అన్వేషణ తెలుగు నవల తొమ్మిదవభాగం | ఇందూరమణ | Anveshana part 9 | investigative & most suspense novel

Vijaya Lakshmi

Published on Jun 30 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

  అన్వేషణ

9

ధారావాహిక నవల

తొమ్మిదవ భాగం

రచన : శ్రీ ఇందూరమణ


‘‘వాళ్ల బట్టలు వాళ్లకు ఇచ్చెెయ్యండి!’’ డ్రాాయర్లతో దిగంబరంగా వచ్చిన యువకులకేసి అబిమానంగా చూస్తూ అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కావాలనే వాళ్ళమీద ప్రేమ ఒలకబోసాడు.మంచిగానే వాళ్ళని దారికి తెచ్చుకోవాలనుకున్నాాడు.

ఎస్సై మాటలు వింటూనే ఒక సెంట్రీీ పరుగున క్రింందకు దిగి ఆ యువకుల బట్టలు పట్టుకుని వచ్చాాడు.

‘‘ముందా బట్టలు వేసుకోండి. వీళ్ళకి టిఫిన్‌ పెట్టించారా?’’ సెంట్రీ కేసి చూస్తూ అడిగాడు ఎస్సై.

‘‘ఎస్సాార్‌! స్టేషన్‌కి తీసుకు వస్తుున్న దారిలోనే హోటల్‌లో టిఫిన్‌ చేసాం సార్‌!’’ పాపం వాళ్లే మాకు హోటల్లో టిఫిన్‌ పెట్టింంచారని మనసులోనే అనుకుంటూ అన్నాాడు ఓ కానిస్టేబుల్‌.

‘‘నువ్వెెళ్లి రైటర్ని ఒకసారి రమ్మను’’ తన ఎదుటే వినయంగా నిలబడ్డ కానిస్టేబుల్‌తో అంటూనే ఆ యువకులకేసి వారగా చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! మేము వెళ్లిపోవచ్చాా?’’ బట్టలు చకచకా తొడుక్కుని ఎస్సైై ముందు భయంగా నిలబడి అన్నాారిద్దరు.

ఇంతలో రైటర్‌ ఆతృతగా మేడ మీదకు వచ్చాాడు.

‘‘రైటర్‌ గారూ! హతురాలు కప్పుకున్న శాలువా ఒకసారి పట్రండి.’’ అన్నాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అలాగే సార్‌!’’ అంటూ మెట్లు దిగి క్రిందకు వెళ్ళాాడు రైటర్‌.

రైటర్‌తో ఎస్సై చెప్పింది వింటూనే ఇద్దరు యువకులూ మతి చెడినవాళ్లలా అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో రైటర్‌ ‘శాలువ’ భద్రపరచిన కవరు పట్టుకువచ్చాాడు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందున్న టేబుల్‌ మీద ఉంచాడు.

‘‘ఈ ‘శాలువ’ ఎవరిదో మీకు తెలుసా?’’ శాలువ కేసి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఖరీదైన శాలువ. అదీ విదేశాల్లో కొన్నది. హతురాలిదేనా? విదేశాల్లో ఉన్న కొడుకులిచ్చాారా?! హతురాలి బట్టలమూట చూస్తే ఎన్నోో ఏళ్ళుగా దేశ దిమ్మరిగా దేశాలు పట్టుకు తిరుగుతున్న యాచకురాలి బట్టల్లా ఉన్నాాయి. శాలువ’ చూస్తే కొత్తగా... ఈ మధ్య కొన్నదిలా ఉంది. అంత ఖరీదైన ‘శాలువ’ హతురాలి దగ్గరకు ఎలా వచ్చింది? దేవాలయానికి వచ్చిన విదేశీ టూరిస్ట్‌ లు ఇచ్చాారా?! పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వారిని అడిగాడు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ మదినిండా ఆలోచనలు గింగిర్లు తిరుగుతూనే ఉన్నాాయి. ఎందుకైనా మంచిదని ‘శాలువ’ గురించి ఈ యువకులను అడిగితే ఏం సమాధానం వస్తుందో అన్న ఉద్దేేశంతో అడిగాడు.

‘‘సార్‌... సార్‌.... ఈ శాలువ.... ‘ఆమె’ కప్పుకోగా నేను చూసాను....’’ ఉన్నట్టుండి ఆ ఇద్దరిలో ఒక యువకుడన్నాాడు.

