటూ వారిని ఆటో ఎక్కించుకుని తీసుకుపోతున్నాారు ఆటోవాళ్ళు. గుంపులు గుంపులుగా కొండమీద నుండి వచ్చిన యాత్రీకుల దగ్గర దగ్గర ప్రాంతాల వాళ్ళంతా ఆటోల్లోోనే ఎక్కిి వెళ్లిపోతున్నాారు. దూర ప్రాంతాల యాత్రికులు మాత్రం బస్సు కోసం బస్టాండ్‌ లోపలకు పరుగులు

తీస్తుున్నాారు.

ఖాళీగా ఉన్న ఆటో ఎక్కిి కూర్చుంంది ఆమె ‘‘బాబూ! పోనియ్యవయ్యాా!’’ అంది ధీమాగా ఆమె.

‘‘మీరొక్కరే అయితే వంద అవుద్దిి! ఎన్‌.ఏ.డి. వరకే వెళ్తాను.’’ చెప్పాాడు ఆటో అబ్బాాయి.

‘ ‘వెళ్ళు! వందేగా! ఇస్తాాలే!’’ అంటూనే ఎదర వెళ్తున్న అంబులెన్స్‌ కేసి చూసింది ఆమె. కనుచూపుమేరలో వెళ్తున్న అంబులెన్స్‌ సైరన్‌ ఇంకా విన్పిస్తూనే ఉంది.

‘‘పాపం! ఎవరికేమైందో?!’ అంబులెన్స్‌ సైరన్‌ వింటూ ఏమీ తెలీనిదానికి మల్లే అంది ఆమె.

‘‘ఏముందమ్మాా! ఎవడికో మూడుంటుంది. అదృష్టంం కొద్దీ అంబులెన్స్‌ సకాలంలో వచ్చుంటుంది. ఇంకా వాడెవడికో భూమ్మీీద నూకలు ఉన్నాాయనుకుంటా’’ వేదాంత ధోరణిలో అన్నాాడు ఆటోవాలా. ‘‘ఇక్కడెక్కడా దగ్గర్లో హాస్పిటల్స్‌ లేవా?’’ ఆ అంబులెన్స్‌ ఎటు వెళ్తుందో తెలుసుకోవాలనే ఆతృతతో అంది ఆమె.

‘‘డబ్బున్న వాళ్ళైతే బోల్డన్ని ప్రైవేటు అసుపత్రులున్నాాయమ్మాా! అనాథనుకోండి. ఒక్కటేగా ఆసుపత్రి. తిన్నగా తీసుకెళ్లి కె.జి.హెచ్‌లో పడేస్తాారు.’’ అంటూనే ఆటో స్టాార్ట్‌ చేసాడు ఆటోవాలా.

కెజిహెచ్‌!

‘ఎస్‌! బ్రిటిష్‌ కాలం నుండి వైద్య సేవలందిస్తున్న పెద్ద హాస్పిటల్‌. ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా చుట్టుప్రక్కల ఉన్న ఆరేడు జిల్లాాల ప్రజలకే కాదు. ఒరిస్సాా... జార్ఖండ్‌ రాష్ట్రాల నుండి కూడా రోగులు ఇక్కడికే వస్తాారని చెప్తుంటారు. చదువుకున్న రోజుల్లో తోటి విద్యాార్ధుులతో ఒకసారి విశాఖపట్నంం వచ్చింది. ఈ ప్రాంతమంతా తిరిగి చూసింది. ఆటోలో ఆలోచిస్తూ కూర్చుంది. ఆటో శరవేగంగా దూసుకుపోతోంది. మూడు చక్రాాల బండైనా ఆరు చక్రాాల బస్సులాగా బరితెగించి పరిగెడుతోంది.

‘‘బాబూ! జాగ్రత్తమ్మాా! తొందరలేదు.’’ అంబులెన్స్‌ ఎటు వెళ్తుందో తెలిసాక హాయిగా సీటుకు జేరగిలబడి అంది ఆమె.

‘‘రాత్రి పదిలోగా రెండు మూడు సర్వీసులన్నాా చెయ్యాాలి కదమ్మాా! మిమ్మల్ని ఎన్‌.ఏ.డిలో దించేసి తిరిగి ఇక్కడికి బేరం చూసుకుని వెంటనే వచ్చెెయ్యాాలి. నాలుగురాళ్ళు సంపాదించాలంటే తప్పదు కదమ్మాా!’’ స్పీడు తగ్గింంచక పోగా ముందు కెళ్తున్న బైక్‌ల్న, ఆటోల్నిి ఓవర్‌ టేక్‌ చేస్తూ సర్రున దూసుకుపోతూనే అ న్నాాడు ఆటో వాలా.

‘ఇక వాడితో వాదన చెయ్యకూడదనుకుంది. మాటల్లో పడి ఏకాగ్రత కోల్పోోయాడంటే అప్పుడు నష్టపోయేది వాడే కాదు. ఆటోలో ఉన్న నేనూ....రోడ్డుు మీద అన్నెం పున్నెం ఎరుగని జనం... ఎందుకొచ్చిన వాగుడు... ఊరుకుంటేనే నయం’ అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఆమె.

చేతిలో ఉన్న చిన్న బ్యాాగ్‌లో ఎంతుందో లెక్క చూసుకుంది. నాలుగైదువందల కన్నాా ఎక్కువ లేవు. పెద్నోట్లన్నీీ దేవుడి హుండీలో వేసేసింది.

************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

ఆమెకు రక్షణగా ఉన్న ఒకే ఒక్క ఆయుధం......ఆమె పిస్టల్....పోలీసులకు చిక్కింది. తరవాతేం జరగబోతోంది? తెలుసుకోవాలంటే అన్వేషణ నవలలోని తరువాతి భాగం రేపటి బ్లాగ్ లో తప్పక చదవాల్సిందే.


Recent Posts
అన్వేషణ తెలుగు నవల పదిహేనవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 15 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పదిహేనవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 16వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 16 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 16వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పద్నాలుగవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 14 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పద్నాలుగవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 13 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పదమూడవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల పన్నెండవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 12 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల పన్నెండవ భాగం ...