అన్వేషణ తెలుగు నవల ఐదవ భాగం | Anveshana part 5 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 26 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

ఐదవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


దూరంగా ఉన్న సిమ్మెంట్‌ చప్టా క్రింద రాళ్లగుట్టల మీద ఎర్రగా రక్తపు మరకలు కనిపించేసరికి ఒక్క ఉదుటున అక్కడకు చేరుకున్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఎస్సై అంత ఆతృతగా అటుకేసే వెళ్ళే సరికి ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని అనుసరించారు.

‘‘రాళ్ల గుట్టల మీద రక్తపు మరకలు చూసారా?’’ ఆతృతగా అన్నాాడు ఎస్సై.

‘‘ఎస్‌ సార్‌!’’ అంటూ క్లూస్‌ టీమ్‌ నిపుణులు ‘రక్తం’ మరకలను జాగ్రత్తగా బ్లేడ్‌తో ఒలిచి తమ దగ్గరున్న ప్లాాస్టిక్‌ కవరులో భద్రపరిచారు. సిమ్మెంట్‌ చప్టా ప్రక్కనే రొట్టెల కవరు, జామ్‌ కవరు కనిపించేసరికి గబుక్కున వెళ్ళి క్రిందకు వంగి వాటిని జాగ్రత్తగా తీసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌

‘‘సార్‌! రొట్టెెల కవరు, జామ్‌ కవరు ఇక్కడ కూడా ఉన్నాాయి సార్‌’’ అంటూ ముసలమ్మ శవం దగ్గర ఆధారాల కోసం వెదుకుతున్న క్లూస్‌ టీమ్‌ మెంబర్‌ ఒకరు గట్టిగా అరిచి ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి చెప్పాాడు.

‘‘ఎస్‌! వీటిని బట్టి చూస్తే రాత్రి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బస చేసారనిపిస్తోంది. అందులో ఒకరు ఈ హతురాలు ముసలమ్మ. రెండో వ్యక్తి ఎవరు?!’’ ఆలోచిస్తూూనే అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అంతేకాదు. ముసలమ్మ హత్య అక్కడ జరిగింది. ఆ రక్తపు మరకలు ఈ రాళ్లగుట్టల వరకూ వచ్చి పడ్డాయంటే... చాలా విడ్డూరంగా వుంది సార్‌.’’

‘‘విడ్డూరం ఏముందీ! ఇక్కడ హత్యాాయుధం లేదూ అంటే హంతకుడు దాన్ని మాయం చేసినప్పుడు దాని నుండి కారిన రక్తం చుక్కు ఆ రాళ్లగుట్ట మీద పడి ఉండొచ్చు కదా!’’ కాలర్‌ ఎగరేస్తూ హుషారుగా అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్‌ సార్‌! మీరన్నదే నిజం.’’ అన్నాాడు క్లూస్‌ టీమ్‌లో ఒకతను.

‘‘మీరు మీ పని కానివ్వండి. నేను ఈ చుట్టుప్రక్కల ఎంక్వయిరీ చేసుకు వస్తాాను. ఈలోగా మీ పని పూర్తయితే శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించండి.’’ అంటూనే ఒక కానిస్టేబుల్ ని వెంట తీసుకుని కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు వెళ్లాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఎస్సై చేతిలో రొట్ల కవరు, జామ్‌ కవరు ఉన్నాాయి. ‘‘త్రీనాట్‌ వన్‌! కొండ మీద రొట్టెలు, జామ్‌ అమ్మే కిరాణా దుకాణాలు పాన్‌ షాప్‌లు ఎన్నున్నాాయో కనుక్కుని రా.’’ బస్సు స్టాండ్‌లో నిలబడి పరిసరాలను గమనిస్తూ అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్‌ సార్‌!’’ అంటూ కానిస్టేబుల్‌ కొండ బస్సు టిక్కెెట్లు బుక్కింగ్‌ కౌంటర్‌ కేసి వెళ్లాడు. సరిగ్గాా అప్పటికి ఉదయం ఏడుగంటలు కావస్తోంది. భక్తులతో కొండంతా రద్దీగా వుంది. దర్శనాలు లేకపోవడంతో కొండపైకి చేరుకున్న భక్తులంతా క్యూ లైన్ ల లోనూ, షాపుల దగ్గర పోగై ఉన్నాారు.

ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఇంతలో కొండదిగువ నుండి బస్సు వచ్చి ఆగింది. దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కరొక్కరుగా క్యూ పాటిస్తూ బస్సులో నుండి దిగుతున్నాారు. భక్తుల మధ్యలో నిలబడ్డ ఆమె తలనిండుగా ముసుగు వేసుకుని బస్సు దిగుతున్న యాత్రీకుల వెనకే నెమ్మదిగా కదులుతోంది. బస్సులో నుండే కొండబస్సు స్టాండ్‌ పరిసరాలను గమనిస్తోంది. రాత్రి జరిగిన సంఘటనలు ఆమె కళ్లముందు కదలాడుతూనే వున్నాాయి. అన్నెం పున్నెం ఎరుగని ముసలమ్మని చంపడం కళ్లారా చూసింది. రాత్రంతా ఘాట్ రోడ్‌లో నడుచుకుంటూ తొలి పావంచా దగ్గరకు చేరుకుంది. తెల్లవార్లూ అక్కడే మెట్ల పక్కన యాచకులతో పాటు నిద్ర పోయింది.

తెల్లారేసరికి అలజడి. కొండమీద అన్నదానం భవనం దగ్గర ఎవరో ఎవర్నోో చంపేసారని యాచకుల ద్వాారానే వింది. అయితే, ఆ వార్త ఆమెకి ఆశ్చర్యం కలిగించ లేదు. తన కళ్ళముందే ముసలమ్మని ఎవరో చంపడం చూసింది. కొండ మీద ఏం జరుగుతోందో చూడాలనిపించింది. అంతే! చక చకా బయలుదేరింది. ఏం జరుగుతోంది?! ముసలమ్మని చంపిందెవరో పోలీసులు కనుక్కోోగలిగారా? ఏమో?! ఆలోచిస్తూనే బస్సు స్టాండ్‌కి చేరుకుంది ఆమె. మెట్లదారిలో నడవలేక బస్సులో బయలుదేరింది. పాపం! ఆ ముసలమ్మని చంపిందెవరో? ఎందుకు చంపారో? రాత్రి ముసలమ్మతో పాటు తనూ అక్కడే ఉందని పోలీసులు గ్రహించేస్తారా. ముసలమ్మమీద కప్పిన శాలువాని గమనిస్తాారు. అవును గమనిస్తేే! తన ఉనికి పసిగడితేనో?

అమ్మో! తన అన్వేేషణ ఎలా? ఏం చెయ్యాాలి? తనింకా ఇక్కడే ఉండడం క్షేమం కాదు. కానీ, తన ఆశ... శ్వాాస...! ఏం కావాలి? నిన్నంతా తిరిగింది. మెట్ల దారిలో మొదలై కొండ మీద అన్ని ప్రాంతాలూ తిరిగింది! పిచ్చిదాన్లా అన్వేేషించింది. తన అన్వేేషణ ఫలిస్తుందా?! నిద్రాాహారాలు మాని కళ్ళల్లోో కాగడాలు పెట్టుకుని వెతుకుతున్న తన ఆశ ఫలిస్తుంందా?!

‘‘దిగమ్మాా! అలా దిక్కులు చూస్తాావేంటి?!’’ వెనుక నిలబడ్డ భక్తుురాలు చిరాగ్గా వీపు తట్టి ముందుకు తోసేసరికి ఇహానికి వచ్చింది ఆమె. అప్పటికే బస్సులో ఆ చివర నుండి గేటు దాకా వచ్చేేసింది ఆమె. రాడ్‌ పట్టుకుని నెమ్మదిగా బస్సులో నుండి దిగింది. ఎదురుగా యూనిఫాంలో వున్న ఎస్సైని చూసి క్షణం తత్తర పాటు చెందింది. మరుక్షణం తేరుకుని ఓ మూలకు వెళ్లి ఎటో చూస్తుున్నట్టుు నటిస్తూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని గమనిస్తోంది ఆమె.

