Vijaya Lakshmi
Published on Aug 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఆలయం కూడా. హైదరాబాద్ .... భాగ్యనగరం....ఇప్పుడంటే హైదరాబాద్ అనే పిలుస్తున్నాం గాని ఒకప్పుడు భాగ్యనగరం గా ప్రసిద్ధి చెందిన నగరమిది. ఈ నగరానికి భాగ్యనగరంగా పేరు రావడానికి కారణాలుగా చాలా విషయాలనే చెప్తారు. అందులో ఒకటి భాగ్యలక్ష్మి ఆలయం.
భాగ్యలక్ష్మి ఆలయం కారణంగానే నగరానికి భాగ్యనగరం అని పెరోచ్చినట్టు ఒక వాదన వినబడుతుంది. అయితే మరో వాదన ప్రకారం బాగ్ అంటే తోట. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు విస్తారంగా తోటలు ఉండేవని, ఆ కారణంగానే ఈ నగరానికి భాగ్యనగరం అని పెరోచ్చినట్టు చెప్తారు. అయితే ఈ వాదన కూడా సరైనది కాదని కులీకుతుబ్ షా తన భార్య భాగమతి పేరుతో ఈ నగరాన్ని నిర్మించారని వాదించే వాళ్లూ ఉన్నారు. ఇది కూడా చరిత్రకందని విషయమే అనే వాదన కూడా ఉంది.
సరే పేరు నగరం పేరు విషయం అలా ఉంచితే హైదరాబాద్ అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తొచ్చేది కళ్ళముందు కనబడేది చార్మినార్. ఆ చార్మినార్ సమీపంలోనే చార్మినార్ ను అనుకోని ఉంటుంది భాగ్యలక్ష్మి ఆలయం. ఈ దేవాలయంలో ప్రతి రోజు నిత్య పూజలతో పాటు, ప్రతి శుక్రవారం ఐదు సార్లు హారతి ఇస్తారు. దీపావళి పండుగ, బోనాల రోజు, నవరత్రులలోను ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భాగ్యలక్ష్మీదేవి ఇక్కడ కొలువుతీరిన విషయంలో చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ సాక్షాత్తూ లక్ష్మీదేవే నడుచుకుంటూ వచ్చి కొలువుతీరిందని ఓ కథనం. ఒకప్పుడు గోల్కొండ నవాబుల కాలంలో ఈ ప్రాంతంలో ఒక స్త్రీ నడుచుకుంటూ నగరంలోకి వచ్చిందని ఆ సమయంలో అక్కడ ఉన్న రక్షకభటులు ఆ స్త్రీని అడ్డుకొని తమ ప్రభువులకు చెప్పి వస్తామని వెళ్లారు. మీరు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని చెప్పిందా స్త్రీ. భటులు వెళ్లి ప్రభువులకు విషయం వివరించగా ఆ వచ్చిన స్త్రీ లక్ష్మీదేవే అని గ్రహించిన ప్రభువులు ఆ భటులు తిరిగి వెళితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి భటులు తిరిగి వెళ్ళేవరకు అక్కడే ఉంటానని మాట ఇచ్చింది కాబట్టి ఆమెను అక్కడే స్థిరంగా ఉంచాలంటే భటులను తిరిగి పంపకూడదని తలచి ఆ భటులను తిరిగి పంపకుండా ఉంచేసారట. దాంతో లక్ష్మీదేవి అక్కడే స్థిరంగా ఉండిపోయిందని ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో అక్కడొక రాయి ఉండేదని ఆ రాతికె అందరూ పసుపు,కుంకుమలు సమర్పించి పూజలు చేసేవారని, 1967లో ఒక బస్సు డ్రైవర్ ఆ రాయిని ఢీ కొడితే ఆ రాయి పగిలిపోయిందని, దాంతో స్తానికులు కొందరు ఆ రాయి భాగ్యలక్ష్మీ దేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ లాగా వేసేశారని, పగిలిన రాళ్ళకు పూజలు చెయ్యకూడదు కాబట్టి అక్కడొక ఫోటో ఏర్పాటు చేసి పూజలు చేసేవారని తరువాతి కాలంలో విగ్రహం కూడా ఏర్పాటు చేసారని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఉన్న భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర రెండు వెండి తొడుగులతో కూడిన రూపాలు ఉంటాయి. ''ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉందని చెప్తారు.
1967 ప్రాంతంలో ఈ గుడి కట్టడంపై కొందరు అభ్యంతరం చెప్పారని, ఆ క్రమంలోనే వారు అసలు గతంలో అక్కడ గుడి ఉందా లేదా అన్న విషయమై పరిశోధన చేసి, హైదరాబాద్‌లో వెట్టి చాకిరీ కోసం వచ్చి, రోడ్లు వేసే కూలి పనిచేసే ఒక మహిళను అదే ప్రదేశంలో పూడ్చి పెట్టారనీ, ఆమె పుణ్యస్త్రీగా చనిపోవడంతో ఆమె సమాధిపై పసుపు, కుంకుమ చల్లేవారనీ ఆమె కుమార్తెలే అక్కడ భిక్షాటన చేసే వారని, 1967 ప్రాంతంలో గుడి కడుతున్నపుడు వారిని వేల్లగోట్టారని కూడా మరో వాదన తీసుకువచ్చినట్టు చెబుతారు.
