అన్వేషణ తెలుగు నవల రెండవ భాగం | ఇందూరమణ | Anveshana part 2 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 23 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ

ధారావాహిక నవల

రెండవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


ఆమె పిచ్చి చేష్టలు ఓరకంట కనిపెడుతున్న వర్తకులు ఒక్కసారే ఆశ్చర్యంగా చూసారు. గంగధారలో స్నాానాలు చేసి వచ్చిన భక్తులు దర్శనానికి వెళ్తూ ఒక్క సారే ఫక్కున నవ్విన నవ్వుకి ఉలిక్కిి పడి తలలు త్రిిప్పి ఆమెకేసి చూసారు.

సరిగ్గాా అదే సమయానికి కేశఖండనశాలలో నుండి వస్తున్న ఒక ఆజానుబాహుడైన వ్యక్తి టక్కున ఆగి పిచ్చిగా నవ్వుతున్న ఆమెకేసి పరీక్షగా చూసాడు. నవ్వుతూ... నవ్వుతూ ఉన్నట్టుండి తలబాదుకొని ఏడుస్తుున్న ఆమెని చూసి అదిరిపడ్డాాడు.

ఉదయం నుండి ఆమె కోసమే వెదుకుతున్న అతను గబుక్కున జేబులో నుండి పర్సు తీసి అందులో ఉన్న ఫోటో తీసి ఎవరూ చూడకుండా అరచేతిలో దాచుకుని మరోసారి ఆమెని ఆ ఫొటోని పదే పదే పరిశీలనగా చూసుకున్నాాడు. ఉన్నట్టుండి ఏడుపు ఆపేసి పక పకా నవ్వుతూ... నవ్వుతూ ఒక్కసారే అందరూ తననే గమనిస్తున్నాారని అనుకుందో... ఏమో.... టక్కున నవ్వు ఆపేసి భుజాన ఉన్న బ్యాాగ్‌ రెండో భుజానికి మార్చుకుని అక్కడనుండి చకచకా దేవాలయం కేసి నడక సాగించింది.

ఆమె అలా కదలగానే అతను గాభరాగా మెట్లు దిగి ఆమె వెళ్లిపోతున్న దిక్కు చూసాడు. భక్తుల సందోహంలో ఆమె కలిసిపోయి ముందుకు సాగిపోతుంటే ఆమెనే గమనిస్తూ అతను భక్తుులను తోసుకుంటూ గబగబా అనుసరించాడు. కనుచూపు మేరలో ఆమెనే అనుసరిస్తూ అడ్డొస్తున్న భక్తుుల్ని నెట్టుుకుంటూ నడుస్తుున్నాాడు.


ఆమె దేవాలయం ముందరున్న గాలిగోపురం దగ్గరకు వెళ్ళి నిలబడి రెంండు చేతులు జోడించి లోన గర్భాాలయంలో కొలువై ఉన్న సింహాద్రినాధునికి నమస్కాారం చేసింది. దూరంగా నిలబడి ఆమె ప్రతి కదలికను గమనిస్తూ  జేబులో నుండి సెల్‌ ఫోన్‌ తీసాడు అతను. చకచకా ఫోన్‌లో నెంబర్లు నొక్కాాడు. సెల్‌ ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకున్నాాడు. ఎలాంటి శబ్దమూ లేదు. సెల్‌ ఫోన్‌కి సిగ్నల్స్‌ అందటం లేదు. విసుగ్గాా పదే పదే సెల్‌ చెవి దగ్గర పెట్టుకుని మనసులోనే తిట్టుకున్నాాడు అతను.

‘‘సార్‌! గుడి దగ్గరలో సెల్‌ఫోన్‌లు పనిచెయ్యవు. కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు వెళ్తే గాని సిగ్నల్స్‌ రావు. ఇక్కడ ‘జామర్‌’ ఏర్పాాటు చేసారు.’’ అతని అవస్థ చూసి దారినపోతున్న దేవస్థాానం ఉద్యోోగి అతని భుజం తట్టి మరీ చెప్పాాడు.