ఇంతలో ఓ కానిస్టేబుల్‌ పరుగు పరుగున ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గరకు వచ్చాాడు. ‘‘సార్‌! కొండ మీద రొట్టెలు, జామ్‌ అమ్మే దుకాణం ఒకటే ఉందట. వరహాల శెట్టిి గారి కిరాణా దుకాణం.’’ చెప్పాాడు పోలీస్‌ కానిస్టేేబుల్‌

‘‘గుడ్‌! పద వెళ్దాం!’’ అంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దుకాణాల సముదాయం కేసి నడిచాడు. అతన్ని అనుసరించాడు కానిస్టేబుల్‌.

ఎస్సై, కానిస్టేబుల్‌ ఇద్దరు వెళ్తున్న దిక్కేే చూస్తూ నిలడిందే గాని ఆమె మనసు మనసులో లేదు. భక్తులు తండోపతండాలుగా మెట్లెక్కుతూ అడ్డుగా నిలబడ్డ ఆమెని నెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నాారు.తాను రాత్రి బసచేసిన మర్రిచెట్టు దగ్గర ఏం జరుగుతోందో చూడాలనిపించి నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ కొండ బస్సు స్టాండ్‌ను అనుకునే ఉన్న అన్నదానం భవనం గోడ దగ్గరకు చేరుకుంది ఆమె.

అప్పటికే అక్కడ ముసలమ్మ శవాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించడానికి దేవస్థానం స్వీపర్లు ముగ్గురు మోసుకుంటూ అంబులెన్స్‌ దగ్గరకు వెళ్తున్నాారు.  

దూరంగా నిలబడి అంతా గమనించింది. దిక్కు మొక్కు లేని ఆ ముసలమ్మ చావు చూసి మనసులోనే కుమిలి పోయింది ఆమె. రాత్రి ముసలమ్మ తనని చూస్తూూనే ‘అమ్మాా తల్లి! నువ్వేేనా! తల్లీ’ అంటూ పిలవడం గుర్తొచ్చి ‘అయ్యో! పాపం! ఎవరో? ఈ ముసలమ్మకే మవుతుందో?’ అనుకుంది.‘ఇక్కడ ఇలాగే నిలబడి ఉంటే తన ఉనికి ఎవరైనా కనిపెట్టెయ్యవచ్చు. రాత్రి తనని పాడు చెయ్యాాలని వచ్చిన దుండగులన్నాా చూడొచ్చు. కసితో దాడి చెయ్యచ్చు. ముసలమ్మ దగ్గరున్న తన శాలువా చూసి పోలీసుకైనా అనుమానం కలగొచ్చు! అంత ఖరీదైన శాలువా ఈ ముసలమ్మ దగ్గరకెలా వచ్చిందని ఆరా తీస్తే తన గుట్టు రట్టవుతుంది. పోలీసులకు అనుమానం కలిగితే క్షణాల్లో ఊరంతా గాలిస్తారు. ఎక్కడ దాక్కున్నాా జల్లెడ పట్టి వెదికి పట్టేసుకుంటారు.

