అన్వేషణ తెలుగు నవల ఏడవ భాగం | ఇందూరమణ | Anveshana part 7 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 28 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

ఏడవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


స్వాామి వారి కళ్యాణోత్సవాల్లోో ఉత్సవమూర్తుులను ఈ రథం మీదే ఊరేగిస్తాానరనుకుంటూ రథాన్ని, దాని అలంకరణని తదేకంగా చూస్తూ క్షణం నిలబడింది ఆమె. ‘‘రండమ్మాా!... మీ సామాన్లుు ఇక్కడ భద్ర పరుచుకోండి. రోజుకు పది రూపాయలే! దర్శనం అయిపోగానే మీ సామాన్లు మీరు భద్రంగా తీసుకోండి.’’ ఒక కుర్రాాడు ‘ఇచ్చట సామాన్లు భద్రపరచబడును’ అన్న బోర్డున్న గది దగ్గర నిలబడి అరుస్తున్నాాడు.

ఆ అరుపు వింటూనే అటు కేసి చూసింది ఆమె. ‘‘ఇక్కడ సామాన్లు భద్ర పరచబడును’’ అన్న బోర్డు చూస్తూనే ఉత్సాాహంగా వెళ్లి మెళ్లో ఉన్న బ్యాాగ్‌ని అక్కడ భద్రపరచడమే మంచిదనుకుంటూ బ్యాాగ్‌ తీసి క్రింద పెట్టింది. బ్యాాగ్‌ కు ఉన్న నెంబర్‌ తాళం ‘కీ’ మనసు లోనే నెమరు వేసుకుంటూ తాళం తెరిచి బ్యాాగ్‌ జిప్‌ తీసింది. తనకి అత్యంంత అవసరమనుకున్న చిన్న చిన్న వస్తుువులన్నీ చేతిలో ఉన్న చిన్న కేష్‌ పర్సు లాంటి దానిలో దాచుకుంది. బ్యాాగ్‌ యథాలాపంగా మూసేసి ‘తాళం’ నెంబర్లు చక చకా కల్లీ బల్లీగా చెల్లా చెదురు చేసి లాక్‌ చేసింది. బ్యాాగ్‌ క్లోక్‌ రూమ్‌లో దాచేసి రశీదు తీసుకుని పర్సులో భద్ర పరుచుకుంది. ‘హమ్మయ్య’ ఇక తనని గుర్తు పట్టడానికి ఒక ఆనవాలుని భద్రంగా దాచేసింది. ఇక రెండో పని!’ అని మనసులోనే అనుకుంటూ కేశఖండనశాల కేసి నడిచింది ఆమె. దర్జాగా నడుచుకుంటూ వెళ్లి కేశఖండనశాల దగ్గర స్వాామి వారికి తల నీలాలు అర్పించడానికి చెల్లించాల్సిన రుసుము పది రూపాయలు కట్టి రశీదు తీసుకుంది.

స్వాామి వారికి తలనీలాలు సమర్పిస్తున్న భక్తుులు ఒకో క్షురకుడి దగ్గర క్యూలో నిలబడి ఉన్నాారు. ఆమె కూడా తన టిక్కెెట్టు మీద ఉన్న నెంబరు ప్రకారం ఒక క్షురకుడి దగ్గర గుండు చేయించుకోవడానికి సిద్ధంగా భక్తుల క్యూలో నిలబడింది. గుండు చేయించుకుంటే ఇక తనని ఆ బ్రహ్మదేవుడు కూడా గుర్తు పట్ట లేడు’ అనుకుంటూ మనసులోనే మురిసి పోయిందామె.

