అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం | ఇందూరమణ | Anveshana part 8 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 29 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అన్వేషణ

ధారావాహిక నవల

ఎనిమిదవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


‘‘అందరూ ఉన్న అనాథను నేను. ఆస్తి ఐశ్వర్యాాలున్న బికారిని. భిక్షగత్తెెను. ‘నా’ అన్నవారు ఉన్నాా ‘నా’ ఆస్తి మీద కన్నేేసిన వారే ఎక్కువ. ముఖ్యంగా నా బిడ్డలు. కొడుకులు ఇద్దరూ స్వాార్ధ పరులే. తండ్రి పోయి ఒంటరిదైన తల్లి ఎలా బ్రతుకుతుందో అని కూడా ఆలోచించకుండా పెళ్ళాలతో విదేశాలకి చెక్కేేసిన ఘనులు. నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎవరూ లేని అనాథ. అయినా, అందరికన్నాా గొప్పగా బ్రతకాలని ఎన్నోో ఆశలతో ఒక్కటయ్యాం. అలాగే బ్రతికాము. ముగురు పిల్లల్ని గొప్పగా పెంచాము. పెద్ద చదువులు చదివించాము. అబ్బాాయిలిద్దరికి వారికి నచ్చిన అమ్మాాయిల్నేే ఇచ్చి పెళ్లిళ్ళు చేసాము. ఆ రోజుల్లోో.. నగరానికి దూరంగా ఎకరం మామిడి తోట కొని అందులో పర్ణశాల లాంటి ఇల్లు కట్టుుకున్నాం. పిల్లల్తో పాటూ ప్రేమగా పెంచుకుంటూ దాన్ని రెంండంతస్థుల భవనంగా మార్చుకున్నాం. ఇప్పుుడు అది నగరం నడిబొడ్డునుంది. దాన్ని అమ్మేసి డబ్బుు చేసుకుందామని నా కొడుకుల ఆలోచన.

కానీ....కానీ....నా ప్రాాణం పోయినా ఆ ఆస్తిని అమ్మేది లేదని నేను. అది నా భర్త ఆస్తి. నా భర్త కల. ఆయన పోతూ పోతూ నాకు చెప్పిన మాట ఒక్కటే.

‘‘సత్యాా! మనం ఇద్దరం అనాథలామ్. తల్లెెవరో తండ్రెవరో తెలీకుండా ఒకే దగ్గర పెరిగాము. మనల్ని కన్నతల్లిలా ఆదరించిన ‘ప్రేమ సమాజం’ లో మనలాగే ఇంకా ఎందరో అనాథలు పెరుగుతూనే ఉన్నాారు. మన పిల్లలు ఇప్పుడు అనాథలు కాదు. పెళ్ళాం పిల్లలతో ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాారు. వాళ్లకి ఈ ఆస్తితో అవసరం లేదు. రాదు. అందుకే నీ తదనంతరం ఈ ఆస్తిని ఎలాగైనా ‘ప్రేమ సమాజాని’కి అప్పగించు. మన లాంటి వాళ్లకి ఇది ఆసరా కావాలి అదే నా చివరి.. చిరకాల వాంఛ!’’ అంటూనే నా చేతుల్లోో కన్నుమూసారాయన.

నా కొడుకులు నాతో యుద్ధంం చేసి నా ఆస్తిని స్వాాధీనం చేసుకోబోయారు. ఎదిరించాను. చివరికి నన్ను ఒంటర్ని చేసి, నా ఇల్లు, తోట వారు స్వాాధీనం చేసుకుందామనుకున్నాారు. నాతో ఎలాగైనా ఆస్తి రాయించుకుందామని ఎన్నోో విధాల ప్రయత్నింంచారు. వాళ్ళకి కనిపించకుండా ఇలా దేశంలో వున్న దేవాలయాల్ని తిరుగుతున్నాాను. నా కొడుకులు నా కోసం వెదుకుతారు. చివరికి నన్ను చంపైనా చేజిక్కింంచుకోవాలనుకుంటారని నాకు తెలుసు. అందుకే నేను అక్కడ నుండి బయటపడి దేవాలయాలన్నీ తిరుగుతూ మేము చిన్నప్పుడు పెరిగిన ప్రేమసమాజానికి వెళ్ళాను. విషయం చెప్ప నా దగ్గరున్న ఈ డాక్యుుమెంట్లుు ఇచ్చాాను.

