అన్వేషణ తెలుగు నవల మూడవ భాగం | ఇందూరమణ | Anveshana part 3 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 24 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

మూడవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


‘‘ఆ గట్టు మీద పడుకో అమ్మాా! ఇక్కడ కింద పడుకుంటే విషపురుగులు కరుస్తాాయి కదా’’ అంటూనే ముసలమ్మ అన్న మాటలు వినీవినట్టు రెండుచేతులతో ముసలమ్మని లేవనెత్తి మర్రిచెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టాా మీద పడుకో బెట్టింది ఆమె.

‘‘అమ్మాా బుజ్జీ. నువ్వేేనా తల్లీ! నీతో యాత్రకు ఎవరూ రాలేదా తల్లీ! అమ్మాా బుజ్జి! అమ్మాా బుజ్జి!!’’ అంటూ కలవరిస్తున్నట్టే మర్రిచెట్టు చప్టామీద పడుకుంటూ అడిగింది ముసలమ్మ. సమాధానం చెప్పడం ఇష్టంలేక మౌనంగా తల వూపింది ఆమె. ముసలమ్మ మతిలేని మాటలు వింటూ మనసులోనే నవ్వుకుంది. ముసలమ్మ పడుకోగానే శాలువా ముసుగారా కప్పి అక్కడ నుండి మరో చోట దూరంగా ఉన్న సిమ్మెంటు చప్టా దగ్గరకు వెళ్ళి కూర్చుంది ఆమె. ముసలమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాాలనిపించలేదు. వినీవిననట్టు తల వూపి వచ్చేేసింది. ఆ ప్రాంతమంతా చీకటి చిక్కగా అలుముకుని ఉంది. చెట్టు మీద గబ్బిలాల రెక్కల చప్పుడు ఉండుండీ కర్ణకఠోరంగా విన్పిస్తోంది.

కొండ బస్సుస్టాండ్‌లో తాటి చెట్టులా నిటారుగా నిలబడ్డ హైమాక్స్‌ లైట్ల కాంతి గుబురుగా పెరిగిన చెట్టు కొమ్మల సందుల్లోో నుండి చొచ్చుకుపోతూ ఉండుండీ గాలికి వూగుతున్న ఆకుల రెపరెపకి అటూఇటూ వూగుతూ క్రింద పడుతోంది వెలుగు. గట్టు మీద అలసటగా మేను వాల్చింది. తలక్రింద బ్యాాగ్‌ పెట్టుకుంది. మనసంతా ఆందోళనగా ఉంది. గుండెల్లోో నుండి దు:ఖం పెల్లుబుకుతోంది. ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తుున్నాాయి. చీరచెంగుతో కళ్ళొత్తుుకుంది. పిచ్చిదాన్లాా పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచనలు మనసంతా కారుమబ్బుల్లాా కమ్మేస్తుంటే ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది. కళ్ళు వర్షించి వర్షించి రెప్పలమాటున వాలిపోయాయి. మగత కమ్మేసి నిద్రలోకి జారుకుంది ఆమె.

ఎవరో ఇద్దరు అగంతకులు మీద పడబోతున్నాారని గ్రహించి ఉలిక్కిిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆంబోతుల్లాా ఆగంతకులు ఇద్దరూ ఒకడు కాళ్ల దగ్గర, మరొకడు తలదగ్గర నిలబడి ఆమెమీద ఒరిగి ఒడిసి పట్టుుకోవడానికి సిద్ధంగా ఉన్నాారు.

వాళ్లిద్దర్నీ అలా చూసేసరికి గబుక్కున లేచి కూర్చుంది. ఒకడ్ని కాళ్లతో తన్నేేస్తూ, మరొకడ్ని చేతుల్తో నెట్టేసి ఆడపులిలా లేచి నిబడింది. చెదిరిన చీర సరిచేసుకుని పయిటచెంగు నడుం చుట్టూ త్రిిప్పి బొడ్లో దోపుకుంది ఆమె. ఇద్దరు ఆగంతకులు చెరోవైపు నిలబడి ‘ఆమె’ మీద లంఘించడానికి సిద్ధమయ్యాారు. ఆ ప్రాంతమంతా చీకటి గుబురుగా అలుముకుని ఉంది. అంత చీకట్లోనూ వాళ్ళ ఆకారాలని నిశితంగా పరీక్షిస్తూనే మీద పడ్డానికి సిద్ధంగా ఉన్న ఇద్దర్నీ ఎలా ఎదుర్కోోవాలో ఆలోచిస్తూ నిలబడింది ఆమె.

