Vijaya Lakshmi
Published on Jul 27 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అదొక శాపగ్రస్త ఆలయం. ఒళ్ళు గగుర్పిడిచే మిస్తారీలు… విచిత్ర సంప్రదాయాలు… భయం గొలిపే రహస్యాలు… ఉత్కంతభరితమైన ప్రయాణం…హిమాలయ దేవత నందాదేవి సోదరుడు కొలువైన ఆలయం…
మాలయాల ఒడిలో, దేవభూమి ఉత్తరాఖండ్‌లో, ప్రకృతి రమణీయతతో కూడిన ఓ లోయలో కొలువై ఉంది లాతు దేవత ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అంతుచిక్కని రహస్యాలకు, విచిత్రమైన ఆచారాలకు, అలౌకిక శక్తుల కథలకు నెలవు. వేద మంత్రాలు, భక్తి గీతాల సవ్వడులు పగటిపూట నిత్యం వినిపించినా, ఈ ఆలయం చుట్టూ అలుముకున్న ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం, దాని గోడల వెనుక దాగిన ఆశ్చర్యకరమైన నిబంధనలు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమె ఈ దేవతను ఆలయంలో దర్శించాగలం. అది కూడా ప్రత్యక్షంగా కాదు కళ్ళకు గంతలు కట్టుకొని. కళ్ళకు గంతలు కట్టుకొని దేవుణ్ణి దర్శించడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఈ లాతు దేవత ఎవరు? ఈ విచిత్రమైన ఆచారాల వెనుక ఉన్న కారణం ఏమిటి? మరో మిస్టరీ ఈ ఆలయంలో నాగదేవత మణితో సహా ఉన్నాడా…. ఈ రహస్య లోకంలోకి మనం కూడా అడుగుపెడదాం రండి!
హిమాలయాల్లో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో దేవాళ్ బ్లాక్‌లోని 'వాణ్' అనే చిన్న గ్రామంలో ఉంది లాతూ దేవత ఆలయం. ఈ గ్రామం నందా దేవి జాతీయ ఉద్యానవనం సమీపంలో ఉంది. హిమాలయాల సహజ సౌందర్యంతో ప్రశాంత వాతావరనంతో అలరారుతుంది ఈ ప్రాంతం.
స్థానికుల నమ్మకం ప్రకారం.. లాటు దేవుడిని ఉత్తరాఖండ్‌లోని నందా దేవి సోదరుడిగా భావిస్తారు. సంవత్సరానికి ఒక్కరోజు వైశాఖ పూర్ణిమ రోజు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయంలోనికి వెళ్ళాలి. వైశాఖ పూర్ణిమ రోజున భక్తుల కోసం తలుపులు తెరుస్తారు, అదే రోజు మళ్ళీ తలుపులు మూసివేస్తారు.
మనం ఏదయినా ఆలయానికి వేల్లినపుడు అక్కడ దేవతను కళ్ళారా చూడాలని ఆశపడతాం. కాని ఇక్కడ లాతూ దేవత ఆలయంలో మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని దేవతను ఆరాధించాలి. చివరికి అక్కడ పూజలు చేసే పూజారులు సైతం కళ్ళకు గంటలు కట్టుకునే పూజలు చేసి తలుపులు మూసేస్తారు. ఎందుకలా కళ్ళకు గంతలు కట్టుకున్తారంటే ఆలయంలో నాగరాజు నాగమణితో ఉంటాడని ఆ నాగమణి దివ్య కాంతులకు భక్తులు అంధులవుతారని, పైగా ఆ దివ్యత్వాన్ని చూస్తే అనేకమైన విచిత్ర పరిస్తితులు ఏర్పడతాయని, అందుకే అలా ప్రత్యక్షంగా దేవతా దర్శనం చేసుకోనివ్వారని చెబుతారు. అది కూడా దూరం నుంచే దేవతను ఆరాధించాలి. వారు ఆలయ ద్వారం నుండి 75 అడుగుల దూరంలో తమ కానుకలు ఇవ్వవచ్చు.
పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది, కానీ అతను కూడా కళ్ళకు ముక్కుకు నోటికి గంటలు కట్టుకునే వెళ్ళాలి. పూజారి దేవతకు పూజలు చేసేటపుడు తన శ్వాస దేవతను తాకకుండా ఉండేందుకు ముక్కుకు , పూజారి మంత్ఉంరాలను పటించతపుడు ధ్యాస చెడిపోకుండా ఉండడానికి అలాగే నోటినుంచి ఎ ఇతర అపశబ్దాలు రాకుండా ఉండడానికి కళ్ళతో పాటు నోటికి కూడా గుడ్డ కట్టుకొని వెళ్తారు. దైవమే అతని అడుగులను నడిపిస్తుందని నమ్ముతారు.
సంవత్సరానికి ఒక్కసారే తలుపులు తెరుస్తారు
ఇక ఆలయం సంవత్సరానికి ఒక్కసారే ఎందుకు తెరుస్తారు అంటే దానికీ ఓ కథ ఉంది. పార్వతి దేవి అవతారంగా చెప్పే నందా దేవి తన సోదరుడు లాతు దేవతకు శిక్ష విధించిందని చెబుతారు,
నందాదేవి పార్వతి దేవి అవతారంగా భావిస్తారు ఆమె దత్తత సోదరుడే లాటూ దేవత. నందా దేవికి సోదరులు లేరు. ఒకరోజు, తనకు ఒక సోదరుడు ఉంటే, అతను ఖచ్చితంగా తనతో పాటు కైలాసానికి వచ్చి తన (వివాహిత స్త్రీకి ఇచ్చే బహుమతులు) "భీటోలి" తెచ్చి ఉండేవాడు కదా అనుకుంది విచారంగా. నందాదేవి విచారం చూసి, కారనమేంతని అడిగాడట శివుడు. నాకు సోదరుడు లేడు, సోదరుడు ఉంటే, అతను నన్ను కలవడానికి వచ్చి నా కోసం కానుకలు భీటోలి తెచ్చేవాడు కదా అన్నదట.
నందా దేవి మాట విన్న తర్వాత, శివుడు కన్నౌజ్ పాలకుడి చిన్న కొడుకు లాతును ఆమె సోదరుడిగా చేసుకొమ్మని చెప్పాడు.
శివుడి మాట విని లాతును తన సోదరుడిగా చేసుకోవడానికి కన్నూజ్‌కు వెళ్లింది నందాదేవి. కన్నౌజ్ రాణి మైనాదేవి, ఆమెకు బటు, లాటు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ మైనాకు కుమార్తె లేదు. అందుకే నందాదేవిని కుమార్తెగా గౌరవించింది. కన్నౌజ్ కు రావడానికి గల కారణం ఏమిటని మైనా నందా దేవిని అడిగినప్పుడు, తనకు సోదరుడు లేడని, లాతును తన సోదరుడిగా చేసుకుని తనతో పాటు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని నందా దేవి చెప్పింది. మొదట, కన్నౌజ్ నుండి కైలాసానికి చాలా దూరం ఉండటంతో మైనా తన కొడుకును ఇవ్వడానికి ఒప్పుకోలేదు, . కానీ నందా దేవి పట్టుబట్టడంతో, మైనా దేవి నందాదేవి అభ్యర్థనకు అంగీకరించి, తన కుమారుడిని నందాదేవి సోదరుడిగా పరిగణించింది.