అక్కడ.. ఇప్పుడు.... ప్రేమ సమాజానికి పెద్ద దిక్కుగా నిలబడ్డ వ్యక్తి ఈ ఆస్తిని తన పేర రాసెయ్యమన్నాాడు. నేను బ్రతికినంత కాలం ‘ప్రేమ సమాజం’లో అనాథలకి సేవ చేస్తూ ఉండొచ్చన్నాాడు. నా ఇద్దరు కొడుకులకి చెరో కోటి రూపాయలు ఇస్తాానన్నాాడు. అప్పుడే నాకు ఏదో మోసం జరగబోతోందని గ్రహించాను. నా కొడుకులకు కూడా డబ్బుు ఇస్తాానన్నప్పుడే నా ఆస్తి మీద అతను కన్నేేసాడని గ్రహింంచి ఇదిగో.... ఇలా సింహాద్రి అప్పన్న చెంతకు చేరి భిక్ష గత్తెెలా నా చివరి

ఘడియలు గడిపేస్తుున్నాాను. పుణ్యాాత్ముులారా! చదివారు కదా నా గోడు. ఈ ఆస్తిని నా కొడుకుల కబంధహస్తాాల నుండి విడిపించి నా భర్త ఆత్మకు శాంతి చేకూరేలా మా ఇద్దరి మనోభీష్టంం ప్రకారం ‘ప్రేమసమాజం’లో అనాథలకి చెందేలా సహాయ

పడగలరు. ఈ లేఖతో పాటు నా బట్టల్లో ప్లాాస్టిక్ కవరులో వెలునామా కూడా రాసి పెట్టాాను. దయ చేసి తమరైనా మా కోరిక తీర్చ గలరు.’’ అంటూ లేఖ రాసి క్రింద ‘సత్యవతి’ అని సంతకం చేసి ఉంది.

ముసలమ్మ రాసిన ఉత్తరం చదువుతూనే ఉలిక్కిిపడ్డాాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఛటుక్కున ఎదురుగా వున్న డాక్యుమెంట్లు తీసి చక చకా అన్ని పేజీలు తిరగేసాడు. ఎక్కడా వీలునామా పేపర్లు కనిపించ లేదు. ఉత్తరంలో ముసలమ్మ రాసిన వాక్యాాలు గుర్తుు చేసుకున్నాాడు. గబ గబా ఉత్తరం మరో సారి చదివాడు. వీలునామా పేపర్లు ప్లాాస్టిక్ కవరులో భద్ర పరిచినట్టుు రాసింది ముసలమ్మ. వెంటనే ప్రక్కనే ఉన్న బజర్ మీట క్కాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సర్!’’ బజర్ సౌండ్ వినగానే పరిగెత్తుకువచ్చాాడు కానిస్టేబుల్.

‘‘రైటర్ ని ఇలా రమ్మను.’’ ఆతృతగా అన్నాాడు ఎస్సై. కానిస్టేబుల్ ఎంత వేగంగా వెళ్లాడో అంతే వేగంగా రైటర్ ని వెంటబెట్టుకు వచ్చాాడు.

‘‘సార్! పిలిచారట?!’’ వినయంగా అడిగాడు రైటర్.

‘‘రైటర్ గారూ! ముసలమ్మ గుడ్డల మూటలో ఏమేమి దొరికాయో ఇలా పట్రండి.’’ ఆర్డర్ జారీ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై మాట వింటూనే అరక్షణంలో తన దగ్గరున్న ముసలమ్మ గుడ్డలమూట, ఆమె దగ్గర దొరికిన ‘ఎలిబీ’లన్నీ తెచ్చి ఎస్సై ముందుంచాడు రైటర్.

రొట్టె కవరు, జామ్ కవర్ లు ఒక ప్లాాస్టిక్ కవరులో పెట్టి ప్యాాక్ చేసి ఉంచాడు రైటర్. ముసలమ్మ కప్పుకున్న ‘శాలువా’ ని కూడా ప్లాాస్టిక్ కవరులో భద్ర పరిచాడు. బట్టలమూటలో నాలుగు చీరలు, జాకెట్లు, చిరిగిన లంగాలు, చిన్న పర్సు, అందులో ఒక ఏభై రూపాయల నోటు, అయిదు పదిరూపాయల నోట్లు, మిగతా అంతా చిల్లర నాణాలు ఉన్నాాయి. ముసలమ్మ బట్టల మూటంతా చిందరవందరగా కెలుకుతూ వెదికాడు ఎస్సై అక్బర్ ఖాన్. భిక్షమెత్తుుకునే ముసలమ్మ బట్టల మూటనంతా ఎస్సై గబగబా కెలికేస్తూ దేని కోసమో వెతుకుతుంటే రైటర్ విస్తుపోయాడు.