‘‘ఓహో! అలాగా సార్‌!’’ అంటూనే అతను సెల్‌ జేబులో పెట్టుకుని తనింతవరకూ అనుసరించి వచ్చిన ఆమె కోసం కళ్లతోనే వెదుకుతూ గాలి గోపురం కేసి చూసాడు. అప్పటి వరకూ గాలిగోపురం దగ్గర నిలబడి గర్భాాలయంలో ఉన్న సింహాద్రి నాధుడికి నమస్కరించుకున్న ఆమె అక్కడ కనిపించక పోయేసరికి అతను అదిరిపడ్డాాడు. గబ గబా జనాల్ని చీల్చుకుంటూ గాలి గోపురం దగ్గరకు చేరుకున్నాాడు. గుడిలో దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు నేరుగా క్రిందకు దిగి కొండబస్సు స్టాండ్‌కు చేరుకుంటున్నాారు. గాలి గోపురం ముందరే నిలబడి ఆమె కోసం, గుంపులు గుంపులుగా నడిచి వెళ్లిపోతున్న భక్తుల కేసి చూసాడు అతను.

ఆమె జనాల్లో కలిసిపోయింది. కనుచూపు మేర ఎక్కడా ఆమె జాడ లేదు. గుంపులు గుంపులుగా భక్తుులే తరలి వెళ్ళిపోతున్నాారు.

ఒక్కసారే ఆందోళనగా ఆమెని వెతుక్కుంటూ గాబరాగా భక్తులను తోసుకుంటూ దేవాలయం దగ్గర నుండి కొండ బస్సు స్టాండ్‌కు చేరుకున్నాాడు. ఆమె కోసమే తానిన్నాాళ్ళూ వెదుకుతూ తిరుగుతున్నాాడు. కనిపించినంతలోనే కనుమరుగయ్యింంది. ఇంతలో వింతగా ఎలా మాయమైపోయిందో? అనుకుంటూ ఆతృతగా వెతుకుతూ తిరుగుతున్నాాడు.

బస్సు స్టాండ్‌కు చేరువలోనే దేవాలయం అన్నదాన సత్రంం ఉంది. దేవుడి దర్శనాలు చేసుకున్న భక్తులు అన్నదానంలో భోజనానికి క్యూలో నిలబడుతున్నాారు.

కొండ బస్సు స్టాండ్‌ లో నిలబడి చుట్టూ పరికించి చూసాడు అతను. భక్తుల సందోహంలో ‘ఆమె’ ఎటు వెళ్లిందో కనుక్కోోలేక పోతున్నాాడు. ఆతృతగా అన్నదానం క్యూ లైన్ల లో వెదికాడు.భక్తుులు కొందరు కొండమెట్లంబట నడుచుకుంటూ క్రిందకు దిగి వెళ్లిపోతున్నాారు. మరికొందరు బస్సు స్టాండ్‌లో బస్సు ఎక్కడానికి నిరీక్షిస్తున్నాారు. కొందరు అన్నదాన సత్రం దగ్గర క్యూలో ఉన్నాారు. ఎక్కువమంది కొండ బస్సుస్టాండ్‌లో ఉన్న ఫేన్సీ దుకాణాల్లోో... ఫొటో దుకాణాల్లో... శనగలు, ఖర్జూరాలు అమ్మే దుకాణాల్లో పోగయి ఉన్నాారు.

‘ఆమె కోసం ఎక్కడని వెతకను? చిక్కిినట్టే చిక్కిి చేజారిన ఆమెని కనిపెట్టి మట్టుపెట్టడమే తన విధి. ఎలా? ఎటు వెళ్లింది?!’ మనసులోనే తర్జనభర్జన పడ్డాడు అతను. ఇంతలో అతని జేబులో సెల్‌ రింగయింది.సెల్‌ రింగ్‌ వినగానే ఉలిక్కిి పడ్డాాడు. భయం భయంగానే సెల్‌ తీసాడు. తనే ముందు ఫోన్‌ చేసి ఉండాల్సింది... అనుకుంటూనే ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకున్నాాడు.

‘‘హలో’’ లోగొంతులో అన్నాాడు.

‘‘కనిపించిందా?’’ అట్నుండి కటువుగా విన్పించింది.