ఉన్నట్టుండి ఒకడు ఆమె మీదకు దూకి ఒడుపుగా నడుముకు చుట్టుుకున్న పైటచెంగు అంది పుచ్చుకున్నాాడు. బలంగా లాగుతూ ఆమెని వివస్త్రని చెయ్యాాలని విశ్వప్రయత్నంం చేస్తుున్నాాడు. జారిపోతున్న చీర చెంగు గట్టిగా పట్టుుకుని వాడితో పెనుగులాడుతోంది ఆమె. ఇంతలో రెండో వాడు కూడా మొదటి వాడికి సహకరిస్తూ పైటచెంగు పట్టుకుని ఇద్దరూ బలంగా గుంజారు. రాక్షసుల్లాా ఇద్దరూ ఒక్కటై చీరచెంగు పట్టుకుని గుంజుతుంటే ఆమెలో సత్తువ సన్నగిల్లిపోతోంది. ఏం

చెయ్యాాలో తోచటం లేదు. ఒక కాలు వెనక్కిి వేసి మరో కాలు ముందున్న చిన్న బండకి ఆన్చి చీర జారిపోకుండా పైటని తన వైపుకు లాక్కుంటోంది. ఆగంతకులిద్దరూ ఆమెని ఎలాగైనా వివస్త్రని చేసి తమ వశం చేసుకోవాలని కామోద్రేేకంతో వూగిపోతూ పైట లాగుతున్నాారు. ఎవరినన్నాా సహాయం కోసం గొంతెత్తి అరవాలనుకుంది. కానీ, అంత అర్ధరాత్రి ఎంత అరచినా తన రోదన అరణ్యరోదనే అవుతుందనుకుంది. ఎవరి సహాయమో అర్ధించే నిస్సహాయురాలు కాదు. ధైర్యాాన్ని కోల్పోోయే అబల కూడా కాదు. ఇక ఉపేక్షించకూడదనుకుంది ఆమె. ఒక చేత్తో పైట చెంగు పట్టుకుని రెండో చేత్తో రహస్యంంగా బొడ్లో దోపుకున్న చురకత్తి తీసి సర్రున చీర చెంగును కోసేసింది.

చీకట్లో ఆమె ఏం చేస్తోందో గ్రహించేలోపే ఇద్దరూ సగం చిరిగిన చీరచెంగుని బలంగా లాగుతూ చిరిగిన సగం చీరని పూర్తిగా చించేస్తూ వెనక్కిి తూలి క్రింద పడ్డాారు. ఎగుడూ-దిగుడూగా ఉన్న ప్రాంతం అంతా రాళ్ళు పైకి తేలిపోయి ఉన్నాాయి. క్రింద సూదుల్లాా ఉన్న రాళ్లమీద పడ్డంతోనే ఇద్దరూ ‘అమ్మాా’ అని బాధతో మూలుగుతూ ఒకరి మీద ఒకరు పడ్డాారు. రాళ్లమధ్య నుండి లేవబోతున్న ఇద్దరు ఆగంతకుల మీదకు చిరుతపులిలా దూకింది ఆమె చేతిలో ఉన్న చుర కత్తితో ఇద్దర్నీ ఎడాపెడా కొడుతున్నట్టే చుర కత్తితో వారి శరీరాలని అందిన దగ్గరల్లాా గాయపరిచింది. చురకత్తి మొన సర్రున దిగుతుంటే ఇద్దరూ అమ్మో..నాయనో... అని గగ్గోోలు పెడుతూ రాళ్ల గుట్టమీద నుండి పడుతూ లేస్తూ పరుగందుకున్నాారు. అయినా, వాళ్ళని వదలకుండా కొంత దూరం వెంబడించి మరీ చురకత్తితో అందిన దగ్గరల్లాా వాళ్ళ శరీరాలని చీరేసింది ఆమె. చేతులమీద, కాళ్లమీద, గుండెల మీద చురకత్తి మొన చేసిన గాయాలకి బెంబేలెత్తిపోతూ ‘అమ్మో ఇది ఆడది కాదురా నాయనోయ్‌’ అంటూ ముందు పరిగెడుతున్న వాడ్ని ‘ఆగరా ఒరేయ్‌ ఆగరా! ఈ దెయ్యాానికి నన్నొదిలేసి పారి పోకురా’’ అంటూ రెండోవాడు కూడా అరుస్తూ పరిగెడుతున్నాాడు.

