విశాఖ నడిబొడ్డున ఈ ఆలయంలో అమ్మవారికి శిరస్సు ఎందుకుండదో తెలుసా?/goddess without head in vizag

Vijaya Lakshmi

Published on Mar 23 2024

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

కొన్ని ఆలయాలు చూసినపుడు. ఆ ఆలయంలో దేవతలను దర్శనం చేసుకున్నపుడు ఎంత విచిత్రంగా ఉంటాయో ఆ ఆలయాల చరిత్ర తెలుసుకున్నపుడు అంతకంటే వింతగా ఉంటుంది. అలాంటి ఒక ఆలయమే విశాఖపట్నం లోని ఈ అమ్మవారి ఆలయం.

 

ఆలయంలో అమ్మవారికి ఘనమైన కానుకలు సమర్పించుకోవలసిన అవసరం గాని, కఠినమైన మొక్కులు తీర్చుకోవలసిన పని గాని లేదు. సంపూర్ణ భక్తితో, సమర్పణ భావంతో కేవలం బిందెడు పసుపు నీళ్ళు అభిషేకిస్తే చాలు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తుంది ఆ అమ్మవారు. సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినపుడు గర్భాలయంలో కొలువుతీరిన దేవీ దేవతలను పాదాలనుంచి శిరస్సు వరకు దర్శించుకుంటాం. మహిమాన్వితమైన కళకళలాడే అమ్మవారి ముఖాన్ని తనివితీరా దర్శించుకుంటాం. కాని ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి శిరస్సే ఉండదు. శిరస్సు లేకుండా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే శిరస్సు ఉంటుంది. కాకపొతే ఉండవలసిన స్థానంలో ఉండదు. శిరస్సు ఉండవలసిన స్థానంలో ఓంకారం ఉంటుంది. శిరస్సు అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఎందుకిలా ఇంత వింతగా... విచిత్రంగా... మరా విచిత్రం వెనకున్న చరిత్రేంటో తెలుసా!?


youtube play button



     ఆ జగజ్జనని ఈ ధరణి మీద వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో కొలువుతీరి ఉంటుంది. అలాంటి ఆలయమే విశాఖపట్నం దుండపర్తి లో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం. విశాఖ వాసులకు, ఎరుకుమాంబ అమ్మవారు ఎంతో నమ్మకమైన ఆరాధ్య దేవత. చూడ్డానికి చిన్న ఆలయమే ఆ ఆలయం వెనకున్న చరిత్ర మాత్రం పెద్దది. అమ్మవారి విగ్రహం వెనక శ్రీచక్రం ఉందని అందుకే ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదని చెప్తారు. ఎరుకుమాంబ అమ్మవారి శిరస్సు ఉండవలసిన స్థానంలో కాకుండా కాళ్ళ దగ్గర ఉంటుందని మొదటే చెప్పను కదా. దీని వెనుక ఒక కథ ఉంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఎరుకుమాంబ అమ్మవారిని గౌరీ స్వారూపంగా భావించి ఆరాధిస్తారు. నిజానికి అమ్మవారు మొదట్నుంచి ఇక్కడ ఉండేవారు కాదు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన గల వైర్లెస్ కాలనీలో అమ్మవారీ ఆలయం ఉండేది. ఆ ఆలయంలో అమ్మవారూ నిత్యం పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైతే బండి ఆగిపోతుందో అక్కడ ఆలయ నిర్మాణం చేపించాలని చెప్పిందని ఓ కథనం. ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్టుగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద నుంచి తీసుకెళ్తుండగా సరిగ్గా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశానికి రాగానే దగ్గర బండి ఆగిపోవడమే కాకుండా అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరయి పడిపోయిందట. జరిగిన ఈ దారుణానికి భయపడి కంగారు పడిపోయిన ఆ గ్రామస్తులు తిరిగి ఆ శిరస్సును విగ్రహానికి అతికించాలనిఎంతగానో ప్రయత్నించారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శిరస్సు మాత్రం విగ్రహానికి అంటుకోలేదు.


దాంతో  ఆ గ్రామస్తులు ఇదేదో అపశకునమని, తమకు ఏదో కీడు జరుగబోతుందని చాలా భయపడ్డారు. వెంటనే తమ భయాన్ని అమ్మవారి ఎదుట మొరపెట్టుకోగా, విరిగిన ఆ శిరస్సు తన కాళ్ల దగ్గర పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పిందట. అప్పటినుంచి భక్తులు అందరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలను పొందుతున్నారు.

      ప్రతి బుధవారం నగరంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బిందెలతో పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. బిందెడు పసుపు నీళ్ళను మొక్కుకుంటే చాలు కోరిన కోరకలు నెరవేరుతాయని బాగా నమ్ముతారు స్థానికులు. ఈ విషయం అలా అలా బయటి ప్రాంతాలకు కూడా పాకి, సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం ఈ  స్నానోత్సవానికి వచ్చి అమ్మవారికి పసుపునీళ్ళ అభిషేకం చేస్తారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 P.M నుండి 5:30 P.M. వరకు ఈ బిందెనీళ్ళ సమర్పణ  అత్యంత ఘనంగా జరుగుతుంది. గురువారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. 


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...