అన్వేషణ తెలుగు నవల ఆరవ భాగం | ఇందూరమణ | Anveshana part 6 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 27 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

ఆరవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


‘‘సార్! రాత్రి .... రాత్రి నేను కొట్టు కట్టేేసే ముందు ఒకావిడ వచ్చింది సార్. వెయ్యి నోటు ఇచ్చి రెండు రొట్టెల ప్యాాకెట్లు, రెండు జామ్ ప్యాాకెట్లు అడిగింది. నా దగ్గర చిల్లరలేదమ్మాా అన్నాాను.’’ నసుగుతూ చెప్పాాడు వరహాలశెట్టి.

‘మరి, ఈ ప్యాాకెట్లు ఆమె ఎక్కడ కొన్నట్టుు?’’ సీరియస్ గా అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నా దగ్గరే సార్!....’’ చేతులు రెండూ నులుముకుంటూ అన్నాాడు కిరాణా షాపు యజమాని వరహాలశెట్టిి. కిరాణా షాపు దగ్గరకు పోలీసు రావడం గమనించగానే చుట్టు ప్రక్కల షాపు వాళ్ళు దూరం నుండే ఓ కన్నేేసి ఓరగా వాళ్ల సంభాషణ అంతా వింటూ ఏదో పనిలో ఉన్నట్టు నటిస్తున్నాారు. రాత్రి ‘ఆమె’ని శారీరకరంగా లోబర్చుకుందామని రేప్ చెయ్యబోయిన ఇద్దరు యువకులు రెండు షాపులకు అవతల నిలబడి వరహాలశెట్టిని పోలీసు ఏమడుగుతున్నాారో వాడేం చెప్తున్నాాడో అనుకుంటూ దొంగచాటుగా నక్కిినక్కిి భయం భయంగా వాళ్ళనే గమనిస్తున్నాారు. రాత్రి తగిలిన కత్తిగాట్లకి ఆర్.ఎమ్.పి. డాక్టర్ దగ్గర మందు రాయించుకుని తిరిగి పనిలోకి వచ్చేేసారు. లోపల గాయాలు చురుక్కుమన్నాా భరిస్తూ మర్రిచెట్టు దగ్గర ఎవరో ఎవరినో చంపేసారన్న వార్త తెలియగానే ఇద్దరూ ఆందోళనగా కొండకొచ్చేేశారు.

‘‘డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాావా?!’’ కిరాణా దుకాణం యజమాని వరహాలశెట్టి కేసి కోపంగా చూస్తూూనే అనుకోకుండా చుట్టు పరికించి చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. రెండుషాపుల అవతల ఇద్దరు కుర్రాాళ్ళు నక్కిి నక్కిి తమనే గమనించడం ఎస్సై అక్బర్ ఖాన్ కనిపెట్టకపోలేదు. వరహాలశెట్టితో మాట్లాాడుతూనే వాళ్లిద్దరి మీద దృష్టి పెట్టాాడు. వాళ్ళిద్దరి మీద అనుమానం కలిగింది.

‘‘సార్! వ్యాాపారమన్నాాక డబ్బు తీసుకోకుండా ఫ్రీగా వస్తువు ఎలా ఇచ్చేేస్తాను సార్?’’ ఆశ్చర్యంంగా ఎస్సై కేసి చూస్తూ అన్నాాడు వరహాలశెట్టి.  

‘‘ఏం జరిగిందో చెప్పు. సోదంతా ఎందుకు?’’ చిరాగ్గా అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నేను వెయ్యి నోటుకు చిల్లర లేదనే సరికి ఈ ప్రక్కనే ఉండే కుర్రాాళ్ళు వచ్చి ఆవిడకి చిల్లర ఇచ్చాారు సార్! ఆ తర్వాాత నేను ఆవిడ దగ్గర డబ్బు తీసుకుని ఈ వస్తుువు ఇచ్చాాను.’’ చెప్పాాడు వరహాలశెట్టి.

