అన్వేషణ తెలుగు నవల నాలుగవ భాగం | ఇందూరమణ | Anveshana part 4 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 25 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ

ధారావాహిక నవల

నాలుగవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


రెండోవాడు ముసలమ్మ గుండెల్లో కత్తి దించుతున్నాాడనగానే మొదటివాడు గబుక్కున క్రింద కూర్చుని ముసుగుతన్ని పడుకున్న ముసలవ్వని అలాగే ఒడిసి పట్టుుకున్నాాడు. నిస్సహాయంగా కాళ్ళు గిజగిజా తన్నుకుంటూ చిన్న మూలుగు మూలిగి తల వాల్చేేసింది ముసలవ్వ.

‘‘పద! ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు.’’ అంటూ రెండోవాడు ముసలమ్మ గుండెల్లో నుండి కత్తి సర్రున బయటకు లాగి కొండ దిగువకు వెళ్ళే మెట్ల దారికేసి నడిచాడు.

‘‘ముసుగు తీసి చూద్దామా? చచ్చిందో...ఇంకా కొన ఊపిరితో ఉందో....’’ అన్నాాడు మొదటి వాడు.

‘‘ఈ జగ్గు గాడు పొడిస్తే ఒక్క పోటే చాలు. అవతలి వాడు గిలగిలా తన్నుకు చావడానికి. ఇదో లెక్కాా? నసక్కుండా రా.’’ అంటూ మొదటి వాడి చెయ్యి పట్టుుకుని లాక్కెెళ్ళిపోతూ అన్నాాడు రెండోవాడు.

ముసలమ్మని అతి కిరాతకంగా చంపడం చూస్తూనే భయంతో బిక్కచచ్చి పోయింది ఆమె. వాళ్ళ సంభాషణను బట్టి వచ్చిన వాళ్లిద్దరూ కిరాయి హంతకులని అర్ధమైంది ఆమెకి. ఎవరు వాళ్ళు?! ఎందుకు ముసలమ్మని అంత కిరాతంగా చంపేసారు! మనసులోనే మూగగా రోదించింది ఆమె. వాళ్ళిద్దరూ గబగబా మెట్లు దిగి వెళ్లి పోవడం గమనిస్తూనే నెమ్మదిగా చెట్టుచాటు నుండి బయటకు వచ్చింది ఆమె.అప్పటికే హంతకులు ఇద్దరూ ఆకాశధార దాటి క్రిందకు దిగి వెళ్లి పోయారు. నెమ్మదిగా ముసలవ్వ పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్లింది. ముసలమ్మ తల దగ్గర పడి ఉన్న తన నేత చీర తీసుకుని ఉండలా చుట్టి చేత్తో పట్టుకుని అక్కడ నుండి క్రిందకు దిగింది. ఏం చేయాలో? ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు ఆమెకు. మెట్ల దారిలో, హంతకులిద్దరూ క్రిందకు దిగుతున్నాారు. ఆ దారిలో వెళ్ళడం ప్రమాదం’ అనుకుంటూ కొండ బస్సుు స్టాండ్‌ దగ్గరకు చేరుకుంది ఆమె.

కొండ బస్సు స్టాండ్‌ అంతా నిర్మాానుష్యంంగా ఉంది. అక్కడే నిలబడి ఒక్క క్షణం సింహాద్రి అప్పన్నస్వాామి వారి గాలిగోపురం కేసి చూసింది ఆమె. ఆలయం చుట్టూ వెలుగుతున్న హైమాక్స్‌ లైట్ల వెలుగులో గాలిగోపురం ప్రాంతం అంతా సుందరంగా దేదీప్యమానంగా కనిపిస్తోంది. దూరంగా ఎక్కడో గూర్ఖా గస్తీ తిరుగుతున్నట్టున్నాాడు. ఉండుండీ గట్టిగా ‘ఈల ’ఊదుతున్న శబ్దం వినిపిస్తోంది.