అన్నదానం భవనం క్రింద నుండి మనుషుల అలికిడి, అరుపు విన్పించేసరికి రాత్రి గస్తీ తిరగాల్సిన గూర్ఖాా ఆదమరిచి పడుకున్న వాడల్లాా ఉలిక్కిిపడి లేచాడు. ఆగంతకులు ఇద్దరి అరుపులూ విని టార్చిలైటు పట్టుకుని ‘ఎవర్రాా అక్కడ? ఏం చేస్తుున్నాారు?’ అంటూ ఎవరో పరిగెడుతున్నాారన్న అలికిడి శబ్దం వినవచ్చిన వైపు టార్చిలైటు ఫోకస్‌ చేస్తూ గట్టిిగా అరిచాడు గూర్ఖాా.

గుర్ఖాాకి దొరికితే తమ పరువు పోతుందని ఆ ఆగంతకులిద్దరూ మెరుపువేగంతో కొండ దిగువకు రెండేసి మెట్లు దాటి గెంతుకుంటూ దిగి పారిపోయారు. చురకత్తి చేత్తో పట్టుకుని చిరిగిన పైట భుజం మీద కప్పుకుంటూ పారిపోతున్న ఆగంతకుల కేసి చూసింది ఆమె. మెట్లదారిలో వెలుగుతున్న వీధిలైట్ల క్రిందనుండి పారిపోతున్న ఆ ఆగంతకులు ఆయాసంతో ఒగరుస్తూ క్షణం నిలబడి అన్నదానం భవనం క్రింద వున్న చెట్టుకేసి చూసారు.

గుబురుగా పెరిగిన చెట్టుు క్రింద క్రీనీడలో దెయ్యంలా తమకేసే చూస్తున్న ఆమెని చూసి భయంతో ఇద్దరూ ఒకర్నొొకరు ఎగాదిగా చూసుకున్నాారు.

‘‘ఒరేయ్‌! నీ ఒళ్లంతా గాయాలేరా! రక్తం చిమ్ముుతోంది!’’ అన్నాాడు ఒకడు.

‘‘నాకేనా! నీ చేతులు, ఒళ్ళు చూసుకోరా’’ అన్నాాడు రెండో వాడు.

‘‘ఇంకొంచెం సేపు ఉంటే మనల్ని చంపేసి ఉండేదిరా!’’ అన్నాాడు మొదటివాడు.

‘‘గాయాల మాటకేం! పదరా! ఆ గూర్ఖాాకి దొరికితే మన పరువు బజారున పడుతుంది.’’ అంటూ రెండో వాడు ఆకాశధార కేసి పరిగెట్టి మెట్లుదిగుతూ ముందుకు సాగాడు. అతన్ని అనుసరించాడు మొదటివాడు.

ఆగంతకులు ఇద్దరూ మెట్లదారిలో పరిగెడుతూ వీధి లైటు క్రింద నిలబడి తనకేసి చూడ్డం గమనించింది ఆమె. ఆ వెలుగులో ఇద్దర్నీ గుర్తుుపట్టిి ఉలిక్కిిపడింది. రాత్రి కిరాణా దుకాణం దగ్గర రొట్టె కొన్నప్పుడు రెండువేల

రూపాయిల నోటుకు చిల్లర ఇచ్చిన వాడు, వాడి స్నేేహితుడు.

చురకత్తి మొనకి అంటిన రక్తంం మరకలని తుడిచేస్తూ జాగ్రత్తగా మళ్లీ బొడ్లో దోపుకుంది. చీర సర్దుకుని, చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా దగ్గరకు వెళ్లి బ్యాాగ్‌లో ఉన్న మరో కాటన్‌ చీర తీసి కట్టుకుంది. చిరిగిన చీర ఉండలా చుట్టి కొద్దిదూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె తలదగ్గర పెట్టింది

