Vijaya Lakshmi
Published on Sep 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...
పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిని భరించలేని దేవతలందరూ అనలాసురిని బారి నుంచి కాపాడమని వినాయకుణ్ణి వేడుకున్నారట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి అనలాసురుని మింగేసాడు! అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు.
కానీ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది. గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలందరూ ఎన్నో ప్రయత్నాలు చేసారు. అన్నీ విఫలమయ్యాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడంతో 21 గరికలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
అప్పటినుంచి ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే నిర్విఘ్న్గంగా పనులు నేరవేరడమే కాకుండా సర్వ శుభాలు కలుగుతాయని గణపతి వరమిచ్చాడట.