Vijaya Lakshmi
Published on Jun 30 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?దెయ్యాలను కూడా భయపెట్టే శిధిలాల దిబ్బ ఆ కోట. సూర్యుడు అస్తమించిన తరువాత అక్కడ అడుగు పెట్టే ధైర్యం దెయ్యాలకు కూడా ఉండదట. చీకటిని కూడా భయపెట్టే స్థలం. ధైర్యవంతులకు కూడా వెన్ను వణికించే చోటు.
అందమైన కోట. అందంగా అద్భుత కళాఖండంలా రాజస్థాన్ రాజసానికి మారుపేరుగా ఠీవిగా నిలబడే ఆ కోట. ఇప్పుడు బీటలు వారిపోయింది. బీటలు వారిన ఆ కోట గోడల వెనక భయంకరమైన చీకటి రహస్యాలెన్నో. ఆ పగుళ్ళ వెనక నిశ్శబ్దంగా అనుసరించే కళ్ళు ఉన్నాయా? ఆ భూతాల గదుల్లో మనుషులు కనబడరు. అడుగుల శబ్దాలు వినబడవు. కాని కొన్ని జతల కళ్ళు మనల్ని వెంటాడుతాయి. కొన్ని జతల అడుగులు మనల్ని అనుసరిస్తాయి. కొన్ని గొంతులు మనతో అదృశ్యంగా గుసగుసలాడతాయి. గాఢమైన నిశ్శబ్దం. భయంకరమైన నిశ్శబ్దం. అక్కడ నిశ్శబ్దం ఎందుకు అంత భయంకరం? ఎవరు ఈ పట్టణాన్ని శపించారు? అసలు ఏమైంది అక్కడ?
రాజస్థాన్ రాష్ట్రంలోని ఎండి బీటలువారిన నేలపై ఓ కోట అలసిపోయినట్టుగా నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. అది కాలాన్ని చూసింది… వైభవాన్ని చూసింది. నాశనాన్ని చూచింది… ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. దెయ్యాలకు, అతీత శక్తుల కథలకు నిలయంగా మారిపోయింది. అది **భాన్ ఘర్ కోట**. భయానికి మారు పేరు. దశాబ్దాలుగా పర్యాటకులను, శోధకులను, ఆధ్యాత్మికవాదులను ఆకర్షిస్తూ ఉంది.
దయ్యాలు వుండే ప్రదేశాలను మీరు ఎపుడైనా చూసారా? ఆ ప్రదేశంలో మీరు తిరుగుతున్నపుడు మీ చుట్టూ గల ప్రేతాత్మల ఉనికిని గమనించారా ? బహుశా...ఇటువంటి దయ్యాలూ, ప్రేతాత్మల కధలు చాలామంది నమ్మక పోవచ్చు. కాని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ జరిగే మిస్టరీలు చూస్తే నమ్మక తప్పదు. అలాంటి ఓ అంతుచిక్కని మిస్టరీ భాన్ ఘర్ కోట.
భాన్ ఘర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లాలోని అరావళీ పర్వత శ్రేణుల పాదభాగంలో ఉన్న ఒక ప్రసిద్ధ కోట. ఇది భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశంగా భూతాల కథలతో ప్రసిద్ధి చెందింది.
ఈ కోటను 1573లో అంబర్ రాజు భగవంత్ దాస్ తన రెండవ కుమారుడు మాధో సింగ్ కోసం నిర్మించారు. మాధో సింగ్ తన తాత మాన్ సింగ్ లేదా భాన్ సింగ్ పేరుతో ఈ పట్టణాన్ని "భాన్ ఘర్" అని నామకరణం చేశాడు. అప్పట్లో ఈ పట్టణం సుమారు 9,000 ఇళ్లతో సమృద్ధిగా ఉండేది, ఏంతో వైభవాన్కాని చవి చూసింది. కానీ 1720 తరువాత జనాభా తగ్గిపోవడం ప్రారంభమైంది.
కోట వెనక ఉన్న భయంకర, దెయ్యాల, భూతాల కథలకు ఆకర్షించబడిన వారు, సాహసికులు, ఉత్సాహపరులు అందరూ నిత్యం ఈ శిధిల గోడల కోటను చూడాడానికి వస్తూనే ఉంటారు. అందులో చాలా మంది అనుభవాలు వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కొన్ని జతల కళ్ళు నిశబ్దంగా మనల్ని వెంటాడుతాయి. ఎవరో మనల్ని రహస్యంగా అనుసరిస్తుంటారు. తిరిగి చూస్తె ఎవ్వరూ ఉండరు. వేడికి మారుపేరయిన ఆ ప్రదేశం అకస్మాత్తుగాచల్లగా మారిపోతుంది. మనుషులు కనబడరు… అడుగుల శబ్దాలు మాత్రం వినబడతాయి. మన పక్కనే ఎవరో గుసగుసలాడుకుంటారు.
