Vijaya Lakshmi
Published on Aug 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అది 1998 సంవత్సరం. అయోధ్యలో ఒక సంఘటన జరిగింది. ఇది మాములు సంఘటన కాదు, ఆ సమయంలో అయోధ్యలోని ప్రజలు ఎంతోమంది హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశారని చెప్తుంటారు. ఇదంతా కేవలం ఒక రూమర్, పుక్కిటి పురాణంగా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న అవినాష్ మిశ్రా అనే అధికారి స్వయంగా చూసి వ్యక్తం చేసిన అభిప్రాయం.
భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయం. భారతదేశంలోని ప్రతీ హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. శతాబ్దాల నిరీక్షణ తరువాత దశాబ్దాల పోరాటం తరువాత చివరికి కోట్లాదిమంది హిందువుల హృదయభారం తీరిన వేళ. బాలరామయ్య ముగ్ధమోహన రూపంతో చిరునవ్వులు చిందిస్తూ నూతన ఆలయంలో కొలువుతీరిన సమయం. దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ అద్భుత, ఆధ్యాత్మిక ఘట్టం బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచనలుమూల ల ప్రజలు ఉత్కంఠగా వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు.
ఇక ఇప్పుడు దేశ విదేశాలనుంచి లక్షలాది మంది హిందువులు అయోధ్యకు బారులు తీరి వెళుతున్నారు. ఈ సందర్భంలో అయోధ్య రామయ్యతో పాటు ఇంకా ఇక్కడ దర్శించవలసిన అనేక ప్రధానమైన ఆలయాలు, స్థలాలు ఉన్నాయి. అయోధ్య రామయ్య తరువాత తప్పనిసరిగా దర్శించుకోవలసినది హనుమాన్ గర్హి ఆలయం. నిజానికి అయోధ్యలో ముందుగా ఈ హనుమాన్ గర్హి ఆంజనేయుని దర్శించుకొని రామయ్య దర్శనానికి వెళితేనే యాత్ర సఫలమవుతుందని చెప్తారు. ఒక రకంగా అయోధ్య రక్షకుడిగా హనుమంతునికి పేరుంది. ఒక సందర్భంలో ముష్కరుల బాంబుదాడుల నుంచి రక్షించిన ఘటనలు కూడా విన్నాం. ఇంత ప్రధానమయిన హనుమాన్ గర్షి ఆలయ విశేషాలు...
అయోధ్య ఈ పేరు వినగానే మనసు పులకిస్తుంది. మనకు తెలియకుండానే కనులు అరమోడ్పులవుతాయి. రామయ్య రూపం ప్రత్యక్షమవుతుంది. అయోధ్య సప్త మోక్ష పట్టణాలలో మొట్టమొదటిది. రామయ్య జన్మస్థలం. అయోధ్య అన్న పేరు స్మరిస్తేనే మోక్షమిచ్చే పుణ్యస్థలం. అలాంటి పున్యస్తలంలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆలయం
హనుమాన్ గర్హి ఆలయం.
అయోధ్య స్టేషన్ నుండి కేవలం 1 కి.మీ దూరంలోనే ఉంటుంది హనుమాన్ గర్హి ఆలయం. ఈ ఆలయం రాజ ద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది. అయోధ్యను రక్షించడానికి హనుమంతుడికి ఇక్కడ ఉండడానికి స్థలం ఇచ్చారని నమ్ముతారు. 76 మెట్లు ఎక్కి పవన్‌పుత్ర దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. రాముడితో పాటు హనుమంతుడిని కూడా దర్శించుకోకపోతే అయోధ్య దర్శన పూర్తికాదని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతారు.
రాముడు రావణుడిని సంహరించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత తన భక్తుడైన హనుమంతుడు నివసించడానికి అయోధ్య నగరంలో స్థలం ఇచ్చాడని, ఆ స్థలంలోనే ఇప్పుడున్న హనుమాన్ గర్హి ఆలయం ఉందని చెప్తారు. అప్పుడే ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు మొదట హనుమంతుడిని దర్శించుకునే తన దగ్గరకు వస్తారని రామయ్య చెప్పాడని ఓ కథనం. అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సమయంలో శ్రీరామచంద్రుడు అందరికీ కానుకలు ఇచ్చాడట. తన ప్రియభక్తుడు హనుమంతుడికి తన కంటే ఎత్తైన ప్రదేశంలో ఉండడానికి స్థలం ఇచ్చాడట. అందుకే హనుమాన్ గర్హి ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. హనుమంతుడి బాల రూపం, హనుమంతుని తల్లి అంజనీ దేవి విగ్రహం కూడా ఇక్కడ చూడొచ్చు.