‘‘కుర్రాాళ్ళా? ఎక్కడుంటారు?’’ కుతూహలంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. ‘ఇదంతా అనవసర ఆరా ఏమో!’ అనుకుంటూ వెనుదిరగబోయిన ఎస్సై అక్బర్ ఖాన్ దూరంగా తననే చాలా సేపట్నుంండి నక్కిి నక్కిి చూస్తుున్న కుర్రాాళ్ల కేసి చూసి టక్కుున ఆగాడు. ఎస్సై అక్బర్ ఖాన్ తమనే గమనించడం చూసిన యువకులు ఇద్దరూ టక్కున వెనుదిరిగి ఏమీ ఎరగనట్టుు నిలబడ్డాారు.

‘‘కానిస్టేబుల్!....ఆ షాపు దగ్గర నిలబడి మనల్నేే గమనిస్తుున్న వాళ్లిద్దర్నీ ఇలా లాక్కురా!’’ అంటూ తన వెనకే వినయంగా నిలబడ్డ కానిస్టేేబుల్ని వాళ్ల దగ్గరకు పంపించాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ఎటో చూస్తూ ఎవర్నోో లాక్కు రమ్మనడం విన్న కిరాణా దుకాణం యజమాని వరహాలశెట్టి కూడా అటుకేసి చూసాడు. రాత్రి ఆమెకి చిల్లర ఇచ్చిన యువకులు కనిపించారు. ఆ కుర్రాాళ్లిద్దర్నీ చూస్తూూనే ‘హమ్మయ్య! వాళ్లని ఇరికించేసి నేను తప్పించుకోవచ్చని’ మనసులోనే అనుకుంటూ టక్కున ఎస్సై దగ్గరకు వచ్చాాడు వరహాలశెట్టిి. ‘‘సార్!...రాత్రి ఆవిడకి రెండువేల రూపాయిల నోటుకి చిల్లర ఇచ్చింది వాళ్లిద్దర్లో ఒకడు సార్!...అదిగో అతడే.’’ హుషారుగా వాళ్లని చూస్తూ చెప్పాాడు వరహాలశెట్టి.

కానిస్టేబుల్ని చూస్తూనే ఆ యువకుల ఇద్దరికి పై ప్రాాణాలు పైనే పోయాయి. పరిగెత్తిపారిపోదామన్నాా దారే లేదు. కానిస్టేబుల్ని పిలిచి తామిద్దర్నీ చూపించి ఎస్సై ఏదో చెప్పేసరికి ఇద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. 

ఇద్దరూ తేరుకునే లోపే కానిస్టేబుల్ వాళ్ల దగ్గరకు చేరుకున్నాాడు.

‘‘మీ ఇద్దర్నీ ఎస్సైగారు పిలుస్తుున్నాారు. రండి.’’ అంటూ హూంకరిస్తూ ఇద్దరి వెనుక నిలబడి గొర్రెెల్ని తోలుతున్నట్టుు చేత్తో తోసుకుంటూ వాళ్లని ఎస్సై దగ్గరకు లాక్కువచ్చాాడు కానిస్టేేబుల్.

‘‘రాత్రి మీరేం చేసారు?’’ వాళ్లిద్దర్నీ దగ్గరకు రాగానే నర్మగర్భంంగా మాట్లాడుతూ వాళ్ళ మీద కన్నెెర్రజేస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. కావాలనే అంతా తెలిసినట్టుు తెలివిగా అడిగాడు ఎస్సై.

‘‘సార్!... సార్!.... మేము....’’ ఒకడు ఆందోళనగా

‘‘లేద్సార్....లేదు.....ఆవిడే....’’ రెండో వాడు భయంగా

‘‘ఆవిడా?! ఏం చేసింది?’’ వాళ్ళద్దరిలో ఏదో రహస్యంం దాగి ఉందనుకుంటూ వాళ్లని గదమాయించాడు ఎస్సై.

‘‘ఆవిడ....! ఆవిడ....’’ ఇద్దరూ నసుగుతూ నిలబడ్డారు.

‘‘చెప్పవయ్యాా! రాత్రి నువ్వేే కదా ఆవిడ దగ్గర వెయ్యినోటు తీసుకుని చిల్లర ఇచ్చాావు. నువ్వు చిల్లర ఇచ్చుండకపోతే ఆ వెధవ రొట్టె, జామ్ అమ్మి ఉండేవాడ్ని కాదు కదా!’’ నిష్ఠూరంగా అన్నాాడు వరహాలశెట్టి వాళ్లతో.

‘‘నువ్వుు నోరు ముయ్యవయ్యాా! నువ్వెందుకు మధ్యలో దూరుతావు?’’ వరహాలశెట్టిి మీద అంతెత్తున లేచాడు ఎస్సై.