***************

ఎస్సై ముందు నిజం ఒప్పుకోక పోతే ముసలమ్మని చంపింది తామేనని రూఢీ చేసుకుని నేరం మోపి జైల్లోోకి నెట్టేసినా నెట్టేస్తాాడు. చెప్పెయ్యాాలి. ఈ గాయాలకి కారణం చెప్పెయ్యాాలి. లేకపోతే ఇంతకంటే భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంందని అనుకుంటూ ఇద్దరూ భయం భయంగా ఒకర్నొకరు ఎగాదిగా చూసుకుని కూడబలుక్కున్నట్లుు ఇద్దరూ ఒక్క సారే మోకాళ్ల మీద కూర్చుని ఎస్సై కాళ్ల మీద పడ్డాారు.

‘‘సార్‌! తప్పయింది క్షమించండి సార్‌! ఆవిడ అందంగా కనిపించేసరికి ఆమె మీద కన్నేేసాం సార్‌. అర్ధరాత్రి ఆమె పడుకున్న చెట్టు దగ్గర కెళ్ళి ఆమెని రేప్‌ చెయ్యాాలనుకున్నాం సార్‌!’’ ఏడుస్తూ ఒకడు ఎస్సై కాళ్లు పట్టుుకున్నాాడు.

ఆ యువకుడు చెప్పింది వినేసరికి ఎస్సైకి మతి పోయింది. ‘తానేదో ఆరా తీయబోతే ఇంకేదో చెప్తుున్నాారు వీళ్ళు. చూద్దాం! ఏం చెప్తాారో’ అనుకున్నాాడు మనసులోనే.

ఆ కుర్రాాళ్లిద్దరూ ఏడుస్తూ ఎస్సై కాళ్ల మీద పడి జరిగింది చెప్తుంంటే చుట్టూ గుమిగూడిన జనం ‘అవ్వ’ అనుకుంటూ నోర్లు వెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తూంండి పోయారు.

‘‘రేప్‌ చెయ్యబోతే`? చెప్పండి ముసలమ్మ అడ్డుగా ఉందని కత్తిితో పొడిచి చంపేసారు. అవునా?!’’ గద్దింంచాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.  

‘‘అయ్యో! ఆ ముసలమ్మ సంగతే మాకు తెలీదు సార్‌. ఆమెని మేమిద్దరం బలాత్కరించబోయే సరికి ఆవిడ ఆడపులిలా మా మీద పడి ఎక్కడ నుండి తీసిందో గాని చిన్న చుర కత్తితో ఇదిగో ఇలా మా ఇద్దర్నీ గాయ

పరిచి తన్ని తరిమేసింది సార్‌! అది ఆడది కాదు సార్‌! ఆది పరాశక్తిలా మా మీద విరుచుకుపడింది. ఆ దెబ్బతో ఇద్దరం పారిపోయి వచ్చేేసాం సార్‌! అంతే సార్‌ జరిగింది.’’ రెండోవాడు ఏడుస్తూూ తమ తప్పంతా ఒప్పుకుంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాాడు. ఎస్సైకి తల తిరిగి పోయింది

‘ఎవరామె?! చురకత్తి బొడ్లో దోపుకుని తిరిగేంత అవసరం.... అగత్యం ఏముంది?!’ ఇంత జరిగాక కూడా ఆమె పోలీసుకు ఎందుకు రిపోర్టు ఇవ్వ లేదు? ఒకవేళ వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నాారా?!

‘‘ఆమెని చూస్తే మీరు గుర్తుు పట్టగలరా?!’’ వాళ్లిద్దర్నీ క్రింద నుండి పైకి కాలర్‌ పట్టి లేవనెత్తుుతూ అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘గుర్తుు పడతాం సార్‌. ’’ హుషారుగా అన్నాారిద్దరు.

‘‘కానిస్టేబుల్‌ వీళ్లిద్దర్నీ స్టేషన్‌కు తీసుకురా!’’ అంటూనే కిరాణా దుకాణం దగ్గర నుండి వచ్చేేస్తూ, అన్నట్టు మీరు కూడా పోలీస్‌ స్టేేన్‌కు ఓసారి రావాల్సి వుంటుది వరహాల శెట్టి గారు.’’ దుకాణం కేష్‌ కౌంటర్‌లో కూర్చున్న వరహాల శెట్టితో చెప్పాాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అలాగే సార్‌’’ అంటూ వినయంగా నిలబడి చెప్పాాడు వరహాల శెట్టి.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ స్టాార్ట్‌ చేసి తారా జువ్వలా ముందుకు ఉరికించాడు.