దేశంలో ఇంకెక్కడా లేనివిధంగా ఈ హనుమాన్‌గర్హి ఆలయంలో ఒక రహస్య పూజా విధానం ఉందని చెప్తారు. ఈ పూజ తెల్లవారుజామున 3 గంటలకు జరుగుతుంది. దాదాపు గంటన్నర సేపు జరిగే ఈ పూజలో పూజారులు తప్ప మరెవరికీ ప్రవేశం ఉండదు ఈ పూజలో హనుమంతుడు స్వయంగా వచ్చి పూజలో పాల్గొన్న 8 మంది పూజారులకు భౌతిక దర్శనం ఇస్తాడని ఇక్కడివారు గాదంగా నమ్ముతారు. అనంతరం భక్తుల సందర్శనార్థం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు.
హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, మొట్టమొదట విక్రమాదిత్య మహారాజ్ ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ పురాతన ఆలయం ధ్వంసంకావడంతో ప్రజలు ఈ స్థలాన్ని హనుమాన్ తిలా అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు లక్నోను నవాబ్ మసూర్ అలీఖాన్ సఫ్దర్ జంగ్ సాహెబ్ ఈ ఆలయాన్ని నిర్మిమ్పచేసినట్టు చరిత్ర చెబుతోంది.
హిందూ ఆలయాలను పడగొట్టడమే ధ్యేయంగా ఉన్న అప్పటి మహమ్మదీయ పాలకులలో ఈ ఆలీఖాన్ హనుమంతుడి ఆలయ నిర్మింపచేయడమేంటి అన్న సంశయం కలుగుతుంది కదా... ఆ కథనం విషయైకి వస్తే ఒక సమయంలో నవాబ్ మసూర్ అలీ సాహెబ్ తీవ్ర అనారోగ్యానికి గురై ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ప్రార్ధనలు, తాయెత్తులు, ఇలా ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ అనారోగ్యానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్తితిలో భక్తుడు, పూజారి, వైద్యుడు హనుమాన్ తిలలో నివసించే సాధువు అయిన మహాత్మా అభయ్ రాంజీ, హనుమాన్ పేరిట పూజ చేసిన పవిత్ర జలాన్ని ఔషధంగా ఇచ్చాడని దాంతో నవాబుకు స్వస్థత చేకూరిందని... హనుమాన్ ఆలయం సేకరించిన పవిత్ర జలం తనను ఆరోగ్యవంతుడ్ని చేసిందన్న నమ్మకంతో నవాబ్ సాహెబ్ హనుమాన్ తిల మీద హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రక కథనాలు చెబుతున్నాయి. ఆ ఆలయమే హనుమాన్ గర్హి ఆలయం. హనుమంతుడు ఇప్పటికీ ఇక్కడ అయోధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇక్కడి ప్రజల విశ్వాసం.
ఈ ఆలయ చరిత్ర అలా ఉంచితే ఆలయానికి సంబంధించి ఒక అద్భుతమ్ అనవచ్చు లేదా హనుమంతుని మహత్యం అని చెప్పొచ్చు ఆ అద్భుతం గురించి చెప్పుకోవాలి.
అది 1998 సంవత్సరం. అయోధ్యలో ఒక సంఘటన జరిగింది. ఇది మాములు సంఘటన కాదు, ఆ సమయంలో అయోధ్యలోని ప్రజలు ఎంతోమంది హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశారని చెప్తుంటారు. ఇదంతా కేవలం ఒక రూమర్, పుక్కిటి పురాణంగా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న అవినాష్ మిశ్రా అనే అధికారి స్వయంగా చూసి వ్యక్తం చేసిన అభిరాయం. నిజానికి 1998 సమయం లో అయోధ్య అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. అంటే మతకల్లోలాలతో అట్టుడుకుతున్న సమయం. ఆ పరిస్తితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఎస్టీఎఫ్ బృందానికి ఒక వార్త అందింది. అయోధ్యలో దాదాపు 20 కిలోల ఆర్డీఎక్స్‌ను అమర్చినట్లు, విద్వంసానికి రంగం సిద్ధం చేసినట్టు. ఈ వార్త విన్న వెంటనే ఎస్టీఎఫ్ టీం రంగం లో కి దిగింది. అసలు ఆ వార్త నిజామా కదా తెలుసుకునే పని లో ఒక టీం, అసలు నిజమే అయితే ఎక్కడ ఈ ఆర్డీఎక్స్ ని అమర్చి ఉంటారో అని తెలుసుకునేందుకు మరొక టీం ని రంగం లో కి దింపింది. ఎందుకు అంటే, మొత్తం భారత దేశం లో ఉన్న అత్యంత సున్నితమైన ప్రాంతాలలో అయోధ్య పేరు ప్రముకంగా వినపడుతుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్నీ డీల్ చెయ్యాలి. లేదంటే అల్లర్లు మొదలయ్యి పరిస్తితి మరింత దారుణంగా తయారవుతుంది. పోలీస్ బలగాలు పేలుడు పదార్ధాలను కనిపెట్టే ప్రయత్నాల్లో పడ్డాయి. సాధువు వేషంలో ఒక ఉగ్రవాది ఆలయంలో బాంబును అమర్చి వెళ్ళిపోయాడు.