"ఏం చెయ్యాాలి? తానిక్కడ నుండి సురక్షితంగా బయటపడాలంటే ఏం చెయ్యాాలి? చెయ్యని నేరానికి అనుమానితురాలిగా పోలీసుల కంటపడితే ఇంకేమన్నాా ఉందా?! తన గమ్యం అగమ్యమై పోదూ?! తన ఆశ అడియాశ కాదూ?! స్వాామి! సింహాద్రి నాథా! నన్ను రక్షించు! నా మనోభీష్టాన్ని నెరవేర్చు! నా అన్వేేషణ కొనసాగేలా ఆశీర్వదించు. నా బ్రతుక్కిి... నా జీవితానికి ఆశ.. శ్వాాస అందించు." మనసులోనే వేనోళ్ల భగవంతుడ్ని ప్రాార్ధించింది ఆమె. ఉన్నట్టుండి తళుక్కుున మదిలో ఏదో ఆలోచన మెదిలేసరికి చక చకా మెట్లు ఎక్కిి కేశఖండనశాల కేసి సాగి పోయింది.

దుకాణాల సముదాయంలో మూడో వరుసలో ఉన్న రెండో దుకాణమే వరహాల శెట్టి కిరాణా షాపు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌, కానిస్టేబుల్‌ ఇద్దరూ కిరాణా దుకాణం దగ్గరకు వెళ్ళారు. పోలీసులు తన దుకాణం దగ్గరకు రావడం గమనిస్తూనే లోపల కేష్‌ కౌంంటర్‌ దగ్గర కూర్చున్న వరాహాల శెట్టి గాబరాగా షాపులో నుండి బయటకు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు నిలబడ్డాాడు.

‘‘సార్‌! నాతో ఏమైనా పనుందా సార్‌?!’’ వినయంగా అడిగాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి.

‘‘ఈ కవరు జామ్‌కి సంబంధించిందేగా...ఇది రొట్టెల కవరు, అవునా?’’ చేతిలో జామ్‌ అంటిన కవరు, రొట్టెముక్క అవశేషాలున్న ప్లాాస్టిక్‌ కవరు చూపిస్తూూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ముక్కు సూటిగా అడిగితే, ‘నాకేమీ తెలీదు సార్‌’ అని తప్పించుకుంటారని అలా అడిగాడు.

‘‘ఆ... అవును సార్‌!’’ అయోమయంగా అన్నాాడు వరహాల శెట్టిి.

‘‘ఇవి నీ దగ్గర దొరుకుతాయా?!’’ వరహాల శెట్టి కళ్లల్లోోకి సూటిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘దొ... దొ... దొరుకుతాయి సార్‌! మీకు కావాలా?’’ అంటూ హుషారుగా షాపులోకి వెళ్ల బోయాడు వరహాలశెట్టి.

‘‘అక్కర లేదు. ఇవి రాత్రి ఎవరికి అమ్మాావో చెప్ప గలవా?!’’ అడిగాడు ఎస్సై.

‘‘అవి.... అవి... చాలామంది....’’ బుర్ర గోక్కుంంటూ ఏదో చెప్పబోయాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి.

‘‘డ్రాామాలొద్దు. నిన్ను సాక్ష్యానికి పిలవటం లేదు. జస్ట్‌! ఆరా కోసం అడుగుతున్నాాను. నిజం చెప్పుు. అబద్ధాలొద్దుు.’’ వరహాల శెట్టి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ చేతిలో లాఠీ చక్రంలా తిప్పుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘చెప్తాను సార్‌! చెప్తాను!’’ అంటూ ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఎటో దిక్కులు చూస్తూూ నిలబడ్డాడు వరహాలశెట్టి.

‘చెప్తేే ఏమౌతుందో? చెప్పకపోతే ఏం చేస్తారో?! ముందుకెళ్తే నుయ్యి వెనక్కెెళ్తే గొయ్యి!’ మనసులోనే తర్జనభర్జన పడ్డాాడు వరహాల శెట్టిి.

‘‘ఏంటాలోచిస్తుున్నాారు? చెప్పంండి?!’’ గొంతు పెంచి అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌


********************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 


ఇదంతా రహస్యంగా గమనిస్తుున్న ' ఆమె ' అసలు అన్వేేషణ దేనికోసం? వరహాలశెట్టిి ఏం చెప్పాాడు? అక్బర్ ఖాన్ ఏం తెలుసుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే రేపతివరకు ఆగాల్సిందే....

Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...