‘‘పాపం! ఎక్కడ పుట్టిందో? ఎలా పెరిగిందో? దిక్కూ మొక్కూ లేకుండా ఇక్కడ పడిఉంది! ఈ చిరిగిన ‘చీర’ ముసలమ్మకి అవసరమౌతుందిలే’’ అనుకుంటూ వెనక్కిి వచ్చేేసింది ఆమె. బ్యాాగ్‌ తల క్రింద పెట్టుుకుని కళ్ళు మూసుకుందే గాని ఆమెకి నిద్ర పట్టడంలేదు. జరిగిన సంఘటనే కళ్ళముందు కదలాడుతోంది. యమకింకరుల్లాా ఆ దుండగులిద్దరూ తన మాన,ప్రాాణాలని బలిగొనేవారే కదా! అప్రమత్తంగా ఉండబట్టే వాళ్ళ కబంధహస్తాాల నుండి బయటపడగలిగింది!’ ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె. చెట్టుు మీద పక్షుల కిలకిలలు... పారుతున్న జలధారల గలగలలు నిశబ్డాాన్ని ఛేదిస్తూ కమ్మనైన సంగీతంలా వినిపిస్తుంంటే నిద్రమత్తులోకి జారుకుంది. ఇంతలో ఎవో గుసగుసలు అస్సష్టంగా చెవిని సోకేసరికి భయంతో వులిక్కిిపడి లేచిందామె. అన్నదానం భవనం ప్రక్కనుండి ఎవరో ఇద్దరు వ్యక్తులు మెట్లు దిగుతూ తమవైపే రావడం గమనించింది. ఆమె.ఛటుక్కున సిమ్మెంటు దిమ్మమీద నుండి లేచి బ్యాాగు భుజాన తగిలించుకుని చెట్టుచాటుకు వెళ్లి దాక్కుంది.

ఒకడు అడుగులో అడుగు వేసుకుంటూ ముసలమ్మ పడుకున్న చెట్టు దగ్గరకు వచ్చాాడు. అతని వెనుకే మరొకడు వచ్చి చేరుకున్నాాడు. ఇద్దరూ ఆజానుబాహుల్లాా ఎత్తుుగా దృఢకాయుల్లాా ఉన్నాారు. చెట్టుుచాటున నక్కిి కళ్ళు చిట్లింంచుకుని చూసింది ఆమె. కొంపదీసి రాత్రి తనపై దాడిచేసిన దుండగులు కాదు కదా! కసితో వస్తున్నాారా చీకట్లో మసగ్గాా నీడల్లాా కనిపిస్తున్నాారు. చెట్టు ఆకుల సందుల్లోనుండి పడుతున్న హైమాక్స్‌ లైటు వెలుగులో వారిని గమనించింది ఆమె. ‘గంట క్రిితం తన మీద దాడి చేసిన వాళ్ళు కాదు. వాళ్లిద్దరూ పొట్టివాళ్ళు. బక్కపల్చగా ఉన్నాారు. కానీ, వీళ్ళు మాత్రంం అలా లేరు', ‘ఎవరై ఉంటారబ్బాా! దొంగలా?! వాళ్లలాగే వీళ్ళూ పోకిరీ వెధవలా?’ ఆలోచిస్తూూనే వాళ్లిద్దరినీ గమనిస్తూ చెట్టుచాటున నక్కిి కూర్చుంది ఆమె.

‘‘ఇదిగోరా! ఇదే! ఇక్కడే ఉంది!’’ ఇద్దర్లోో ఒకడన్నాాడు.

‘‘అవునా?!... మరెందుకు ఆలస్యం?’’ బొడ్లో నుండి పొడవాటి కత్తి తీస్తూ అన్నాాడు రెండోవాడు. చెట్టు చాటున నక్కినక్కి చూస్తున్న ఆమె వారిద్దరి సంభాషణ వింటూనే అదిరిపడింది. మరింతగా చెవులు రిక్కించి వారి సంభాషణ మీద మనసు కేంద్రీకరించింది.

‘‘శాలువా కప్పుకుని ఎంత దర్పంగా పడుకుందో! చూడు... ఇంకెందుకు ఆలస్యం.... నిద్రలోనే యమలోకం పంపించేద్దాం. నువ్వు సిద్ధంగా ఉండు. అరచి అల్లరి చెయ్యకుండా చూస్కో’’ అంటూనే రెండోవాడు కత్తి నిలువునా పైకి ఎత్తి ముసుగు తన్ని పడుకున్న ముసలవ్వ గుండెల్లో కసుక్కున దించాడు.


*************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...