హఠాత్తుగా భయంకరమైన అరుపులు వినబడతాయి. అంతలోనే హృదయవిదారకంగా ఏడుపులు. కీచుమన్న శబ్దాలు. వింత ధ్వనులు. నల్లటి చీర ధరించి నిష్హబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న స్త్రీ కనబడీ కనబడనట్టుగా లీలగా కనబడే ఓ అనుభూతి. దెయ్యాల బొమ్మలు… హఠాత్తుగా కనబడి అంతలోనే మాయమయే నీడలు, పొగమంచు రూపాలు, యువరాణులు, సైనికుల రూపాలు. అంతవరకూ స్తిరంగా ఉన్న వస్తువులు సడన్ గా వాటంతటవే కదులుతాయి. ఏమాత్రం గాలి లేని సమయంలో హఠాత్తుగా, తలుపులు, కిటికీలు వాటంతట అవే తెరుచుకుంటాయి. టపటపా కొట్టుకుంటాయి. మళ్ళీ అవే మూసుకుపోతుంటాయి. కొన్నిసారు అక్కడున్న వస్తువులు ఎవరూ కడపకుండానే మన దాడి చేసినట్టు మీద పడిపోతుంటాయి. ఇవన్నీ భాన్ ఘర్ కోటను చూడ్డానికి వెళ్ళిన వారు చెప్పిన భయంకర అనుభవాలు.
వీటన్నిటి వెనకున్న మిస్టరీ ఏంటి. ఇవన్నీ ఆ కోటలో ఉన్న దయ్యాలు చేస్తున్న పనులేనా… ఇప్పటికీ మిస్టరీనే.ఇన్ని భయాలు వెంటాడుతున్నా… సందర్శకులు రావడం ఆగలేదు. భయం భయంగానే కోటంతా తిరిగి చూడడం ఆగలేదు.
ఆ కనబడే నల్లతిచీర స్త్రీ ఒకప్పటి భాన్ ఘర్ యువరాణి రత్నావతి. రత్నావతి రాజా ఛత్ర సింగ్ కుమార్తె. అందానికి మారుపేరు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఎంతోమంది రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు ఒక మంత్రగాడు కూడా యువరాణిని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెను పొందడం అసాధ్యం అని అతనికి ఖచ్చితంగా తెలుసు. అందువల్ల ఆమెను సొంతం చేసుకోవడానికి మాయాజాలం ఉపయోగించాలని తాంత్రికుడు ప్రణాళిక వేశాడు. చే పరిమళ ద్రవ్యాల పట్ల యువరాణికి ఉన్న ఇస్తానని గమనించి ఆమె ప్రేమను పొందడానికి యువరాణి కోసం కొన్న పరిమళంపై ఒక మంత్రం ప్రయోగం చేసాడు.
ఈ విషయం తెలుసుకుని ఆ పరిమళ సీసాను పగలగొట్టింది, ఆ పరిమళం వెళ్లి బండరాయి పడి ఆ బండరాయి మంత్రగాడి ఆకర్షణకు గురయి అతనివైపు దొర్లుకుంటూ వెళ్ళింది. తాంత్రికుడు దాని కింద చంపబడ్డాడు. అతను తన చివరి శ్వాస తీసుకునే ముందు క్షణాల్లో, విషయం గ్రహించిన తాంత్రికుడు తన మరణానికి ప్రతిగా ఆ రాజ్యాన్ని, గ్రామస్తులను మరియు యువరాణిని శపించాడు. ఆ శాప ప్రభావంతో కొన్నాళ్ళకు మొఘలుల దాడితో కోటంతా నాశనమయి యువరానితో పాటు అందరూ మరణించారని. యువరాణి రత్నావతి ఆమెలో పది ప్రాణాలు పోగొట్టుకున్న మాంత్రికుడి ఆత్మలు కోట లోపల ఉన్నినాయని బలంగా నమ్ముతారు. మరికొందరు రత్నావతి మరెక్కడో పునర్జన్మ తీసుకుంటుందని,ఆ యువరాణి వచ్చినప్పుడు మాత్రమే ఈ కోట మాంత్రికుడి శాపం నుంచి బయటపడుతుందని నమ్ముతారు.