ఎస్సై అక్బర్ ఖాన్ కోపంగా అరిచేసరికి గజగజా వణికపోతూ భయం భయంగా షాపులో కెళ్ళి కేష్ కౌంటర్లో కూర్చుండిపోయాడు వరహాలశెట్టి.  ఇంతలో అంబులెన్స్ లో ముసలమ్మ శవాన్ని ఎక్కించి ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరకు పరిగెట్టుకు వచ్చాాడు మరో కానిస్టేేబుల్.

‘‘సార్! ఫోరెన్సిక్ డిపార్టుమెంట్ వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి వెళ్లిిపోయారు. శవాన్ని పోస్టుుమార్టంం కోసం అంబులెన్స్ ఎక్కింంచాము.’’ ఆయాసపడుతూ చెప్పాాడు ఆ కానిస్టేేబుల్.

‘‘అక్కడున్న కానిస్టేబుల్స్ ని అంబులెన్స్ లో పెద్దాసుపత్రికి వెళ్ళమను. నేను ఇక్కడ ఇంటరాగేషన్ పూర్తిచేసుకుని వచ్చేేస్తాను. నువ్వు సాయంత్రం వరకూ మర్డర్ స్పాాట్ దగ్గరే ఉండు. అనుమానస్పద వ్యక్తుులు ఎవరైనా అటుగా వస్తే వదిలిపెట్టకు.’’ అంటూ ఆ కానిస్టేబుల్ కి చెప్పి ఎదురుగా ఉన్న ఇద్దరు యువకుల కేసి చూసాడు ఎస్సై. ఆ కానిస్టేబుల్ సెల్యూట్ చేసి అంబులెన్స్ దగ్గరకు పరిగెట్టాాడు. అప్పటికే అంబులెన్స్ బయలుదేరడానికి సిద్ధంంగా వుంది. ఇద్దరు కానిస్టేబుల్స్ అంబులెన్స్ ఎక్కాారు. మూడో కానిస్టేబుల్ అన్నదానం బిల్డింగ్ కేసి వెళ్తూ మెట్లు దిగాడు.

‘‘చెప్పండి....! అలా నీళ్ళు నమిలితే ఆ ముసలమ్మని మీరే చంపారనుకోవాలి....నిజమేనా?!’’ చేతిలో ఉన్న లాఠీతో ఒకడి బుర్ర మీద కొడుతూ అన్నాాడు ఎస్సై.

‘‘సార్!... మేము ఆ ముసలమ్మనా...?! ఎందుకు సార్! దాన్నెందుకు చంపుతాం!’’ అయోమయంగా అన్నాాడొక కుర్రాాడు.

‘‘ఎందుకా?! అదీ నేనే చెప్పాాలా?! డబ్బు కోసం.... ముసలమ్మ ముష్టెత్తుకుని దాచుకున్న డబ్బు కోసం, లేదా మెడలోనో...చెవులకో.... ఉన్న బంగారం కోసం....అవునా!’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆ యువకులిద్దరికీ ముచ్చెెమటలు పోసాయి. నోరు విప్పకపోతే నిజంగానే హత్యాానేరంలో ఇరికించేసేలా ఉన్నాాడు ఈ ఎస్సై.’’ అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాారు.

‘‘కానిస్టేబుల్! వీళ్లిద్దర్నీ స్టేషన్ కు తీసుకుపద! అడిగే రీతిలో అడిగితే గాని నిజం కక్కరు.’’ కర్కశంగా అన్నాాడు ఎస్సై.

‘‘సార్!... సార్!.... చెప్పడానికేముంది సార్! ఆవిడ శెట్టిగారి దగ్గర కొచ్చింది. ఈయన చిల్లర లేదంటే నా దగ్గరుందని చిల్లర తీసి ఇచ్చాాను. అంతే సార్ జరిగింది.’’ వినయంగా వంగిపోతూ చెప్పాాడొక యువకుడు.