‘‘ఎవరు?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై.

‘‘అదే సార్‌! మా మీద కత్తితో ఎటాక్‌ చేసిందే ఆమె సార్‌?’’ అన్నాాడు రెండో యువకుడు.

ఆ యువకులు ఇద్దరి మాటలు వింటూనే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఆమె... అంటే...!! ముసలమ్మకి రొట్టె, జామ్‌ తినడానికి ఇచ్చింది....ఆమెనా మీరు చెప్తున్నది.’’ అన్నాాడు ఎస్సైై.

‘‘అవును సార్‌! ఆమె!’’ అన్నాారిద్దరూ ఒక్కసారే ముక్త కంఠంతో. ఆ యువకులు చెప్పింది వింటూనే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘ఎవరామె?! ఆమె కొంపతీసి ఉగ్రవాది కాదు కదా! ఆ ముసలమ్మని చంపాల్సిన అవసరం ఆమెకేముంది?? లేదా ఆ ముసలమ్మ కొడుకులే ఇదంతా చేయించారా?’ కొంప దీసి కిరాయి హంతకురాలు కాదు కదా? అరే అల్లా...! దేశం ఏ దిశకెళ్తూంది. ఆలోచిస్తుున్న కొద్దీ మతిపోతోంది ఎస్సైై అక్బర్‌ ఖాన్‌ కి.

‘‘మీ ఇద్దర్నీ వదిలేస్తాను. మీమీద ఎలాంటి కేసు బుక్‌ చెయ్యను. కానీ, నాకో సహాయం చెయ్యాాలి.’’ యువకులిద్దరి కేసి ఓరగా చూస్తూ అన్నాాడు ఎస్సై.

‘‘ఏం చెయ్యాాలి సార్‌?’’ ఉత్సాాహంగా అన్నాారిద్దరూ.

‘‘మీమీద ఎటాక్‌ చేసిన ఆమెని మీరు గుర్తించగలరు కదా! ‘ఆమె’ ఎక్కడున్నాా మీరు వెతికి పట్టుుకోవాలి. మీ వెనుకే మా కానిస్టేబుల్స్‌ని పంపిస్తాను. వాళ్ళు సివిల్‌ డ్రస్సుల్లో యాత్రీకుల్లా మీ వెనుకే ఉంటారు.’’ చెప్పాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్ సార్! ‘ఆవిడ’ ఎక్కడ కనిపించినా పట్టుకుని మీ కానిస్టేబుల్స్‌కి అప్పగిస్తాం సార్‌?’’ అన్నాాడొక యువకుడు ఆనందంగా.

‘‘సార్‌! ఆవిడ దొరికాక మామీద మళ్లీ కేసు పెట్టి సెల్‌లో పడేసి చితకబాదెయ్యరు కదా!’’ అన్నాాడు రెండోవాడు భయం భయంగా.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చిన్నగా మనసులోనే నవ్వుకున్నాాడు.

‘‘వెళ్లండయ్యాా! వెళ్లంండి! సార్‌ మనసు మార్చుకునే లోపు ఇక్కడ నుండి ఉడాయించెయ్యండి.’’ ఆ యువకులిద్దరి వెనుకే నిలబడ్డ కానిస్టేబుల్‌ ఒకడు వాళ్ల చెవి దగ్గర చిన్నగా గుసగుసగా చెప్పి ఇద్దర్నీ ఎలర్ట్‌ చేసాడు.

ఇద్దరూ చకచకా గదిలోనుండి బయటకు వస్తూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కేసి చూసి వినయంగా నమస్కాారం పెట్టాారు.

‘‘సార్‌! వెళ్ళొస్తాం సార్‌!’’ అన్నాాడొక యువకుడు గది దాటుతూ.