‘‘కనిపించింది... కనిపించి...’’ నసుగుతూ అన్నాాడు. అంటూనే చుట్టూ పరికించాడు. ఆమె జాడ కానరాలేదు. తన జాడ కూడా ఎవరూ పసిగట్టకూడదనుకుంటూ భక్తులు పలుచగా ఉన్న ప్రాంతం కేసి నడుచుకుంటూ వెళ్ళి నిలబడ్డాాడు.

‘‘కనిపించి... ఏమైంది?’’ మరింత కటువుగా వినిపించింది అవతలనుండి.

‘‘ఇక్కడే... ఎక్కడో.... జనాల్లోో కలిసి పోయింది బాస్‌. కనిపెడతాను... కనిపెట్టి పట్టుకుంటాను.’’ స్థిరంగా అన్నాాడతను

‘‘పట్టుకోవడం కాదు. మట్టుబెట్టాాలి. ఈ రాత్రికే పని ముగించాలి. సమ్‌జే.’’ అట్నుండి అంతే స్థిరంగా ఆర్డర్‌ విన్పింంచింది అతనికి.

‘‘ఎస్‌ బాస్‌.’’ అన్నాాడు. అంతే! ఫోన్‌ కట్టయింది. సెల్‌ జేబులో పెట్టుకుంటూ కోపంతో ఒక్కసారే క్రూరంగా మారి పోయాడు అతను.

‘‘ఈ రాత్రిికి ఎలాగైనా ‘ఆమె’ని హతమార్చాాలి. ఎలాగైనా పని ముగించాలి.’’ కసిగా పళ్ళు పటపటా కొరుక్కుంటూ కోపంతో ఆమె ఆచూకీ కోసం ఆవేశంగా పిచ్చివాడిలా అటూ ఇటూ పరుగులెడుతూ తిరిగాడు. మనసులో తనని తానే తిట్టుుకుంటూ అన్నదానం భవనం కేసి చూస్తూూ అయోమయంగా నిస్సత్తువతో నిలబడిపోయాడు అతను.

****************************

సాయంత్రం అవుతోంది. శీతాకాలం వలన ఆరోగంటకే చీకటి చిక్కబడుతోంది. ఉదయం నుండి ఆలయ పరిసరాల్లోో తిరిగితిరిగి అలసిపోయిన ఆమె, అలసటగా మెట్లదారిలో అన్నదాన భవనం ప్రక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా మీద చతికిలబడింది.  

భక్తులు దర్శనాలు ముగించుకుని పెక్కుమంది బస్సుల్లోనూ, కొద్దిమంది కాలినడకన తండోపతండాలుగా కొండదిగి వెళ్లిపోతున్నాారు. చెట్టు క్రింద కూర్చుందే గాని చలికి తట్టుకోలేకపోతోంది ఆమె. భుజాన ఉన్న బ్యాాగ్‌ తీసి, తన ప్రక్కనే

పెట్టుకుని బ్యాాగ్‌కు ఉన్న నెంబర్‌ తాళం తెరవడానికి క్షణం ఆలోచిస్తూ నెంబర్లు తిప్పింది. మూడు నెంబర్లున్న తాళం కోడ్‌ గుర్తుచేసుకుంటూ బ్యాాగ్‌ తాళం తెరిచి అందులో ఉన్న శాలువా బయటకు తీసింది. యథాలాపంగా నెంబర్లు అన్నీ చకచకా మార్చేేసి బ్యాాగ్‌ తాళం వేసింది ఆమె. భుజాల మీదుగా శాలువా కప్పుకుని చెట్టుకు చేరగిలబడి కూర్చుంది. చలికి ఒణికిపోతూ కూర్చున్న ఆమె కొద్దిదూరంలో ఒక ముసలమ్మ కాళ్ళు ముడుచుకుని గజగజా వణికి పోతూ బొంగరంలా పడుకున్న తీరు చూసింది. చివుక్కుు మంది ఆమె మనసు. గబాలున లేచి ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్లింంది. తను కప్పుకున్న శాలువ తీసి ఆ ముసలమ్మ మీద కప్పింది. వెనుదిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. కడుపులో ఆకలి దంచేస్తోంది. బ్యాాగ్‌ భుజాన తగిలించుకుని చలికి వణుకుతునే మెట్లెక్కిి కొండ బస్సు స్టాంండ్‌ దగ్గరకు వెళ్ళింది.