‘‘సార్! అందులో అంత ముఖ్యమైన వస్తుువులేవీ లేవండి! ఆ డాక్యుమెంటు ఒకటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఉంది.’’ అన్నాాడు రైటర్. 

‘‘అదే... ఆ ప్లాస్టిక్ కవరు ఏది?’’ ఆందోళనగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అదిగో! అదే సర్! ‘శాలువా ఉంది కదా. అదే కవరులో భద్రంగా దాచి ఉన్నాాయి ఈ డాక్యుమెంట్లు.’’ అన్నాాడు రైటర్.

‘శాలువా’ ఉన్న కవరు తీసి అంతా దులిపిచూసాడు ఎస్సై.

‘‘కొంప మునిగింది. ఇందులో ప్లాస్టిక్ కవరు చుట్టి వీలునామా దాచి ఉంచానని ముసలమ్మ తన ఉత్తరంలో రాసింది. ఇప్పుడా కవరు దొరక్క పోతే కొంపలంటుకుంటాయి. ముసలమ్మ యావదాస్తికి హక్కుదారులెవరో తేల్చాాల్సింది ఆ వీలునామాయే. అది కనిపించక పోతే....?! ఎవరికి లాభం? ముసలమ్మ తదనంతరం ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది?’ ఆలోచిస్తూూనే ఉలిక్కిి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్! వీలునామా కనిపించక పోతే ఆ యావదాస్తి ఆ ముసలమ్మ కుమారులకే చెందుతుంది. ఇప్పటికే ఆస్తిని తమ చేతుల్లోకి తీసుకున్నాారు వాళ్ళు. అంటే....?! ముసలమ్మ కొడుకులే తమ తల్లిని చంపించేసారా? కిరాయి హంతకులతో ఈ ఘోరానికి పాల్పడ్డారా?! వాళ్ళే ముసలమ్మ దగ్గరుండాల్సిన వీలునామాని ఎత్తుుకు పోయారా? మరి ఈ డాక్యుమెంట్లు ఎందుకు వదిలేసారు?" ఎక్కడివక్కడ వదిలేసి రివాల్వింగ్ చైర్ కి చేరగిలబడి తలమీద... నుదురుమీద రుద్దుకుంటూ కణతలు

నొక్కుుకున్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఏమైంది సార్! ఎందుకంత ఆందోళనగా ఉన్నాారు?’’ ఆత్రుతగా అడిగాడు రైటర్.

‘‘ముందు ఈ క్లూసన్నీ జాగ్రత్త చెయ్యి’’ అంటూనే, ‘‘ఇంతకీ రైటర్ గారూ! ముసలమ్మ చావుకు కారణమైన హత్యాాయుధం దొరక లేదు కదూ? వెంటనే మన వాళ్లిద్దర్ని పంపించి హత్ జరిగిన చుట్టుు ప్రక్కల ప్రాంతం అంతా వెతికించండి. ముఖ్యంగా ప్లాాస్టిక్ కవరులో భద్రపరిచిన కాగితం ఏదన్నాా దొరికితే వదిలెయ్యొద్దని చెప్పండి.’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! అదంతా కొండలు.. .గుట్టలతో నిండిన అడవి ప్రాంంతం సార్. క్రిందపడితే ఎటు దొర్లుకెళ్తుందో తెలీని లోయలు కూడా. మనవాళ్ళు ఎక్కడని వెతక గలరు?’’ నమ్రతగా అన్నాాడు రైటర్.

‘‘నాకు తెలీదంటారా?! కానీ వెతకాలి. హత్యాాయుధం కన్నాా ప్లాస్టిక్ కవరులో చుట్టిన పేపరు చాలా అవసరం. అది లేకపోతే ముందు మనం ముద్దాయిలమవుతాం. వెళ్లండి! అప్రమత్తంంగా ఉండే చురుకై కానిస్టేబుల్స్ని  పంపించండి.’’ అన్నాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్ సార్!’’ అంటూ అక్కడ నుండి తన సీటు దగ్గరకు వెళ్ళాడు రైటర్. రైటర్ వెళ్లగానే ఉలిక్కిిపడి సీట్లో నుండి లేచి నిలబడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్. ముసలమ్మతో పాటు ఎవరో మరొకామె ఉంది అదే ప్రదేశంలో. ఎవరామె?! ఆమెనే కదా! ఈ యువకులిద్దరూ చెరచబోయింది. ఆమె చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయామన్నాారు. చురకత్తితో వారిమీద దాడి చేసిన ‘ఆమె’ సాధారణ స్త్రీ కాదు. కత్తి బొడ్లో దోపుకు తిరుగుతూందంటే సాదా సీదా సంసారి కాదు. మరి ఎవరామె?

