Vijaya Lakshmi
Published on Jul 31 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?దయ్యాలు ఉన్నాయా?
మీరెప్పుడైనా చూశారా?
ఇలా అడిగితె కొందరు లేవంటారు, మరికొందరు ఉన్నాయంటారు. అయితే ఇద్దరూ కూడా తమ వాదనలకు ఖచ్చితమైన సాక్ష్యాలు మాత్రం చూపలేరు. అందుకే దయ్యాల కథలన్నీ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. ఇదీ అలాంటి మిస్టరీనే. డ్యుమాస్ బీచ్ మిస్టరీ
సాధారణంగా బీచ్ అంటే… అలల సవ్వడులు, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం. బంగారు రంగు ఇసుక…. కానీ ఆ బీచ్ కెళితే మాత్రం చిక్కటి చీకటి లాంటి ఇసుక, మన చెవుల దగ్గరే గుసగుసలాడే అదృశ్య మనుషులు, మనల్ని పలకరించే ఆత్మలు. తెలియని ఆందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి మన గుండెల్లో అలజడి రేపుతుంది. ఎందుకలా అంటే ఏమో… ఖచ్చితమైన సమాధానం మాత్రం లేదు. అందుకే అదొక మిస్టరీ బీచ్ గా ప్రసిద్ధిచెందింది.
ఆ బీచ్ పగలంతా టూరిస్టుల రద్దీతో కిటకిటలాడుతూ సందడిగా ఉంటుంది. కాని చీకటి పడితే … అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. కాని సందడి మాత్రం ఉంటుంది. సందడి చేసేది అదృశ్య శక్తులుగా ఉన్న దయ్యాలు. గుజరాత్ లో ఉన్న ఆ బీచ్ పేరు వింటే స్థానికులు చాలా మంది ఉలిక్కి పడతారు. నల్లటి ఇసుకతో ఉండే ఆ బీచ్ ఎందుకంత భయంకరం… ఎందుకంటే ఒకప్పుడది స్మశానం. ఇప్పుడది ఆత్మలకు నిలయం.
పగటి వేళల్లో అదో అందమైన బీచ్. కానీ రాత్రయితే…సముద్రం తన అలల సవ్వడితో మాటలాడుతుంది. దానికి ప్రతిగా ఉరుకుతూ వస్తున్నా అలలను చూస్తూ ఆత్మలు సందడి చేస్తాయి.
ఉత్కంఠతను రేకెత్తించే దెయ్యాల కధలు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే ఆ ఘోస్ట్ స్టోరీస్ నిజంగా నిజమైనవయితే ,,, అలాంటి ఓ యదార్ధ ఘోస్ట్ బీచ్ స్టొరీ, దయ్యాల బీచ్ కథ మీకోసం….
డుమాస్ బీచ్ పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో, సూరత్‌కు నైరుతి దిశలో 13 మైళ్ల దూరంలో, అరేబియా సముద్రం వెంబడి ఉంది. ఇది నిస్సందేహంగా అత్యంత సుందరమైన, అందమైన బీచ్‌లలో ఒకటి, బీచ్ లో ఉండే నల్లటి ఇసుక మరింత అందం.ఆ బీచ్ లో ఇసుక నల్లగా ఎందుకుంది.
ఉదయం వేళల్లో ప్రశాంతంగా, అందానికే అందం గా, సందడికి మారుపేరుగా, దైవ భూమిగా అనిపిస్తుంది. కానీ సూర్యాస్తమయం అయితే చాలు సీన్ రివర్స్ అయిపోతుంది. మీరు ప్రశాంతంగా సముద్రపుటలల్ని చూస్తూ కూర్చుంటే హఠాత్తుగా మీ వెనక గట్టిగా, వికృతంగా నవ్వు వినబడుతుంది. ఎవరా అని చూస్తె అక్కడెవరూ ఉండరు. అంతలోనే హృదయవిదారకమైన ఏడుపు వినబడుతుంది. అప్పుడూ ఎవరా అని చూస్తారు. మళ్ళీ ఎవరూ కనబడరు. నవ్వులు, ఏడుపులే వినబడతాయి. అంతలోనే తెల్లటి పొగమంచు లాంటి ఆకారాలు లీలగా కనబడుతూ అలవోకగా కదులుతూ వెళ్ళిపోతాయి. ఎవరో మన చెవి దగ్గరే గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుంది. వెళ్ళిపో తక్షణం వెళ్ళిపో అని ఎవరో హెచ్చరిస్తున్నట్టుగా వినబడుతుంది. భయంకరంగా కుక్కల ఏడుపులు, అరుపులు. చీకటి పడిన తరువాత ఎవరైనా ఉండిపోతే వారికి ఎదురయ్యే అనుభవాలివి. అందుకే ఇది .దెయ్యాలబీచ్ గా ప్రసిద్ధి చెందింది.
సూరత్ లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈ డ్యూమాస్ బీచ్ ఒకటి. టూరిస్టులు కూడా ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ చీకటి పడుతున్న కొద్దీ ఇక్కడ మనుషులు ఒక్కరు కూడా కనిపించరు. రాత్రవుతున్న కొద్దీ చిక్కటి చీకటిలో నల్లటి ఇసుకతో భయంకరంగా కనబడుతుంది ఆ బీచ్. మొండిగా ఈ బీచ్ లో రాత్రి పూట ఉండాలని ప్రయత్నించిన చాలా మంది అనేక భయంకర అనుభవాలను ఎదుర్కొన్నారని, కొందరయితే తిరిగి వెనక్కి రాలేదని,చెబుతారు.