అక్కడ వరుసగా ఉన్న దుకాణాలన్నీ వెతుక్కుంటూ ఓ కిరాణాకొట్టు దగ్గర ఆగి రొట్టె, జామ్‌ కొనుక్కుంది. బ్యాాగ్‌ సైడ్‌ జిప్‌లో ఉన్న చిన్న బ్యాాగ్‌ తీసి రెండువేల రూపాయల నోటు ఇచ్చింది. దుకాణం యజమాని ఆమె దిక్కు ఎగాదిగా చూసి... నోటు కేసి పది మార్లు చూసుకుని చిల్లర లేదని తిరిగి ఇచ్చేేసాడు. ఇంతలో ప్రక్క షాపులో కూర్చున్న ఇద్దరు యువకులు ఆమెని చూస్తూనే కిరాణా దుకాణం దగ్గరకు వచ్చాారు.‘‘నేను చిల్లర ఇస్తానివ్వండి.’’ అంటూ ఆమె చేతిలో నోటు తీసుకుని చిన్నగా ఫోజు కొడుతూ ఆమెకేసి ఓరగా చూసాడు ఒక యువకుడు. ఆమె ఆ యువకుడి కేసి తలెత్తి కూడా చూడలేదు. రొట్టె, జామ్‌ ప్యాాకెట్టు పట్టుుకుని నిలబడింది.

‘‘మరో రొట్టె, జామ్‌ ప్యాాకెట్టు ఇవ్వండి.’’ అని కిరాణా షాపు యజమానిని అడిగింది ఆమె.

ఆమె కంఠస్వరం వింటూంటే వీణ మీటినట్లుంది. రెండువేల రూపాయల నోటుకు ఇరవై వందనోట్లు ఇస్తూ ఆమె చేతిని కావాలనే తాకాడు ఆ యువకుడు. ఆమె చివ్వున తల ఎత్తి చురుగ్గాా ఆ యువకుడి కేసి చూసింది. ఆమె అలా చూసేసరికి క్షణం తడబడ్డాాడా యువకుడు. కానీ, ఆమె ముగ్ధమోహన రూపాన్ని చూసి చలించిపోయారు యువకులు ఇద్దరూ.

ఆమె రొట్టెలు రెండు, జామ్‌ ప్యాాకెట్లు రెండు పట్టుకుని తిరిగి మర్రిచెట్టుు దగ్గరకు వెళ్లిపోయింది. యువకులు ఇద్దరూ ఆమె వెంటే వెళ్లారు. ఆమె మర్రిచెట్టుు దగ్గరకు వెళ్లడం గమనించి వెనుదిరిగారు.

ఒక రొట్టెను మధ్యలో విరిచి జామ్‌ రాసి కొద్దిి దూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్లింంది ఆమె. తాను కప్పిన శాలువా తీసి ఆ ముసలమ్మను తట్టిి లేపింది.

‘‘అమ్మాా! ఈ రొట్టె తినమ్మాా.’’ అంటూ చేతిలో వున్న రొట్టె ఆ ముసలమ్మకి ఇచ్చింది ఆమె.

‘‘ఎందుకు తల్లీ నీకీ శ్రమ.’’ అంటూనే ముసలమ్మ ఆమె చేతిలో రొట్టె తీసుకుని ఆమెకేసి చూసింది.

‘‘ఇంకా కావాలా అమ్మాా?’’ అడిగింది ఆమె. ముసలమ్మ ఆమె కేసి ఆసక్తిగా చూస్తుండి పోయింది.

‘‘అమ్మాా! నువ్వేేనా అమ్మాా! నువ్వేే నా తల్లి’’ ఆనందంగా అంది ముసలమ్మ. ముసలమ్మ ఏమంటోందో ఆమెకి అర్ధం కాలేదు.


******************

(సశేషం)

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...