దాంతో లాటూ కైలాసంలో ఉన్న సోదరికి "భిటోలి" అంటే కానుకలు తీసుకు వెళ్ళడానికి బయలుదేరతాడు. నందాదేవి కైలాసానికి బయలుదేరినప్పుడు, ఆ ప్రాంత ప్రజలందరూ ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. నందాదేవి పల్లకీ వాన్ గ్రామానికి చేరుకున్నప్పుడు, సోదరుడిని ఒక దగ్గర ఉండమని చెప్పి తానూ స్నానం చేయడానికి ఒక నదికి వెళ్ళింది,
. సమీపంలోని కొండపై ఆమె కోసం వేచి ఉండగా లాతుకు చాలా దాహం వేసింది. అతను సమీపంలోని కుగ్రామానికి వెళ్లి మహిళలను తనకు నీరు ఇవ్వమని అడిగాడు. మహిళలు నీటికి బదులుగా స్థానిక మత్తు పానీయం ఉన్న కుండను లాతుకు అప్పగించారు. వారి చిలిపితనం తెలియక లాతు కుండలోని మొత్తం తాగి ఆ మత్తులో అసహజంగా ప్రవర్తించాడు. నది నుండి తిరిగి వచ్చిన తరువాత ఇది చూసిన నందాదేవి లాటూ పై ఆగ్రహం చెంది ,దీనివల్ల నందా దేవి కోపించి, అతన్ని శపించి వాణ్ గ్రామంలో బంధించమని ఆదేశించింది. తరువాత లాటూ తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపపడ్డాడు. దాంతో శాంతించిన నందాదేవి లాతును ఆ ప్రాంత నివాసులు దైవంగా పూజిస్తారని వరం ఇచ్చింది. కానీ ఎవరూ అతని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి లేదా ఎవరూ అతన్ని నేరుగా చూడకూడదనే షరతు కూడా పెట్టింది. తన పేరు మీద ఒక ఆలయం నిర్మిస్తామని, వైశాఖ చివరి రోజున తానూ వచ్చి అతడిని పూజిస్తామని లాతుతో చెప్పింది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందా దేవి జాత్ ఉత్సవం జరిగేటప్పుడు, లాతును పూజిస్తుంది అమవారు..
అప్పటి నుండి ఈ ఆచారాలు పాటిస్తున్నారు
గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవుడిగా భావిస్తారు. భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరిక తీర్చినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు.
మరొక పురాణం ప్రకారం లాతు దేవత వాన్ ప్రాంతంలో జ్ఞానోదయం పొందిన సంచార సన్యాసి. అతని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన గ్రామస్తులు అతన్ని దేవతగా పూజించడం ప్రారంభించారు.
శ్రీ నందా దేవి పవిత్ర ఊరేగింపు జాట్ యాత్ర ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, హేమకుండ్ వరకు ఈ ప్రయాణంలో లాతు దేవత నందా దేవిని స్వాగతించి, తోడుగా వెళ్తాడు. లాటు దేవాలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండిక ఎక్కువగా పఠిస్తారు.
హిమాలయ ఆధ్యాత్మిక హృదయాన్ని చూడాలనుకునే సాహసోపేత ప్రయాణీకులకు, లాతు దేవతా మందిర్ ఒక మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. ఉత్కంఠభరితమైన నేపథ్యం, ప్రత్యేకమైన ఆచారాలు మరియు ఆకర్షణీయమైన ఇతిహాసాలు కలిసి మరే ఇతర తీర్థయాత్రకు భిన్నంగా ఉంటుందీ జాతర.
వాన్ గ్రామానికి వెళ్ళడం ఇతర హిమాలయ దేవాలయాల మాదిరిగానే అతి కష్టంతో కూడుకున్నది. అందుకే శారీరకంగా మానసికంగా ఆ ప్రయాణానికి సిద్ధంగా ఉంటేనే వేల్లగానం. ఆలయానికి వెళ్ళడానికి సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఆలయం లోపల ఫోటోగ్రఫీ నిషేధించబడింది.
లాతు దేవతా ఆలయానికి చేరుకోవడానికి రిషీకేష్ చేరుకొని అక్కడినుంచి బస్సులలో వెళ్ళవచ్చు.
సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్, హరిద్వార్. సమీప విమానాశ్రయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జోషిమఠ్ చేరుకోవాలి. జోషిమఠ్ నుండి నితీ లోయ వైపు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం వస్తుంది. ఆలయానికి చేరుకోవడానికి కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిన హిమాలయ దేవాలయాల మాదిరిగానే ఇక్కడ కూడా శీతాకాలంలో భారీ మంచు కురుస్తుంది. కాబట్టి వేసవి కాలం (మే నుండి అక్టోబర్ వరకు) ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం
వాన్ గ్రామంలో ఉండడానికి వసతి అంతగా ఉండదు. హోమ్‌స్టేలు ఎక్కువగా ఉంటాయి. ఆలయానికి సమీపంలో కొండపై గర్హ్వాల్ మండలం వికాస్ నిగమ్ (పర్యాటక శాఖ) అతిథి గృహం మరియు అటవీ శాఖకు చెందిన మరొక అతిథి గృహం ఉన్నాయి.
లాతు దేవత ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఉత్తరాఖండ్ యొక్క గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి, అంతుచిక్కని నమ్మకాలకు ప్రతీక.