*******************

కేశఖండనశాలలో తలనీలాలు అర్పించి గంగధార దగ్గరకు వచ్చింది ఆమె. అక్కడంతా రద్దీగా వుంది. తలనీలాలు అర్పించిన భక్తులంతా క్యూలో ఒకర్నొొకరు తోసుకుంటూ గంగధారలో స్నాానానికి మునుగుతున్నాారు. ఎక్కడో కొండ కోనల్లోో నుండి నిరంతరం పారుతూ వచ్చేే గంగధార అన్నికాలాల్లోనూ ఆగకుండా పారుతూనే ఉంటుంది. గంగధారలో మునిగితే పాపాలన్నీ పటాపంచలై పోతాయని భక్తుల నమ్మకం. తలనీలాలు అర్పించి గంగధారలో మునిగి వచ్చిన వాళ్లందరికి జంగమదేవర ‘నామాలు’ పెడుతూ డబ్బు వసూలు చేస్తుున్నాాడు.

ఆమె గంగధారలో స్నాానం చేసి తడి బట్టలతోనే నేరుగా సింహాద్రి అప్పన్న దర్శనానికి క్యూలో నిలబడింది. వంద రూపాయల ప్రత్యేేక దర్శనం క్యూ లైను రెండు కిలోమీటర్ల మేర పొడవుగా భక్తుులతో చాంతాడులా పాకి పోయి ఉంది.  

ఉచిత దర్శనాల క్యూూ అయితే మరి చెప్పక్కర లేదు. కొండమీద మాడ వీధులన్నీ మెలికలు తిరిగి ఉంది క్యూూ.

ఏది ఏమైనా ఈ రోజు అప్పన్న స్వాామిని దర్శించుకుని రావాలని స్థిరంగా నిర్ణయించుకుందామె. క్యూూలో నించుందే గాని మనసు దేవుడి మీద లగ్నం కావటం లేదు.‘ముసలమ్మ’కి తన శాలువా కప్పి తప్పు చేసిందా?! ఇప్పుుడు తన ఉనికి కూడా బయట పడేలా వుంది. ఎలా?! తన అన్వేేషణ కొనసాగడం ఎలా?! తన జీవిత గమ్యం అదే! తన బ్రతుక్కిి పరమార్థం...తన జన్మకి చరితార్థం...అదే...తన అన్వేేషణ ఫలిస్తేేనే తను ఉండ గలదు. లేక పోతే....ఒక వేళ ఫలించక పోతే...అమ్మోో... అనుకుంది. ఆ ఆలోచన మనసులో మెదలగానే నిలువెల్లాా భయంతో కంపించుకు పోయింది ఆమె ‘‘దేశం నలుమూలలా తిరిగైనా తన అన్వేేషణ కొనసాగిస్తుంంది గానీ, ప్రాాణం పోయినా వెనకడుగు వెయ్యదు. వెయ్య లేదు!’’ తన జీవితగమ్యంం అదే కదా స్థిరంగా అనుకుంది ఆమె.

