అక్కడ స్వామిని కిటికీ నుంచే దర్శించుకోవాలి/ఆలయంలో వింత దర్శనం/krishna darshan through window/

Vijaya Lakshmi

Published on Mar 21 2024

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

    ఇక్కడ స్వామివారి దర్శనం చాలా చిత్రంగా ఉంటుంది. దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే స్వామి దర్శనం చేసుకుంటాం. కాని ఉడుపి ఆలయంలో మాత్రం భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. ఉడిపి ఆలయంలో కృష్ణయ్యను కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు. తొమ్మిది రంధ్రాలు ఉన్న ఈ కిటికీ నుండే శ్రీకృష్ణ భగవానుడని దర్శించాలి. దీనిని. ఇలా నవగ్రహకిటికీ నుండి కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్తారు. అయితే మొదటినుంచి ఈ పధ్ధతి లేదు. పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యులవారు స్థాపించిన నాటి నుండి పదహారో శతాబ్దం వరకూ భక్తులు, స్వామివారిని నేరుగానే దర్శించేవారు.



శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో, కనక నాయకుడు, కనకదాసుగా మారి, ’చెన్న ఆదికేశవ’ అన్న నామంతో కీర్తనలు వ్రాస్తూ, భక్తిఉద్యమకారుడై తిరిగేవాడు. అప్పట్లో నిమ్న కులస్తులకు ఆలయ ప్రవేశం కొంత ఇబ్బందికరంగానే ఉండేదని చరిత్ర చెబుతోంది కదా. దాంతో కురుబ కులానికి చెందిన కనకదాసును ఉడుపిలో ఆలయ ప్రవేశం చెయ్యనివ్వలేదు సరి కదా కనకదాసును  ఆలయం వెనుకభాగంలో బంధించి, హింసించారట. అప్పుడు కనకదాసు ఆర్తితో ఆ కృష్ణయ్యను పిలుస్తూ ఆశువుగా కీర్తనలు ఆలపించాడు.



కనకదాసు వేదనకు కరగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుంచి  వెనక్కు తిరిగాడట. కనకదాసుకు దర్శనభాగ్యం కలగడానికి  ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు “కనకన కిండి” లేదా “కనకదాసు కిటికి”గా పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం ఉంది. ఇక్కడే ’కనక మండపం’ను నిర్మించారు.


         కృష్ణ తత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతునన ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుదీరి ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా కృష్ణ భక్తులు ఉడుపి బాలకృష్ణుని దర్శించుకుంటారు.


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...