ఎస్! ఆమె....ఆమె సాధారణ స్త్రీ కాదు’ అనుకుంటూనే రైటర్ వెనుకే గదిలో నుండి బయటకు వచ్చాాడు ఎస్సై అక్బర్ ఖాన్.

స్టేషన్ అంతా ఫిర్యాాదుదారులతో కిక్కిిరిసిపోయి వుంది. లా అండ్ ఆర్డర్ ఎస్సై గది ముందు నలుగురైదుగురు బాధితులు నిలబడి ఉన్నాారు. అందర్నీ తప్పింంచుకుంటూ జేబుదొంగల్ని, ముద్దాాయిల్ని నిర్బంధించే సెల్ దగ్గరకు వెళ్లాడు ఎస్సై అక్బర్ ఖాన్.  

సెల్ లో నలుగురైదుగురితో పాటు కొండలమీద నుండి లాక్కొచ్చిన యువకులిద్దరూ సిగ్గుతో ఓమూల నక్కిి కూర్చున్నాారు. వారి ఒంటిమీద ఒక్క కట్ డ్రాాయర్ తప్ప మరే ఆచ్ఛాాదన లేదు. అర్ధనగ్నంగా కూర్చొొని తలలు మోకాళ్ళలో దాచేసుకున్నాారు.

క్రైైమ్ ఎస్సై అక్బర్ ఖాన్ సెల్ దగ్గరకు రావడం చూస్తూనే అక్కడే కాపలాగా ఉండాల్సిన సెంట్రీలు బయట నిలబడి ఎవరితోనో మంతనాలు చేస్తున్న వాళ్ళు పరుగు పరుగున సెల్ దగ్గరకు వచ్చాారు.

‘‘సార్!’’ ఇద్దరు సెంట్రీలు వినయంగా ఎస్సైకి సెల్యూట్ చేసారు.

‘‘వాళ్లిద్దర్నీ మేడమీద ఇంటరాగేషన్ సెల్ దగ్గరకు తీసుకురండి’’ అంటూ మేడమీదకు టక టక బూట్ల శబ్దం చేసుకుంటూ హుందాగా నడిచి వెళ్ళాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఆ యువకులిద్దర్నీ అలా సెల్లో పడేసి ఉంచకూడదు. వారిద్దరూ ఏం నేరం చేసారని వారిని బంధించగలడు? వాళ్ళకు వాళ్ళే ఎవరో ఒకామెని చెరచబోయామని చెప్పాారు. కాని, ఆమె ఎక్కడ?! ఆమె ఫిర్యాాదు చేస్తేనే గాని వీళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఆ ముసలమ్మ హత్యకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని రూఢీగా తెలుస్తూనే ఉంది. కానీ, రాత్రి ఆ ముసలమ్మతో ఎవరో ఒకామె ఉందన్న గట్టి ఆధారం వాళ్ళే. ఈ ఇద్దరు యువకులే ఆమె ఎవరో కనిపెట్టి పట్టుకో గలరు. ఆలోచిస్తూనే ఇంటరాగేషన్ సెల్ దగ్గరకెళ్ళాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ఇంటరాగేషన్ సెల్ దగ్గరకు వెళ్ళారని సెంట్రీలు ఇద్దరూ రైటర్ కి చెప్పి సెల్లో ఉన్న యువకుల్నిి తీసుకుని మేడ మీదకు వెళ్ళారు.

*****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


అందినట్టే అంది...అందకుండా పోతున్న, అర్థం కాని ప్రశ్నార్ధకంగా మిగిలిపోతున్న, కేసు ఏ మలుపు తిరగబోతోంది? ఈ అన్వేషణ ఎక్కడికి దారితీసింది?


Recent Posts
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం  |  ఇందూరమణ | Anveshana part 8 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం ...
ఒడిశాలోని రహస్య శక్తి పీఠం - తారా తారిణి ఆలయం అద్భుతాలు | Odisha's Most Powerful Shakti Peetha Mystery  |  Tara Tarini Temple
ఒడిశాలోని రహస్య శక్తి పీఠం - తారా...
అన్వేషణ తెలుగు నవల ఏడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 7  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఏడవ భాగం ...
అర్థరాత్రి పూరీ జగన్నాథ ఆలయంలో ఏం జరుగుతుంది | Navakalebara Mystery Explained, biggest secret of puri temple
అర్థరాత్రి పూరీ జగన్నాథ ఆలయంలో ఏం జరుగుతుంది...
అన్వేషణ తెలుగు నవల ఆరవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 6  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఆరవ భాగం ...