అసలు ఈ బీచ్ ఇంత ఘోరంగా దెయ్యాలకు నిలయంగా ఎందుకు మారింది. ఎందుకంటే ఈ బీచ్ ఒకప్పుడు హిందూ స్మశాన వాటిక. కొన్ఇని వేల శవాలకు దహన సంస్క్కకారాలు జరిగాయట. ఇక్కడ దహనం చేసిన వారి ఆత్మలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా ఇక్నికడే తిరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు ఏర్పడే నల్లని బూడిద ఈ బీచ్ లోని తెల్లని ఇసుకలో కలిసి క్రమంగా అది నల్లగా మారినట్లు చెప్తారు. రాత్రిళ్ళు అక్కడికెల్తే అసలిక తిరిగి రారు అని కూడా చెప్తూవుంటారు స్థానికులు.
గుజరాత్‌లోని సూరత్‌కు జస్ట్ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ద్యూమాస్ బీచ్.నిజానికి ఇక్కడ నాలుగు బీచ్ లను కలిపి డ్యూమాస్ బీచ్ గా చెప్తారు. అందులో రెండు బీచ్ లు మాత్రం జనంతో కళకళలాడిపోతాయి.
ఇక మూడో బీచ్ లో కూడా కాస్తో, కూస్తో జనం వుంటారు. ఇంక నాలుగో బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల బీచ్. విచిత్రమేంటంటే ఈ బీచ్ లో ఇసుక కూడా నల్లగా వుంటుందట.
ఈ కథనాల్లో నిజమెంతో చూద్దామని రాత్రిపూట ఆ బీచ్ కెళ్ళినవారు ఇక తిరిగిరాని సందర్భాలు కూడా వున్నాయని చెప్తారు స్థానికులు. దెయ్యాల బీచ్ గా పేరు పొందిన ఈ నాలుగో బీచ్ లో రాత్రిళ్ళు మాత్రమె కాదు పగటిపూట కూడా భయంకరంగా అరుపులు, మూలుగులు వినపడిన సందర్భాలు కూడా వున్నాయి అంటారు స్థానికులు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే చివరకు రాత్రిళ్ళు ఈ బీచ్ కు వెళ్ళటం కూడా నిషేధించారు.
ఈ బీచ్‌కు కొద్ది దూరంలో ఓ పురాతన పాలెస్ ఉంది. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ ఈ ప్యాలెస్‌ను కట్టించాడట! ప్రస్తుతం ఇది మనుషులు నివసించని పేలెస్ గా ఉండిపోయింది. అయితే దూరం నుంచి చూస్తే ఆ పేలెస్ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందని, దగ్గరకు వెళితే మాత్రం ఆ ఆకారం అదృశ్యమవుతుందని కథలు ప్రచారంలో ఉన్నాయి... ఈ భయం కొద్దే హవేలీలోకి ఎవరూ వెళ్లడం లేదు.
మనుషులే కాదు రాత్రివేళల్లో జంతువులు కూడా ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికి సాహసించవు. సాధారణంగా వీధికుక్కలు పర్యాటకులు విసిరేసిన ఆహారం కోసం వస్తుంటాయి. కానీ అవి కూడా రాత్రి పూట డుమాస్ బీచ్‌లో అడుగుపెట్టవు. ఎందుకంటే అదో పెద్ద మిస్టరీ. అంతేకాదు రాత్రివేళల్లో బీచ్‌వైపు చూసి ఇవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. భయంతో అరవడం, దూరంగా పారిపోవడం వంటివి చేస్తుంటాయి. కుక్కలకు దెయ్యాలు కనబడతాయని, కంటికి కనిపించని ఆత్మలను కూడా అవి చూస్తుంటాయని చాలామంది నమ్ముతుంటారు.
రాత్రి వేళల్లో బీచ్‌లో తిరిగే దెయ్యాలను చూసే కుక్కలు అరుస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. వారందరికీ ఈ అరుపులు, ఆ వింత శబ్దాలు అలవాటైపోయాయి.
దయ్యాల్లేవు.. ఆత్మల్లేవు.. అంతా ఉత్తిదే అని అనేవాళ్లూ ఉన్నారు.. ఆత్మలు లేవని నిరూపించడానికే రాత్రంతా బీచ్‌లో బస చేసి వచ్చారు. ఆత్మలున్నాయని చెబుతున్నదాంట్లో నిజం లేదని చెబుతున్నారు. స్థానికులు చెబుతున్నట్టు డ్యూమస్ బీచ్ అంత భయానకంగా ఏమీ ఉండదని అంటున్నారు. ఏదో ప్రయోజనం కోసం కొందరు ఈ దుష్ర్పచారాన్ని మొదలు పెట్టారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. దయ్యాల బీచ్ అనేసరికి టూరిస్టులు పెరిగిపోయారు. ఇదీ దయ్యాల బీచ్ కథ.