******************

గోపాల పట్నం పోలీస్‌స్టేషన్‌.. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఒంటరిగా సీట్లో కూర్చుని ఆలోచిస్తున్నాాడు. కొండపై నుండి నేరుగా స్టేషన్‌ కొచ్చేేసాడు. ముసలమ్మ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తీసుకువెళ్లారు. ముసలమ్మ తరఫువాళ్ళు ఎవరూ లేరు. వస్తాారో.... రారో.... తెలీదు. అనాథ శవంగా కేసు క్లోజ్‌ చేయడానికి వీలు కాదు. ‘హత్య’ చేసి చంపేసారు. ఎవరో? ఇది యాదృచ్ఛికమా?! కావాలనే చంపేసారా? ఎందుకు?! ముసలమ్మ దగ్గర అంత విలువైన వస్తుువులు ఏమున్నాాయి? లెక్క లేనంత నగలు...నగదు ఉందా? సహజ మరణమైతే అక్కడే పంచనామాతో కేసు ముగించేసే వాడు. కానీ, ఈ హత్యోోదంతాన్నిి ఎలా పరిశీలించాలి?! పరిశోధింంచాలి! హత్య జరిగిన రాత్రి ముసలమ్మతో ఎవరో మరొకామె కూడా ఉందన్నది రూఢీ అయింది. ఎవరామె! కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి చెప్పిన దాని ప్రకారం ఎవరో ఒకామె ఈ ముసలమ్మకి రొట్టె, జామ్‌ కొని ఇచ్చిందన్నది నిజం. ఆమె ఆ రొట్టెలో ‘మత్తు’ మందు కలిపిందా?! తెలివి లేకుండా పడుకున్న ముసలమ్మని

పొడిచి పారిపోయిందా?! ఎందుకు?! ఆలోచిస్తుున్న కొద్దీ తల తిరిగి పోతోంది ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి. ఇంతలో స్టేషన్‌ రైటర్‌ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ గది దగ్గరకొచ్చి తలుపు తట్టి ‘సార్‌’ అని పిలిచాడు. రైటర్‌

ఆ పిలుపుకి ఆలోచనల్లోనుండి తేరుకున్న ఎస్సై ‘‘కమిన్‌’’ అంటూ ద్వాారం కేసి చూసాడు. రైటర్‌ సెల్యూట్ చేసి గదిలో కొచ్చాాడు.

‘‘చెప్పు.’’ హుందాగా, నీటుగా జేరగిల బడి అన్నాాడు ఎస్సై.

‘‘సార్‌! కొండ మీద హత్య చేయబడ్డ ముసలమ్మ దగ్గర దొరికిన చిన్నబట్టల మూటలో ఈ డాక్యుమెంట్లుు ఉన్నాాయి సార్‌?!’’ అంటూ చేత్తో పట్టుకొచ్చిన కాగితాలు ఎస్సై టేబుల్‌ మీద పెట్టాడు రైటర్‌.

‘‘ఎస్‌!.. ఆ ముసలమ్మ దగ్గర బట్టలమూట దొరికింది కదూ. శవం దగ్గర దొరికిన ప్రతి వస్తుువు ఎలిబీ లిస్టులో రాయండి.’’ అంటూనే తన ముందు రైటర్‌ పెట్టిన డాక్యుుమెంటు పేపర్లు తీసి చూసాడు ఎస్సై. 1971లో రిజిస్టర్‌ అయిన డాక్యుమెంటది. డాక్యుమెంటు మొత్తం పేజీలన్నీ చదివాడు. డాక్యుమెంటుతో బాటు రెండు పేజీల ఉత్తరం కనిపించింది. ఎప్పుడో ఏడాది క్రిితమే రాసిన ఉత్తరం. పైన తేదీని బట్టి గ్రహింంచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నమస్కాారం!

మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. ఉత్తరం ఉపోద్ఘాతం చదువుతూనే అదిరిపడ్డాాడు ఎస్సై. ఏరికోరి కొనుక్కున్న రివాల్వింగ్‌ చైర్లో రిలాక్స్‌డ్‌గా కూర్చన్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఛటుక్కుున ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాాడు.


****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


ఉత్తరాన్ని చూసి అంతలా అదిరిపడ్డాదెందుకు అక్బర్ ఖాన్!??? ఉత్తరంలో ఏముంది? అక్కడక్కడే సంచరిస్తుున్నతిరుగుతున్నా' ఆమె ' ఎవరో

తెలిసిపోయిందా....?????

Recent Posts