ఆలయంలోని ఏ మూలలో వెతికినా, ఎక్కడ కూడా బాంబు జాడ అయితే కనపడలేదు. పోలీసులు వెంటనే ఆలయానికి వెళ్లి బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. తీవ్రమైన వెతుకులాట సాగుతోంది. సరిగ్గా అప్పుడే అందరి చూపు గుడి ప్రాంగణంలో కూర్చున్న ఒక చిన్న కోతి మీద పడింది. అది తన చేతిలో రెండు వైర్లు పట్టుకుని కోల్డ్ వాటర్ మెషిన్ దగ్గర కూర్చుని ఉంది. ఇది చుసిన పోలీసులు అక్కడకు వెళ్లారు. అప్పటికే అది ఆ తీగలతో ఆడుకుంటుంది. అప్పుడప్పుడు ఆ తీగలను నోటిలో పెట్టుకొని గట్టిగా పీకుతోంది. తీగలను గట్టిగ తెంపేసేలాగా ఆ కోతి వాటిని లాగుతుంది. కాస్త పరిశీలించగానే వారికి అర్ధమైపోయింది. అయితే కోతి చేతికి చిక్కిన వైర్‌ని విడిపించేందుకు ఆ కోతి ని తరిమేయానికి ప్రయత్నించారు కానీ అది వెళ్లలేదు సరి కదా ఇంకా ఆ తీగలను నోటితో పట్టి లాగేస్తూ ఉంది. ఎలా అయితేనే కొంచెం సేపటికే ఆ కోతి ఆ తీగలను విడిచిపెట్టింది. ఒక్క సెకనులో నే చుట్టూ చూసేసరికి ఆ కోతి ఎవరికీ ఎక్కడ కనిపించలేదు.
కోతి వెళ్లిన వెంటనే బాంబ్ డిస్పోజల్ టీమ్ వాటర్ మెషీన్ వద్దకు వెళ్లి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. మెషీన్‌ను తెరిచి చూడగా అందులో బాంబు కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాంబు అప్పటికే నిర్వీర్యం చేయబడింది. ఎందుకంటే బాంబులో టైమర్ కేవలం మూడు సెకన్ల క్రితమే ఆగిపోయింది. అప్పుడు పోలీసులు మరోసారి నిర్దారించుకున్నారు, కోతి ఆడుతున్న తీగలు ఆ బాంబు కి సంబందించిన తీగలు అని. ఆ కోతి తీగను లాగి తెంపి, బాంబు పేలకుండా ఆపిందని అర్థమైంది. హఠాత్తుగా అక్కడ అదృశ్యమైన కోతి హనుమాన్‌గర్హి ఆలయ శిఖరంపై కూర్చుని కనిపించింది అందరికి. గుడి శిఖరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు హనుమంతుడు అని అప్పుడు అక్కడున్నవారందరికి మరోసారి అర్థమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పోలీసులంతా ఎంతగానో ఆశ్చర్యపోయారు. అది మామూలు కోతి కాదని, స్వయం గా ఆంజనేయ స్వామి అని అక్కడ ప్రజలు గుర్తించారు, భావించారు. అయితే, తన దేవుడైన శ్రీరాముడి నగరం లో ఎప్పుడు ఏ ఆపదగానీ, సమస్య గానీ వచ్చిన ఆంజనేయ స్వామి ఎదో ఒక రూపం లో ఇలా వచ్చి కాపాడుతూ ఉంటాడు అని అక్కడి ప్రజలు ఇంకా బగా నమ్మలండానికి ఇది మరింత పునాది వేసింది.
.