ఇక కొండ మీద ఉండకూడదనుకుంది ఆమె. మెట్లదారిలో దిగడం కూడా ప్రమాదమే అనుకుంటూ రోడ్డుమార్గంలో నడిచి వెళ్ళడమే మంచిదనుకుంటూ ఘాట్‌ రోడ్‌ కేసి నడిచింది ఆమె. బంతిలా గుండ్రంగా చుట్టిన చిరిగిన చీర చేత్తో పట్టుకుని ఘాట్‌ రోడ్‌లో కొండ దిగువకు నడక ప్రాారంభించింది ఆమె. పాములా మెలికలు తిరిగి ఉన్న రోడ్డు మీద, రోడ్డుకు అటూ ఇటూ ఉన్న కరెంటు స్తంభాల వెలుగులో నెమ్మదిగా నడుస్తూ ఆలోచిస్తోంది ఆలోచిస్తూ నడుస్తోందే గానీ ఆమె మనసు మనసులో లేదు. పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తూ ఆగి ఆగి నడుస్తోంది. ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టుు ఉలిక్కిిపడి చేతిలో ఉన్న చీరకేసి చూసుకుంది ఆమె.అంతే! ఉండలా చుట్టిన కాటన్‌ చీరని బంతిలా బలంగా ఘాట్‌ రోడ్డును ఆనుకుని ఉన్న లోయలాంటి మామిడితోటలోకి విసిరేసింది ఆమె.  

ధ్యేయం నెరవేరేవరకూ... తన అన్వేేషణ పూర్తయ్యే వరకూ.... ఏ శక్తీ తనని అడ్డుకోలేదు’ దృఢంగా మనసులో తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ గుండెల్నిండా గాలి పీల్చుకుని ధీమాగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి నడిచింది ఆమె

******

తెల్లాారేసరికి కొండ కొండంతా గుప్పుమంది. ఉదయాన్నేే శ్రీస్వాామి వారి సుప్రభాతసేవకు వచ్చిన అర్చకులు గర్భాాలయంలో అడుగు పెట్టకముందే ఆ వార్త దావానలంలా కొండంతా ఆక్రమించేసింది. రాత్రంతా వ్యాాపారంలో అలసి సొలసిన వ్యాాపారస్తులు కొందరు ఇళ్లకు వెళ్లిపోగా చాలామంది తమ తమ దుకాణాల ముందే మేను వాల్చి సేద దీరుతున్నాారు. ఉన్నట్టుండి గూర్ఖా గావుకేక సింహగిరి శిఖరమంతా ప్రతిధ్వనించింది. దేవాలయం చుట్టూ ఆక్రమించిన కొండకోనలన్నీ కంపించిపోయినట్టు అరిచాడు గూర్ఖా. కొండమీద ఆలయం చుట్టూ పహరా కాస్తూ తిరుగుతున్న గూర్ఖా అన్నదానం బిల్డింగ్‌ చుట్టుముట్టి మర్రిచెట్టు దగ్గర కొచ్చేేసరికి ఎవరిదో మూలుగు విన్పించింది. అనుమానంగా చెవులు రిక్కించి విన్నాాడు.