చారిత్రకంగా ఈ గుడి ఎక్కడా ప్రస్తావిన్చాబదలేదని, ఇది పురాతనమైనది కాదని, చార్మినార్ వద్ద గతంలో భాగ్యలక్ష్మి ఆలయం లేదని, కేవలం ముడు నాలుగు దశాబ్ధాల క్రితమే అక్కడ గుడి నిర్మాణం జరిగిందని కొందరు చరిత్రకారుల వాదన. సాధారణంగా హిందూ దేవాలయాలకు దాన శాసనాలు అంటే గుడి కట్టించిన వారో, లేక ఆ గుడి నిర్వహణ కోసం మడి, మాన్యాలను ఎవరు ఎంత మేరకు భూములు లేదా కానుకలు ఇచ్చారు లాంటి వివరాలతో శాసనాలుంటాయి. కానీ, భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సంబంధించి అలాంటి శాసనాలు కూడా లభించలేదు. ఇలా చారిత్రకంగా లభించిన ఆధారాలను బట్టి, ఈ ఆలయం కేవలం కొన్ని దశాబ్దాల క్రితం కట్టినదేనని కొందరి వాదన.
1967 లో ఈ గుడి కట్టారని మరికొందరి వాదన. కాని ఇక్కడ అమ్మవారు ఏ ఆకారంలో ఉన్నా అయిదు శతాబ్దాల నుంచి ఇక్కడే ఆరాదించబడుతోందని గతంలో అక్కడ రాతి రూపంలో అమ్మవారు ఆరాదించబడేదని, ఇప్పుడున్న గుడే సుమారు వందేళ్ళ అంతకు ముందు వందల సంవత్సరాల నుంచి అమ్మవారు నాటిదని శిలా రూపంలో ఆరాదిన్చాబదిందని మరో వాదన కూడా వినబడుతుంది. 2012 లో కూడా దీపావళి సందర్భంగా ఇక్కడ బారికేడ్లు లాంటి నిర్మాణాలు పెంచే సందర్భంలో ఘర్షణలు జరగడం వివాదం కోర్తువరకు వెళ్ళడం కూడా జరిగింది. ఇలా ఇప్పటికే ఈ దేవాలయం చాలాసార్లు వివాదాస్పద సంఘటనలకు లోనయింది. అలా మొదట్లో చిన్న షెడ్ లా తాత్కాలిక మందిరం లా ఏర్పాటయిన భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి తరువాత రేకులతో కాస్త పెరిగి ఆ తరువాత ఇంకాస్టే పటిష్టంగా ప్రస్తుతం ఒక చక్కటి గుడిగా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది.
సరే ఈ వివాదాల సంగతి పక్కన పెట్టి అమ్మవారి ఆలయ విశేషాల విషయానికి వస్తే హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం మాత్రం లక్షలాది మంది భక్తులకు, అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. లక్షలాదిమందికి ఆరాధ్యదేవత భాగ్యలక్ష్మి అమ్మవారు.
ముఖ్యంగా దీపావళి,నవరాత్రుల సమయంలో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని తహతహలాడతారు. ఈ పర్వదినాల సమయంలో అమ్మవారి ఆలయశోభ చూసి తీరవలసిందే. అద్భుతమైన అలంకరణతో శోభాయమానంగా, ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఇక అమ్మవారి శోభను చూడడానికి రెండు కనులు చాలవు.ముఖ్యంగా దీపావళి రోజు ఇసకేస్తే రాలని జనం ఆలయం ముందు బారులు తీరి ఉంటారు.
ఎక్కడా లేని ఒక ప్రత్యేక ప్రక్రియ కనబడుతుంది. ఏ ఆలయంలోనైన ఏదో ఒక పదార్ధమో ఒక పండో భగవంతుని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. కాని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రసాదంతో పాటు దీపావళికి అమ్మవారి కానుకగా ఒక నాణాన్ని ఇస్తారు. అమ్మవారి ఖజానాగా వ్యవహరిస్తారు ఆ నాణాన్ని. దీపావళి రోజు అమ్మవారి ఖజానా పేరుతొ నాణాలు పంచుతారు. ఆ ఖజానా అంటే నాణాలు ఇంట్లో పెట్టుకంటే మంచిదని చెప్తారు. అందుకే ఆ ఖజానా కోసం భక్తులు తాపత్రయపడతారు. అమ్మవారి ఖజానా అంటే నాణెం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. ఆ నాణెం తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టుకుని పూజించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.