తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ నిలిపివేత‌ | TTD Shrivani tickets news

Vijaya Lakshmi

Published on Jan 08 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ నిలిపివేత‌

జ‌న‌వ‌రి 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ 

నెల రోజుల పాటు ప్రయోగాత్మక అమలు


భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను రేపటి నుండి అంటే జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు.


ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి అని ఒక ప్రకటనలో తెలిపింది టీటీడీ.



ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది.


తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది.

ఈ మార్పును గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.



ఇవి కూడా చదవండి :

Recent Posts
సంక్రాంతి గాలిపటాలు | Sankranti Festival Kites in Telugu
సంక్రాంతి గాలిపటాలు | Sankranti Festival Kites...
హైదరాబాద్ లోటస్ టెంపుల్ – శాంతి, సౌందర్యానికి ప్రతీక | Hyderabad Lotus Temple – A Symbol of Peace & Architecture
హైదరాబాద్ లోటస్ టెంపుల్ – శాంతి, సౌందర్యానికి...
చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య ఒకటేనా?  |  2026 లో మౌని అమావాస్య ఎప్పుడు వస్తుంది | Significance of mouni Amavasya
చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య ఒకటేనా? ...
కనుమ నాటి కోనసీమ ప్రభల తీర్థం రాష్ట్ర పండుగగా  |  వీరభద్ర ప్రభలు  | what is prabhala teertham
కనుమ నాటి కోనసీమ ప్రభల తీర్థం రాష్ట్ర...
మౌని అమావాస్య (చొల్లంగి అమావాస్య) విశిష్టత | how to perform mouni Amavasya in north india & AP
మౌని అమావాస్య (చొల్లంగి అమావాస్య) విశిష్టత |...