అప్పటికే స్వాామి వారి సుప్రభాతసేవకు ఆలయానికి అర్చకులు వచ్చేే వేళయిందని త్వరత్వరగా పని ముగించుకుని ఆలయం దగ్గరకు చేరుకోవాలనుకున్నాాడు గూర్ఖా. ఉండుండీ ‘ముసలమ్మ మూలుగు’ ఆ నిశ్శబ్ద నిశీధిలో అతి భయంకరంగా విన్పిస్తోంది. మర్రిచెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా మీద ముసుగుతన్ని పడుకున్న వ్యక్తి ఎవరో మూలుగుతున్నాారని గ్రహించాడు గూర్ఖా. గాబరాగా అక్కడకు వెళ్లి టార్చి వేసి చూసాడు. టార్చి వెలుగులో ఎవరో శాలువా ముసుగార కప్పుకుని మూలగలేక మూలుగుతున్నాారు. చేతిలో ఉన్న పొడవాటి కర్రతో ‘శాలువా’ తొలగించి చూసాడు. శాలువా కప్పుకున్న ముసలమ్మ బాధగా మూలుగుతూ కొనవూపిరితో కొట్టుకులాడుతోంది. అప్పటికే కత్తిపోటు వలన బాగా రక్తం స్రవించి సిమ్మెంటు చప్టా మీద రక్తం ధారలా కారుతోంది. టార్చి వెలుగులో ముసలమ్మని తేరిపారా చూసాడు గూర్ఖాా. అప్పటికే గూర్ఖా కేసి బేలగా చూస్తూ ప్రాాణాలు వదిలేసింది ముసలమ్మ.టార్చి వెలుగులో రక్తంతో తడిసి ముద్దయిన ముసలమ్మ వాలకం చూడగానే అదిరి పడి కెవ్వున అరిచాడు. గబ గబా కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు చేరుకుని వర్తకులందర్నీ కేకలేసి లేపాడు గూర్ఖాా.   

అదే సమయంలో కొండ దిగువనుండి అర్చకులను మోసుకుంటూ వచ్చి ఆగింది బస్సు. ముసలమ్మ చావు కబురు వినగానే అర్చకులు, వర్తకులు హుటాహుటిన పోలీసులకు ఫోన్‌ చేసారు. కొందరు కొండ దిగువనే ఉన్న దేవస్థానం అధికారులకు విషయం చేరవేసారు.

ముసలమ్మ గుండెల్లో ఎవరో కత్తితో పొడిచి చంపేసారన్న వార్త తెలియడంతో అందరూ భయంతో ఆ దరిదాపులకు వెళ్ళలేదు. దూరం నుండే గుంపులు గుంపులుగా నిలబడి చూస్తుండి పోయారు. ముసలమ్మ శవాన్ని అక్కడ నుండి తరలించే వరకూ దేవాలయంలో పూజా పునస్కాారాలు నిర్వహింంచకూడదని అర్చకులు తిరిగి బస్సులో ఇళ్లకు వెళ్లి పోయారు.  

ఆలయ ప్రాంగణంలో ఎవరు మరణించినా ఆ ‘శవం’ దహన సంస్కాారాలు పూర్తయ్యే వరకూ గుడి తలుపులు తెరవరు. ఆ తర్వాాత ఆలయమంతా సంప్రోక్షణ చేసాక గాని పూజాది కార్యక్రమాలు నిర్వహించరు. భక్తులకు స్వాామివారి దర్శన భాగ్యం కలుగదు.

కొండమీద హత్య జరిగిందన్న వార్త చేరడంతోనే గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుండి ఎస్సై, నలుగురు కానిస్టేబుల్స్‌ హుటాహుటిన వచ్చి చేరుకున్నాారు. అప్పటికే తెల్లారి పోయింది. భక్తులు తండోపతండాలుగా మెట్లదారిలో కొండపైకి చేరుకుంటున్నాారు. యాత్రీకులను ఎవరినీ మర్రిచెట్టు దరిదాపులకు రానివ్వకుండా పోలీసులు పహరా కాస్తున్నాారు. సిమ్మెంటు చప్టా మీద ఉంది ముసలమ్మ శవం. శాలువా అంతా రక్తసిక్తమై ఉంది. సిమ్మెంటు చప్టా మీద ధారలా చారులు కట్టి వుంది రక్తంం.