‘‘ఏం! మళ్లీ రావాలని సరదాగా ఉందా?’’ వాళ్లిద్దర్నీ దగ్గరుండి సాగనంపుతున్న సెంట్రీ వాళ్లని మోచేత్తో ముందుకు తోస్తూ అన్నాాడు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ వాళ్ల ధ్యాాసలో లేడు. ఆ యువకులిద్దరూ చెప్పింది విన్న దగ్గర్నుండి ‘ఆమె’ ఎవరు? అన్న అన్వేేషణతో ఆలోచనలో పడిపోయాడు. ఈ యువకులిద్దరే ‘ఆవిడ్ని’ గుర్తింంచగలరు. వీళ్లద్వాారానే ‘ఆమె’ని పట్టుకోవాలి. ఎలా?! ఆమె ఇంకా ఇక్కడే ఉంటుందా? రాత్రి ఆ సంఘటన జరిగిన వెంటనే ఊరు విడిచి పారిపోలేదు కదా! ఒకవేళ పారిపోతే ఏం చెయ్యాాలి?’ అనుకుంటూ ఉన్నట్టుండి టక్కున సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘వెంటనే వెళ్ళి అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కేంప్‌ ఆఫీసుకి వెళ్లి ఏసిపి గారికి కేసు పూర్వాాపరాలు

తెలియజెయ్యాాలి. ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలి. ఏదన్నాా తేడా వస్తే తను బలైపోతాడు’ సర్కిల్‌ ఇనస్పెెక్టర్‌ గారికి కూడా విషయం చెప్పాాలి. అనుకుంటూనే పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆత్రుతగా బయటకు వచ్చాాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*********************

దర్శనం క్యూలైన్లో ఉన్న ఆమె గర్భాాలయం చేరుకునే సరికి సాయంత్రం అయిపోయింది. క్యూ లైన్లోనే ప్రసాదం ప్యాాకెట్లు, బిస్కట్లు కొనుక్కుని ఆకలి తీర్చుకుంది. క్యూ లైన్లకిరువైపులా టీస్టాల్స్‌, స్నాాక్స్‌ కౌంంటర్లు ఏర్పాాటు చేసారు.భక్తులు అందరూ గంటల తరబడి క్యూలైన్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బాత్‌రూమ్‌లు, మంచి నీటి కొళాయిలు అన్నీ క్యూ లైన్ల పొడవునా ఉన్నాాయి. మధ్యాాహ్నం వేళ మధ్యలో దేవాలయం అరగంట మూసేసి దేవుడికి రాజభోగం’ పూర్తి చేసారు. అదే సమయంలో అర్చకులు కూడా దేవుడి కోసం వండిన ‘రాజభోగాన్నేే’ వారూ అల్పాాహారంగా స్వీకరించి మళ్లీ దేవాలయం తెరిచారు.

ఆమె!

గర్భాాలయంలో దేవుడి ముందు స్వాామికి నమస్కాారం చేసుకుంది. అష్టోత్తర నామార్చన చేయించుకుంది. వర్సులో ఉన్న నోట్లన్నీ తీసి స్వాామి వారి హుండీలో వేసింది. హుండీ దగ్గరే నిలబడ్డ దేవాలయ ఉద్యోగి ఆమె పర్సులాంటి బ్యాాగ్‌ లో నుండి నోట్లన్నీ ఏరి మరీ స్వాామివారి హుండీలో వెయ్యడం చూస్తూనే నోరు తెరుచుకుని ఆశ్చర్య పోయాడు. సాధారణంగా భక్తులు స్వాామివారికి సమర్పించే కానుకలు ఏ రూపంలో వేసినా ముడుపుల రూపంలో పసుపు వస్త్రంలో భద్రంగా మూడు ముడులు వేసి మరీ హుండీలో వేస్తుంటారు. ఆమె గర్భాాలయంలో స్వాామి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి పూజాది కార్యక్రమాలు ముగించుకుని వస్తూ తన దగ్గరున్న చేతి బ్యాాగ్‌ లో నుండి నోట్లన్ని తీసి హుండీ లో వెయ్యడం చూసిన అర్చకుడు ఆశ్చర్య పోయాడు.

స్వాామి వారి దర్శనం చేసుకుని కొద్దిదూరంలో ఉన్న ఆండాళ్‌ సన్నిథిలో అమ్మవారికి మొక్కుకుని తన మెళ్ళో ఉన్న బంగారు గొలుసు తీసి హుండీ లో వేసింది ఆమె. ‘తల్లీ నా మనోభీష్టంం నెరవేర్చు. గమ్యంం తెలీని నా అన్వేేషణ ఫలించేలా చెయ్యి తల్లీ’ అంటూ మొక్కుకుని గుడిలో నుండి బయటపడింది ఆమె. అప్పటికే సాయంత్రం అయిపోయింది. శీతాకాలం కావడంతో చీకట్లు ముసురుకున్నాాయి. నున్నగా గుండు చేయించుకోవడం వలన తలమీద ముసుగు కప్పుకున్నాా చీర నిలబడకుండా జారిపోతోంది. ఆమె కూడా చీరచెంగు జారిపోయినా పట్టించుకోకుండా దేవాలయం చుట్టూ తిరుగుతూ గాలి గోపురం ముందుకు వచ్చింది.