భాన్ ఘర్ కోట మిస్టరీ వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. భాన్‌గఢ్ కోట నిర్మించబోయే ప్రాంతంలోని కొండలపై సాధు గురు బాలూ నాథ్ నివసించేవారు. కోట నిర్మాణానికి ముందు భగవంత దాస్ ఆ సాధువుతో సంప్రదించి, కోటా నిర్పుమాణానికి పూనుకున్నానారు, అప్దిపుడా సాధువు ఇక్కడ కోట నిర్మించుకో కాని కొన్ని షరతులకు లోబడి అని చెప్పాడు. రాజభవనం నీడలు తన నివాసంపై పడకూడదని, అలా పడేంత దగ్గర వరకు కోటను నిర్మించావద్దని షరతు పెట్టాడు. ఒకవేళ అలా జరిగితే కోట శిథిలమవుతుందని హెచ్చరించాడు. ప్రారంభంలో కోటను సాధువు నిర్దేశించిన పరిమితులకు లోబడే నిర్మించారు. కానీ క్రమంగా రాజు సాధువు మాటలను పట్టించుకోవడం మానేసి, కోటను పెంచుతూ పోయాడు. చివరికి దాని నీడలు సాధువు ఇంటిని తాకాయి. దీంతో క్రుద్ధుడైన బాలూ నాథ్ రాజ్యాన్ని శపించాడు. ఆ శాపం వల్లనే కోట నాశనమై, చుట్టుపక్కల గ్రామాలు కూడా క్రమక్రమంగా వదిలివేయబడ్డాయి. ఆ తర్వాత కోటను పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగినా, పైకప్పులు కూలిపోవడం, ఇళ్ళు నిలబడకపోవడం జరిగిందని ప్రజలు చెప్పుకుంటారు. కథలుగా చెప్పుకుంటారు.
అసలివన్నీ పుక్కిటి పురాణాలా… భయపెట్టే కథనాలేనా… ఏమో … కథనాల సంగతెలా ఉన్నా భయపెట్టే పరిస్తితి మాత్రం ఖచ్చితంగా అక్కడుంది. అందుకే భారతదేశ చారిత్రక కట్టడాలను సంరక్షించే బాధ్యత నిర్వర్తించే భారత పురావస్తు సర్వే సంస్థ, భాన్ ఘర్ కోట ప్రారంభంలో ASI గుర్తుతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది, దీనిలో సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత భాన్‌గఢ్ కోటలోకి ప్రవేశం నిషేధించబడింది,అన్న హెచ్చరిక బోర్డ్. దీనిని సాధారణంగా భారతదేశంలోని భయంకరమైన ప్రదేశాలలో ఉంచుతారు.
ఇదిలా ఉంటె ఈ కోట ఇలా శిధిలంగా మరిపోడానికి మరొక కథనం కూడా ఉంది. దాని ప్రకారం సమీపంలో అప్పట్లో బంగారు గనులు విపరీతంగా ఉండేవట. కొంతకాలానికి ఆ ఖనిజం అయిపోయింది. దాంతోా మైనింగ్ ఆగిపోయిన తర్వాత ప్రజలు భాన్‌గఢ్ నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని, అందుకే ఈ ప్రాంతమంతా శిదిలలుగా మిగిలిపోయిందని కూడా ఓ ప్రచారం ఉంది.
ఈ అతీంద్రియ శక్తిని, దయ్యాల కథలను నమ్మినా నమ్మకపోయినా, భాన్‌గర్ కోట దాని చారిత్రక మరియు నిర్మాణ ప్రాశస్త్యం కోసం మాత్రం తప్పక చూడాల్సిందే. భాన్ ఘర్ కోట మూడు వరుస రక్షణ గోడలతో మరియు ఐదు భారీ గేట్లతో నిర్మించబడింది. కోటలో ఎన్నో దేవాలయాలు, హవేలీలు మరియు ఖాళీగా ఉన్న మార్కెట్లు చూడొచ్చో. గోపీనాథ్ దేవాలయం, సోమేశ్వర దేవాలయం, కేశవ్ రాయ్ దేవాలయం, మంగలా దేవి దేవాలయం మరియు గణేశ్ దేవాలయం ఉన్నాయి. ఈ దేవాలయాలు 17వ శతాబ్దపు నాగర శైలిలో నిర్మించబడ్డాయి మరి ఇన్ని దేవాలయాలు ఉన్నపుడు ఇక్కడ దెయ్యాలు ఎలా ఉంటాయి. దేవతలు ప్రజలను రక్షిస్తారని చెడును జయిస్తారని చెబుతారు కదా ఇన్ని దేవాలయాలు ఉన్న ఒక స్థలంలో దయ్యాలు ఎలా ఉంటాయి? అని కూడా కొందరి వాదన. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం మిస్టరీగానే మిగిలిపోయింది.
శతాబ్దాల తర్వాత కూడా భాన్ ఘర్ కోట శిధిల గోడలు ఏదో చెబుతూనే ఉన్నాయి. చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కాని మనం వినలేము…
మీరెప్పుడైనా రాజస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ కోటను చూసే ప్రయత్నం చేస్తారా…. భాన్‌గర్ కోట లోకి వెళ్ళడానికి ప్రవేశ రుసుము: భారతీయులకు రూ. 25, విదేశీయులకు రూ. 200. కోట ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.