నలుగురు పోలీసులు చుట్టూ పహరా కాస్తున్నాారు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ నేరుగా వెళ్లి ముసలమ్మ మీద కప్పి ఉన్న శాలువాని లాఠీతో పూర్తిగా తప్పించి చూసాడు. ‘డెబ్భై ఏళ్ళకి పైబడే ఉంటాయి ముసలమ్మకి’ అనుకున్నాాడు. ఇలాంటి ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మనసులోనే అనుకుంటూ చుట్టుప్రక్కల అంతా నిశితంగా పరిశీలించి చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

క్రిందంతా రాళ్లు తేలి ఉన్నాాయి. అన్నదానం భవనం వెనుక గోప్యంగా ఉందా స్థలం. ఎత్తుగా ఎదిగిన చెట్లు గుబురుగా అల్లుకుని ఉన్నాాయి. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ వెనుకే వినయంగా నిలబడ్డాడు గూర్ఖా. ఎస్సై అడగక ముందే తాను చూసిన సంఘటన అంతా వివరిస్తూ చెప్తున్నాాడు. గూర్ఖా చెప్పిందంతా వింటూనే పరిసరాలని సున్నితంగా గమనిస్తుున్నాాడు ఎస్సై. అడుగులో అడుగు వేసుకుంటూ క్రిందంతా క్షుణ్నంగా పరిశీలిస్తూ ఆ ప్రాంతం అంతా కలియతిరిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో దేవస్థాానం ఈవో రాఘవేంద్ర స్వాామి అక్కడకు వచ్చి చేరుకున్నాారు. ఆయన వెనుక ఆలయ అధికారులు పేషికార్‌, ఖరోడా, హవల్దాార్‌ను వెంటపెట్టుుకు వచ్చాారు. ఈవో రాఘవేంద్ర స్వాామి వస్తూనే ఎస్సై అక్బర్‌ ఖాన్‌తో అన్నాాడు.

‘‘ఎస్సై గారూ! త్వరగా మీ ఫార్మాాలిటీస్‌ అన్నీ పూర్తి చేసి శవాన్ని ఇక్కడ నుండి తరలించండి. ఆలయంలో స్వాామి వారికి పూజా కార్యక్రమాలు ఆగిపోయి భక్తులకు దర్శనాలు ఆపేయ్యాాల్సి వచ్చింది. దయచేసి శవ పంచనామా త్వరగా పూర్తి చేయించండి.’’ అధికార దర్పంతో అన్నాాడు.

‘‘సార్‌! ఈ ముసలమ్మది సహజ మరణమే అయితే మీరన్నట్టే వెంటనే పంచనామా పూర్తి చేసేవాళ్లం. కానీ... ఇది మర్డర్‌. ఒక అనాధని... అదీ భక్తుల దగ్గర బిచ్చం అడుక్కునే ఒక ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది?! ఎలాంటి పరిశీలన... పరిశోథన చెయ్యకుండా శవానికి చాప చుట్టేస్తే ఆ తర్వాాత మా పీకల మీదకొస్తుంది వ్యవహారం.. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి! వీలైనంత త్వరగా ఫార్మాాలిటీస్‌ కంప్లీట్‌ చేయిస్తాాను.’’ అంటూనే ఈవో రాఘవేంద్ర స్వాామికి నమస్కాారం చేసి గౌరవంగా సాగనంపాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో ఫోరెన్సిక్‌ నిపుణులు వచ్చి చేరుకున్నాారు. వారితో పాటే అంబులెన్స్‌ కూడా వచ్చి చేరుకుంది. ఫోరెన్సిక్‌ నిపుణులు ముసలమ్మ శవం మీదున్న కత్తిపోటు, శాలువా, ముసలమ్మ తల క్రింద వున్న చిన్న మూట అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వేలిముద్రలు సేకరిస్తున్నాారు. క్లూస్‌ టీమ్‌ పరిసరాలన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తుున్నాాయి. గుబురుగా వున్న మర్రిచెట్టు కేసి దాని చుట్టూ కట్టిన సిమ్మెంటు దిబ్బకేసి చూస్తూ కొద్దిదూరంలో ఉన్న మరో చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు దిమ్మ కేసి చూస్తూ ఒక్కసారే ఉలిక్కిిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

******************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...