‘‘నిజమా?!...’ ఎగతాళిగా అంటూనే ఆ యువకుల చేతుల మీద మెడ దగ్గర గాయాలు చూసి అదిరిపడ్డాాడు ఎస్సై అక్బర్ ఖాన్. అంతే!   కోపంతో రెచ్చిపోతూ చేతిలో ఉన్న లాఠీతో ఇద్దర్నీ ముడుకుల మీద, చేతుల మీద గట్టిగా కొడుతూ గట్టిగా అరుస్తూ అన్నాాడు ఎస్సై అక్బర్ కాన్.

‘‘నా కొడకల్లారా! అబద్ధాాలు చెప్తార్రాా! మీ చేతుల మీద మెడ మీద ఆ కత్తి గాట్లేమిట్రాా... విప్పండ్రాా! మీ చొక్కాాలు విప్పండి.... కానిస్టేబుల్....వీళ్లిద్దరి చొక్కాాలు వూడదియ్యి.’’ పూనకం వచ్చిన వాడిలా వణికిపోతూ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అలా కేకలేస్తూూ అరిచేసరికి దుకాణాల దగ్గర ఉన్న యాత్రీకులు, వర్తకులు అందరూ ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వరహాలశెట్టి దుకాణం దగ్గరకు గుంపులుగా వచ్చి చేరుకున్నాారు. యాత్రీకులు, వర్తకులు అందరూ ఆ యువకులిద్దర్నీ దొంగల్లాా చూస్తూ ఏం జరిగుంటుందోననుకుంటూ కుతూహలంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డారు. వర్తకులందర్నీ చూసి ఆ యువకులిద్దరూ సిగ్గుతో తలదించుకున్నాారు.

ఇంతలో ఒక వ్యక్తి గుంపులో నుండి ధైర్యంగా చొచ్చుకువచ్చి ఎస్సై అక్బర్ ఖాన్ ముందు నిలబడ్డాాడు.

‘‘సార్! వీళ్లిద్దరూ మా కుర్రాాళ్ళే! మా దుకాణాల్లో పని చేస్తూ ఉంటారు. వీళ్ళ వలన ఏదైనా పొరపాటు జరిగి వుంటే క్షమించి వదిలెయ్యండి సార్.’’ అన్నాాడతను.

‘‘వీళ్ల తరఫున నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నాావా! వీళ్ళిద్దరూ ఏం చేసారో తెలుసా?!...’’అంటూనే ఆ ఇద్దరు యువకుల కేసి తిరిగి, ‘‘చెప్పండ్రాా! ఈ కత్తిగాట్లేమిటి? ఏం చేసారో చెప్పండి.’’ లాఠీతో ఇద్దర్నీ కొట్టినట్టుు బెదిరిస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై చెప్పింది వింటూనే ఆ యువకులిద్దరినీ సమర్థిస్తూూ వచ్చిన వ్యక్తి ఇదేదో పెద్ద వ్యవహారమేననుకుంటూ అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాాడు.   

అదే సమయంలో, ఆమె తన బుజాల మీద ఉన్న బ్యాగ్ భద్రంగా మోసుకుంటూ కేశఖండనశాల కేసి నడుస్తోంది. ‘తనతో ఈ బ్యాగ్ ఉండడం మంచిది కాదు. నిన్న తనని చూసినవాళ్లంతా తప్పక గుర్తు పట్టేస్తాారు. ఏం చెయ్యాాలి?’’ అనుకుంటూ గాబరాగా నడుస్తున్న ఆమె స్వాామివారి రథశాల దగ్గరకు చేరుకుంది.

****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో  

 

ఎస్సై అక్బర్ ఖాన్ ఆ కుర్రాళ్ళ చేత ఏం నిజం కక్కించగలిగాడా? అంటా గమనిస్తున్న " ఆమె " దొరికిందా?

ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చేే రేపటి దాకా ఆగాల్సిందే......



Recent Posts
అన్వేషణ తెలుగు నవల ఆరవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 6  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఆరవ భాగం ...
గ్రామదేవతల సోదరుడు బోనాలు పోతురాజు అసలు కథ  | Poturaju Mystery Explained, ashadha Bonalu 2026
గ్రామదేవతల సోదరుడు బోనాలు పోతురాజు అసలు కథ...
అన్వేషణ తెలుగు నవల ఐదవ భాగం  | Anveshana part 5  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఐదవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల నాలుగవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 4  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల నాలుగవ భాగం ...
అన్వేషణ తెలుగు నవల మూడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 3  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల మూడవ భాగం ...