అప్పటికే చీకటి చిక్కగా అలుముకుంది. చలి కూడా శరీరాన్ని గజ గజ లాడిస్తోంది. అప్పటికింకా ఆరగంటలు కూడా కాలేదు. కొండ ప్రాంంతం కావడం వలన మంచు దట్టంగా కురుస్తోంది. క్లోక్‌ రూమ్‌లో పెట్టిన బ్యాాగ్‌ తీసుకుంది. బ్యాాగ్‌ లోపలి నుండి చిన్నగా మడతలు పెట్టిన బెడ్‌ షీట్‌ తీసి శరీరం నిండా కప్పుకుంది. గాలి గోపురం ముందరున్న సిమ్మెంటు దారిలో నడుస్తూ ఆలోచిస్తోంది.

ఇక ఇక్కడ ఉన్నాా ప్రయోజనం లేదు. ఏం చెయ్యాాలి?!’ అనుకుంటూనే ఏదో గుర్తొచ్చిిన దానిలా బ్యాాగ్‌ ప్రక్క జిప్‌లో ఉన్న సెల్‌ ఫోన్‌ తీసింది. సైలెంంట్‌ మోడ్‌లో ఉన్న సెల్‌ ఫోన్‌ లో పాతిక పై చిలుకు మిస్‌డ్‌ కాల్స్‌ ఉన్నాాయి. అన్నీ ఒకే ఒక్క వ్యక్తిి నుండి వచ్చిన కాల్స్‌. సెల్‌ తీసి చూసింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా చేసిన కాల్స్‌ అవి. తను బయల్దేరినప్పుుడే పాత నెంబర్లన్నీ తీసి మూలన పడేసింది. కొత్త నెంబరు తీసుకుంది. ఈ నెంబరు ఎవరికీ తెలీదు. ఒకే ఒక వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తివే వరుసగా ఇన్ని మిస్‌డ్‌ కాల్స్‌.

‘ఏమైందబ్బాా?! ఎందుకంత ఆతృతగా చేసింది? తనే ఎప్పుడన్నాా... అవసరముంటే చేస్తానని కదా చెప్పింది?! మరి!’ అలా ఆలోచిస్తూనే ఒక్కసారి ఆనంద భరితురాలైంది. ఆమె అంటే....న అంటే..... తన.... తన..... ఆశ..... శ్వాాస.... ధ్యేయం.... ధైర్యం....తన చెంతకు చేరాయా...? తన పూజలు ఫలించాయా?


****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో

ఆమె అన్వేేషణ గమ్యం ఎక్కడికి చేఇరింది? ఆమె ఆశలు ఫలించాయా..?? అన్వేషణ ఎలా సాగింది?


Recent Posts
అన్వేషణ తెలుగు నవల తొమ్మిదవభాగం  |  ఇందూరమణ  | Anveshana part 9 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల తొమ్మిదవభాగం |...
భారతదేశంలోని అత్యంత రహస్యమైన తాంత్రిక శక్తి పీఠాలు! | India's Most Mysterious Tantric Temples Explained in Telugu
భారతదేశంలోని అత్యంత రహస్యమైన తాంత్రిక శక్తి పీఠాలు!...
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం  |  ఇందూరమణ | Anveshana part 8 |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఎనిమిదవ భాగం ...
ఒడిశాలోని రహస్య శక్తి పీఠం - తారా తారిణి ఆలయం అద్భుతాలు | Odisha's Most Powerful Shakti Peetha Mystery  |  Tara Tarini Temple
ఒడిశాలోని రహస్య శక్తి పీఠం - తారా...
అన్వేషణ తెలుగు నవల ఏడవ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 7  |   investigative & most suspense novel
అన్వేషణ తెలుగు నవల ఏడవ భాగం ...